మెయన్ ఫీచర్

చైనాకు భారత్ చెంపదెబ్బ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా సామ్రాజ్యవాద కాంక్షను భారత్ ధీరోదాత్తంగా అడ్డుకుంటున్నది. చైనా విస్తరణ వాదాన్ని నియంత్రిస్తున్న భారత్ ప్రయత్నాలను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి. అవసరమైతే భారత్ పక్షాన నిలబడి పోరాటం చేస్తామని మద్దతు కూడా ప్రకటించాయి. ఆసియా ఖండంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భారత్ గౌరవ ప్రతిష్ఠలకు ఇదొక నిదర్శనం. చైనా బెదిరింపులకు లొంగక భారత ప్రభుత్వం, సైన్యం మన దేశ సార్వభౌమత్వాన్ని, సరిహద్దులను కాపాడడంతోపాటు భూటాన్ దేశ రక్షణకు కూడా సన్నద్ధం కావడం భారత ప్రభుత్వ దృఢ నిశ్చయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నది.
రెండు బలమైన దేశాలు భారత్-చైనాల మధ్య వున్న చిన్న దేశం భూటాన్. రెండు దేశాల సరిహద్దులలోని భూటాన్ ప్రాంతంలో డో క్లామ్ ఒక కీలక ప్రాంతం. ప్రాచీన కాలంలో డోక్లామ్ ఒక ప్రముఖ వాణిజ్య కేంద్రం. బౌద్ధుల ప్రాబల్యం వున్న ప్రాంతం. భారత్‌లోని నాథుల్లా కనుమలకు 15 కి.మీ దూరంలోను, చైనా సరిహద్దుల్లోని డ్రమన చుషు నదికి 30 కి.మీ దూరంలోను ఈ ప్రాంతం వుంటుంది. ‘డోక్లామ్’ తమదంటే తమదని భూటాన్-చైనా ప్రభుత్వాలు గతంలో వివాదాలకు దిగాయి. అయితే 1988,1998 సంవత్సరాలలో ఈ రెండు ప్రభుత్వాలు రెండు ఒప్పందాలపై సంతకాలు చేసుకుని డోక్లామ్ ప్రాంతంపై యథాతథ స్థితిని కొనసాగించాలని, ఈ ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఒప్పందాలను ధిక్కరిస్తూ చైనా ప్రభుత్వం డోక్లామ్ ప్రాంతం ద్వారా తన ఆర్థిక, సామ్రాజ్యవాద అవసరాల కోసం విశాలమైన రహదారి నిర్మాణం చేపట్టింది. చైనా సైన్యం ఈ రహదారి నిర్మాణం చేపట్టడం ఆసియా ఖండంలో ఆందోళనకు, ఉద్రిక్తతలకు దారితీసింది.
దాదాపు 89 చ.కి. మీటర్ల వైశాల్యం కలిగిన డోక్లామ్ పట్టణం భూటాన్, భారత్, చైనా దేశాలకు అత్యంత కీలకమైన ప్రదేశం. డోక్లామ్ ప్రాంతంపై పట్టు సాధించినట్లయితే చైనాకు భూటాన్, భారత్‌లపై భౌగోళిక ఆధిపత్యం సునాయాసంగా ఏర్పడుతుంది. ఈ ప్రాంతంలో నిరంతర ఉద్రిక్తతలను నెలకొల్పడం ద్వారా భూటాన్ దేశం బలపడిపోయింది. భారత్ వనరులను వృథా చేసి తద్వారా లబ్ది పొందవచ్చునన్నది చైనా కుట్ర. డోక్లామ్‌లో చైనా వేయదల్చుకున్న రహదారి మనకు కేవలం 15 కి.మీ దూరం మాత్రమే. ఏ క్షణమైనా చైనా మూకలు భారత్‌లోకి చొచ్చుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాంతం కూడా కాశ్మీర్ లోయలాగా, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలాగ నిరంతరం అలజడులతో దేశ సార్వభౌమత్వానికి, శాంతిభద్రతలకు ప్రధాన సమస్యగా నిలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పాలకులు చేసిన చారిత్రక తప్పిదాల కారణంగా ఇటు శ్రీనగర్ ప్రాంతం, అటు అరుణాచల్ ప్రాంతం ఇప్పటికీ సమస్యలుగానే వున్నాయి. అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలనుకున్న నేటి భారతదేశం కొత్త తలనొప్పులను సహించే స్థితిలో లేదు. అందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం పొరుగు దేశాలు ఆర్థికంగా బలోపేతంగా ఉంటూ శాంతిభద్రతలతో వుంటేనే మనకు శ్రేయస్కరం అన్న అంశాన్ని గుర్తించి ఈ దిశగా సరిహద్దు దేశాల ప్రగతి కోసం పనిచేస్తున్నది. ఇందుకోసం దీర్ఘకాలిక పథకాలను కూడా రూపొందించుకున్నది.
భౌగోళికంగా భూటాన్‌లో అంతర్భాగమైన డోక్లామ్ ప్రాంతాన్ని పరిరక్షించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆ దేశ ప్రజలు మూకుమ్మడిగా స్వాగతిస్తున్నారు. మన పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, మయన్మార్ కూడా భారత్ పక్షాన నిలబడుతున్నాయి. గతంలో నేపాల్, మయన్మార్, శ్రీలంక దేశాలు చైనా ప్రణాళికలను అంగీకరించి ఎంతో నష్టపోయిన సంఘటనలు కళ్ల ముందు కదలాడుతున్నాయి. చైనా వేసిన ప్రణాళికలు మొదట్లో చాలా ప్రయోజనకరంగా, ఆకర్షణీయంగా కనపడతాయి. అవి అమలు దశ, ముగింపుదశలకు వచ్చేసరికి ఆయా దేశాల ఆర్థిక అంశాలు, పరిపాలన విధానాలు, సార్వభౌమత్వాలు చైనా గుప్పిట్లోకి వెళ్లిపోతాయి. ఈ విషయం అర్థమయ్యేసరికి ఆయా చిన్న దేశాలు చైనా అడుగులకు మడుగులొత్తే పరిస్థితి దాపురిస్తుంది. ఈ అంశాలన్నింటిని దృష్టిలో వుంచుకున్న భూటాన్ ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలను పూర్తిగా సమీక్షించింది. తమ భూభాగాలను చైనా కబ్జా చేస్తోందని, తమ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతోందని అధికారికంగా ఆరోపించింది. డోక్లామ్ ప్రాంతంపై 2012లోనే భారత్- చైనాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. డోక్లామ్ వివాదాన్ని ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, అప్పటి వరకూ ఉభయ దేశాలు ఏకపక్షంగా ఈ ప్రాంతంలో ఎటువంటి పనులు చేపట్టరాదని ఒప్పందంలో పేర్కొన్నారు. చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని సహించబోమని భారత్ నిర్ద్వంద్వంగా ప్రకటించింది. డోక్లామ్ ప్రాంతంలో రహదారి నిర్మాణం వల్ల తమ రక్షణకు భంగం కలుగుతుందని భారత్ వాదించింది. మన దేశ రక్షణ కోసం తగిన్ని బలగాలను కూడా డోక్లామ్ ప్రాంతానికి తరలించింది. ఇంతేకాకుండా భూటాన్ ఆర్థిక ప్రగతికి, సార్వభౌమత్వ పరిరక్షణకు వీలైనంత సహాయం చేస్తామని నరేంద్ర మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. భారత ప్రభుత్వం ఇచ్చిన హామీపై భూటాన్ ప్రజలు అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. ఏదో ఒక రోజున చైనా నుంచి ఏర్పడే ప్రమాదాల నుంచి భారత్ మాత్రమే తమను రక్షించగలదని వారి విశ్వాసం. భూటాన్ పరిరక్షణ భారత్ నైతిక బాధ్యత. తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకోవడం కానీ, భూటాన్ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయడం గానీ మోదీ ప్రభుత్వానికి ఇష్టం లేదు. భారత సరిహద్దులో, భూటాన్ ప్రాంతంలో చైనా అనధికారికంగా రహదారి నిర్మాణాన్ని చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరాలను తెలపడమే కాకుండా సైన్యం సహా అన్ని రకాల సహాయాలకు సిద్ధపడింది.
1962లో భారత్-చైనాల మధ్య యుద్ధం తర్వాత ఉభయదేశాల సేనలు ఈ ప్రాంతంలో గస్తీ కాస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవాలని 1985లో చర్చలు జరిగాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లోని 90వేల చ.కి.మీ, అక్సాయ్‌చిన్ ప్రాంతంలోని 38వేల చ.కి.మీతోపాటు భూటాన్‌లోని 269 చ.కి.మీ భూమి వివాదంలో ఇరుక్కుంది. ఇందులో డోక్లామ్ అత్యంత కీలకం. భూటాన్‌కు, చైనాకు మధ్య దౌత్య సంబంధాలు లేవు. భారతదేశం ద్వారానే భూటాన్ చైనాతో చర్చలు జరుపుతూ వచ్చింది. డోక్లామ్‌లో చైనా రహదారి నిర్మించడం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడమేనని భూటాన్ ప్రభుత్వం ప్రకటించింది. డోక్లామ్ ప్రాంతంలో రహదారి నిర్మాణానికి భారత్ నుంచి ఇటువంటి స్పందన వుంటుందని చైనా ఊహించలేదు. గతంలోని మెతక ప్రభుత్వాల్లాగానే ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా వుంటుందని తప్పుడు అంచనాలు వేసిన చైనా డోక్లామ్‌లో దుస్సాహసం చేసింది. డోక్లామ్ అంశంపై మోదీ ప్రభుత్వం నిర్ధిష్టమైన విధానాలను అమలు చేస్తుందని, తనకు మద్దతుగా అనేక దేశాల సహాయం కోరుతుందని, ప్రపంచ దేశాల ముందు తనను ఒంటరిగా నిలబెడుతుందని చైనా ఊహించలేదు. గతంలోని ప్రభుత్వాల మాదిరి భయపెట్టి, బెదిరించి, ప్రలోభపరిచి భారత ప్రభుత్వాన్ని తనకు అనుకూలంగా మలచుకోగలనన్న అతి విశ్వాసం చైనాకు వుండేది. అయితే చైనా ఉత్పత్తులను నిలువరించడంతోపాటు డోక్లామ్‌లో సైన్యాన్ని భారత్ మోహరిస్తుందని అనుకోలేదు. దీంతో చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది చైనాకు ఊహించని పరిణామం.
అవకాశం చిక్కినప్పుడల్లా భారత్ ప్రగతిని ఆపడానికి చైనా అన్ని మార్గాలను అవలంబిస్తూ వచ్చింది. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్‌లోను భారత్‌కు స్థానం లేకుండా చేసేందుకు చైనా తన ‘వీటో’ అధికారాన్ని వినియోగించింది. భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు పాకిస్తాన్‌ను ముందుకు తోస్తూ వచ్చింది. పాకిస్తాన్‌లోని తీవ్రవాద సంస్థలకు దొంగచాటుగా సహాయం చేస్తూ వస్తోంది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆసియా నుంచి యూరప్ వరకూ మధ్య ఆసియా మీదుగా ఉపరితల రవాణా, సముద్ర మార్గాల నిర్మాణంలో భాగం పంచుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం కూడా ఇందులో భాగం. ఇందుకు ప్రత్యామ్నాయంగా భారత్ సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటివరకూ ఒక ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న చైనాకు భారత్ బలమైన ఆర్థిక ప్రత్యర్ధిగా కనపడుతున్నది. దీంతో ఏదో ఒక రకంగా భారత్‌ను ఇబ్బంది పెట్టాలనుకున్న చైనా డోక్లామ్‌లో అనేక ప్రయోజనాలు ఆశించి రోడ్డు నిర్మాణం చేపట్టింది. భారత్ నుంచి ఎదురైన వ్యతిరేకత కారణంగా చైనా కొంత మెత్తబడక తప్పలేదు.
1959లో దలైలామాకు భారతదేశంలో రాజకీయ శరణు ఇచ్చినప్పుడు కూడా చైనా విపరీతంగా ఆందోళన చేసింది. దలైలామాను భారత్‌కు రాకుండా అడ్డుకునేందుకు విపరీతమైన వత్తిడి తెచ్చింది. బౌద్ధమతంతో మనకు వున్న అనుంబంధం కారణంగా కూడా భారత ప్రభుత్వం భూటాన్‌కు మద్దతుగా నిలుస్తూ వచ్చింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాగానే మొట్టమొదటి విదేశీ పర్యటన హిమాలయాల్లోని భూటాన్‌తోనే ప్రారంభించడం ఆ దేశ ప్రయోజనాలపట్ల మనకున్న నిబద్ధతను తెలియజేస్తుంది. భారత్-్భటాన్‌ల మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు వున్నాయి. భూటాన్ సామాజిక ఆర్థిక ప్రగతి కోసం భారత్ శక్తివంచన లేకుండా కృషిచేస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ‘్భరత్-్భటాన్‌లు ఒకరి కోసం మరొకరు వున్నాయి. ఈ రెండు దేశాల పాస్‌పోర్టుల రంగులు వేరేగా వుండవచ్చు కానీ రెండు దేశాల సాంస్కృతిక వారసత్వం, జీవన మూలాలు ఒకేలా వున్నాయి’ అని మోదీ అన్నారు. భూటాన్‌లో పదివేల మెగావాట్ల హైడ్రో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు మోదీ ప్రభుత్వం అంగీకరించింది. పాలపొడి, గోధుమలు, నూనెలు, పప్పుదినుసులు, బియ్యం తదితర ఎగుమతులపై వున్న ఆంక్షలను మన ప్రభుత్వం ఎత్తివేసింది. 2014లో నరేంద్ర మోదీ భూటాన్ పర్యటన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు మరింతగా బలపడ్డాయి. ఆసియా ఖండంలోని చిన్న చిన్న దేశాలతో బలపడుతున్న భారత్ సంబంధాలు చైనాకు కంటగింపుగా మారాయి. వీటిని దెబ్బతీయడం కోసం చైనా చేయని ప్రయత్నం లేదు. అయితే నిర్దిష్టమైన విధానాలతో, నిబద్ధతతో కొనసాగుతున్న భారత దౌత్యనీతి కారణంగా చైనా ఆటలు సాగడం లేదు. ఇటువంటి సమయంలో చైనా కావాలని ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు డోక్లామ్‌లో నిర్మాణాలు చేపట్టింది. అయితే మోదీ నేతృత్వంలోని బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ పట్టుదల కారణంగా చైనా తాత్కాలికంగా వెనకడుగు వేసింది. ఇటీవల చైనాలో జరిగిన ‘బ్రిక్స్’ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇందుకు నిదర్శనం.
*

కామర్సు బాలసుబ్రహ్మణ్యం సెల్: 09899 331113