మెయిన్ ఫీచర్

ఆకారంలోనూ విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం కారమే గణపతిగా ఆవిర్భవించిందంటారు. గణపతిని ప్రథమారాధ్యునిగా గౌరవిస్తారు. ప్రణవ తేజస్వునిగా, విశ్వరూపదైవంగా వేదం గణపతిని స్తుతించమని చెబుతుంది. సర్వసృష్టికి ఆధారం గణేశుడని ఋగ్వేదం చెబుతుంది. విశ్వం, విశే్వశ్వరుడు ఒకే పదంలో కలిపిన అద్భుతనామధేయుడు వినాయకుడు పార్వతి చేతిలోని నలుగుపిండితో ప్రాణం పోసుకున్న బాలు డు, శివుణ్ణి ఎదిరించి ప్రాణాపాయస్థితిని తెచ్చుకొని తిరిగి శివారాధకుని తలను అతికించడం ద్వారా పునర్జీవితుడు అయిన వినాయకుడు ఆరాధించడం ప్రపంచంఅంతా కనిపిస్తుంది. సర్వసృష్టి చేసే బ్రహ్మకూడా మొట టమొదట విఘ్నారాధన చేస్తాడు. విద్యార్థులు గణపతికి నమస్కరిస్తే చాలు వారు కోరుకున్న విద్యలు కరతలామలకం అవుతాయ. ఇట్లాంటి వినాయకుని ఆకారమే ఓ విజ్ఞాన భాండాగారం. వినాయకుని వాహనం. మూషికం, వాసనామయ జంతువు. తినుబంఢారముల వాసనను బట్టి అది ఆ ప్రదేశానికి చేరుతుంది, బోనులో చిక్కుకుంటుంది. ఆ విధంగానే మానవుడు జన్మాంతరవాసనలవల్ల, ఈ ప్రాకృత జీవితంలో చిక్కుకొని పెడ మార్గాలు పడ్తారు. మూషిక వాహనుడనగా, వాసనలను (కోరికలను) అణగద్రొక్కేవాడు. అహంకారానికి చిహ్నం- మూషికం. అహంకారం బుద్ధిమంతుల్ని పతితం చేస్తుంది. బుద్ధిపతి అయిన మహాగణపతి దానిని మలిచి జయించి సద్వినియోగం చేశాడు. సద్బుద్ధినిచ్చేవాడు- మూషిక వాహనుడైన గణపతి.
జ్ఞానం ఏకత్వానికి సూచిక వినాయకుని ఏకదంతం, చేటలంత చెవులు బుద్ధికుశలతకు మారుపేరుగా నిలుస్తాయ, పెద్దతల విశేషమైన బుద్ధికి నిదర్శనం,వక్రతుండం ఓంకారానికి,, లంబోదరం బ్రహ్మాండానికి సూచిక ఇలా తన ఆకారంలో విశేషాలను కలిగి ఉన్న వినాయకుని రూపం శివకేశవుల కు అబేధరూపం. ఒక్క విఘ్ననాశకుణ్ణి పూజిస్తే చాలు శివకేశవులను అమ్మవారిని పూజించి నట్లు. ఇలా వినాయకుని పూజలో పరమార్థాన్ని తెలుసుకొని పూజించిన వారికి సర్వసౌభాగ్యాలు లభ్యమవుతాయ.

- చోడిశెట్టి