మెయిన్ ఫీచర్

వైవిధ్యం.. మగువల మనోభీష్టం ఫ్యాషన్ ప్రపంచం కొత్తపుంతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనునిత్యం అనూహ్య మార్పులే ‘్ఫ్యషన్ ప్రపంచం’ అసలు లక్షణం. మార్పుకు స్వాగతం పలుకుతూ, మగువలు వైవిధ్యాన్ని కోరుకోవడంతో ఈ ఏడాది భారత్‌లోనే కాదు, విశ్వవ్యాప్తంగా కొత్త కొత్త ఫ్యాషన్లు రంగప్రవేశం చేశాయి. సాంప్రదాయాలకు ఆలవాలమైన భారత్‌లోనూ మహిళలు స్వేచ్ఛాగళం వినిపిస్తూ ఆధునికత వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా యువతులు తమకు నచ్చిన దుస్తులు ధరిస్తూ, అలంకరణపై తెగ మోజుపడుతున్నారు. విభిన్న ఫ్యాషన్లకు భారతీయ మహిళలు ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అనడానికి ‘పెళ్లికూతురి ముస్తాబు’లో ఇటీవల చోటు చేసుకుంటున్న మార్పులే అద్దం పడుతున్నాయి. అలంకరణకు సంబంధించి తమ ప్రాధాన్యతలను ఇపుడు వధువులే నిర్మొహమాటంగా చెబుతున్నారు. పెళ్లికూతురి ముస్తాబులో సాంప్రదాయ పద్ధతులకు తెరపడుతున్నట్లు ఓ సౌందర్య ఉత్పత్తుల సంస్థ జరిపిన తాజా సర్వేలో వెల్లడైంది. తేలికపాటి నగలు ధరించాలని, శిరోజాలు, నయనాలు ఆకట్టుకునేలా ఉండాలని వధువులు వాంఛిస్తున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది. భారీ అలంకరణతో, బరువైన దుస్తులతో పెళ్లి పందిట్లో అందరి ముందూ తల వంచుకుని కూర్చోవాలని ఈ కాలపు వధువులు భావించడం లేదు. ఆకర్షణీయంగా ఉంటూ, అలంకరణలో తమ వ్యక్తిత్వం బయటపడాలని వారు కోరుకుంటున్నారు. కళ్లు ఆకట్టుకునేలా ఉండాలని సర్వే సందర్భంగా 43 శాతం మంది వధువులు తేల్చి చెప్పారు. మేనిచాయ ఆకట్టుకునేలా మంచి నిగారింపుతో ఉండాలని 25 శాతం మంది పెళ్లికూతుళ్లు తమ మనసులోని మాట చెప్పారు. నయనాలు కాంతులీనేందుకు అవసరమైతే మేక్‌ప్ ఆర్టిస్టు సహాయం తీసుకోవడంలో తప్పేమీ లేదని చాలామంది యువతులు చెప్పారు. పెళ్లిరోజు శిరోజాల అలంకరణ అదిరిపోయేలా ఉండాలని 45 శాతం మంది వధువులు తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు. అందమైన హెయిర్ స్టయిల్ కోసం తాము బ్యూటీషియన్ల వద్దకు వెళుతుంటామని 25 శాతం మంది తెలిపారు. ముఖం అందంగా ఉండాలని 41 శాతం మంది, బరువు తగ్గాలని 22 శాతం మంది వధువులు పెళ్లికి ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు సర్వేలో వెల్లడించారు. పెళ్లిళ్లే కాదు, మిగతా సందర్భాల్లోనూ వినూత్న ఫ్యాషన్ల వైపు యువతులు ఆసక్తి పెంచుకోవడంలో ఇపుడు సామాజిక మీడియా ఎంతో కీలకపాత్ర వహిస్తోంది. ఫ్యాషన్లకు సంబంధించి తమ మనోభావాలను యువతులు పరస్పరం తెలియజేసుకుంటున్నారు.
ముఖానికి రంగులు.. తలపై పచ్చబొట్లు..
శిరోజాలు కత్తిరించుకోవడం, గోళ్ల ఆకారం, పచ్చబొట్లు, శరీర భాగాలపై రంగులు అద్దుకోవడం, విభిన్న వస్తధ్రారణ... ఇలా అలంకరణకు సంబంధించి ఎనె్నన్నో కొత్త పోకడల వైపు యువతులు మొగ్గు చూపుతున్నారు. కొన్ని దేశాల్లో అయితే మగువలు ఇపుడు తమ శిరోజాలకు లేత ఎరుపు, లేత నీలిరంగు వేసుకుంటున్నారు. శిరోజాలను గుండె ఆకారంలో పలురకాలుగా ముడి వేసుకోవడం తాజా ఫ్యాషన్‌గా మారింది. నీళ్లలో చేపలు కదలాడుతున్నట్లు గోళ్లకు వింత వింత డిజైన్లు అద్దుతున్నారు. గోళ్ల చివర బుడగలున్నట్లు వినూత్న పోకడలతో చూపరులకు విస్మయం కలిగిస్తున్నారు. ముఖారవిందంపై విభిన్న రంగులను అద్దుకుంటూ వైవిధ్యం చాటుకునే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ‘యూ ట్యూబ్’, ‘ఇన్‌స్టాగ్రామ్’ వంటి సామాజిక మీడియాలో ఫొటోలను చూస్తూ ఇలా ముఖాలపై రంగులు పులుముకుంటూ తమ అందం మరింతగా ఇనుమడిస్తోందని యువతులు సంబరపడుతున్నారు. అలంకరణకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇక, దుస్తుల విషయంలో అయితే ఫ్యాషన్లకు ఎలాంటి సరిహద్దులూ లేవు. నిన్న వింత అనుకున్న ఫ్యాషన్ ఈరోజుకి పాతదై పోతోంది, ఇవాళ కొత్తదనుకున్న పోకడలు రేపటికి మొహం మొత్తేస్తున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు భిన్నత్వాన్ని, ప్రత్యేకతను కోరుకుంటున్న టీనేజీ యువత కొత్తదనం కోసం అనుక్షణం తపన పడుతోంది. ఏ మాత్రం కలవని రంగులున్న దుస్తుల్ని ధరించడం, ప్లాస్టిక్ నగలు వేసుకోవడం, తలపైనా పచ్చబొట్లు వేయించుకోవడం, నచ్చిన ఆకారంలో శిరోజాలను కత్తిరించుకోవడం.. ఇవన్నీ ఈ కాలపు యువతను వెర్రెత్తించే ఫ్యాషనే్ల. కొత్త ఫ్యాషన్లను స్వాగతించిన 2015 సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతుండగా, వచ్చే ఏడాది ఇంకెన్ని పోకడలు రానున్నాయో చూడాల్సిందే!