మెయిన్ ఫీచర్

శాస్ర్తియ నృత్యానికి పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ డాన్స్‌లో రాణించాలనుకున్నా శాస్ర్తియ నృత్యాన్ని నేర్చుకోవాలి. శాస్ర్తియ నృత్య సాధన చేస్తే ఏ డాన్స్‌నైనా సులభంగా చేయవచ్చు. సంప్రదాయ నృత్యం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. మన సంప్రదాయ
మూలాలను మరిచిపోతే భవిష్యత్తు అనేది ఉండదు. భారతీయ నృత్య సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ప్రజలను ఆలోచింపజేసి వారిలో చైతన్యం నింపేందుకు కూచిపూడిలో అనేక కళారూపాలు ఉన్నాయ. ఈ సందర్భంగా శాస్ర్తియ నృత్యమైన భరతనాట్యం, కూచిపూడి గురించి
నాట్యాచారిణి సుధామాల తన అభిప్రాయాలను వివరించారు.
*
శాస్ర్తియ నృత్యంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భామాకలాపం అంశాన్ని గంతంలో గంటల తరబడి ప్రదర్శించేవారు. ప్రదర్శన ఎంత దూరంలో వున్నా ప్రేక్షకులు ఎడ్లబండ్లపై వచ్చి వీక్షించేవారు. కాలంతోపాటు నేర్పించే గురువులలో కూడా మార్పులు వచ్చాయి. కొంతమంది గురువులు నృత్యాన్ని వ్యాపారంగా మార్చేస్తున్నారు. నృత్యాంశాలు పదిహేను నిమిషాలకు కుదించుకుపోయాయి. గతంలో భామాకలాపం అంశం ప్రదర్శించాలంటే తొలుత ఇద్దరు సూత్రధారులు రంగప్రవేశం చేసేవారు.
శ్రీరాజ గోప బాలా క్షీరాభోరాశిలోలా శ్రీతజనపాలా
నీరాద రూప నిగమాకార వర కూచిపూడి కళ్యాణ నిలయా...
అంటూ నృత్య కార్యక్రమాన్ని ప్రారంభించి భామాకలాపం గురించి వివరించి సత్యభామ ప్రవేశిస్తోందని పద్యగానంలో పలుకగా ఇద్దరు చెలికత్తెలు తెర పట్టుకుని రంగ ప్రవేశం చేసేవారు. తెర వెనుక సత్యభామ తొలుత జడను ప్రదర్శించేది. ఆ తరువాత తెర తీయగానే ‘్భమనే.. సత్యభామనే..’ అంటూ సత్యభామ పాత్రలో నర్తకి నృత్యం ప్రారంభించేది. ప్రస్తుతం ఈ సంప్రదాయం కనుమరుగైంది. శాస్త్రం గురించి ఆలోచిస్తే భామాకలాపం ఒక అద్భుత సృష్టి అని నాట్యాచారిణి సుధామాల పేర్కొన్నారు. ఈ అంశంలో మాధవి పాత్ర కేవలం కల్పితం. ఈ పాత్ర ద్వారా జీవాత్మ పరమాత్మల అనే నృత్యాన్ని యోగం, జ్ఞానం, భక్తి, శరణాగతుల ద్వారా జీవుడు బ్రహ్మానందం అనుభూతిని పొందే విధానాన్ని చాటి చెప్పిన యోగీశ్వరుడు సిద్ధేంద్ర యోగి అని ఆమె పేర్కొన్నారు. భామాకలాపాన్ని ప్రత్యేక కలాపంగాను, మాధవిని ఆదర్శ సతిగా రూపుదిద్దిన మహనీయుడు సిద్ధేంద్రయోగి. ప్రస్తుతం ఒక్కొక్క నాట్యాచార్యుడు ఒక్కో విధంగా మరల్చుకున్నారు. భామాకలాపం శృంగార రస సుధాకలశం ఒక శృంగార కావ్యం. ఈ భామాకలాపంలో శ్రీకృష్ణుడు శృంగార పురుషుడు. భామాకలపాం అంటే సత్యభామ తన బాధను, భావాలను చెప్పుకోవడమే. సాహిత్యపరంగా ఆలోచిస్తే భామాకలాపం సంస్కృత తెలుగు పదాలతో మిళితమై కనిపిస్తుంది. ఈ అంశాన్ని ప్రదర్శించడంలో నర్తకీమణులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన శైలిని అవలభిస్తున్నారు. ‘్భమనే సత్యభామనే..’ అంటూ కనుసైగలతో, ముఖ అభినయంతో తనదైన తమశైలిలో నృత్యం చేస్తున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా నృత్యం ప్రదర్శించినా శాస్త్రం మారకూడదు. ఇటీవల కొన్ని నృత్య సంస్థలు వ్యాపార ధోరణిలో కూచిపూడి నృత్యం పేరుతో సినీ గీతాలను నృత్యం చెయ్యడం, పవిత్రమైన నృత్య అంశాలను సినిమా డాన్స్‌లుగా అభినయాన్ని మార్పులు చెయ్యడం బాధాకరమని సుధామాల విచారం వ్యక్తం చేసింది.
వెంపటి కోదండరామశాస్ర్తీ శిష్యరికంలో నృత్యం ప్రారంభించి నాట్యాచారిణిగా డా ఉమా వైజయంతిమాల కల్లకూరి శిష్యరికంలో అనేక మెళకువలు నేర్చుకుని కూచిపూడి నృత్యంలో డిప్లొమా పూర్తిచేశానని చెప్పారు. అనేక నృత్య సంస్థలు, పాఠశాలలు నిర్వహించిన నృత్య పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా ఎంపిఎ పూర్తిచేసి స్వీయ రచనలు చేశారు. పుష్కర గౌతమి, శ్రీనివాస కళ్యాణ వైభవం, హిందీలో రామాయణ్ నృత్య నాటికలను తనదైన శైలిలో రూపొందించానని చెప్పారు. కుమార సంభం, గురుతత్వం, అలమేలు మంగ విలాసం, రామప్ప నృత్య నాటకాలకు స్క్రిప్ట్ వ్రాశానని అన్నారు. నృత్యమాల పేరుతో నృత్య శిక్షణాలయం స్థాపించి యువ కళాకారులను నృత్యంలో తీర్చిదిద్దుతున్నానని చెప్పారు.
నృత్యకళ ప్రాంతీయ భేదాలతో కొన్ని మార్పులు జరిగి దక్షిణ భారతదేశంలో కూచిపూడి, కథాకళి, మోహినీ ఆట్టం, భరతనాట్యంగా విరాజిల్లుతోంది. ఉత్తరభారతదేశంలో కథక్, ఒడిస్సి, మణిపురి నృత్యాలుగా భాసిల్లుతున్నాయి. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా సంగీత నృత్యాలు మానవాళిని కలుపుతున్నాయి. ఈ రంగంలో కళ వికసిస్తున్నపుడు దానికి ప్రామాణిక రూపం కల్పించేది శాస్త్రం. శ్రీకరమై సర్వజన సంధాయికాలైన సంగీతకవిత్వ నృత్యాది లలిత కళా సంపుల్లితమైనది తెలుగు గడ్డ. ఈ తెలుగు నేలపై ప్రాచీన నృత్య సంప్రదాయమైన కూచిపూడి నృత్యం నిత్య శోభాయమానంగా ప్రకాశించడానికి తాను ఒక దివ్వెను అవుతానని నాట్యాచారిణి సుధామాల అన్నారు. నృత్యం కోసం అహర్నిశలు కృషి చేసే ముగ్గురు అక్క చెల్లెళ్ళు వైజయంతిమాల, మాధవిమాల, సుధామాలలు ముగ్గురు అమ్మలుగా నృత్యకళామతల్లికి నీరాజనం పలుకుతున్నారు.
*

చిత్రం.. నృత్యమే శ్వాసగా మలుచుకున్న అక్కాచెల్లెళ్లు వైజయంతిమాల, మాధవీమాల, సుధామాల

-మురళీధర్