మెయన్ ఫీచర్

‘ఇద్దరు చంద్రులు’ భలే భలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటే ఏమిటో ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థి పర్యటనలో తెలుగు రాష్ట్ధ్రానేతలు చేసిన హడావుడి చూస్తే అర్థమవుతుంది. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ‘ఓటు అభ్యర్థన’ కోసం వచ్చినప్పుడు ఆయనను స్వాగతిస్తూ ‘ఇద్దరు చంద్రులు’ చేసిన సందడి విస్మయం కలిగించేదే. కోవింద్ ఇప్పుడు రాష్టప్రతి కాదు. కేవలం అభ్యర్థి మాత్రమే. ఆయనను తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, ఏపిలో అధికార టిడిపి, ఆ పార్టీని వ్యతిరేకించే ప్రధాన విపక్షం వైసీపీ బలపరుస్తున్నందున ఎన్డీఏ ఓట్లకు వచ్చిన గత్తరేమీ లేదు. కారణాలేమైనా దేశ చరిత్రలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడబలుక్కుని, పోటీపడి మరీ ఒక అభ్యర్థికి ఎదురేగి స్వాగతించి ‘మా ఓట్లు మీకేన’ని ‘గంపగుత్త’గా భరోసా ఇవ్వడం బహుశా ఇదే తొలిసారి కామోసు! ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి మిత్రపక్షంగా టిడిపి మోతాదుకు మించి ఉత్సాహం ప్రదర్శించిందంటే అర్థం ఉంది. కానీ, ఎన్డీఏలో భాగస్వామి కాని, తాజాగా బిజెపి దళపతి అమిత్ షాను ‘భ్రమిత్ షా’అని వెటకరించి, తెలంగాణ గడ్డపై ‘కమల వికాసాన్ని’ నిలువరిస్తోన్న టీఆర్‌ఎస్ దళపతి కేసీఆర్ కూడా అంతే ఉత్సాహంతో కోవింద్‌కు రాచమర్యాదలు చేయడం ఆశ్చర్యకరం. ఓ వైపు రాష్ట్రంలో ‘కమల దళాల’ను ఉతికి ఆరేస్తున్న తెరాస- అదే బిజెపి అభ్యర్థికి ఘనస్వాగతం పలకడం కేసీఆర్ మార్కు రాజకీయానికి నిదర్శనం.
కోవింద్‌కు ఘన స్వాగతం పలకడాన్ని తప్పుపట్టలేం. అయితే, పార్లమెంటులో తలుపులు మూసి, ప్రత్యక్ష ప్రసారాల గొంతు నులిమి తెలంగాణకు ‘అర్ధరాత్రి స్వతంత్రం’ ఇవ్వడంలో కీలకపాత్ర పోషించిన నాటి లోక్‌సభ స్పీకర్, నేటి యుపిఏ అభ్యర్ధి మీరాకుమార్‌కు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం మంచిదికాదన్నది విజ్ఞుల వాదన. తెరాస ఎన్డీఏకు మద్దతునిస్తున్నట్లు ఎలాగూ ప్రకటించేసింది. ఇక మీరాకుమార్ వచ్చి అభ్యర్థించినా పార్టీ విధాన నిర్ణయం తీసుకున్నందున తామేమీ చేయలేమని చెప్పి, అల్పాహారవిందు ఇచ్చి సాగనంపితే సగౌరవంగా ఉం డేది. సరే.. ఎవరి వ్యూహం వారిది!
ఇంకా రాష్టప్రతిగా ఎన్నిక కాని అభ్యర్థికి ఏపిలో సర్కారు సొమ్ముతో పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ఆయనకు ఎదురేగి స్వాగతం పలకటం ఎబ్బెట్టుగానే ఉందన్నది విజ్ఞుల మనోగతం. ఇప్పుడంటే బాబు రాజకీయ పరిస్థితి స వ్యంగా లేదు గానీ, గతంలో ఆయన దేశరాజకీయ యవనికపై ప్రధాన పాత్రధారే. ఈ పరిణామాలను గతంతో పోల్చిచూసుకునే వారికి, తాజా చర్యలు సానుభూతికి గురవుతున్నాయి. ఒకప్పుడు రాష్టప్రతి, ప్రధాని నియామకాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు- ఇప్పుడు అవసరార్థం అ నవసరంగా తన స్థాయిని తగ్గించుకుంటున్నారేమోనన్నది ‘త మ్ముళ్ల’ వేదన.
ఇక, ప్రతిపక్షనేత జగన్ తా నూ ‘ఆ తాను ముక్కనేన’ని చాటుకునేందుకు పెద్దగా మొహమాటపడ లేదు. మామాలుగా అయితే మద్దతు ప్రకటించి, ఎన్నికప్పుడు ఓట్లేస్తే సరిపోయేది. కానీ విధేయత పరీక్షలో తెలుగుదేశం పార్టీకి ఎక్కడా తగ్గకుండా, తానూ ఆ వరసలో నిలవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తెరాస మాదిరిగా వైసీపీ కూడా ఎన్డీఏ భాగస్వామి కాదు కాబట్టి! ఇది ఒకరకంగా అత్యుత్సాహం ప్రదర్శించడమేనన్నది ఆ దృశ్యాలు చూసే వారిలో కలిగే తొలి అభిప్రాయం. అయితే, కోవింద్‌కు జగన్ పాదాభివందనం చేయడాన్ని టిడిపి ఆక్షేపించడం తగదు. కోవింద్ వయసు రీత్యా జగన్‌కు తాతతో సమానం. కాబట్టి పెద్దలకు పాదాభివందనం చేయడం తప్పేమీకాదు. గతంలో సీఎం కేసీఆర్ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామికి అనేకసార్లు పాదాభివందనం చేసినప్పుడూ ఇలాంటి విమర్శలే వెల్లువెత్తాయి. నమస్కారం సంస్కారానికి ప్రతీక. పెద్దలను గౌరవించడం మన సంప్రదాయం. దానిని కూడా రాజకీయం చేయడం తగదు. ఇప్పుడంటే రాజకీయాలు ఆగర్భశత్రువుల వైరంలా మారాయి గానీ, ఓ 30 ఏళ్ల క్రితం ప్రత్యర్థుల మధ్య కూడా మర్యాద, మన్ననలుండేవి. వ్యక్తుల మధ్య కాకుండా పార్టీలు,సైద్ధాంతికపరమైన విభేదాలే ఉండేవి. కోవింద్‌కు పాదాభివందనం చేసినంత మాత్రాన జగన్‌పై ఉన్న కేసులన్నీ వీగిపోతాయన్నట్లు, అసలాయన దానికోసమే పాదాభివందనం చేశారన్న నిందలు నవ్వులపాలయ్యేవే. రాజకీయాల్లో హుందాతనం గురించి మాట్లాడే తెలుగుదేశం పార్టీ తాను మాత్రం హుందాతనం పాటించకపోవడం ఆక్షేపణీయం.
ఇక ఇదే ఎపిసోడ్‌లో వైసీపీ దళిత, గిరిజన ఎమ్మెల్యేలు కోవింద్‌తో ఫొటో దిగలేక, వెంకయ్యతో ఫొటోలు దిగిన వైనంపై జగన్ ఆగ్రహించి, వారికి చివాట్లు పెట్టారంటూ ‘సర్కారు ప్రాయోజిత మీడియా’లో అల్లిన ఆధార రహిత కథనాలు- పత్రికలపై అంతో ఇంతో ఉన్న గౌరవాన్ని మంటకలిపేవే. ఇప్పటికే ఏ పార్టీకి ఏ పత్రిక కరసేవ చేస్తుందో, ఎవరి ప్రయోజనాల కోసం ఏ పత్రిక శ్రమదానం చేస్తుందో, ఏ రాతల వెనుక ఎవరున్నారో, ఆ రాతల వల్ల వచ్చే లాభమేమిటో సోషల్‌మీడియా పుణ్యాన అందరికీ అర్థమవుతూనే ఉంది. కాబట్టి తమ జర్నలిజానికి భుజకీర్తులు, ట్యాగులైన్లు ఎన్ని పెట్టుకున్నా వాటిని నమ్మేరోజు లు పోయాయని ఇంకా గుర్తించకపోవడమే అవివేకం. సర్కా రు సేవలకు ప్రతిఫలంగా తా యిలాలు, తాంబూలాలు అం దుకుంటున్నందుకు ఇలాంటి వెగటు ప్రచారమే చేయాల్సిన పనిలేదు. కావాలంటే మరో కాంట్రాక్టు, ఇంకో 13 జిల్లాల్లో అప్పనంగా భూమి బహుమానంగా తీసుకోవచ్చు. ఇప్పుడున్న టెలికాస్టు రేట్లు పెంచుకోవచ్చు. దానికెవరూ అ భ్యంతరం చెప్పరు. ఎందుకంటే ఎవరి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వారిది కాబట్టి!
ఒకప్పుడు రాజకీయాల్లో ఎ త్తుకు పై ఎత్తులన్నీ వారి వారి శిబిరాల్లోని సీనియర్లు వేసేవారు. తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు రాయబారాలు, మంతనాలు, మం త్రాంగాలు వారే నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ఆ పాత్రను పార్టీల పక్షాన మీడియా అధిపతులే పోషిస్తున్నారు. ఇతర పార్టీల్లోని వారిని తీసుకురావడం, తమ ప్రతినిధులతో ప్రతర్థి పార్టీ ఇబ్బందులపై ఆరా తీయించి, వారితో ప్యాకేజీలు మాట్లాడే దళారీ పాత్ర పోషిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. వైఎస్ జీవించి ఉన్న సమయంలో ఆయన మీడియాలో పనిచేసే జర్నలిస్టులు- ప్రతిపక్షంలో ఉన్న టిడిపి సీనియర్లను కాంగ్రెస్‌లో, అనంతరం వైసీపీలో చేర్పించేందుకు ఇలాంటి పాత్రనే పోషించారు. ఇప్పుడు ఆ పాత్రను ‘దమ్మున్న మీడియా’ దళపతులు నిర్వర్తిస్తున్నట్లుంది. కాబట్టి నైతిక విలువలు, మీడియా విలువల గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదేమో?! సీనియర్ రాజకీయ నాయకుడైన మాకినేని పెద్దరత్తయ్య ఇటీవల మీడియా దళారీ దళపతుల గురించి చెప్పింది నూటికి నూరుపాళ్లూ నిజం!
* * *
అరువు మేధావి ప్రశాంత్ కిశోర్ (పి.కె.) పాదం మోపిన తర్వాత జగన్ పార్టీ తొలి ప్లీనరీ నిర్వహించుకుంటోంది. విపక్ష నేతగా జనంలో దూసుకుపోతున్న జగన్‌కు- మోదీ,నితీష్, కేజ్రీవాల్‌ను గెలిపించి, అఖిలేష్-రాహుల్‌ను ఓడించిన వ్యూహకర్త పి.కె. సలహాలు ఎంతవరకూ అక్కరకొస్తాయో చూడాలి. నిజానికి ఇప్పుడు ఏపిలో ప్రభుత్వ వ్యతిరేకత చాలాఉందన్నది బహిరంగం. అధికార పార్టీ శ్రేణుల అసంతృప్తి, అడుగడుగునా అవినీతి, కార్యకర్తలకు అందని అధికార ఫలాలు, ఎమ్మెల్యేలు- వారి వారసుల దోపిడీ, ఒక వర్గం హవాపై మిగిలిన వర్గాల ఆగ్రహంతో కూడిన అసహనం, అవసరం లేకున్నా భూసేకరణ, వెరసి అధికారపార్టీకి జనం దూరమవుతున్న వాస్తవ పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు పాజిటివ్, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెగిటివ్ దృక్పథంతో చూసే చంద్రబాబుకు ఇవి తెలిసి ఉండకపోవచ్చు. తెలిసినా ఇలాంటి వ్యతిరేక ఆలోచనను ఆయన ససేమిరా అంగీకరించరు. కాబట్టి నిఘా వర్గాలు కూడా నెగిటివ్ నిప్పును ఆయన ముందు ఉంచేందుకు మొహమాటపడవచ్చు. అది సహజం. ఎందుకంటే రాజును బట్టే భటులు కదా?! వాజపేయి హయాం నాటి బిజెపి మునిగిపోయే ముందు చేసిన ‘్భరత్ వెలిగిపోతుంద’నే నినాదంలా ఉంటుంది అధికార పార్టీ ఆలోచన.
ఇప్పుడు జగన్‌కు ‘అరువు సలహాదారు’ పికె ఏం చే స్తారో చూడాలి. జగన్ ఒక్కరే ‘ప్రత్యామ్నాయ నేత’ అన్న పేరు కష్టపడి సంపాదించుకున్నా, కాబోయే సీఎం ఆయనేనన్న భావన జనంలో బలంగా కల్పించలేకపోతున్నారన్నది నిజం. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రాజకీయ ప్రతికూల పరిస్థితులను సొమ్ము చేసుకోవాలనుంటే, క్షేతస్థ్రాయిలో పనిచేస్తున్న వారి సలహాలు తీసుకుంటే చాలు. ఎదుటివారు చెప్పింది పది నిమిషాలు ఓపికతో వింటే మేలు. ‘అంతా నాకు తెలుసు. నాకు మీరు చెప్పేవాళ్లా? నా వల్లే పార్టీకి ఓట్లు వస్తాయి. నన్ను చూసే ఓట్లేస్తున్నారనుకునే’ ధోరణి ఉంటే ఎవరూ బాగుచేయలేరు.‘నేను’ అనే పదం వినిపిస్తే అది పతనానికి నాంది. ‘మనం’ అంటేనే మనుగడ. ఇది ఒక్క జగన్‌కే కాదు, రాజకీయ పార్టీలకు సా రథ్యం వహించేవారందరికీ వర్తించే సూత్రం! *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144