మెయిన్ ఫీచర్

పత్రం... ఆరోగ్య రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో వినాయకునికి ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. తలపెట్టిన కార్యాలన్నీ ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా ముగించడం కోసం మొదటగా వినాయకుడ్ని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి శుభ కార్యానికి ముందు పూజలు అందుకుంటున్నా, ప్రత్యేకంగా భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితిగా స్వామిని ఇంటింటా, వాడవాడలా ఘనంగా పూజించుకుంటున్నాం. వ్యక్తిగత, సామూహిక ఆరాధనల వలన సమాజం పటిష్టమవుతుంది. ఈ ఆలోచనతోనే మన ప్రాచీన మహర్షులు సామాజిక నిష్ట కలిగి వుండేలా వ్రతాలు, పూజలను నిర్దేశించారు.
వీటివలన వ్యక్తి ఉన్నతి, జాతి ఔన్నత్యం సాధ్యమవుతుంది. సమాజంలో పేద, ధనిక వర్గాలు ఎలాంటి కుల, మత బేదాలు లేకుండా పూజలు నిర్వహించడంవలన సమాజమంతా ఒక్కటిగా నిలిచే అవకాశం ఏర్పడుతుంది. అది భిన్నత్వంలో ఏకత్వంపై ధర్మాన్ని శక్తివంతం చేస్తుంది. దీంతో మానవ సంబంధాలు గట్టిపడి పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటు సమిష్ట జీవన ఫలాన్ని సంపాదించుకోగలం. సమాజాన్ని చైతన్యపరిచి ఐక్యతా భావాన్ని పెంపొందించే సామూహిక ఉత్సవాల్లో వినాయక చవితి అత్యంత ప్రసిద్ధమైంది. ఐకమత్యంగా మెలగాలనే దృఢ సంకల్పంతోపాటు పర్యావరణ స్పృహ, ఆరోగ్య జీవన పరిరక్షణ అంతర్లీనంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో కనిపిస్తుంది.
వేదాలలో బొటనవేలు పరిమాణంలో గణపతిని తయారుచేసి పూజిస్తే చాలని చెప్పినట్టు పండితులు వివరిస్తున్నారు. మట్టి విగ్రహాలనే ఏర్పాటు చేసుకోవాలనే నియమం. మట్టి ప్రకృతికి మూలం. ప్రతి జీవి కూడా మట్టిలో పుట్టి మట్టిలోనే కలిసిపోతుందనే సృష్టి నియమాన్ని ప్రజలకు గుర్తు చేయడమే వినాయక చవితి ఉత్సవాల పరమార్ధం. అందుకే మన పూర్వీకులు మట్టి విగ్రహాలను మాత్రమే నెలకొల్పేవారు. అంతేకాక సామాజిక పరంగా గ్రామంలోని చెరువు వద్దకు వెళ్లి ప్రజలు మట్టి తీయడం ద్వారా చెరువును పూడిక తీసినట్టు అవుతుంది. నిమజ్జనం రోజున చెరువు గట్టున వినాయక నిమజ్జనం చేసినచో గట్టు పటిష్టమవుతుంది. ఉత్సవాలు జరపడం వలన ప్రజల్లో ఐక్యత ఏర్పడుతుంది. మట్టివిగ్రహాలను నెలకొల్పడం ద్వారా చెరువుల సంరక్షణ కార్యక్రమం కూడా జరుగుతుంది.
ప్రకృతితో లభించే అన్నిరకాల పత్రాలతో వినాయకుడ్ని పూజించడం మరో విశేషం. వైద్యానికి పనికిరాని చెట్టు అంటు ఏదీ లేదని, ప్రతి చెట్టు వైద్యానికి పనికివస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెపుతోంది. అందుకే ప్రతి పత్రం వైద్య ప్రాధాన్యతకలిగిందే. అవి మానవుని ఆరోగ్య రక్షణకుఉపయోగపడేవే. గణపతకి అత్యంత ప్రీతికరమైనది గరిక. దీనిని సంస్కృతంలో దూర్వ అంటారు. రెండు రెండు గరికలతో గణపతికి ప్రత్యేకంగా దూర్వాయుగ్మ పూజ చేస్తారు. ప్రకృతిలో విరివిగా లభించే గరికను తైలంలో వేసి మర్దన చేసుకుంటే మానవుని నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని వైద్యులు చెపుతారు. వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రం ప్రత్యేకమైన వైద్య, ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. మాచీపత్రం-చర్మ వ్యాధులకు, బృహతీపత్రం (నేల మునగ)-దగ్గు, మధుమేహం, బిల్వపత్రం (మారేడు)-కంటి వ్యాధులు, చర్మరుగ్మతలు, దూర్వాయుగ్మం- నాడీ వ్యవస్థ, దత్తూర పత్రం (ఉమ్మెత)-మానసిక వ్యాధులు, బదరీపత్రం (రేగు) -చిన్నపిల్లల జబ్బులు, అపామార్గ పత్రం(ఉత్తరేణి)-దంత వ్యాధులు, తులసీ పత్రం -దగ్గు, వాంతులు, చూతపత్రం(మామిడి)-అతిసారం, గోళ్లపగుళ్లు, కరవీరపత్రం (గనే్నరు)-తీవ్ర జ్వర నివారణకు, విష్ణుక్రాంత పత్రం(అరిశె ఆకు)-రక్తదోష నివారణ, దాడిమీపత్రం(దానిమ్మ)- ఉబ్బసం, అజీర్ణం, సింధువారపత్రం (వావిలాకు)-ఒళ్లునొప్పులకు, శమీపత్రం-కుష్టు నివారణ, అశ్వత్థ పత్రం (రావి ఆకు)- శ్వాసకోశవ్యాధులకు, నింబపత్రం (వేపాకు)-చర్మ సంబంధ వ్యాధులకు ఇలా చెప్పుకుంటూ పోతే వినాయకునికి అర్పించి పూజించే ప్రతి పత్రానికి వైద్య సంబంధం ఉంది.
గణపతికి అర్పించే పత్రాలకు-ప్రకృతికి, ప్రకృతికి-మనిషికి వున్న సంబంధం గాఢమైనదనే విషయాన్ని మనం అర్ధం చేసుకోవాలి. వినాయకునికి ఏనుగు ముఖం, ఏనుగు శక్తివంతమైన జంతువు, సూక్ష్మదృష్టికి సంకేతం. శాకాహారి, శాకాహారం శక్తికి సంకేతం. అందుకే వినాయకుడు మహా శక్తి సంపన్నుడు. ఆయన ఆరాధన మహిమాన్వితమైంది. మానవ సంక్షేమమే ధ్యేయంగా అందరం సంఘటితమై మహిమాన్వితుడైన గణనాధుని శాస్తవ్రిధితో ఆరాధించి ఆయన అనుగ్రహానికి పాత్రులవుదాం.

-వేదాంతం హరికుమార్