మెయిన్ ఫీచర్

అంతులేని వేదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రూరత్వం ఎక్కడైనా ఎప్పుడైనా దౌర్బల్యంనుండే జనిస్తుంది. అది మానవత్వానికే మచ్చ లాంటిది. 2015వ సంవత్సరంలో దేశం మొత్తంలో 34651 మానభంగాలు జరిగాయంటే సగటున రోజుకు 92 ఆన్నమాట! పరిస్థితులు ఎంతగా విషమించాయో ఇట్టే అర్ధం అవుతుంది. బాధితులు 6 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులని తెలుసుకున్నప్పుడు బాధాకరం అనిపిస్తుంది. జార్ఖండ్‌లో ఆదివాసీ అమ్మాయిలను బలవంతంగా చెరచడమే కాక వారిచే అద్దె గర్భాలను ధరింపచేయించి ఆ బిడ్డలను అమ్ముకోవడం ఎంత దౌర్భాగ్యపు చర్య!
ఒక్క దశాబ్దంలో మహిళలపై అత్యాచారాలు రెట్టింపు అయ్యాయని దేశంలోని మహోన్నత న్యాయస్థానం ఆవేదన వ్యక్తపరచడం ఎంత విచారకర విషయం. అమెరికాలో మహిళలపై ఏటా 3,21,500 మానభంగం తదితర సంబంధమైన దురాగతాలు జరగడం ఏ కోణంనుండి చూసినా మనల్ని ఆనందపరిచే విషయం కాదు. నూతన సంవత్సర వేడుకుల్లోను, కోలాహలంగా జరుపుకునే పండుగలు, తిరునాళ్లలోను అంతెందుకు ఎక్కడ జన సందోహం వుంటే అక్కడ అబ్బాయిల ఆగడాలు ఆరంభమవుతాయి. ఆ మానవ మృగాల నికృష్ట ఆలోచనలు ప్రారంభం అవుతాయి. అమ్మాయిలు కనబడడమే ఆలస్యం సెక్స్ రేస్ విడవందే అబ్బాయిలు గాలి పీల్చరు. మహిళ ఎదురైందంటే చాలు ఆ భయంకర మస్తిష్కాలలో మానభంగపు ఆలోచనలు వడివడిగా చొరబడతాయి. ఫలితంగా సూటిపోటి మాటలతో అమ్మాయిలను వేధించడం, వికృత చేష్టలతో బాధించడం సర్వసాధారణమవుతుంది. సమాజ భీతి, ఏ కొద్దిపాటి నైతికత అయినా ఉన్న ఆనాడు మెల్లగా బల్లకింద చేయిపెట్టి, బిత్తర చూపులు చూస్తూ భయం భయంగా లంచం తీసుకున్నాడు ఉద్యోగి. మరి ఈనాడు? తానే సర్వాధికారి అన్నట్టు నిర్భీతిగా బహిరంగంగా, నిస్సిగ్గుగా, కొన్ని సందర్భాల్లో దబాయించి తీసుకుంటున్నాడు. అలానే ఆనాడు రహస్యంగా కొనసాగించే దుశ్చర్యలను ఈనాడు బహిరంగంగా కొనసాగించదలచామంటూ బస్సులనుండి బలవంతంగా మహిళలను లాక్కుపోతున్నారు అబ్బాయిలు. అదేం చిత్రమో కానీ సాటి ప్రయాణీకులు తమకేమీ పట్టనట్లే ప్రేక్షక పాత్ర వహించడాన్ని చూస్తుంటే ఒక ‘నిశ్శబ్ద సంస్కృతి’ చోటుచేసుకున్నట్టు కనిపిస్తుంది. నాసిలో పరమ నాసి అన్నట్టు కొందరైతే నంగనాచుల్లా ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లలో బంధించడానికి తాపత్రయపడుతుంటా రు! ఇదంతా చూస్తుంటే సమాజం ఎటుగా పయనిస్తుందో, ఎంతగా దిగజారిపోయిందో అన్న భీతి కలుగుతుంది.
కారణాలు ఏమిటి?
ఈ విష పరిణామానికి, విపరీత పోకడలకు కారణాలు ఏమిటి? విజ్ఞానం పెరగుతున్న కొద్దీ మనిషి ఇంత వివేకహీనుడుగా ఎందుకు దిగజారుతున్నాడు? ఒక అబలను హింసించడం ద్వారా పొందాలనుకున్న కిక్, ఆనందం, వేటాడి అనుభవించాలన్న వికృత వ్యక్తిత్వం అతనిలో ఎలా చోటుచేసుకుంది? 2012లో నిర్భయ ఉదంతంతో సమాజం ఒక్కమారు గొల్లుమంది. కామంతో కళ్లుగప్పుకుని సాటి మహిళలపట్ల క్రూరంగా, సంస్కారహీనంగా, ఆటవికంగా ప్రవర్తించిన మగహీనులను కఠినంగా శిక్షంచడానికి చట్టాన్ని సవరించడం జరిగింది. ఐనప్పటికీ, ఆ తరువాత కూడా ఇలాంటి ఉదంతాలు తగ్గకపోగా అవి మరింత ఉద్ధృతం అవ్వడానికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం, పరిష్కార మార్గాలు ఏమిటో పరిశీలిద్దాం.
పురుషాధిక్య సమాజం: పితృస్వామ్య విధానం, పురుషాధిక్య సమాజం మనది. పుత్రునికి జన్మనిచ్చిన తండ్రిని అదృష్టవంతుడని కొనియాడతారు. కుమార్తెకన్నా చాలా భిన్నమైన వాడిగా పెంచి పోషిస్తారు. తోటి పిల్లలను అతను కొట్టినా, తిట్టినా తప్పుచేసాడని మందలించకపోగా అదొక సాహస కృత్యంలా, పురుష లక్షణంగా భావించుకుంటూ లోలోన మురిసిపోతారు. ఈ అర్ధరహితమైన లింగవివక్ష మూలంగా తనకు తెలియకుండానే అబ్బాయి తానొక హీరో, తానొక ఉన్నతుడనన్న అహం, ఇగో పెంచుకుంటాడు. చిత్రం ఏమంటే పురుషాధిక్య ధోరణి వివాహానంతరం భార్యలపైన కూడా ఈనాడు స్వైరవిహారం చేస్తున్నది. వివాహిత మహిళల్లో 8 శాతం మంది లైంగిక హింసకు, 32 శాతం శారీరక హింసకు, 10 శాతం తీవ్రమైన గృహ హింసకు గురవడం-స్థూలం కనీసం సగంమంది మహిళలు ఏదో ఒక రకమైన హింసకు బలి కావడం ఈ హింసా ప్రవృత్తికి తార్కాణం. కొడుకు,కూతుళ్ల పెంపకంలో కుటుంబ పెద్ద చూపే వివక్ష చివరకు ఈ విధంగా సమాజ ఖేదానికి దారి తీస్తుందంటారు విజ్ఞులు. గనుక ఈ సమస్య గురించి మనం మరింత లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నేతల మాటల ప్రభావం: కన్యాపరీక్షలో విఫలం అయిందన్న అభియోగంతో భార్యను వదిలేయమని ఆమె భర్తను నిర్దేశించింది మహారాష్టల్రోని ఒక కుల పంచాయతీ! అదేదో ఒక కులపంచాయతి, వెనుకబడిన ప్రజానీకం నివశిస్తున్న ప్రదేశం అని అనుకుందాం. మరి ఒక రాష్ట్ర అధినేతగా పనిచేసి, దేశ ప్రధాని కావాలనే తహతహలాడిన ములాయంసింగ్ యాదవ్ మహిళలపై వేధింపులు, వారిపై జరిగే అకృత్యాలను గురించి మాట్లాడుతూ ‘ఎంతైనా అబ్బాయిలు అబ్బాయిలే...పిల్లలు ఆ వయసులో తప్పులు చేయడం సహజం.. ఏమైనా అలాంటి వార్తలకు పత్రికలు అంతగా స్పందించనవసరం లేదేమో’ అని సమాజానికి తన విలువైన సందేశాన్ని నిస్సంకోచంగా అందించడాన్ని చూస్తుంటే మనం ఎటు పోతున్నామో అర్ధం అవుతుంది గదూ!
సమాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీ ‘లైంగిక వెధింపులు ఒక చర్మ ప్రదర్శన (స్కిన్ షో) లాంటిద’ని సెలవిస్తే, ‘కుమార్తె పరువుకన్నా ఓటు ప్రతిష్ఠనే ముఖ్యం’ అని మొన్నటికి మొన్న జనతాదళ్ (యు) అధినేత శరద్ యాదవ్ బల్లగుద్ది చెప్పాడు! ప్రియాంక గాంధీకన్నా అందమైన మ హిళలు ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు కనుక ఆమె ప్రచారం గురించి తమకేమీ భయం లేదన్నది బిజెపి నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అయిన వినయ కతియార్ విలువైన భావన. ఇలాంటి నాయకులు దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహిస్తుంటే సమాజంలో విష సంస్కృతి కాక మరేమి వ్యాప్తి చెందుతుంది? కేంద్ర రాష్ట్ర శాసనసభల్లో చర్చలు రచ్చలు కావడానికి, శాసన సభలు దుశ్శాసన సభల్లా రూపాంతరం చెందడానికి ఈ నాయకులే గదా కారకులు! ఒక రాష్ట్ర శాసనసభలో ఒక మహిళా నేత చీరలాగి వివస్తన్రు చేయడానికి అధికార సభ్యులు గావించిన నీచాతినీచ ప్రయత్నం యువతకు ఎలాంటి సందేశం అందిస్తుంది? సుదీర్ఘ భారతీయ సంస్కృతికి ఎంతటి అపరాధం చేసినట్టు అవుతుంది? అందుకే ‘్భరత రాజకీయాలు నేరాలలో ప్రజలను భాగస్వాములు చేస్తున్నా యన్న’ కలకత్తా విశ్వవిద్యాలయం ఆచార్యులు బలభద్రగారి భావన అత్యంత ఆలోచనాత్మకంగా కనిపిస్తుంది. స్ర్తి పురుష లింగభేదం అన్న సనాతన భావంలో మహిళలు ఒక వెనుకబడిన వర్గంగా, ఒక విధంగా ‘సామాజిక దళితులు’గా, పురుషులు ఒక ఉన్నత వర్గానికి చెందినవారుగా చాటుకునే పైశాచిక ప్రవృత్తినా? ఒక ఆధిక్యతా భావన? అప్రజాస్వామిక, అమానవీయ ఆలోచనతో నిండిన దుర్లక్షణమా? మనో వైకల్యానికి తార్కాణమా? ఇలా ఏ కోణంనుండి చూచినా ఈ భావన అత్యంత ప్రమాదకరం అన్నది నిర్వివాదాంశం.
దయనీయ విషయం: పాశ్చాత్య దేశాల్లో ఏ బజార్లో కానీ, షాపులో, సమావేశ ప్రదేశాలలో కానీ, జనం కిక్కిరిసి ఉన్నప్పుడు ఆ దేశస్తులు తోసుకుపోవడానికి ఏమాత్రం ప్రయత్నించరు. వ్యక్తిగత దూరం (పర్సనల్ స్పేస్) పద్ధతిని పాటించాలన్న సంప్రదాయాన్ని, ఇతరుల స్వేచ్ఛను అపహరించరాదన్న సూత్రాన్ని పాటించడంలో ప్రతి ఒక్కరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇతరుల వ్యక్తిత్వానికి వాళ్లు ఇచ్చే విలువ అది. తమస్వేచ్ఛపై తమకు తామే విధించుకునే ఆంక్ష అది! అది వాళ్ల సంస్కారం. ఈ విషయంలో సగటు భారతీయ యువత ప్రవర్తన దానికి భిన్నంగా ఒక విధంగా వ్యతిరేకంగా కనిపిస్తుంది. గుంపు ఎక్కడ కనిపిస్తుందా, తోపులాటకు ఎక్కడ అవకాశం లభిస్తుందా అని ఆశగా, డేగకళ్లతో ఎదురు చూడడం, మరి కొందరైతే పనిగట్టుకుని ఓ పథకం ప్రకారం ఒక నిర్దేశిత ప్రదేశానికి సామూహికంగా చేరడంతోనే పశులక్షణాలు ప్రకోపిస్తాయి. దీనికి కారణాలు ఏమిటి? బాల్యంనుండి తల్లిదండ్రులు తమ పిల్లలకు చక్కని పద్ధతులు నేర్పకపోవడమా? పాఠశాలల్లో నైతిక బోధనా తరగతులు లేకపోవడంతో హద్దులేని స్వేచ్ఛనే తమకు ముద్దు అన్న ధోరణి ప్రబలడమా? మరో విషయం.మహిళలను గేలి చేస్తూ, వాళ్ల వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ టీవీ, సినిమాల్లో ప్రసారమవుతున్న కార్యక్రమాలు, పత్రికల్లో ప్రచురించబడుతున్న శీర్షికలు మహిళలు లైంగికపరమైన దాడులు గురవడానికి పరోక్షంగా దోహదపడుతున్నాయని తమిళనాడుకు చెందిన ముగ్గురు ఐపిఎస్ అధికారులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.
ఇలా చేయాలి: దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ ఎంత ముఖ్యమో, మహిళలపై జరిగే అకృత్యాలను అరికట్టడం దేశ ప్రగతికి, సమాజ సంక్షేమానికి అంతే అవసరం. మహిళా అభ్యున్నతిపైనే సమాజ వికాసం ఆధారపడుతుందన్నది యదార్ధం. మరి ఈ హింసా ప్రవృత్తిని అంతం చేసి మహిళా వేదింపులకు చరమగీతం పాడేదెలా? ఇదొక వ్యక్తి సమస్యనో, ఒక ప్రాంతీయ సమస్యనో కాదు. ఇదొక జాతీయ సమస్య కనుక ఈ అంశంపై ప్రతి ఒక్కరు తమ దృష్టిని పెట్టాలి. ‘ప్రపంచాన్ని ఒక క్రమంలో తీర్చిదిద్దాలంటే కుటుంబాన్ని చక్కని క్రమశిక్షణతో ఉంచాల’న్న కన్ఫూషియస్ ఆలోచనాత్మక సందేశాన్ని మనసా వాచా అమలుపరచాలి. కుటుంబాన్ని రాజ్యానికి పునాదిగా అభివర్ణిస్తారు. ప్రతి తల్లి, తండ్రి తమ కుటుంబాన్ని క్రమశిక్షణకు నిలయంగా, ఉన్నత విలువలకు కేంద్రంగా తీర్చిదిద్దినప్పుడు సమాజం శాంతికి మారుపేరుగా పరిఢవిల్లుతుంది. కనుక అబలలపై అత్యాచారాలను అరికట్టడంలో పైన పేర్కొన్న కారణాలన్నీ ఒక పార్శ్వం అయితే తల్లిదండ్రులు తమ పిల్లలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతూ, అలాంటి అత్యాచారాలకు అవకాశం లేకుండా చేయడం మరొక పార్శ్వం-అతి ముఖ్య పార్శ్వం- అవుతుంది.

-ఎం.ఆర్.కె.మూర్తి