మెయిన్ ఫీచర్

ఆధ్యాత్మిక ప్రచార నెలవు..‘దాసకుటి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ర త్నాకరుని రామదాసుగా మార్చిన రామ అన్న పదబంధం ధర్మాచరణకు నిలువెత్తు సాక్ష్యం. రామ అన్న పేరుగల దశరథుడు రామోవిగ్రహాన్ ధర్మః అన్న పేరును సార్థకం చేశాడు. కేవలం నేను దశరథ పుత్రుణ్ణే అన్న రాముడు నిజానికి పరబ్రహ్మ స్వరూపం. మహావిష్ణువు అవతారం అని పండితోత్తములు చెబుతారు. అట్లాంటి రాముని స్మరించినవారికి రాముణ్ణి అనుసరించినవారికి రాముని దివ్యాశీస్సులు సదా వెన్నంటి ఉంటాయి. ఆ రాముని భక్తులు వేలకోట్ల సంఖ్యలో ఉన్నారు. నిత్యమూ రాముని సేవలో గడిపేవారు నేటికీ ఉన్నారు. తమ తమ పిల్లలకు రామనామానే్న పెట్టుకుని రాముని స్మరిస్తూ ఆనందించేవారు కోకొల్లలుగా కలియుగంలో కనబడుతారు. రామునిపై పాటలు కట్టి పాడేవారు, కథలు చెప్పి కథకులుగా పేరెన్నిక గలవారు, రాముని చరితను ఆసాంతం తమ దృష్టికోణంలో చూచి చెప్పేవారు, రాముని చరిత్రను చదివి తాము ఆనందించడమే కాక రాముని తమసోదరునిగా, ప్రభువుగా, పరదైవంగా చేసుకొన్నవారు కలియుగంలో అడుగడుగనా తారసపడుతుంటారు. అట్లాంటి వారిలో ఆంధ్రావాల్మీకిగా ఖ్యాతి గడించినవారు శ్రీవాసుదాసస్వామివారు. ఈ వాసుదాసు స్వామి సదా రామనామోచ్చారణలో తమ జన్మను పునీతం చేసుకొన్నారు. నిత్యమూ రామానామ పారాయణ లో మునిగి తేలడమే కాక తన తోటివారిని తన చుట్టుపక్కల ఉన్నవారికి సైతం రామరసాయానామృతాన్ని అందించేవారు. అట్లా చేసే ఈ వాసుదాసస్వామి వాల్మీకి కృత సంస్కృత రామాయణాన్ని ఆంధ్రానువాదం చేసి పండిత పామరులకు రాముని చరిత్రను విషయ వివరణ చేశారు. అంతేకాక నిత్యమూ రామాయణాన్ని ప్రవచించేవారు. రామనామఅనుసంధానంలో ఎంత ఆనం దం వస్తుందో తెలియచెబుతూ ఊరూ రా తిరిగి రామాయణ ప్రాముఖ్యతను పిన్నపెద్దలకు వివరించేవారు. ఆ స్వామి అసలు పేరు వావిలికొలను సుబ్బారావు ఈ పేరును మరిచి రామదాసుగా వాసుదాసుస్వామిగానే నేటికీ మిగిలిపోయారు. తాను ఆంధ్రీకరించిన రామాయణాన్ని ఒంటిమిట్టలోని కోదండరామస్వామికి సమర్పించారు. టెంకాయ చిప్పను పట్టుకుని ఊరూరా తిరిగి భిక్ష సేకరించి వచ్చిన డబ్బును కోదండరామస్వామి దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఓ సత్రం కూడా కట్టించారు. 108 పర్యాయాలు రామాయణ పారాయణం అనే యజ్ఞం చేశారు. కోదండరామ స్వామికి మహాసామ్రాజ్య పట్ట్భాషేకం చేశారు.
ఆ సమయంలోనే ఈ స్వామివారి శిష్యగణం శ్రీకోదండరామ సేవక ధర్మసమాజానికి ఆకారమేర్పరిచారు. స్వామివారికి ఈ సేవసమాజం కూడా నిత్యపూజాదికాలను నిర్వర్తించే ఏర్పాట్లు చేశారు. వాసుదేవానంద స్వామివారి ప్రసంగాలకు, రామాయణ పారాయణకు ముగ్ధుడైన ఓ వదాన్యుడు గుంటూరు జిల్లాలో కూడా వాసుదాస స్వామి వారి చేత రామాయణ పారాయణమనే యజ్ఞాన్ని చేయమని ప్రోత్సహించారు. 1925లో వాసుదాస స్వామి వారి శిష్యులు సత్తెనపల్లిలో ఆశ్రమాన్ని స్వామివారికి నిర్మించి ఇచ్చారు. పాదుకాక్షేత్రం పేరుతో నడిగడ్డపాలెంలో ఆ గ్రామస్తులు ఆశ్రమాన్ని కట్టించి స్వామివారిని ఆహ్వానించారు. రెండు ఎకరాల నిమ్మతోటను కూడా ఆశ్రమానికి ఇచ్చారు. 1936లో వాసుదాస స్వామివారు రామకైంకర్యానికి రాముని సానిథ్యానికి పయనించారు. కలియుగం వీడిన స్వామివారిని తలుచుకుంటూ వాసుదాస స్వామివారి అడుగులో అడుగువేయడానికి శిష్యగణం ప్రారంభించింది. వాసుదాస స్వామి వారు చేసే రామాపారాయణ యజ్ఞాన్ని వీరు ఇప్పటిదాకా అక్కడక్కడ నిర్వహిస్తూనే ఉన్నారు.
కారణాంతాల వల్ల అంగలకుదురులో వాసుదాసస్వామి వారి ఆశ్రమాన్ని 1948లో ఏర్పాటు చేశారు. దాసకుటిగా నామకరణోత్సవం చేశారు. ఈ ఆశ్రమంలో ధ్యానమందిరం నిర్మించారు. 1958లో 28 రోజుల పాటు 108 సార్లు రామాయణ పారాయణ చేసి శ్రీరామ చంద్ర ప్రభువుకు గురువుగారు చేసినట్లుగానే మహాసామ్రాజ్య పట్ట్భాషేకాన్ని నిర్వర్తించారు.
ఈ దాసకుటిలో నిత్యమూ రామునికి పూజాదికాలు నిర్విఘ్నంగా జరుగుతుంటాయి. ఇక్కడ నెలకొన్న 108 సాలగ్రామ మూర్తులకు అభిషేకాలు, అర్చనలు, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణలు స్వామివారికి ప్రీతి పూర్వకమైన నివేదనలు చేస్తుంటారు. భక్తబృందం అంతా కలసి స్వామి వారి సేవలో ఉంటూ తమ గ్రామ ప్రజలనే కాక పల్లె పట్నాలు తిరిగి అందరినీ సత్యధారణులుగాను, ధర్మాచరణులుగాను చేయడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ఇపుడు ఐదవ గురువుగా ఉన్న శ్రీరామానుజదాస స్వామివారు ఈ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు తీసుకొన్నారు. ఈ ఆశ్రమం ద్విపద భగవద్గీత, శ్రీకృష్ణ లీలామృతం, ఆంధ్ర వాల్మీకి రామాయణం, ఆర్యకథా నిధులు -8్భగాలు ఇలా పలు గ్రంథాలను ప్రకాశం చేస్తున్నారు. వాసుదాసస్వామివారి జయంతి ఉత్సవాలను, శ్రీరామ పట్ట్భాషేకాలను వీరు సదా నిర్వహిస్తుంటారు. రామాయణ పారాయణ, ప్రవచనం చేస్తూ శ్రీ రామానుజదాస స్వామి వారు ఆశ్రమ బాధ్యతలతో పాటు వాసుదాసస్వామివారి ఆశయాలసాధనలోసదా నిమగ్నులై ఉంటున్నారు. ప్రజలందరూ రామునికి మారురూపులు కావాలని ధర్మాచరణలో ముందుండాలని, రాముని చరిత్రను వినాలన్న ఆసక్తి ఉన్నవారికందరికీ ఆంధ్రావాల్మీకి విరచిత రామాయణాన్ని నిత్యమూ ప్రవచిస్తూ తమ ఆశయాన్ని సఫలీకృతం చేస్తున్నారు.

- చరణశ్రీ