మెయిన్ ఫీచర్

సాయానికి సదా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌతమ్ పసితనం నుంచే సామాజిక స్పృహతో వ్యవహరించేవాడు. తండ్రి ఆర్మీ ఉద్యోగి కావటం వల్ల క్రమశిక్షణతోపాటు మంచితనం, మానవత్వం అలవడ్డాయి. రోడ్డుమీద గుంతలు కనిపిస్తే బైక్ ఆపి పక్కన పెట్టి ఆ గుంతలను బాగు చేయడానికి నడుం కట్టేవాడు. పేదలు కష్టాలను చెప్పుకుంటే తన వంతు సాయంగా వారికి కావలసినవి సమకూర్చేవాడు. చెట్టుకింద ఏ పని లేక విచారించే బీదవారికి తమకు చేతనైన పనిని సమకూర్చేవాడు. అలా అలా ప్రజల దృష్టిలో పడ్డాడు. నేనొక్కడినే సమాజానికి ఇంత చేయగలిగితే నాలాగా ఆలోచించే వారంతా ఒక్కటైతే సొసైటీకి ఎంతో మంచి చేకూరుతుందని భావించిన గౌతమ్ ‘సర్వ్ నీడి’ పేరుతో 2014లో ఒక సంస్థను స్థాపించాడు. మంచి ఉద్యోగం, జీతం, హోదా ఉన్నా వాటన్నింటినీ వదిలేసి మొదట పలు ఎన్జీవో సంస్థల్లో సభ్యుడిగా చేరి సేవలందించారు. అంతటితో ఆగకుండా తానే ఒక ఎంజిఓ ఎందుకు పెట్టకూడదని ఆలోచించి నిర్ణయం తీసుకుని కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సర్వ్ నీడిని ప్రారంభించారు.
డైలీ అన్నదాత
వివాహాలు, బర్త్‌డే ఫంక్షన్లు, హోటళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను సేకరించే ఈ సంస్థ సభ్యులు అనాధ పిల్లలకి, వృద్ధులకు, ఆకలితో వున్న బీదవారికి పెట్టి వారి ఆకలి తీరుస్తారు. ఈ ప్రాజెక్టుకు ‘డైలీ అన్నదాత’ అనే పేరును పెట్టాడు. ఇలా వృధా ఆహారాన్ని సేకరించేందుకు వెళ్లినపుడు అక్కడివారు స్పందించి సహాయసహకారాలు అందిస్తున్నారని అంటా రు సర్వ్‌నీడి సభ్యులు. ఆ డబ్బుతో బీదవారికి కడుపునిండా భోజనం వండి పెట్టడం, అవసరమైన బట్టలు, బెడ్‌షీట్లు కొనివ్వటం వంటివి చేస్తూ ప్రస్తుతం ప్రతిరోజూ కనీసం వెయ్యిమందికి ఆకలి తీరుస్తున్నారు సర్వ్ నీడి టీమ్. ‘సేవ్ ఏ లైఫ్’ అనే పేరుమీద అనాధలకు మతి స్థిమితం లేని ఆడబిడ్డలకుతోబుట్టువై బాధ్యతగా తమకు సంబంధించిన హోమ్‌లలో జాయిన్ చేస్తా రు. తీవ్రమైన కాన్సర్ వంటి రోగాలతో జీవిస్తున్న వీధి పిల్లలకు బర్త్‌డే పార్టీలు వంటివి చేస్తూ వారి చిన్నచిన్న కోరికలు తీర్చటం కూడా సర్వ్ నీడి సేవలలో భాగ మే. అట్టలు కట్టి ఉన్న జుట్టుతో, మురికి పేరుకుపోయి బిగుసుకుపోయిన దేహాలతో రోడ్లపై తిరుగుతూ ఎలా పడితే అలా జీవించేవారిని సైతం కనుక్కుని వారిని నీట్‌గా కటిం గ్ చేయించి శుభ్రంగా స్నా నం చేయించి, శుభ్రమైన బట్టలు వేసి కడుపునిండా భోజ నం పెట్టి వారి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు.
మెడికల్ మొబైల్ సర్వీస్
ఈ పేరుమీద మరో ప్రాజె క్టు స్టార్ట్ చేసి, బీదవారికి మెడికల్ క్యాంపులు, హెల్త్ చెకెప్‌లు చేయించి, అవసరమైతే వైద్యచికిత్సలు చేస్తారు. కేవలం మనుషులకి మాత్రమే కాకుండా వీధుల్లో దెబ్బలు తగిలి బాధపడే శునకాల వంటి ఎన్నో మూగజీవాలకు సైతం ట్రీట్‌మెంట్ ఇచ్చి వాటిని బాగుపరిచి బ్లూక్రాస్‌కి అందజేస్తుంది సర్వ్‌నీడి సంస్థ.
అనాథ శవాలకు అంత్యక్రియలు
నగరంలో గల వివిధ వృద్ధాశ్రమాల్లో, ఇతరేతర అనాథాశ్రమాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్‌లలో ఉండే అనాధ శవాలకు తానే కొడుకై, తన చేతులపై మోస్తూ వారి దహన సంస్కారాలను సొంత ఖర్చులతో సాంప్రదాయపరంగా నిర్వర్తిస్తూ తల కొరివి సైతం పెట్టి తన మానవత్వాన్ని చాటుకుంటాడు గౌతమ్. ఈ సేవలో తనకు ఎంతో తృప్తి ఉంటుందని చెబుతాడు.
నాలుగేళ్లలో 14 ప్రాజెక్టులు!
ఇతని సేవలను గుర్తించి ‘హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ సంస్థ సర్వ్ నీడికి బెస్ట్ ఆర్గనైజేషన్‌గా అవార్డు ఇచ్చింది. ఇలా కేవలం నాలుగు సంవత్సరాలలో 14 ప్రాజెక్టులపైన మనసు పెట్టి పూర్తి స్థాయిలో 24 గంటల సేవలందిస్తూంది సర్వ్ నీడి వాలంటరీ ఆర్గనైజేషన్. సమాజానికి ఉపయోగపడే ఇన్ని మంచి కార్యక్రమాలను చేపడుతున్న ఈ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం గుర్తించి సపోర్ట్‌ని అందిస్తే కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లోనూ, రాష్ట్రాల్లోనూ మా సేవలను అందించటానికి రెడీగా ఉన్నామని అంటున్నారు గౌతమ్‌కుమార్!
అనాథాశ్రమం ఏర్పాటు
ఈ సంస్థ తరఫున ఒక అనాథాశ్రమం సైతం నడుపుతూ, పాతికమంది పిల్లలకు ఆలనా పాలనా చూడటమే కాకుం డా, చదువు చెప్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకోసం తగిన శిక్షణని ఇస్తున్నారు. తన ఆలోచనా శైలిని ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ప్రత్యేక పేజ్ ఓపెన్ చేసి తనలాంటి వారిని చేతులు కలపాల్సిందిగా ఆహ్వానించాడు. దీనికి స్పందించిన ఎంతోమంది సర్వ్ నీడి సంస్థలో వాలంటీర్లు అయ్యారు. కాలేజీ స్టూడెంట్స్, వర్కింగ్ ఎంప్లాయిస్, బిజినెస్‌మెన్ ఇలా విభిన్నవర్గాలకు చెందిన 30 మంది ఈ సంస్థ లో సభ్యులుగా చేరారు. వీరంతా కలసి నగరంలో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు.

సర్వ్ నీడి ఆర్గనైజేషన్ గౌతమ్‌కుమార్ బృందం

-శిరీష