మెయిన్ ఫీచర్

న్యూజిలాండ్‌లో భారతీయ నృత్యహేల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె చేతిలో ఉన్న కళ నాట్యం. ఆ కళతోనే న్యూజి లాండ్‌లో అడుగుపెట్టిన ఈ అతివ అక్కడ భారతీయ నాట్య రీతులను పరిచయం చేస్తోంది. బాలీవుడ్ సినిమాల్లోని డ్యాన్స్‌లే భారతీయ నృత్య కళలు అని నమ్మే న్యూజిలాండ్‌వాసులకు ఆ పిచ్చిగంతులు కాదు అసలైన నాట్యకళ ఇది అని చాటి చెబుతోంది. ఆమే నాట్యకళాకారిణి స్వరూపా ఉన్ని.
వివాహం తరువాత న్యూజిలాండ్‌కు..
కేరళకు చెందిన స్వరూపా ఉన్ని భరతనాట్యం నేర్చుకుంది. ఆమెకు సిద్దార్థ్‌తో వివాహమైంది. పెళ్లయిన తరువాత ఆమె భర్తతో పాటు న్యూజిలాండ్ వెళ్లవలసి వచ్చింది. భర్త సిద్దార్థ్ కార్పొరేట్ జాబ్‌ని వదలి అతనికి ఇష్టమైన చిత్రనిర్మాణంలో అధ్యయనం చేసేందుకు న్యూజిలాండ్ వెళ్లాడు. భర్తతో పాటు స్వరూప కూడా వెళ్లకతప్పలేదు. అక్కడకి వెళ్లడమే జీవితం మేలు మలుపునకు కారణమైందని చెప్పవచ్చు. న్యూజిలాండ్‌లోని ఒటాగో ప్రాంతం సౌత్ ఐలాండ్‌లోని డునెడిన్‌లో ఉండేవారు. అక్కడ స్వరూపాకు ఏమీ తోచేదికాదు. వీకెండ్స్‌లో భర్త ఫ్రెండ్స్‌తో పార్టీలు, షికార్లు మినహా ఆమెకు ఖాళీ సమయమంతా ఏమీ తోచేదికాదు.
ఆ నిశ్శబ్దాన్ని భరించటం ఆమెకు కష్టమైంది. ఆమె చేతిలో ఉన్నది నాట్యం మాత్రమే. ఈ కళతోనే ఏదైనా చేయాలని అని అనిపించింది. ఇక్కడ ఎవరైనా కళాకారులు ఉన్నారేమో నాట్యప్రదర్శనలు ఇద్దామని భావించింది. కాని ఎవ్వరూ కనిపించలేదు. పరిచయం కాలేదు. చివరకు గూగుల్ పరిశోధించి నాట్య కళాకారులను కలుసుకుంది. కాని భారతీయ నృత్యం అంటే వారికి కేవలం బాలీవుడ్ డ్యాన్స్ మాత్రమే అనుకునేవారు. అటువంటి వారిలో చైతన్యం తీసుకువచ్చింది. సోలో డ్యాన్స్‌ను విభిన్నరీతుల్లో వారి ఎదుట ప్రదర్శించి నాట్యకారిణిగా ఆమె గుర్తింపుతెచ్చుకోవటం ప్రారంభించారు. ఆ తరువాత పూర్తిగా భరతనాట్య ప్రదర్శనలు ఇవ్వటం ఆరంభించారు.
నాట్యలోకంతో నాట్యశిక్షకురాలిగా..
తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే చిన్న గదిలో నాట్యలోకం అనే డ్యాన్స్ స్కూలును ఏర్పాటుచేసి శిక్షకురాలిగా ఎంతోమంది అభిమానాన్ని చురగొన్నారు. న్యూజిలాండ్ తొలి ఇండియన్ డ్యాన్స్ స్కూలు గా ఆమె ఏర్పాటు చేసిన నాట్యలోకం అక్కడివారి మన్ననులు పొందుతుంది. తొలుత ముగ్గురు మాత్రమే వచ్చేవారు. నేడు ముప్పయి మందికి తక్కువకాకుండా ఆమె వద్ద నాట్యం నేర్చుకుంటున్నారు. అంతేకాదు స్వరూప తన శిష్యులతో కలిసి అక్కడ నాట్య ప్రదర్శనలు ఇస్తూ భారతీయ నాట్యం పట్ల న్యూజిలాండ్‌లో అభిమానాన్ని పెంచిం ది. చేతిలో ఉన్న కళతో అడుగు ముందుకు వేయటం వల్ల ఈనాడు ఇక్కడివారి అభిమానాన్ని సంపాదించానని స్వరూప అంటుంది. కేరళ లో అమ్మ చేతి వంటలు, అక్క డ ప్రకృతి దృశ్యాలను, కొబ్బ రి తోటలను మరచిపోలేనని, అయితే ఇక్కడకు పిల్లలకు నాట్యం నేర్పించటం,
వారితో కలిసి ప్రదర్శనలు ఇవ్వటం ద్వారా కొంత తేరుకోగలుగుతున్నానని అంటారామె.
సంప్రదాయాలను విడవలేదు..
స్వరూప భారతీయ సంప్రదాయమైన దుస్తులనే అక్కడకూడా ధరిస్తారు. టీవీల్లో భారతీయ ప్రోగామ్స్ ను వీక్షిస్తూ.. ఇంట్లో కూడా మలయాళ వంటకాలనే చేస్తూ అక్కడ నాట్య సౌరభాలను వెదజల్లుతున్నారు. స్వదేశం నుంచి దూరంగా వచ్చినా ఆ బాధ లేకుండా డ్యాన్స్ స్కూలుతో న్యూజ్‌లాండ్‌వాసులను స్నేహితులుగా మలుచుకుని వారికి భరతనాట్యం నేర్పించటం సంతృప్తినిస్తోందని చెబుతుంది.