మెయిన్ ఫీచర్

అమ్మపాల అమృతం.. బిడ్డకు శతమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అమ్మపాలు అమృతం.. అమ్మ ఈ భూమిమీద తిరిగే దేవత..మాతృత్వం
ఒక వరమనీ, దానివల్లే పరిపూర్ణత సిద్ధిస్తుంది’’ అని నమ్మే తల్లులు పిల్లలకు
పాలివ్వటం అనే పనిని తన్మయత్వంతో వాత్సల్య పూర్వకంగా చేస్తారు.
తల్లిపాలవల్ల బిడ్డకు విటమిన్స్, ప్రొటీన్సు దొరకడమే కాదు... తల్లి శరీర
స్పర్శవల్ల, వాత్సల్య పూరిత ఆలింగనం వల్ల బిడ్డకు భరోసా, రక్షణ, వీటన్నింటినీ మించిన ‘అమ్మ ప్రేమ’ దొరుకుతుంది. అమ్మకూ అంతే తన బిడ్డతో నిత్య సాన్నిత్యం, దగ్గరితనంవల్ల సహజ సిద్ధమైన పుత్ర (పుత్రిక) ప్రేమ ఆమెలో
అంతకు పదింతలవుతుంది. దానివల్ల తల్లీపిల్లల సంబంధం పటిష్టమై... మానవ సంబంధాలు మరింత పరిపుష్టమవుతాయి.
సృష్టికర్త ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు...! తల్లి కడుపులో శిశువును సృష్టి చేయడంతోనే సృష్టికర్త పని అయిపోలేదు... పుట్టిన బిడ్డ తాగటానికి పాలను కూడా అమ్మస్తన్యంలో నుంచి స్రవించే గొప్ప ఏర్పాటు చేశాడు. పసిబిడ్డకు గుక్కెడు పాలు - ఈ భూమిమీద దొరకవనా... ఆ ఏర్పాటు...? కాదు... కాదు... అమ్మపాలలో అమృతం ఉంటుంది గనుక పుడుతూనే బిడ్డ వాటిని తన వెంట తెచ్చుకునే ఆ అరేంజ్‌మెంట్! ఎంత దయామయుడో కదా సృష్టికర్త...! ప్రతిదానికీ బాగా ఆలోచించి ప్రణాళికా బద్ధంగా ఈ సృష్టికార్యం జరిపిస్తున్నట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే!
ఇప్పుడు ఈ ప్రస్తావన అంతా ఆగస్టు 7వ తేదీ వరకు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాలు జరగబోతున్నాయి గనుక...! దీనినిబట్టే ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాలకు ఉన్న ప్రాముఖ్యత, విలువలను ఎవరైనా అంచనా వేయొచ్చు. పుట్టిన బిడ్డకు ఆరు నెలల వయసు వచ్చేవరకు తల్లిపాలు తాగించడంవల్ల పిల్లలు బలంగా పెరగటమే గాక వాళ్ళలో రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న అవగాహనను, ఎరుకను తల్లులలో కలిగించటమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కలిసి 1991లో ‘ప్రపంచ తల్లిపాల వారోత్సవాల’కు శ్రీకారం చుట్టారు. ఇందులో 170 దేశాల దాకా పాల్గొన్నాయి.
నిజానికి బిడ్డకు స్తన్యం ఇచ్చి పాలు తాగించాలన్న విషయాన్ని ఏ తల్లికీ ఎవరూ చెప్పనవసరం లేదు. కాన్పు తర్వాత తల్లికి పాలుపడటం ఎంత సహజ సిద్ధమైన చర్యనో ఆ పాలను ఆమె బిడ్డకు తాగించటం కూడా అంతే. సహజ సిద్ధమైన చర్య... అది ప్రకృతి సిద్ధమైనది. అయినా అమ్మపాలలోని శ్రేష్టతను, మంచి గుణాలను శాస్త్ర సంబంధిగా తల్లులకు, తండ్రులకు, ఇతర కుటుంబ సభ్యులకు తెలియచెప్పటం చాలా అవసరం. ఎ.బి.సి. ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటూ ఫీడింగ్ సమయంలో తల్లి శ్రద్ధ వహించాల్సిన ముఖ్య విషయాలను ‘అవేర్‌నెస్’, ‘బి పేషంట్’, ‘కమ్‌పర్ట్’ అని మూడు భాగాలుగా విభజించారు మెడికల్ సైంటిస్టులు. ఈ విషయాలను ఎవరికి వాళ్లు తెలుసుకోవటమే గాక నలుగురికి తెలియచెబుతూ ప్రచారణ కూడా చేయాలి.
బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు వచ్చేశాయ్..
తల్లిపాలకు సాటియైనవి ఈ లోకంలో మరే పాలూ లేవు. వాటికి ప్రత్యామ్నాయాలు కూడా లేవు. అమ్మపాలు అమ్మ పాలే...! అందుకే వర్కింగ్ మదర్స్ కూడా ఆఫీసుకు వెళుతూ వెళుతూ పిల్లలకు పాలు ఇవ్వడమే గాక ... ఫ్రిజ్‌లో బ్రెస్ట్‌మిల్క్‌ని బాటిల్స్‌లో స్టోర్ చేసి వెళుతున్నారు. తల్లిపాలు దొరకని పిల్లలకోసం - విదేశాలలో బ్రెస్ట్ మిల్క్ బ్యాంకులు కూడా ఉన్నాయి. తమవద్ద చనుబాలు సమృద్ధిగా దొరకని తల్లులు అనివార్య పరిస్థితిలో ఆ బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ఇంకా - మరో ప్రత్యామ్నాయంగా పోతపాలను బాటిల్స్‌లో పోసి తాగిస్తుంటారు. పల్లెటూళ్ళలో ఆ రోజుల్లో పిల్లలకు ఆవుపాలు తాగించేవాళ్ళు... సిటీలో ఇప్పుడు ఫార్ములా మిల్క్‌ను పోతపాలుగా పడుతున్నారు. తల్లిపాలలో ఉన్న పోషకాలు ఫార్ములా మిల్క్‌లో ఉండవు... అవి పిల్లలకు త్వరగా అరగక తరచూ అజీర్తి చేస్తూ ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువే...! తల్లిపాలు తాగి పెరిగిన పిల్లల్లో ఉండే చురుకుదనం, తెలివితేటలు పోతపాల పిల్లల్లో ఉండవు. అందుకే అంటారు. ఒక్కోసారి సంప్రదాయాన్ని, శాస్తజ్ఞ్రానాన్నీ పక్కపక్కన పెట్టి ‘ఏదీ మంచిది... ఏది ఉపయోగమయింది...!’ అని తులనాత్మక పరిశీలన చేస్తే దేని ప్రయోజనాలు దానివి అని సమాధానం చెప్పవలసి వస్తుంది.
తల్లిపాల గురించిన శాస్త్ర పరిజ్ఞానం లేకుండానే నిరక్షరాస్యులైన పల్లెటూరి స్ర్తిలు ఆ రోజుల్లో వాళ్ళ బిడ్డలకు ఆరునెలలే కాక అదనంగా రెండేళ్ళ వరకూ కూడా పాలిచ్చే వాళ్ళు. పొద్దునే్న పరగడుపున ఉగ్గుగినె్నలో తల్లిపాలు, కొంచెం ఆముదం కలిపి ఉగ్గుపెట్టేవాళ్ళు. (పిల్లకు తాగించేవాళ్ళు) దానివల్ల పసిపిల్లలకు అజీర్తి, మలబద్ధకం వంటివి దరిచేరవు. ఇలాంటి విషయాలను, ఆరోగ్య సూత్రాలను అనుభవజ్ఞులైన అమ్మమ్మలు, బామ్మలు బాలింతలైన మనవరాళ్ళకు చెప్పేవాళ్ళు. తల్లిపాలలో ఔషధ గుణాలున్నాయని ముందుగా గుర్తించింది కూడా వెనకటితరం ఆడవాళ్ళే... ఇంట్లో ఎవరికయినా కళ్ళకలకలు వంటి కంటి జబ్బులు వస్తే... చుట్టుపక్కల ఇళ్ళలో ఎక్కడ బాలింత ఉన్నా అక్కడికి వెళ్ళి... రెండు, మూడు బొట్లు చనుబాలు అడిగి తెచ్చి... దూదిని వాటిలో ముంచి కళ్లమీద వేసేవాళ్ళు. వీటిని ‘చనుబాల వత్తులు’ అనేవాళ్ళు. ఇంకా - కాన్పు తర్వాత పాలుపడని తల్లులు... విషజ్వరాల వంటి అనారోగ్య కారణాలవల్ల పిల్లలకు పాలివ్వలేని తల్లులు వాళ్ళ పిల్లలకు పోతపాలు పట్టకుండా ‘అమ్మపాలు ఎవరివయినా అమ్మపాలే’ అన్న నమ్మకంతో బాలింతలైన ఇతర స్ర్తిల దగ్గర తమ పిల్లలకూ పాలు తాగించేవాళ్ళు... ఇప్పుడు విదేశాలలో నడుస్తున్న ‘మదర్‌మిల్క్ బ్యాంకు’ కానె్సప్ట్‌కు బహుశా బీజం ఇక్కడి నుంచే పడిందేమో! (క్యాన్సర్ బారినపడిన తల్లులు, కీమోట్రాట్‌మెంట్ తీసుకునే వాళ్ళు, హెచ్‌ఐవి బాధితులు బ్రెస్ట్ ఫీడిగ్ చేయకూడదు).
‘్ఫడింగ్ రూమ్స్’ అవసరం
ప్రమోషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్‌కి తల్లి, కుటుంబ సభ్యుల సహకారమే గాక ఆఫీసు, ప్రభుత్వ రంగ సంస్థలు, సాటి మనుషుల సహాయ సహకారాలు కూడా అవసరం అవుతాయి. సహజంగా తల్లులు పబ్లిక్ ప్లేస్‌లలో నలుగురి ముందు పిల్లలకు పాలివ్వడానికి సిగ్గుపడతారు. అందుకే రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, మాల్సు ఎయిర్‌పోర్ట్‌లలో బ్రెస్ట్ఫీడింగ్ రూమ్స్, బేబీకేర్ రూమ్స్ సపరేట్‌గా ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఆఫీసులలో, వర్క్‌ప్లేస్‌లలో చంటిపిల్లల తల్లులు పాలను పంపింగ్ చేసి ప్రిజర్వ్ చేసుకోవటం కోసం రిప్రిజరేటర్ సౌకర్యం ఉన్న ప్రత్యేక గదులను ఏర్పాటుచేయాలి. ఈ పద్ధతి అమెరికా వంటి దేశాలలో ఉంది. మన దగ్గర మగవాళ్ళకు ప్రత్యేకంగా స్మోకింగ్ రూమ్సు, జీన్సు ఉంటాయిగానీ ఆడవాళ్ళకు పిల్లల ఫీడింగ్ రూమ్స్ ఉండవు. ‘స్ర్తిలను గౌరవించడం మన సంప్రదాయం’ అన్న సూక్తి, బోర్డులు తగిలించటంలో ఆగిపోయిందే తప్ప కార్యరూపం దాల్చటం లేదు... ‘అమ్మ’ను గౌరవించడం, ‘పాలిచ్చే తల్లి’కి మరుగు ఏర్పాటుచేయటం ఆడవాళ్ళదే కాదు మగవాళ్ళ కర్తవ్యం కూడా. ఆకలైన పసిపాప అమ్మపాల కోసం గుక్కపట్టి ఏడుస్తుంది... ‘అమ్మ ఇప్పుడు పబ్లిక్ ప్లేస్‌లో ఉంద’ని ఆ పాపకు తెలవదు. స్తన్యం నోటి కందంచే దాకా అలా ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి... బిడ్డతో బైటికెళ్ళిన తల్లికి ‘్ఫడింగ్ రూమ్స్’ అవసరమా కాదా... వాటి అవసరం అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న తల్లికే తెలుస్తుంది. సాటి స్ర్తి అర్థం చేసుకోగలదు... అలాగే పురుషులు, ప్రభుత్వాలు కూడా అర్థం చేసుకోవాలి.

అజ్ఞానం, అమాయకత్వం వల్ల ఎంతో నష్టం

ఎందుకంటే... బిడ్డకు తల్లి స్తన్యం ఇవ్వటం అన్నది ఎంత సహజ విషయమే అయినా... అందులో కొంత అజ్ఞానం, అమాయకత్వం కూడా కొంతమంది విషయంలో ఉన్నాయని కొన్ని దశాబ్దాల వెనక్కు వెళ్ళి... అప్పటి తల్లుల గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. అప్పటి తల్లులు బిడ్డను పక్కలో (్ఫ్లట్‌గా) పడుకోబెట్టి పాలు ఇచ్చేవాళ్ళు... బిడ్డ పాలు తాగుతుండగనే తల్లులు నిద్రపోయేవాళ్ళు కూడా! దానివల్ల పాలధారల వేగానికి పిల్లలు ఉక్కిరిబిక్కిరై శిశు మరణాలు కూడా సంభవించేవి. ఇప్పుడు డాక్టర్లు ‘తల్లులు కూర్చుని పిల్లలకు పాలు పట్టాలని ఆ వెంటనే భుజాన ఎత్తుకుని వెన్ను చరచాలని... త్రేన్పు వచ్చేదాకా అలా చేయాలనీ చెబుతున్నారు. ఈ విషయం అప్పటి తల్లులకు చాలా మందికి తెలియదు. కాన్పు అయిన మొదటిరోజు తల్లి స్తన్యం నుంచి స్రవించే ముర్రుపాలలో పిల్లలకు రోగనిరోధక శక్తిని అందించే గుణం, ఇన్‌ఫెక్షన్స్ నుంచి, చెడు బ్యాక్టీరియా నుంచి వైరస్ నుంచి రక్షించే శక్తి ఉంటుందని గైనకాలజిస్టులు, పిడియాట్రిషియన్లు చెబుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఆడవాళ్ళు ‘అవి మురికిపాలని’ పిండి పారేసేవాళ్ళే గానీ పిల్లలకు తాగించేవాళ్ళు కాదు. దానివల్ల... ఆ అజ్ఞానంవల్ల... పిల్లలకు ఎంతో నష్టం జరిగిపోయింది.

కలసి తల్లి పాల వారసత్వాన్ని కాపాడుకుందాం

తల్లిపాల వారోత్సవాలలో ఒక్కొక్క ఏడాది ఒక్కో థీమ్‌ను ఎంపిక చేస్తారు. 1992లో బేబీ-ఫ్రెండ్లీ హాస్పటల్ ఇనిషియేటివ్... 1993లో మధర్ - ఫ్రెండ్లీ వర్క ప్లేస్ ఇనిషియేటివ్ 1995లో బ్రెస్ట్ ఫీడింగ్ ఎమ్‌పవరింగ్ ఉమెన్. 1997లో బ్రెస్ట్ ఫీడింగ్ నేచర్స్‌వే. 1999 బ్రెస్ట్ ఫీడింగ్, ఎడ్యుకేషన్ ఫర్ లైఫ్. 2000లో బ్రెస్ట్ఫీడింగ్: ఇట్ ఈజ్ యువర్ రైట్ 2007లో. బ్రెస్ట్ ఫీడింగ్: ది ఫస్ట్ అవర్ -సేవ్ వన్ మిలియన్ బేబీస్. 2011లో ‘టాక్ టు మి! బ్రెస్ట్ ఫీడింగ్ - ఎ3డి ఎక్స్‌పీరియన్స్ 2015. బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ వర్క్ - లెటజ్ మేక్ ఇట్ వర్క్ వంటివి ఒక్కో సంవత్సరం ఒక్కో అంశం మీద అందరూ దృష్టి కేంద్రీకరించడానికి... ప్రచారం చేయడానికి నిర్దేశించబడ్డాయి. ఆగస్టు 7వ తారీఖు వరకు జరిగే తల్లిపాల వారోత్సవాలలో 2017 థీమ్‌గా ‘సస్టెయినింగ్ బ్రెస్ట్ ఫీడింగ్ టు గెదర్’ అన్న అంశాన్ని నిర్ణయించటం జరిగింది. 7 పాయింట్స్‌తో ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. అవేమిటంటే..
సపోర్టింగ్ మమ్స్ అండ్ ఫ్యామిలీస్
సపోర్టింగ్ హెల్త్ ప్రొఫెషనల్స్
బ్రెస్ట్ ఫీడింగ్ ఎన్‌వైర్నమెంట్స్
వాలంటీర్స్ అండ్ సపోర్టర్స్
కార్పొరేట్ స్పాన్సర్ షిప్
బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ప్‌లైన్
బ్రెస్ట్ ఫీడింగ్ ఇన్‌ఫర్‌మేషన్ అండ్ రిసర్చ్
ఈ ఏడు విషయాల మీద ముఖ్యంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ మీద తల్లులకు వారి కుటుంబానికి ఎడ్యుకేషన్ క్లాసెస్ నిర్వహించడం... హెల్త్ ఆర్గనైజేషన్స్‌తో వాళ్ళను కనెక్ట్ చేయటం... బ్రెస్ట్ ఫీడింగ్ హెల్ఫ్‌లైన్‌లు ఏర్పాటుచేయడం... తల్లిపాల వల్ల బిడ్డకు కలిగే లాభాల మీద ఇంకా విస్తృతంగా, వివిధ కోణాలలో పరిశోధనలు చేయించటం, కార్పొరేట్ సంస్థల ఆర్థిక సహాయాన్ని కోరటం వంటివన్నీ పై ఏడు ముఖ్య అంశాలలోని అంతర్గత అంశాలు.

- కొఠారి వాణీ చలపతిరావు