మెయిన్ ఫీచర్

వరాలనిచ్చే వరలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజామ్
చంద్రాం హిరణ్మరుూమ్ లక్ష్మీం జాతవేదో మమావహ
శుద్ధలక్ష్మీ మోక్ష లక్ష్మీ జయలక్ష్మీ సరస్వతీ
శ్రీలక్ష్మీ వరలక్ష్మీచ ప్రసన్న మమ సర్వదా
అంటూ వరాలనిచ్చే తల్లిని వరలక్ష్మిగా భావించి శ్రావణ శుక్రవారం పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. వైకుంఠుని ఇల్లాలు మహావిష్ణువు హృదయేశ్వరియైన మహాలక్ష్మీదేవి ఓసారి భూలోక విహారానికి వచ్చిందట. ఆమెకు ఈ లోకంలోమానవులను ఉద్దరించాలన్న సంకల్పం కలిగింది. ఎవరైతే శుచిగా, శుభ్రంగా, నిర్మల మనస్కులై తన్ను సేవిస్తారో వారిని అనుగ్రహిద్దామని అలా తిరుగుతూ తిరుగుతూ ఓ ఇంట ప్రవేశించిందట.
ఆ ఇంటి ఇల్లాలు సౌభాగ్యవతి చారుమతి. ఆ చారుమతి తన అత్తమామల సేవలను, తన భర్త అవసరాలను చూస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుతోందట. తన పిల్లలకు మంచిసంస్కారాలను నేర్పుతోందట. ఇంట్లో ఉన్న సభ్యులందరి బాగోగులను ఓ కంట కనిపెడుతూ వారికందరికీ హృదయోల్లాసాన్ని కలిగించేలా పనులు చేస్తూ ఈ ఈతిబాధలను దూరం చేయమని మహాలక్ష్మీదేవిని స్తుతించడం భూలోకవిహారానికి వచ్చిన మహాలక్ష్మి చూచింది. చారుమతి లేమిలో కూడా కలిమిని వెతుక్కునే ఇల్లాలు.
చారుమతి కలలో మహాలక్ష్మి కనపడి ‘ఓ చారుమతి నీ సంస్కారంతో నన్ను మెప్పించావు. నీవు శ్రావణ పూర్ణిమ కు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను కొలిచినట్లయితే నీవు కోరిన కోర్కెలను తీరుస్తాను’ అని చెప్పిందట. స్వప్నసాక్షాత్కారం పొందిన చారుమతి దిగ్గున లేచి చుట్టూ చూసి ఓహో నేను కలగన్నాను సుమా అనుకొందట. ఈ స్వప్నవృత్తాంతాన్ని తన అత్తమామలతోడి భర్తతోడి చెప్పుకొందట. ఆ తరువాత శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూసి తన తోడి స్ర్తిలతో కలసి శుక్రవారం నోము నోచిందట. అంతే ఆ పూజలో పాల్గొన్నవారికి అనేకానేక కానుకలను వరలక్ష్మి దేవి ప్రసాదించింది. చారుమతి సర్వసౌభాగ్యసంపదలనిచ్చింది. ఇంతటి వైభవాన్నిచ్చిన వరలక్ష్మి అమ్మవారిని అక్కడి స్ర్తిలందరూ కొనియాడి వారి వారి ఇండ్లల్లో వారు కూడా ఈ శుక్రవారం నోము నోచుకోవడం ఆరంభించారట.
అలా శ్రావణ మాసం రాగానే అంగనలందరూ శ్రావణ శుక్రవారం నాడు
సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయినీ
మంత్రమూర్తే సదా దేవీ మహాలక్ష్మి నమోస్తుతే
ఆద్యంత రహితే దేవీ ఆదిశక్తి మహేశ్వరీ
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే
అంటూ శుక్రవారపు లక్ష్మిని పూజిస్తారు.

సువర్ణలక్ష్మి
మహాలక్ష్మీ దేవి శ్రీపురంలో శక్తి అమ్మ నారాయణీ స్వరూపంగా, సువర్ణమూర్తిగా దర్శనం ఇస్తోంది. అక్కడి నారాయణీ అమ్మవారు భక్తులకోసం 70 కిలోల బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించి అపర లక్ష్మీదేవిగా కొలుస్తున్నారు. ‘హిరణ్యవర్ణాం హరిణీం’ అంటూ అమ్మ కరుణార్థ్ర చూపుకోసం సామాన్యులనుంచి అసామాన్యుల దాకా అమ్మ దర్శనంకోసం శ్రీపురం తరలి వస్తుంటారు. శ్రావణమాసంలో ఈ సువర్ణలక్ష్మీదేవి దర్శనం అతి పవిత్రం.. పరమపుణ్యం.

భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీవ్రతం నాడు అమ్మవారికి ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి నానావిధ ఫల, భక్ష్య భోజ్యాలను నివేదన చేస్తారు. తమచేత శాస్త్రోక్తంగా వ్రతాన్ని నిర్వహించిన పురోహితునికి దక్షిణ తాంబూలాదులను సమర్పించి సంతృప్తిపరుస్తారు. తొమ్మిది దారపు పోగులతో తొమ్మిది ముడుల్ని వేసిన సూత్రాన్ని కుడిచేతికి కట్టుకొని ‘అమ్మా! వరలక్ష్మీదేవి! మాకు పుత్ర పౌత్రాభివృద్ధినీ, ఆరోగ్యంతో కూడిన ఆయుష్షును ఇవ్వవలసింది’ అని ప్రార్థిస్తారు.

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సౌమామృతసోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై
అంటూ మహాలక్ష్మీదేవిని సంతానలక్ష్మిగా సంభావించి తమకు సంతానాన్ని ప్రసాదించమని వేడుకుంటారు. వరలక్ష్మీవ్రతం చేసుకొన్న నిస్సంతులు సంతానవంతులు కావాలని సంతాన ప్రదాయని అయన వరలక్ష్మినే సంతాన వరలక్ష్మిగా పూజిస్తారు.

సర్వానికి కారణమైన ఆదిపరాశక్తిని సముద్ర గర్భను చంద్రుని సహోదరిని మొట్టమొదట వైంకుఠవాసుడే శ్రీలక్ష్మిగా పూజించాడు. ఆ తల్లినే మహాలక్ష్మి వైకుంఠవాసిని జగత్ప్రభువైన మహావిష్ణువుకు ఇల్లాలుగా ప్రసిద్ధి చెందింది. శ్రీలక్ష్మీ హృదయం మహాలక్ష్మి వైభవాన్ని వేనోళ్ళలా కీర్తిస్తోంది. విష్ణుపురాణం లక్ష్మిదేవి యొక్క జగద్వ్యాపకాన్ని చెప్తుంది. పురుషార్థాలను ప్రసాదించే ఈ తల్లిని పూజిస్తే సర్వసౌభాగ్యాలు ఒనగూడుతాయని పరమశివుడు పార్వతికి చెప్పాడు.

శ్రావణలక్ష్మి
‘‘్ధవళతరాంశుక గంధమూల్య శోభే’’, అని వరలక్ష్మీదేవికి ఇష్టమైన శే్వత వస్త్రాలని కట్టి, శే్వత వర్ణ పుష్పాలతో, శే్వతశ్రీ గంధంతో పూజించి పాలు, పాయసంలాంటి తెల్లని పదార్థాలను నివేదన చేయడం శ్రావణ శుక్రవారపు వరలక్ష్మీదేవి పూజలో ప్రత్యేకత. ఇలా శే్వతవస్త్రాలంకారిణి పూజించినవారికి అటు విద్య, ఇటు సంపదరెండూ ఒనగూడుతాయని పురాణ వచనం.

మహాలక్ష్మీ దేవి స్వర్గలక్ష్మిగా, నాగలక్ష్మిగా, రాజ్యలక్ష్మిగా, గృహలక్ష్మిగా, కామధేనువుగా, దక్షిణాదేవిగా, క్షీరసముద్ర రాజతనయగా, శోభాలక్ష్మిగా, తేజోలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, వీరలక్ష్మిగా, ఐశ్వర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఆదిలక్ష్మిగా ఇలా మహాలక్ష్మి ఎన్నో అంశావతారాను ధరించింది. ఈతల్లిని విజయానికి వీరానికి, ధైర్యానికి దుష్టశిక్షణాధికారిగా, శిష్టరక్షకురాలిగా ఖ్యాతిగాంచింది. సర్వులు విజయాన్ని ప్రాప్తి చేయమని అమ్మను మనసార స్తుతిస్తారు.

సంపదలకు, సామ్రాజ్యాలకు, విద్యలకు, కీర్తిప్రతిష్ఠలకు, సర్వశాంతులకు, యశస్సులకు మూలకారణమైన ఈ తల్లివరాలను కురిరిపించడానికి ‘కుండిన’ అనే పట్టణంలో నివాసముంటున్న చారుమతీదేవి అనే స్ర్తీకి స్వప్న దర్శనం ఇచ్చింది. చారుమతి కలలోనే మహాలక్ష్మిని వరలక్ష్మిగా సంభావించి పూజించింది. తన్ను శ్రావణ పున్నమికి ముందువచ్చే శుక్రవారంనాడు పూజించమని ఆదేశించిదట అందుకే ఆదిలక్ష్మి అమ్మవారినే వరలక్ష్మీదేవిగా సంభావించి పూజిస్తారు.

ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేసి అమ్మవారిని అనేక విధాలుగా స్తుతించి
బద్నామి దక్షిణహస్తే నవ సూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
అని పువ్వులు, తులసి కలపి తొమ్మిది ముళ్లు వేసి నవరంధ్రాలతో ఉన్న ఈ దేహాన్నుంచి తమను రక్షించి సదా సత్యము, నిత్యమై వెలుగొందే మహాలక్ష్మీ సాయుజ్యాన్ని ప్రసాదించమని వరలక్ష్మీదేవిని స్ర్తిలంతా వేడుకుంటారు.

- సి. విజయలక్ష్మి