మెయన్ ఫీచర్

ఇండో అమెరికన్ బంధం అనివార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశాక ప్రపంచమంతా ‘నూతన అమెరికా’ వైపు చూడసాగింది. అంటే డమోక్రాట్ల యుగం ముగిసి రిపబ్లికన్ల ‘జాతీయ’ దశకం మొదలైందని అర్థం. ఇది అంతర్జాతీయ వాణిజ్య, రక్షణ రంగాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందోనని పరిశీలకులు విశే్లషిస్తున్నారు. బ్రిటన్‌లో ‘బ్రిగ్జిట్’ అనంతర పరిణామాలు అమెరికా, యూరప్‌లో చర్చనీయాంశాలైనాయి. చైనా శరవేగంగా ఆసియాలో ఆధిపత్య శక్తిగా మారుతున్నది. భారత్‌లో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ రెండడుగులు ముందుకువేస్తే ప్రతిపక్షాలు మూడడుగులు వెనక్కి నెడతాయి. ఈ దశలో భారత్ భవిష్య వ్యూహాలేమిటి?
‘ట్రంప్ విజయం జాతీయవాద విజయం’ అని ఆ దేశ నేషనలిజం అంటే ప్రపంచీకరణ మాత్రం వెనుక పట్టింది. దీనివల్ల బహుళ జాతి సంస్థలు ఇబ్బందుల్లో పడబోతున్నాయని ఒక అంచనా. అదే జరిగితే ఇండియా, అమెరికా అనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశాలు జాతీయ వాదంలో స్వీయ నియంత్రణలు విధించుకుంటే దీనిని చైనా సద్వినియోగం చేసుకుంటుందనే వ్యూహాత్మక ధోరణిపై చర్చ మొదలైంది. లోగడ ఈస్టిండియా కంపెనీలు వంటివి అనుసరించిన వ్యూహమే ఇప్పుడు చైనా మొదలుపెట్టింది. చైనా తన విస్తరణ వాదాన్ని కొనసాగిస్తున్నది. ఇది ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే అంశం. ముఖ్యంగా భారత్‌కు ప్రమాదకరం. ట్రంప్ విజయానికి అమెరికాలోని ప్రవాస భారతీయులు కొంత కృషి చేసారు. ట్రంప్ విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉత్తర భారతంలో కొందరు దేవాలయాల్లో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందినవాడు. అతని ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అభ్యర్థి. అనాదిగా భారత విదేశాంగ విధానంలో డెమోక్రట్లతో సంబంధాలు ఉండేవి. ఒబామా కూడా డెమోక్రాట్ పార్టీ వాడే కదా. రిపబ్లికన్లు కన్సర్వేటివ్ పాలసీని అనుసరిస్తారు. అలాంటప్పుడు ఎన్‌ఆర్‌ఐలు ట్రంప్‌ను ఎందుకు బలపరిచారు అంటే మారుతున్న ప్రపంచ రాజకీయ చిత్రపటానికి ఇది అద్దం పడుతున్నది.
నెహ్రూ యుగంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు కెన్నడీతో ఇండియాలో మైత్రి ఉండేది. ఆయనను అమెరికా పెట్టుబడిదారీ వర్గాలకు మిత్రుడు అని చెప్పలేము. అందుకే ఆయన రష్యాతో ప్రత్యక్షంగా జతకట్టాడు. నెహ్రూ చైనాతో మైత్రి నెరిపి ‘పంచశీల’ ప్రతిపాదించి శృంగభంగం పొందాడు. తర్వాత కాలంలో అమెరికా పాకిస్తాన్‌కు ఆయుధాలు అమ్మి తన వలస రాజ్యం మార్చుకుంది. గత కొనే్నళ్లుగా పాకిస్తాన్ చైనాకు వలస రాజ్యంగా మారింది. సహజంగానే ఇది రష్యాకు, అమెరికాకు ఇష్టంలేదు. అలాంటప్పుడు ఆసియాలో అమెరికాకు నమ్మకమైన ఒక మైత్రీ దేశం అవసరం ఉంది. అది ప్రజాస్వామిక పద్ధతి పార్లమెంటరీ వ్యవస్థను అంగీకరించిన ఇండియానే కదా.
టిబెట్‌ను కబళించిన చైనా అరుణాచల్‌ప్రదేశ్ వైపు అడుగులు వేస్తున్నది. నేపాల్ నుండి ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ల మీదుగా శ్రీలంక వరకు రెడ్ కారిడార్‌ను చైనా నిర్మించింది. చైనా ఇటు ఇండియాలో తన అనుకూల వర్గాలను ప్రోత్సహిస్తూ, బయట పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్‌లోను కొందరిని ఇండియాకు వ్యతిరేక వర్గాలుగా మారుస్తున్నది. ఇది స్పష్టంగా రష్యా, అమెరికాలు ఇండియా కన్నా బాగా అర్థం చేసుకున్నాయి. ఇండియా తన రక్షణావసరాలకు రష్యాపై ఆధారపడింది. ప్రపంచంలోని ఆయుధోత్పత్తులలో 14 శాతం ఇండియా కొనుగోలు చేస్తున్నది. అమెరికా పాకిస్తాన్‌కు, ఇండియాకు ఆయుధాలు అమ్మింది. రష్యా నుండి 60 శాతం ఆయుధాలు ఇండియా రక్షణావసరాలకు చేరుతున్నాయి. మనం అమెరికా మీద ఆధారపడడంతో అలిగిన రష్యాను కొద్ది వారాల క్రితం ఇండియా బుజ్జగించి ఆయుధాలు కొనుగోలు చేసి అలక తీర్చడం అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు ఇండో- నా ఘర్షణలో నమ్మకంగా ఇండియా వెనుక ఎవరెవరు ఉంటారు? అంటే అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియా వియత్నాం,మంగోలియా, దక్షిణ కొరియా వంటి దేశాలు ఉంటాయి. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాజ్‌పక్షే లోగడ చైనాకు అనుకూలంగా ఇండియాకు వ్యతిరేకంగా ఉండేవాడు. కాని ఇఠీవల శంకాకు దీవులవద్ద జరిగే నిర్మాణాల బాధ్యత చైనా స్వీకరించడంతో తమ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతున్నదని గ్రహించి విదేశాంగ నీతిని మార్చుకున్నారు. అంటే నిన్నటి రాజపక్ష నేటి రాజపక్ష ఒకరు కారు. ఇలాంటి సువర్ణావకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నది. కొంతకాలంగా చైనా, అమెరికాల మధ్య విమానాల విషయంలో చెలరేగిన ఘర్షణ అందరికీ తెలిసిందే. తమ జలాంతర్గాములను తిరిగి ఇవ్వాల్సిందిగా అమెరికా చైనాను హెచ్చరించినా చైనా తన దురహంకారంతో అమెరికాను ధిక్కరించింది. ట్రంప్ ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తున్నాడు. ఇది ఇండియాను కొంత కలసివచ్చే అవకాశం. అమెరికా, భారత్‌ల మధ్య మైత్రి బంధం పెరిగితే అది చైనాకు ఈర్ష్య కలిగించగ తప్పదు.
చైనా,జపాన్‌ల మధ్య ఉన్న దక్షిణ సముద్ర ద్వీపాలు వివాదాన్ని ఇండియా ఇప్పుడు సద్వినియోగం చేసుకోబోతున్నది. మోదీ పాకిస్తాన్ పర్యటనలో జపాన్‌తో అణుఒప్పందాలను కుదుర్చుకుని ఇండో జపాన్ బౌద్ధ యుగం నాటి అనుబంధాలను గుర్తు చేయడం ఈ వ్యూహంలోని అంతర్భాగమే. దీనిని చైనా సహించడం లేదు. దక్షిణ కొరియాను ఇండియా, అమెరికా బలపరచడం చైనా జీర్ణం చేసుకోలేకపోతున్నది. అందుకని తన అణు పరిజ్ఞానాన్ని పాకిస్తాన్‌కు ఇచ్చి, ఆ దేశం నుంచి ఉత్తర కొరియాకు అందేట్టు చైనాయే చేసింది. ఇప్పుడు ఉత్తర కొరియా కొరకరాని కొయ్యగా మారిపోయిందంటే చైనా పుణ్యమే. ఇవన్నీ రిపబ్లికన్ నేత ట్రంప్ గమనించి కొన్ని వ్యూహాలను అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నాడు. అవి-దక్షిణ కొరియాతో అమెరికా ప్రత్యక్ష బంధం ఏర్పరుచుకోవడం, ఇజ్రాయిల్‌కు ప్రత్యక్ష మద్దతునివ్వడం, దక్షిణాసియా సముద్ర దీవులపై చైనా ఆధిపత్యాన్ని నిరోధించడం, చైనా ఉత్పత్తులను ఇండియా నిషేధంచడాన్ని హర్షించడం, ఇండియాలోని జిహాదీ వర్గాలు తమకు కూడా శత్రువులేనని భావించడం, పాకిస్తాన్‌ను దుష్టదేశంగా గుర్తించడం వంటివి. పాక్‌లోని బెలూచిస్తాన్ స్వతంత్ర పోరాటాన్ని బలపరచడం ఇత్యాది అమెరికా నిర్ణయాలన్నీ ఇండో అమెరికా స్నేహబంధాన్ని బలపరిచేవిగానే ఉన్నాయి. భవిష్యత్తులో ఇండియా అమెరికా, జపాన్, ఇజ్రాయిల్, ఫ్రాన్స్ ఇలా ఐరోపా దేశాలు ఒక కూటమిగా ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది దుందుడుకు చైనా దురహంకార దోరణికి అడ్డుకట్ట వేసే అంశం. ఇది నిస్సందేహంగా చైనాకు మింగుడుపడని ధోరణి.
ఏ ఒక్క సంఘటన వల్లనో చైనా, అమెరికా వాణిజ్య సంబంధాలు రాత్రికి రాత్రే భంగం కాకపోయినా దక్షిణాసియాలో వ్యూహాలు మాత్రం మారుతాయి. అంటే అమెరికా ఇండియామీద, చైనా పాకిస్తాన్‌మీద ఇకమీద ఆధారపడబోతున్నదని అర్థం. పాకిస్తాన్ ఒక మిలటరీ నియంతృత్వ మత దేశం. థియోక్రిటిక్ కంట్రీ నాస్తిక చైనాతో వారి దోస్తీ అక్కడ ముల్లాలు ఆమోదిస్తారా? కేవలం పాక్ భుజం మీదికి ఎక్కి చైనా ఇండియాపైకి తుపాకీ గురిపెడుతున్నదని అర్థం. ట్రంప్ సాయంతో పాక్‌కు బుద్ధి చెపితే చైనా నడుము విరిగినట్టే అవుతుంది. ఇప్పటికే అమేరికా సేనలు ఐసిస్ స్థావరాలను ధ్వంసం చేస్తున్నది. 2017లో ఆసియాలో కూడా సైనిక చర్యలు జరుగుతాయా? అన్నది వేచి చూడాలి. ఇండియా ట్రంప్‌కు సన్నిహితం కావడం అంటే భారత్‌లోని చైనా, పాక్ అనుకూల వర్గాలను కవ్వించడమే అవుతుంది. బంగ్లాదేశ్ హోంమంత్రి అసజుద్దీన్ ఆ మధ్య కోల్‌కతలో మాట్లాడుతూ,
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరులో భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించడం ఆశావహమైన పరిణామం. ఇస్లామాబాద్‌లో జరుగవలసిన సార్క్ సమావేశాలను భారత్‌తోపాటు భూటాన్ బంగ్లాదేశ్ వంటివి కూడా బహిష్కరించడంతో భారత్ నేతృత్వంలో ఆసియలో సినో పాక్ వ్యతిరేక కూటమి బలపడుతోందని అర్ధం చేసుకోవాలి. చైనా దుశ్చర్యలకు నేపాల్ అడ్డాగా మారింది. నేపాల్‌ను పాక్ ప్రజలు బెలూచిస్తాన్ ఉగ్రవాద సర్పబంధం నుండి విముక్తం చేయడం కోసం ఇండో అమెరికన్ సంయుక్త సైనిక విన్యాసాలకు ఇది తరుణం. దీనివల్ల అమెరికాలోని లక్షలాది ఎన్‌ఆర్‌ఐలకు కూడ ఉద్యోగ రక్షణ లభిస్తుంది. చైనా ప్రేరిత ఉగ్రవాదులపై కఠినచర్యలు తీసుకోవడంలో ఇండియా అవసరమైతే అమెరికా ప్రత్యక్ష సైనిక సహాయం తీసుకోవాల్సి వుంటుంది. కాగా, ఇండో అమెరికన్ సంబంధాలు బలపడడాన్ని కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు.
ప్రభాని మోదీ ఇటీవల అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు పర్యటించారు. ఆ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ‘్భరత్ మాకు నిజమైన మిత్రదేశం’ అన్నాడు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరును గుర్తు చేసాడు. సరిగా ఇవే మాటలు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు కూడా అన్నారు. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా అమెరికన్ కాంగ్రెస్ ఇప్పటికే గుర్తించింది. చైనా ఇటు సిక్కింలోకి అటు అరుణాచల్ ప్రదేశ్ భూటాన్‌లోని డొక్లామ్‌లోకి చొరబడడంవల్ల ఇండోచైనా సంబంధాలు 1962 నాటి హీన స్థితికి దిగజారిపోయాయి. ఇప్పుడు అమెరికా మద్దతు ఇండియాకు అనివార్యం. ప్రత్యక్ష పరోక్ష యుద్ధాలకు అటు చైనా ఇటుఇండియా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పడు ప్రపంచవ్యాప్తంగా పాక్-చైనా అపవిత్ర కూటమిని ఎత్తి చూపే బాధ్యత అమెరికా, ఇండియా భూటాన్ దక్షిణ కొరియా ఇజ్రాయిల్ మీద వుంది. ప్రస్తుతం రష్యా-అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియా ఇటు రష్యా, అటు అమెరికాలతో సమతుల్యత పాటించాల్సి ఉంటుంది.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్