మెయన్ ఫీచర్

వీర జవాన్ల త్యాగాలు వృథా కారాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచ్చ గెలిచినా మన ప్రధాని నరేంద్ర మోదీ ఇంకా ఇంట గెలవలేదు. ఈ విషయాన్ని సాకుగా తీసుకునే సందీప్ దీక్షిత్, ములాయం సింగ్, మణిశంకర్ అయ్యర్, అజం ఖాన్ బృందం- మోదీకి బదులుగా భారత సైన్యం మనోబలాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తోంది. దీంతో వీరంతా ‘పాక్-చైనాల నుంచి జీతభత్యాలు పొందేవారి జాబితా’లో ఉన్నారా? అనే అనుమానాలు కలగడం సహజం. ‘్భరత రాజ్యాంగం 1950 జనవరిలో ప్రకటింపబడిన రోజు చాలా దుర్దినం’- అంటూ ప్రకటన చేసిన రచయిత్రి అరుంధతీ రాయ్ అమెరికా వెళ్లి, భారత్ వంటి దుర్మార్గపు దేశం మరొకటి లేదు అని విలేఖరుల సాక్షిగా చెప్పింది. కాశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని దిల్లీలోని జెఎన్‌యు విద్యార్థులు కొంతమంది జిహాదీ ఉగ్రవాదులను కోరారు. కన్నయ్యకుమార్ వంటి చైనా ప్రేరేపిత విద్యార్థి నేతలు ఉద్యమాలు నడుపుతుంటే అరుంధతి రాయ్ మద్దతు ప్రకటించారు. భారత రాజ్యాంగం అరుంధతీ రాయ్ అన్నట్టు అంత దుర్మార్గమైందా? రాజ్యాంగాన్ని తిట్టడం అంటే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ని తిట్టడమే. ఆయన మేధోసంపత్తిని ఈ రచయిత్రి అవమానించడమే. ఇలాంటి రచయితలు, కుహనా లౌకికవాదులు దేశంలో ఉగ్రవాదం నారు పోసి, నీరు పోసి కల్లోలం సృష్టిస్తున్నారు. ఫలితంగా చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, తెలంగాణ తదితర ప్రాంతాల్లోని యూనివర్సిటీల్లో హింస ప్రజ్వరిల్లింది.
‘్భరత్‌ను ముక్కలు చేయండి’ అని పిలుపునిచ్చే దేశద్రోహులు పెద్ద సంఖ్యలో చైనా, పాక్ ప్రేరణతో మన దేశంలో పుట్టుకొచ్చారు. ఈ పరిణామాల ఫలితంగానే ఇటీవల చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు జరిపిన పలు హింసాత్మక సంఘటనల్లో వందలాది మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినపుడల్లా- ‘ఇది పిరికివాళ్ల చర్య’ అని భారత ప్రభుత్వం ఆనవాయితీగా మొక్కుబడి పత్రికా ప్రకటనలు విడుదల చేస్తుంది. ‘వీరజవాన్ల కుటుంబానికి శ్రద్ధాంజలి’ అంటూ ప్రధాని, రాష్టప్రతి పేరిట ప్రకటనలు విడుదల చేస్తారు. నిజానికి ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే సంఘటన’ అంటూ హోం మంత్రిత్వ శాఖ సైతం యథాలాపంగా స్పందిస్తుంది. ఇంతకీ ఈ సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఎవరు? అట్టడుగు వర్గాల నుండి వచ్చిన ఆర్థిక స్థోమత లేని యువకులు. వీళ్లు చైనా, పాక్ ప్రేరిత ఉగ్రవాదుల చేతుల్లో హతులౌతుంటే- ప్రఖ్యాత రచయితలు, వీర లౌకికవాదులు నీచమైన పాత్రను పోషించటం ఏమిటి? హింసావాదాన్ని ఖండించేవారు ఎవరూ లేరా? ఉగ్రవాదుల, మావోయిస్టుల బీభత్సకాండపై మీడియాలో వచ్చే కథనాలకు నేతలు స్పందించరా? ఈ విషయంలో ప్రజల ధోరణి కూడా ఇందుకు భిన్నంగా లేదు. వీరజవాన్లు ప్రాణత్యాగాలు చేస్తున్న సమయంలో జనం ‘బాహుబలి’ సినిమా టికెట్లను బ్లాకులో కొనుక్కొని మరీ ఆనందిస్తున్నారు. ఉగ్రవాదులు, మావోయిస్టులు ర్యాకెట్ లాంచర్లు వంటి అధునాతన ఆయుధాలతో మన సైనికులపై దాడులు చేస్తున్నా మన నిఘా వ్యవస్థలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా తరచూ దెబ్బతింటోంది. వీటన్నింటినీ సరిదిద్దే వారు ఎవరు? ఇప్పుడిక ప్రధాని మోదీ కాశ్మీర్ గురించి అందమైన నినాదాలతో ప్రజలను మభ్యపెట్టలేరు. లోక్‌సభలో బిజెపికి పూర్తి మెజారిటీ ఉంది. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో బిజెపి ప్రభుత్వాలే ఉన్నాయి.
‘ఆదివాసీలు పేదవారు గనుకే వారు స్వీయరక్షణ కోసం ఉగ్రవాదులను ఆశ్రయిస్తున్నారు’ అంటూ జిహాదీ సానుభూతిపరులు టీవీల్లో ప్రసంగిస్తున్నారు. ఐతే ‘ఇన్‌ఫార్మర్లు’ అనే నెపంతో ఆదివాసీలను పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కాల్చిచంపారు. లోకానికి తెలియని మరో అంశం ఏమంటే- చత్తీస్‌గఢ్ కొండకోనల్లో అక్రమ మైనింగ్‌ను అక్కడి మావోయిస్టులే జరుపుతున్నారు. అలా వచ్చిన సంపద చైనాకు చేరుతున్నది. రోడ్లు వేసి చత్తీస్‌గఢ్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించినా, రోడ్లు వేసేందుకు మావోయిస్టులు అంగీకరించరు. ఎందుకని? రోడ్లు వేస్తే తమ తమ స్థావరాలకు సైన్యం చేరవచ్చు, ఆదివాసీల్లో ఆర్థిక,విద్యా వికాసం జరుగుతుంది. అపుడు వారు మావోల మాటే వినరు. కేరళ, తమిళనాడు, తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, త్రిపుర రాష్ట్రాల్లో పరిస్థితులు చేజారిపోయాయి. అంటే రాజకీయంగా చైనా, పాకిస్తాన్‌లు భారత్‌పై పరోక్ష విజయాలు సాధించాయని అర్థం. నేపాల్‌లోని ఖాట్మండు నుండి శ్రీలంకలోని జాఫ్నా వరకు ‘రెడ్ కారిడార్’ నిర్మాణం పూర్తి అయింది. అరుణాచలప్రదేశ్‌ను చైనా ఏ క్షణంలోనైనా ఆక్రమించుకోవచ్చు. ఆక్రమిత కాశ్మీర్‌కు పట్టిన గతే అరుణాచలప్రదేశ్‌కు పట్టబోతున్నది.
దేశరక్షణ కోసం ప్రభుత్వం భద్రతా దళాలను రూపొందించుకుంటుంది. అంటే వారి వద్ద చట్టబద్ధంగా ఆయుధాలు ఉంటాయి. అలాకాక ఏ పౌరుడైనా ఆయుధాలు ధరించి ఉంటే అది రాజ్యాంగ రీత్యా నేరం. మరి దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రైవేటు సైన్యాన్ని ఎట్లా సమర్థిస్తున్నాయి? ఎట్లా పెంచి పోషిస్తున్నారు? బిహార్‌లో లల్లూప్రసాద్ యాదవ్, యూపీలో ములాయంసింగ్‌లకు ప్రైవేటు సైన్యాలున్నాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలకు ఉపక్రమించాలి. సాకులు చెప్పి మోదీ తప్పించుకోజాలరు. అటు చైనా, ఇటు పాకిస్తాన్ నుండి మన దేశంలోని వారి అనుకూల వర్గాలకు అందుతున్న అన్నిరకాల సహాయాలను నిలిపివేయాలి. బీజింగ్, ఇస్లామాబాద్‌లో దౌత్య సంబంధాలు తాత్కాలికంగా నిలిపివేయాలి. టిబెట్‌ను స్వతంత్ర సార్వభౌమరాజ్యంగా పార్లమెంట్‌లో తీర్మానించాలి. బెలూచిస్తాన్, గిల్గిత్‌లలో స్వతంత్ర పోరాటాలకు భారత్ ప్రత్యక్ష మద్దతును అందించాలి. ఆక్రమిత కాశ్మీరును స్వాధీనం చేసుకోవాలి. కులభూషణ్ జాధవ్ వంటివారిని విడిపించుకోవాలి. దేశ సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని చట్టపరంగా శిక్షించాలి. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ‘చత్తీస్‌గఢ్ అమరవీరులకు శ్రద్ధాంజలి’ సంతాప తీర్మానాలు చేస్తే మనకు నిన్నటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే గుర్తుకు వస్తుంది. యుపిఎ ప్రభుత్వానికంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని భావించే ఇపుడు ప్రజలు మోదీ, అమిత్‌షాలకు మద్దతుగా తీర్పునిస్తున్నారు.
దేశ సరిహద్దుల్లో ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్‌ఒసి) వద్ద జవాన్లు చేసిన త్యాగాలకు జాతి ఏ విధంగా రుణం తీర్చుకోగలదు? శరీరం గడ్డకట్టే అత్యల్ప ఉష్ణోగ్రతల్లో మంచుకొండల్లో మన సైనికులు పహారా కాస్తుండబట్టే- ‘వీర లౌకికవాదులు, జాతి వ్యతిరేకులు’ హాయిగా చికెన్ పలావులు తిని బ్రాందీ తాగి వాగుతున్నారు. దిల్లీ మాజీ సిఎం షీలా దీక్షిత్ సుపుత్రుడైన సందీప్ దీక్షిత్ భారత సైన్యాధ్యక్షుణ్ణి ‘జనరల్ డయ్యర్’తో పోల్చాడు. ఆయనకు భారత్‌లో ఉండడం ఇష్టం లేకపోతే పాకిస్తాన్‌కు వెళ్లి స్థిరపడవచ్చు. ఇక్కడే ఉంటూ భారత సైన్యాన్ని అవమానించటం దేశద్రోహం కాక మరేమిటి? నిజానికి దేశ వ్యతిరేక వాఖ్యలు చేసే మణిశంకర అయ్యర్, సందీప్ దీక్షిత్‌లది తప్పు కాదు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వానిదే అసమర్థత అనాలి. ఆయూబ్ పండిట్ అనే పోలీసు ఉన్నత అధికారిని ఇటీవల రాళ్లతో కొట్టి శ్రీనగర్‌లో చంపారు. ఇది కిరాతక చర్య అని కేంద్రం ఒక ప్రకటనను విడుదల చేసింది. మరి ఈ కిరాతక చర్యను ప్రేరేపించిన పాకిస్తాన్‌పై తీసుకున్న చర్య ఏమిటి?
గత నెల 30న చైనా భారత్‌ను బెదిరించింది. భూటాన్ సరిహద్దులో సుదీర్ఘమైన రోడ్లు నిర్మించింది. ఇది సిలిగురికి సమీపంలో ఉంది. అంటే అటు అరుణాచల్‌ప్రదేశ్, ఇటు భూటాన్ సిక్కింలలో ఏకకాలంలో చైనా సరిహద్దు దురాక్రమణలకు పాల్పడింది. దీనికి కేంద్రంలోని పాలకులు ఏం సమాధానం చెబుతారు? ఇది నెహ్రూ, కృష్ణమీనన్‌ల నాటి కాలం కాదని మోదీ సర్కారు జవాబు చెప్పగలదా? ఐదేళ్ల క్రితం జరిగిన ‘యథాతథ స్థితి’ ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించి ఇపుడు డొక్లామ్ అనే భూటాన్ భూభాగంలో కట్టడాలు మొదలుపెట్టింది. ఈశాన్య భారతాన్ని ఆక్రమించుకుంటూ ఇప్పుడు చైనా భూటాన్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ వరకు వచ్చింది. తార్కికంగా చూస్తే ఇదంతా భారత భూభాగమేనని ఎవరికైనా సులువుగా తెలుస్తుంది. ‘ఇండో-చీనీ భారుూ భారుూ’ అనే రోజులు పోయాయి. నెహ్రూ కళ్లముందే ఆయన ‘పంచశీల’ అనే కంచు నగరా పగిలిపోయింది. నిన్న చైనా నాధూలా మార్గాన్ని మూసివేసింది. మన దేశం నుండి మానస సరోవర్‌కు యాత్రికులు వెళ్ళే అవకాశం లేదని అర్థం. సిక్కిం భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొని వచ్చారు. ఇది 1962 నాటి పరిస్థితిని గుర్తుకుతెస్తున్నది. అప్పటికీ, ఇప్పటికీ ఒక తేడా 1962లో ఢిల్లీని ఒక షోబియన్ సోషలిస్టు పరిపాలిస్తున్నాడు. కాని ఇవ్వాళ భారతదేశాన్ని ఒక హిందువు పరిపాలిస్తున్నాడు. చైనాతో ప్రత్యక్ష యుద్ధం వస్తే 1962లో వలే ఇపుడు భారత్ ఓడిపోదని నిశ్చయంగా చెప్పవచ్చు.
ప్రస్తుతం ప్రపంచంలోని ‘పొలిటికల్ కెమిస్ట్రీ’ని బాగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. పాకిస్తాన్, సౌదీ అరేబియా సహజ మిత్రులు. ఇండియా, ఇజ్రాయిల్ అలాగే సహజ మిత్రులు. పాకిస్తాన్ మిత్రులంతా ఇండియాకు శత్రువులే. చైనా నిరీశ్వర దేశం. పాకిస్తాన్ అల్లాను నమ్ముకున్నది. అలాంటప్పుడు ఈ ఈర్ష్యా ద్వేషాలలో రగిలిపోయే పాక్ చైనాతో ఎందుకు మైత్రి చేసింది? సారాంశం ఏమంటే, చైనా అనుకూల వర్గాలు, పాక్ అనుకూల వర్గాలతో కలిసి పనిచేస్తాయే కానీ ఎటువంటి పరిస్థితిలోను ‘హిందువు’లకు మద్దతునివ్వవు. ఇప్పుడు మోదీ ఏం చేయబోతున్నాడో తెలియదు. దేశంలోని ఉభయ కమ్యూనిస్టు పార్టీలపైనా, ముస్లిం లీగ్, మజ్లిస్ సంస్థలపైనా నిషేధం విధించకపోవచ్చు. టిబెట్‌ను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కోరకపోవచ్చు. చైనాతో దౌత్యసంబంధాలు రద్దుచేయకపోవచ్చు. కాని ఆర్థిక బంధాన్ని చైనాతో తెగతెంపులు చేసుకోవచ్చు. చైనా వస్తువులు, పెట్టుబడులు ఇండియాకు రాకుండా నిరోధించవచ్చు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అస్తిత్వం కోసం ఇజ్రాయిల్ అరబ్బు దేశాలతో పోరాడుతున్నట్లే ఇండియా ఇటు పాక్‌తో, అటు చైనాతో పోరాడక తప్పదు. యుద్ధం ఎవరికీ సుఖశాంతులను ఇవ్వవు. దిల్లీపై చైనా, పాక్‌లు ఉమ్మడి యుద్ధం ప్రకటించినప్పుడు ఇండియా గత్యంతరం లేక సమర రంగంలోకి దూకవలసి ఉంటుంది. అప్పుడు దిల్లీకి ఎంత ప్రమాదం ఉంటుందో- బీజింగ్‌కు, ఇస్లామాబాద్‌కు కూడా ఇండియా ప్రయోగించే అధునాత క్షిపణుల వల్ల అంతే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇండియా వద్ద ప్రస్తుతం అంతటి అణ్వస్త్ర సామర్థ్యం ఉంది. అమెరికా, అవిభక్త రష్యాల తర్వాత తృతీయ స్థానంలో ఇండియా ఉన్నదని ఒక పరిశోధన వెల్లడించింది. తాజాగా భారత్ చేసిన హెచ్చరికను చైనా బుట్టదాఖలు చేసి మన ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులోని భూటాన్‌లో నిర్మాణాలు కొనసాగిస్తున్నది. దీనికి మోదీ సమాధానం ఏమిటి? డొక్లామ్ వద్ద చైనా జరిపిన నిర్మాణాలు ఆపగలరా? ఇప్పుడు మాటలు కాదు- చేతలు కావాలి!

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్