మెయిన్ ఫీచర్

దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తె లంగాణాలోని జంట నగరాల్లలో 15వ శతాబ్దిలో ఆరంభమైన బోనాల సంబరాలు ఖండాంతరాలకు వ్యాపించాయ. దేశవిదేశాల్లోనూ బోనాలు అంగరంగవైభోగంగా జరుగుతున్నాయ. నిన్ననేడురేపు కూడా అమ్మతల్లిని కొలవడానికి కోట్లకొలది జనం తండోపతండాలుగా వస్తునే ఉన్నారు. అమ్మ అనుగ్రహం కోసం బారులు తీరి దర్శనం చేసుకొంటున్నారు.
గోల్కండ కోటలోని జగదాంబికాలయంలో ఆషాఢంలో మొదటి బోనాల పండుగ ఆరం భమైంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహాకాళి ఉత్సవాలు మహాఘనంగా జరుపుతూ, హైదరాబాద్ పాతబస్తీ షాలిబండలో వెలసిన ప్రాచీన అక్కన్న మాదన్న మహంకాళీ దేవాలయం, పాతబస్తీలోని లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారి దేవాలయాలు ఇలా ఈ బోనాల ఉత్సవాలు సు సంపన్నంగా జరపడం వెనుక మానవాళి కృషి ఎంతో ఉంది. సుమారు 200 సం.ల క్రితం 1813లో సికింద్రాబాద్ వాస్తవ్యులు సురిటి అప్పయ్య మిలటరీలో ఆర్మ్‌డోలీ బేరర్‌గా పనిచేస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయని టవర్‌కు బదిలీ అయ్యారు. ఆ సమయంలో కలరా వ్యాధి సోకి చాలామంది మరణించారు. ఆ సమయంలో అప్పయ్య తనవారితో కలిసి ఉజ్జయినీలోని మహాకాళి అమ్మవారిని ప్రార్థించారు. కలరా వ్యాధి నుండి కాపాడితే సికింద్రాబాద్‌లో ఆలయ నిర్మాణం జరిపి నిత్యం సేవించుకుంటానని వేడుకున్నారు. అచిర కాలంలోనే వ్యాధినుండి రక్షించబడి కలరా వ్యాధి పూర్తిగా దూరంఅయపోయింది. అమ్మవారి మొక్కు ప్రకారం 1815లో అప్పయ్య మిత్రులతో కలిసి ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని ఉజ్జయనీ మహాకాళి అమ్మవారున్న స్థలంలోనే కట్టె విగ్రహాన్ని ప్రతిష్టించారు. అమ్మవారికి ఉజ్జయినీ మహాకాళి అని నామకరణం చేసి నిత్య పూజలతో సేవిస్తున్నారు.. ఈ ప్రాంతాన్ని మరమ్మత్తులు చేస్తున్న సమయం త్రవ్వకాలలో ‘‘శ్రీమాణిక్యాలదేవి’’ విగ్రహం లభ్యమైంది. ఈ మాణిక్యాల దేవిని గర్భాలయంలో మహాకాళి అమ్మవారి ప్రక్కనే ప్రతిష్ట చేసారు. 150 సం. క్రితం 1864లో కట్టె విగ్రహాలను తొలగించి ప్రస్తుతమున్న విగ్రహాలను ప్రతిష్ట చేసారు. ఆనాటి నుండి నేటివరకు ఆలయాన్ని అభివృద్ధిచేస్తూ ప్రస్తుతం సుందర మనోహర దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఆనాటి నుండి అప్పయ్య వారసులే దేవాలయ రక్షణ, నిత్య పూజా కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. ఈ అమ్మను దర్శించుకున్నవారికి ఈడేరని కోరికలంటూ ఉండదు. అమ్మకు మనసారా చేతులెత్తి నమస్కరిస్తే చాలు అమ్మ అనుగ్రహం లభ్యమవుతుంది.

- సాయకృష్ణ