మెయిన్ ఫీచర్

మోగింది వీణ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధునికయుగంలో పాశ్చాత్య పోకడల మాయలో పడినవారు సంప్రదాయ సంగీతాన్ని పెద్దగా ఇష్టపడటం లేదు. ముఖ్యంగా కుర్రకారు అలనాటి సంప్రదాయ వాయిద్య సంగీతా న్ని పెద్దగా ఇష్టపడటం లేదు. ఒకప్పుడు గాత్రానికి ఎంత ప్రాధా న్యం ఉండే దో వాద్యసంగీతానికీ అంతే విలువ ఉండేది. అందు నా వీణ మీటడంలో ప్రావీణ్యం ఉంటే అదో పెద్ద హోదాగా పరిగణించే రోజులున్నాయి. ఈ తరంలో కూడా వీణను మెచ్చుకునే శ్రోతలు ఉన్నారని, శ్రద్ధగా, పద్ధతిగా వీణవాయిస్తూ పాటందుకుంటే తన్మయత్వం లో మునిగితేలిపోయే శ్రోతలు కళాకారులను ప్రోత్సహిస్తారని అంటోంది హైదరాబాద్‌కు చెందిన గాయని శ్రీవాణి. వీణ వాయిస్తూ గానాలాపన చేసే ఆమె ఇప్పుడు సామాజిక మాధ్యమంలో రికార్డులు సృష్టిస్తోంది. గుండె లోతుల్లో నుంచి వచ్చే పాటకు వీణపై బాణీలు కట్టి పాడటం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. పాడగలగడం తన ఇష్టం దైవం వేంకటేశ్వర స్వామి ఇచ్చిన వరంగా భావిస్తూ.. వీణానాదమే తన సర్వస్వంగా భావించే హైదరాబాద్‌కు చెందిన గాయని శ్రీవాణి. వీణపై ఆమె వినిపిస్తున్న మధురమైన స్వరాలకు యూట్యూబ్‌లో విపరీతమైన లైక్స్ సంపాదించింది. సోషల్ మీడియాలోనే కాదు తెలుగు సినిమా పాటలతో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న శ్రీవాణి చెప్పిన విశేషాలు..
రెండవ తరగతిలోనే స్టేజ్ షో
శాస్ర్తియ సంగీత శిక్షణతో తన పాటకు పదును పెట్టిన శ్రీవాణి ఏడేళ్ల నుంచే వీణపై పాటలకు బాణీలు కట్టడం ఆరంభించింది. రెండవ తరగతి చదువుతున్నపుడు స్టేజ్ మీద కచ్చేరీ ఇచ్చే అవకాశం వచ్చింది. ‘ఆ రోజు నేను పాడిన పాట విని తల్లిదండ్రులు పులకరించిపోయారు. నేను వేంకటేశ్వర స్వామిని, వీణనే నమ్మాను. అవే ఈ గుర్తింపును ఇచ్చాయని భావిస్తాను. ఏదైనా వీణతోనే పాడతాను. గుండెలో నుంచే భావా న్ని వీణ ద్వారానే శ్రోతలకు వినిపిస్తాను’ అంటారు శ్రీవాణి.
వీణకు పునర్వైభవమే లక్ష్యం
శాస్ర్తియ సంగీతంలో వాణిజ్య స్వరాలు పలికిస్తున్న ఈ తరుణంలో ఆమె వీణా వాయిద్యాన్ని నమ్మారు. అంతరించిపోతుందనుకుంటున్న ఈ వీణా వాయిద్యా న్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందంటారు. ‘మా అమ్మాయి కోసం నర్సరీ ట్యూన్స్ చేస్తున్నాను. రాబో యే తరం ఈ వాయిద్య పరికరాన్ని విస్మరించకుండా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఇపుడొస్తున్న యువ సంగీతకళాకారులు తనను స్ఫూర్తిగా తీసుకుని వీణను నేర్చుకుంటన్నామని చెప్పటం ఆనందాన్ని ఇస్తోంది’ అంటారామె. ఆమె ఇప్పటికీ వీణ వాయిద్యంలో క్రమం తప్పకుండా

ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి ట్యూన్‌ను చాలెంజ్‌గా భావిస్తుంది.
మానసిక ప్రశాంతతను, శాంతిని ప్రసాదించే వీణపై ఇళయరాజ పాటలు పాడటం మధురానిభూతిగా చెప్పే శ్రీవాణి పాటకు ఎల్లలు లేవంటారు. ఇతర రాష్ట్రాలలోనూ వీణపై పాటలు పాడటం ఆమె ప్రతిభకు నిదర్శనం. ఇటీవలనే కోల్‌కతాలో శ్రేయాగోషాల్ ఎదుట తన గానమాధుర్యాన్ని వినిపించారు. ఆమె పాటను ప్రఖ్యాత గాయని ఉషాఊతప్ సైతం మెచ్చుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి వస్తున్న అవకాశాలపై సంతృప్తిని వ్యక్తంచేస్తూ సోషల్‌మీడియాపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.