మెయిన్ ఫీచర్

యోగానందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదువేల ఏళ్ల చరిత్రగల విశిష్ట సాధన ప్రక్రియ యోగ. ఈ పదం సంస్కృత పదం ‘యుజ్’ నుంచి పుట్టింది. అంటే కలపడం, కలవడం, కలిసి ఉండటం అనే అర్థాలున్నాయి. ‘యోగా’ను పాశ్చాత్యులకు పరిచయం చేసిన తొలి గురువు స్వామి వివేకానంద! మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో ఒంటికి యోగా అంతే అవసరం. యోగాను అందించిన పతంజలి మహర్షి ‘యోగాః కర్మను కౌశలం’ అన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘నీవు చేసే పనిలో నైపుణ్యమే యోగా’ అని సెలవిచ్చాడు. మనిషి యాంత్రిక జీవనానికి, ఆధునిక జీవనంలో ఎదురవుతున్న సమస్యలకు అద్భుత పరిష్కార మార్గం యోగా. మన శరీరాలను నియంత్రణలో ఉంచుకుని వాటిపై పట్టు సాధించినపుడు మాత్రమే మనిషిలోని అంతర్గత శక్తి వెలుగుచూస్తుందని, యోగాసనాల ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు. ‘యోగ పితామహుడి’గా పేరొందిన మహర్షి పతంజలి యోగా తత్వశాస్త్రంలో 195 యోగా సూత్రాలను సంకలనం చేసి వాటికి భాష్యాలు చెప్పి భారతీయ యోగకు బాటలు వేశారు. యోగ ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా సాధించవచ్చునో ఆయనే మొదటిసారి ‘అష్టాంగ యోగ’ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. యోగ అంటే శారీరక వ్యాయామాలనీ అందరూ అనుకొంటారు కానీ శ్వాస, నిద్ర, నవ్వు ఇలా ప్రతిదీ యోగాయే. యోగ అంటే ఓ జీవన విధానం. మనిషి ఆరోగ్యానికి, మంచి ఆలోచనలకు ‘యోగా’ గొప్ప వరప్రదాయినిగా పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపుకోసం ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మాన ఫలితమే ఐక్యరాజ్యసమితి జూన్ 21 ‘అంతర్జాతీయ యోగ దినము’గా జరుపుకోవాలని 2015లో నిర్ణయంచింది. ఆధ్యాత్మిక ప్రయోజనాలతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేసే యోగాభ్యాసం పట్ల ఆధునికులు ఆసక్తి పెంచుకుంటున్నారు. యోగద్వారా శరీరంలో సమస్థితి పెరుగుతుంది. దీనే్న వేదంలో ‘సమ త్వం యోగ ఉచ్చతే’

అని ఆనాడే పేర్కొన్నారు.
యోగం శరణం గచ్ఛామి
మనసుని, దేహాన్ని కలిపి చూపించే యోగముద్ర రాజముద్ర అయిపోయింది. భారతీయ జీవన విధానాన్ని మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా యోగాసనాలు వేసిన తర్వాత వస్తున్న ఫలితం చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతోంది. యోగతో జీవితకాలం పెరగడమే కాక సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. శరీరంలోని మలినాలను వదిలించడంతోపాటు మనసును పరిశుభ్రంగా ఉంచటానికి తోడ్పడుతుంది.
అష్టాంగ యోగం
పతంజలి చూపిన రాజమార్గమే అష్టాంగ యోగం. అష్టాంగ యోగ సూత్రా లు అనుసరిస్తే వ్యాధులు దూరమవుతాయి. ఇవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిలు. యోగ చిత్తవృత్తుల నిరోధకమని పతంజలి యోగశాస్త్రం చెబుతుంది. ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్య సౌభాగ్య ప్రదాయకం యోగాభ్యాసం. ఆధునిక వైద్యం దారిచూపని అనేక సమస్యలకు పరిష్కారం చూపే మహత్తు ప్రాచీన భారతీయ యోగాకు ఉంది. ఒకప్పుడు యోగులకు, రుషులకు మాత్రమే ఈ ప్రక్రియ అందుబాటులో ఉండేది. ఇపుడు మనిషి జీవతంలో భాగమైంది. సక్రమ జీవన విధానానికి, మొండి వ్యాధులకు ప్రత్యామ్నాయం అష్టాంగ యోగం. ఏ వయస్సు వారైనా నిరభ్యంతరంగా ఉత్సాహంగా సాధన చేయడం అవసరం. జీవన విధానం సక్రమంగా ఉండటానికి అష్టాంగ యోగ ఎంతో దోహదపడుతుంది. ఇదీ సంక్షిప్తంగా యోగా చరిత్ర. సనాతన భారత శాస్త్రాల్లో పుట్టిన శాస్త్రాల్లో యోగా కూడా ఒకటి. మానసిక శుద్ధి, శారీరక దారుఢ్యము, రోగ నిరోధక శక్తి, ఆరోగ్య సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడతాయి. యోగ చేయడానికి ధన వ్యయమేది అక్కర్లేదు. అందరూ యోగాతో ఆరోగ్యవంతులైతే దేశం కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోగలదని ఆశిద్దాం.

- కె.రామ్మోహన్‌రావు