మెయన్ ఫీచర్

‘ఉగ్ర జ్వాలల’కు చైనా ఆజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా జర్మనీలో జరిగిన జి-20 సదస్సులో చైనా-్భరత్ అధినేతల ద్వైపాక్షిక చర్చలను చైనా ఏకపక్షంగా తిరస్కరించటం ద్వారా తన యుద్ధకాంక్షను, విస్తరణ వాంఛను బహిర్గతం చేసింది. ‘డొక్లామ్’ ప్రాంతం నుండి వైదొలిగేది లేదని మొండిగా ప్రకటించి భూటాన్, సిక్కింలను కబళించాలనే తన దుర్బుద్ధిని మరోసారి చైనా నిరూపించుకుంది. నిజానికి ‘చైనా సరిహద్దు’ అనేది చారిత్రకంగా ఎక్కడ ఉంది? చైనా ఆత్మరక్షణ కోసం తన సరిహద్దులో ఒక గోడ కట్టుకున్నది. దీనినే ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ అంటారు.
కారల్ మార్క్స్ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన మావో సేటుంగ్ చైనాలో ప్రజా ఉద్యమం నడిపాడు. అక్కడ రాజరికాన్ని తొలగించి తానే రాజు అయినాడు. అప్పటి నుండి చైనా రాజ్యవిస్తరణ కాంక్ష మొదలై, హిమాలయ పాద సానువులలోని చిన్న చిన్న రాజ్యాలను కబళించింది. టిబెట్టు, బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతం మానస సరోవర్ వంటివి చైనాలో అంతర్భాగం అయినాయి. పాకిస్తాన్‌ను తన వలసవాద దేశంగా మార్చుకొని ఆసియాలో తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదగాలని చైనా ఆరాటపడుతోంది. సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ వంటి హిమాలయ ప్రాంతాలను క్రమంగా తన భూభాగంలో కలుపుకోవాలని ఉవ్విళ్లూరుతున్నది. ఇందుకు ఆనాటి నెహ్రూ నుండి ఈనాటి సోనియా గాంధీ, ఏచూరి సీతారాంల వరకు కాంగ్రెస్, కమ్యూనిస్టు నేతలు ప్రత్యక్షంగా మద్దతునిచ్చారు. 1962లో చైనా అస్సాంలోని భూభాగాల వరకు చొచ్చుకొని వచ్చింది. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పట్లో విజయవాడలో వామపక్ష నేత మాకినేని బసవపున్నయ్య ఓ అధ్యయన సదస్సు ఏర్పాటు చేసి ‘్భరత్ చైనాపై దురాక్రమణ చేస్తున్నది. చైనా సైన్యానికి మద్దతునివ్వాలి’ అని బహిరంగంగా ప్రకటించాడు. కార్మికుల, కర్షకుల శ్రేయస్సు కోసం ‘ప్రజారాజ్యాన్ని’ స్థాపించామని చైనా చెప్పుకుంటున్నది. కాని అమెరికా తర్వాత చైనా అంతటి పెట్టుబడిదారి దేశంగా మారిపోయింది. ఒకప్పుడు బ్రిటన్‌ను ‘కలోనియల్ పవర్’ అనేవారు. ఇప్పుడు ఆసియాలో చైనా ఆ పాత్ర పోషిస్తున్నది. ఇండియా, జపాన్, దక్షిణ కొరియాల వంటి దేశాలను జయించి తన సామ్రాజ్యంలో కలుపుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇటీవల సిపిఎం ‘లాల్-నీల్’ అనే కొత్త నినాదాన్ని ప్రజలకు అందించింది. నిజానికి వర్గ స్పృహ - వర్ణ స్పృహ పరస్పర విరుద్ధాంశాలు. ఐనా సైద్ధాంతికంగా అంత లోతుగా ఎవడు ఆలోచిస్తాడు కనుక?! భారత్ ప్రధానంగా కాశ్మీర్ వద్ద ఎల్.ఒ.సి వద్దనుండి వస్తున్న కిరాయి ఉగ్రవాద ముఠాలపైనే దృష్టి కేంద్రీకరించింది. 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగి, నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం కూడా చైనా దురాగతాలను ఎదుర్కొనటంలో విఫలమైంది. చత్తీస్‌గఢ్‌లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఐనా అక్కడ వందలాది వీర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో హిందూ సామాజిక సంస్థలకు చెందిన వేలాదిమంది కార్యకర్తలను నాటి నంబూద్రిపాద్ యుగం నుండి నేటి ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ వరకూ చంపివేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు బిజెపి నాయకులు ఒక సంతాప సభ జరిపి శ్రద్ధాంజలి ఘటించి వెళ్లిపోతున్నారు.
గత నెల చివరి వారంలో ప్రధాని మోదీ అమెరికా, ఇజ్రాయిల్, లిస్బన్ (పోర్చుగల్), ఆమ్‌స్టర్‌డామ్‌లో పర్యటించి భారత్‌కు మద్దతు కూడగట్టుకున్నారు. ఇది చైనాకు బొత్తిగా నచ్చలేదు. అందుకని- ‘1962 నాటి పరిస్థితి పునరావృతం అవుతుంది జాగ్రత్త’ అని చైనా రక్షణ మంత్రి భారత్‌కు బహిరంగ హెచ్చరిక పంపాడు. బ్రహ్మపుత్ర నది టిబెట్‌లో పుట్టి దిగువన అరుణాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాలకు వస్తుంది. చైనా వారు బ్రహ్మపుత్రపై ఆనకట్ట మొదలుపెట్టారు. ఇది 2019 నాటికి పూర్తి అవుతుంది. తత్ఫలితంగా ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాలు ఎడారిగా మారిపోతాయి. 1957 ప్రాంతంలో దలైలామాను టిబెట్టు నుండి తరిమివేసినప్పుడు నెహ్రూ నిరసన తెలిపి ఉంటే మనకు ఈ దుర్గతి వచ్చి ఉండేది కాదు. అటు కాశ్మీరు సమస్య, ఇటు చైనా దురాక్రమణలకు నెహ్రూ దూరదృష్టి లేని విదేశాంగ నీతియే మూలకారణం. 2007 జూలై 1న 60వేలమంది పౌరులు తమకు ప్రజాస్వామ్యం కావాలంటూ హాంగ్‌కాంగ్‌లోని విక్టోరియా పార్క్ నుండి పెద్ద ఊరేగింపు జరిపారు. ఇది ‘ఎర్రసైన్యం’పై తిరుగుబాటు. దీనిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని చైనా అధ్యక్షుడు హాంగ్‌కాంగ్ ప్రజలను, బ్రిటన్‌ను హెచ్చరించాడు. మానవ హక్కులపై గగ్గోలు పెట్టే ‘ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్’ సంస్థ చైనా దురాగతాలను ఎందుకు ఖండించలేదు? ఇండియాలోని ‘పురస్కార తిరస్కారాల దళం’ (అవార్డు వాపసీలు) ప్రస్తుత పరిణామాలపై ఎందుకు నోరు మెదపటం లేదు? అంటే ఇక్కడ రాజకీయవేత్తలే కాదు రచయితలూ, కళాకారులూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని అర్థం!
దురాగతాలకు సాక్ష్యాలెన్నో..
మన దేశం పట్ల చైనా చేస్తున్న అరాచకాలకు, కిరాతకాలకు ఎన్నో సంఘటనలు అద్దం పడుతున్నాయి. బ్రహ్మపుత్ర నదికి చైనా తన భాషలో ఓ పేరు పెట్టింది. బ్రహ్మపుత్ర నీరు భారత్‌లోకి రాకుండా చెక్‌డామ్‌లు కట్టింది. అరుణాచల్‌ప్రదేశ్ తమ దేశపు అంతర్భాగం అని ప్రకటించింది. మెక్‌మోహన్ రేఖను ఉల్లంఘించింది. 2005 నుండి నేటి వరకు 2285 సార్లు ఉల్లంఘనలకు పాల్పడి భారత్ భూభాగాల్లోకి ప్రవేశించింది. నాధూలా మార్గాన్ని మూసివేసింది.. ఫలితంగా భారతీయులు కైలాస్, మానస సరోవర్ యాత్రలు చేయలేరు. ఇండియాతో లోగడ చేసుకున్న ఒప్పందాలు చెల్లవంటూ ప్రకటించింది. డోంగ్లాంగ్ ఆక్రమించుకున్నది. పాకిస్తాన్‌లోని కరాచీ సముద్ర తీరంలో తన న్యూక్లియర్ సబ్ మెరీన్‌ను నిలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ ఏరియా తమదే అంటున్నది. భూటాన్‌లోకి తాజాగా చొచ్చుకొని వచ్చింది. టిబెట్టును కబళించినట్లే భూటాన్‌ను ‘గుటకాయస్వాహా’ చేయడానికి చైనా సిద్ధంగా ఉంది. ఉగ్రవాది మసూద్‌ను ‘సత్ఫురుషుడ’ని అభివర్ణించింది.. ఎందుకంటే అతడు భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తున్నాడు కదా. 67 లక్షల కోట్లతో ఎకనమిక్ కారిడార్ నిర్మాణాన్ని చైనా మొదలుపెట్టింది. పాకిస్తాన్‌ను వలసరాజ్యంగా మార్చుకొని అక్కడ గాద్వార్, సీపోర్టు, లాహోర్ మెట్రో, బెలూచిస్తాన్ కారిడార్‌ల నిర్మాణాలు మొదలుపెట్టింది. సరిహద్దులల్లోని ఇండియా ‘బంకర్స్’ను ధ్వంసం చేసింది.
ఇండియాలో కన్హయకుమార్ వంటి తీవ్రవాద విద్యార్థులను విశ్వవిద్యాలయాల్లో సృష్టించి చెన్నై, అలీగఢ్, దిల్లీ, హైదరాబాద్ వంటి చోట్ల వివిధ విద్యాలయాల్లో ఆందోళనలు మొదలుపెట్టేలా చైనా వ్యూహాలను అమలు చేస్తోంది. తన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోకుండా తన ఉత్పత్తులకు పాకిస్తాన్ సహా ఇండియాలోని అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలల్లో మార్కెట్లు సిద్ధం చేసుకున్నది. ఇక్కడి ముఖ్యమంత్రులను ఇతర మంత్రులను వ్యాపార లావాదేవీలకు చైనాకు పిలిపించుకుంటోంది. భారతీయ ఉత్పత్తులకన్నా తమ ఉత్పత్తులు చౌకగా లభిస్తాయని ప్రచారం చేసి తమ సరుకులకు ఇండియాను డంపింగ్ యార్డుగా మార్చింది. అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా తన వీడియోలు ఉచితంగా సరఫరా చేస్తూ సాంస్కృతికంగా యువకులకు ‘బ్రెయిన్‌వాష్’ చేసింది.
చైనా బహిరంగ మద్దతుతో నేపాల్‌లో భట్టారాయ్ అనే ఉగ్రవాది ప్రజల్లో అల్లర్లు రేపి అప్పటి ప్రభుత్వాన్ని కూలద్రోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడు. ‘హిందూరాజ్యం’ అని పిలువబడే నేపాల్‌లో అక్కడి పాలకులు ఇటీవల రాసుకున్న కొత్త రాజ్యాంగంలో తమది సెక్యులర్ దేశం అని ప్రకటించారు. శ్రీలంకలో వేలుపిళ్లే ప్రభాకరన్ అనే ‘తమిళ పులి’కి ఆయుధాలు చైనా ద్వారా అందాయి. నల్లమల అడవుల నుంచి అక్రమ రవాణా ద్వారా ఎర్రచందనం దుంగలు పడవలపై చైనా చేరటం గమనార్హం. ఇలా భారత్, శ్రీలంక, నేపాల్‌లోను, ఇప్పుడు భూటాన్, అరుణాల్‌ప్రదేశ్‌లో చైనా విధ్వంసక చర్యలకు పాల్పడుతూ తన ఆధిపత్యాన్ని సాధించుకుంటున్నది. ఈ నేపథ్యలో ఇప్పుడు ప్రధాని మోదీ బ్రహ్మపుత్రపై చైనా నిర్మించే డాములను, జలవిద్యుత్ కేంద్రాలను ఆపగలరా? అంటే సందేహమే! కొద్ది రోజుల క్రితం చైనా రక్షణ మంత్రి మాట్లాడుతూ ‘చైనా భూభాగాలను భారత్ ఆక్రమించింది’ అని ఆరోపించారు. 1962 నాటికన్నా తాము ఇంకా శక్తిమంతంగా ఉన్నామని ఆయన భారత్‌ను భయపెట్టాడు. అంటే సిక్కిం, భూటాన్‌లను కబళించడానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. 1890లో బ్రిటీషువారు నిర్ణయించిన సరిహద్దు రేఖ పటాలు ఎక్కడ ఉన్నాయో చూపండి. మెక్‌మోహన్ రేఖ దాటి చైనా ఎందుకు ముందుకు వచ్చింది? అసలు ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ మాత్రమే చైనీయుల సరిహద్దు. అది దాటి ముందుకు ఎలా వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో పేదరికం నిర్మూలనకు ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణాలు మంజూరు చేసింది. దీనిని చైనా పట్టు పట్టి రద్దుచేయించింది. ఇక ఇండియాలో తన జీతగాళ్లచేత విధ్వంసక చర్యలు చేయిస్తున్నది. ఒకవైపు భారత్‌పై భౌగోళిక దురాక్రమణ జరుపుతూ మరొకవైపు ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తున్నది. గతంలో యుపిఎ ధృతరాష్ట్ర ప్రభుత్వం తన అస్తిత్వం కోసం భారత్ సాంస్కృతిక కళాసాహిత్య రంగాలను చైనా సోదరులకు అప్పగించింది. కనీసం ఎన్‌డిఏ ప్రభుత్వమైనా కళ్లు తెరవకపోతే దేశానికి దిక్కెవరు? చైనా మద్దతుతో నిన్న ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగం చేసి ‘దీనిని అమెరికాపై గురిపెట్టాం’ అని ప్రకటించింది. దీంతో అమెరికా ఏ విధంగా ప్రతీకార చర్య చైనాపైనా, ఉత్తర కొరియాపైనా తీసుకోబోతున్నదో వేచి చూడాలి! సిక్కింలో వేర్పాటువాదులను ‘దేశ విభజన చేయించండి’ అని చైనా ప్రేరేపిస్తున్నది. అరుణాచల్‌ప్రదేశ్ పేరును ‘లోయర్ టిబెట్’గా మార్చింది. నేపాల్‌ను తన ఏజెంట్ భట్టారాయ్‌తో పరిపాలింజేస్తున్నది. భారత్ ఒక సంపూర్ణ సమగ్ర దేశం కాదు, అందులో కాశ్మీరు, దక్షిణ తమిళనాడు వంటి వేరే దేశాలున్నాయని చైనా ప్రేరిత ఉగ్రవాదులు వాదిస్తున్నారు. దీనికి మోదీ సమాధానం ఏమిటి? చైనా, తైవాన్, హాంగ్‌కాంగ్, టిబెట్‌లు నాలుగు స్వతంత్ర దేశాలు అని భారత విదేశాంగ శాఖ ఎందుకు ప్రచారం చేయటం లేదు? కనీసం దలైలామా నేతృత్వంలో ఒక ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని వెంటనే ఏర్పాటు చేయటం, ఇండియాకు చైనా దిగుమతులను నిషేధించటం వంటి చర్యలకైనా భారత్ ఉపక్రమించాలి.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్