మెయన్ ఫీచర్

తెలుగు భాషా కేంద్రం తరలివచ్చేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళులకున్న భాషాభిమానం గొప్పదే! కానీ, ఇతర భాషలపట్ల వారికి ఉన్న చులకన భావమే భరించరానిది! ముఖ్యంగా దక్షిణాది భాషలన్నింటిపట్లా ఉన్న తక్కువ భావంతో ఆ భాషలని అణచివేయడానికి చేసిన ప్రయత్నం ఖండించదగ్గది! తమిళం కన్నా తెలుగు ప్రాచీనమైనదని డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి రాసిన వ్యాసాన్ని 2003లో ‘నడుస్తున్న చరిత్ర’లో ప్రచురించారు. ఈ పత్రిక సామల రమేష్‌బాబు సంపాదకత్వంలో తెలుగు భాషకి అంకితమై వచ్చిన పత్రిక.
వెయ్యి సంవత్సరాలకి పైగా సాహిత్యం ఉండి, అభివృద్ధి చెందుతున్న భాషలోని ప్రాచీనమైన విశిష్ట గుణాలని గుర్తించి, వాటిని ప్రపంచానికి తెలియజెప్పడానికి, ‘ప్రాచీన ప్రతిపత్తి’ని కల్పించడం. ఈ విషయాన్ని తమిళులు ముందుగానే తెలుసుకుని 2000 సెప్టెంబర్ 2న కేంద్ర సాహిత్య అకాడమీ జరిపిన సమావేశంలో తమిళానికి ప్రాచీన హోదా ఇవ్వాలని సిఫారసు చేయించారు. (2004 అక్టోబర్ 12న భారతదేశ గెజిట్‌లో ‘క్లాసికల్ భాషలు’ అనే పేరుతో కొత్త సముదాయాన్ని సృష్టిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.) ‘ప్రాచీన ప్రతిపత్తి’కి వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాల చరిత్ర అర్హత అని అంటే మరికొన్ని భాషలు ఈ ప్రతిపత్తిలో గుర్తింపు పొందే అవకాశముంది. దాంతో తమిళ సోదరులు వాళ్ళకొచ్చిన ప్రాచీన హోదాని దక్షిణాది రాష్ట్రాలైన తెలుగు, కన్నడ, మలయాళం, ఒరియాలకు దక్కకుండా చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటి కేంద్ర మంత్రి మారన్ కేంద్రానికి ఓ లేఖ రాశారు. దాంట్లో ‘్భషల ప్రాచీనార్హతకు పదిహేను వందల నుంచి రెండు వేల అయిదు వందల సంవత్సరాల పరిమితి’ ఉండాలని ప్రతిపాదించారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత జటిలం చేసింది. ఈ కుట్ర బయటపడేసరికి వివిధ భాషా ప్రాంతాల భాషాశాస్తవ్రేత్తలు, పరిశోధకులు తిరగబడే పరిస్థితి వచ్చింది. దీంట్లో భాగంగానే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోని భాషా సమితులు, భాషోద్యమకారులు, భాషాశాస్తవ్రేత్తలు తెలుగుకి ప్రాచీన హోదా లభించాలంటూ పట్టుబట్టారు.
అప్పటి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, భాషాభిమాన సంస్థలు- ప్రాచీన హోదావల్ల వచ్చే వందకోట్లు కోసం కాదు, తమిళం కన్నా తెలుగు భాష ప్రాచీనమని నిరూపించడానికి, తెలుగు ప్రాచీనతకు సంబంధించిన సర్వ ఆధారాలను అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కి సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగుతోపాటు కన్నడ భాషకు ప్రాచీన ప్రతిపత్తిని 2008లో ప్రకటించారు. ఈ ప్రకటనను సవాలు చేస్తూ తమిళ న్యాయవాది ఆర్.గాంధీ ఒక ప్రజ ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) మద్రాసు హైకోర్టులో దాఖలుచేశారు. తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదాకి వ్యతిరేకంగా వేసిన ప్రజాహిత వ్యాజ్యాలతో ప్రభుత్వానికి సంబంధం లేదని తమిళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా ఎవ్వరూ నమ్మలేదు. తెలుగు, కన్నడం భాషల ప్రాచీన హోదా ఇరుకున పడింది. ఏ ప్రాతిపదికన తెలుగు, కన్నడంతోబాటు ఒరియా, మలయాళ భాషలకు ప్రాచీన హోదా కల్పించారో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని వివరించమంది మద్రాసు హైకోర్టు. కేంద్రం వివరణ ఇచ్చిన తర్వాత మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్ కౌర్, న్యాయమూర్తి ఆర్.మహదేవన్- ‘ఒక భాషకు ప్రాచీన హోదా కల్పించడం కోసం కేంద్రం కొన్ని నిబంధనలను రూపొందించింది. ఆ మేరకు భాషాపండితుల అధ్యయనం ఆధారంగా తెలుగు, ఒరియా, కన్నడం, మలయాళ భాషలకు ప్రాచీన హోదాని ప్రకటించింది. దానిని మేము ధృవీకరిస్తున్నాం’ అంటూ తీర్పునిచ్చారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోవడం కుదరదని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది. తమిళ న్యాయవాది దాఖలు చేసిన ‘పిల్’ను చివరికి ఎలాగైతేనేం 2016 అక్టోబర్ 31న కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు.
అప్పటికే ఎనిమిదేళ్ళనాడు తమిళాన్ని ప్రాచీన భాషగా గుర్తించడంతో ఏడాదికి 10 నుంచి 15 కోట్ల కేంద్ర నిధుల్ని తమిళనాడు ప్రభుత్వం అందుకుంటోంది. కోర్టు తీర్పు వాయిదాలు పడుతుండడంతో తెలుగువారు దాదాపు 8 కోట్లు ని ధుల్ని నష్టపోయారనే చెప్పాలి. మనం ప్రాచీన హోదా కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నపుడే తమిళులు తమ కార్యాన్ని పూర్తిచేసుకున్నారు. మైసూర్‌లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్’ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్ళుగా కొనసాగుతున్న ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ క్లాసికల్ త మిళ్’ని 2008లోనే వేరు చేసి తమ రాష్ట్రానికి తీసుకుపోయి 75 కోట్ల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వ సంస్థగా తమిళులు నిర్వహించుకుంటున్నారు. ఆనాడు ‘పిల్’ మీద అప్పీలు చేసిన తెలుగు అధికార భాషా సంఘం ఇపుడు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా చీలింది. మనకి ప్రాచీన హోదా లభించినా, మన ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ క్లాసికల్ తెలుగు’ మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థతోనే ఉండిపోయింది.
తమిళులు ఈ కేంద్రం ద్వారా తమకి వచ్చే నిధుల్ని ప్రాచీన సాహిత్య పరిశోధనకు, అనువాదాలకు ఖర్చుచేస్తున్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ సంస్థ సంచాలకుడిని, ప్రణాళికా సహాయకుల్ని మిగిలిన సిబ్బందిని కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. ఇప్పటికీ తెలుగు, కన్నడ ప్రాచీన కేంద్రాలు మైసూర్‌లోనే ఉన్నాయి. వీటి కార్యకలాపాల్ని మైసూర్‌లోని భారతీయ భాషల కేంద్ర సంస్థే (్ళనిజజ) నిర్వహిస్తోంది. ‘ప్రాచీన కేంద్రాన్ని మరోచోటికి మార్చినా, ప్రాచీన భాష శోధనకు సంబంధించిన ప్రణాళికలను చేపట్టి అందుకు సంబంధించిన వివరాలను సమర్పిస్తే వాటికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. పరిశోధనలు జరపడంతోబాటు పరిశోధకుల్ని నియమించడానికి అవకాశం కలుగుతుంది. గొప్ప పరిశోధకులకు పురస్కారాలు ఇవ్వవచ్చు. ఇవన్నీ జరిగేట్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. తెలుగులో ఇంకా ఎన్నో ప్రచురణలతోబాటు అనువాద కార్యక్రమాలు, పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ జరగాలంటే ముందు ప్రాచీన కేంద్రానికి సంచాలకుడిని, ప్రణాళికా సహాయకుల్ని నియమించాలి. సలహా మండలిని ఏర్పరచాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించే ప్రయత్నాలు జరగాలి’’ అంటున్నారు విశ్వనాథం, రాళ్ళపల్లి సుందరంలాంటి పరిశోధకులు. ఇం దుకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ముందుకు రా వాలి. ఇక్కడ సంస్థని ప్రారంభించడానికి స్థలం, భవనం లాంటి సౌకర్యాలు కల్పించాలి. అందుకు భాషాభిమానులేమీ చేయలేరు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్నాం. కదలాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు’’ అంటున్నారు తె లుగు భాషోద్యమకారులు డాక్టర్ సామల రమేష్‌బాబు లాంటి తెలుగు భాషోద్యమకారులు.
ప్రాచీన హోదాకి సంబంధించిన అత్యున్నత కేంద్రం కోసం నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో వెయ్యి గజాల స్థలాన్నిస్తామని గత సంవత్సరం గిడుగు జయంతి సభ భాషాదినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కానీ కార్యరూపంలో ముందుకు కదలలేదు. తెలంగాణ తరఫున తెలుగు విశ్వవిద్యాలయ ఉప కులపతి, ఆంధ్రప్రదేశ్ తరఫున ఓ సంఘం ప్రతినిధులు మైసూర్ వెళ్లి పరిస్థితులన్నింటినీ పరిశీలించి వచ్చారు. ప్రాచీన భాషా పరిశోధనా కేంద్రం ఇచ్చేది తెలుగు భాషకి. ఇప్పుడు తెలుగు భాష మాట్లాడే రాష్ట్రాలు రెండు. ఈ సమస్యే- తెలుగు కేంద్రాన్ని తెలుగు రాష్ట్రంలోకి తీసుకురావడాన్ని జటిలం చేసింది.
ఈ నేపథ్యంలో గత వారం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావ్‌దేకర్- ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ప్రాచీన తెలుగుపీఠం ఏర్పాటు అంశాన్ని ఎవ్వరూ నా దృష్టికి తేలేదు. ఇప్పుడది మైసూర్‌లోనే ఉన్నట్లు కూడా తెలీదు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించడం తెలుగువారు ఉలిక్కిపడేట్లు చేసింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఓ సాహిత్య సభలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావుమాట్లాడుతూ, ‘2008 నవంబర్ 1న తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా ప్రకటించారు. తమిళం వాళ్ళు మాత్రం వేరు భాషలకు ప్రాచీన హోదా ఇవ్వవద్దు, మాదే ప్రాచీన భాషగా ఉండాలన్నారు. ఓ తమిళ అడ్వకేట్ అక్కడే హైకోర్టులో రిట్ వేశారు. ఇన్ని సంవత్సరాలుగా మనం యుద్ధం చేసి 2008లో మనకనుగుణంగా తీర్పుతెచ్చుకోవడం జరిగింది. మైసూర్ నుంచి తెలుగు భాషా కేంద్రాన్ని మన రాష్ట్రంలోకి తీసుకువెళ్ళడం అవసరమనే విషయాన్ని నేను మండలి బుద్ధప్రసాద్ లాంటివాళ్ళకు చెప్పాను. ఆ కేంద్రం నెలకొల్పడానికి మనవాళ్ళింతవరకూ స్థలానే్న నిర్ణయించలేదు. తమిళం వాళ్ళు చాలా ముందుకు వెళ్లిపోయారు. కన్నడం వాళ్ళూ కదిలారు. తమిళంలో రెండు, మూడుసార్లు ప్రపంచ తమిళ మహాసభలను నిర్వహించారు. దాదాపు 100 కోట్లకుపైగా గ్రాంట్‌ని పొందారు. వాళ్ళ విశ్వవిద్యాలయాల్లో క్లాసికల్ లాంగ్వేజ్ మీద పరిశోధనలు చేస్తున్నారు, స్కాలర్‌షిప్పులూ ఇస్తున్నారు. కానీ మనవాళ్ళు ఇలాంటి అవకాశాల్ని సద్వినియోగపరచుకోవడం లేదు. మనతోబాటే ప్రాచీన హోదా పొందిన కన్నడ భాషకి బెంగళూరులో కేంద్రానికి స్థలం ఇచ్చారు. నన్ను హెచ్‌ఆర్‌డి తరఫున కన్నడ కేంద్రానికి హెడ్‌గా వేశారు. తెలుగువాళ్ళు ఇంతవరకూ ఒక్క అడుగూ ముందుకు వేయలేదు, స్థల నిర్ణయమూ చేసినట్లు లేదు. ఇదీ మన ప్రాచీన భాషా కేంద్రానికి సంబంధించిన పరిస్థితి’’ అన్నారు.
అదే సభలో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప కులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ- ‘‘మన తెలుగు కేంద్రానికి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో స్థలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వంతోపాటు విశాఖ వాసులందరూ ప్రోత్సహిస్తే ఈ విషయంలో మనం చొరవ తీసుకొని ముందుకు కదులుదాం’’ అన్నారు. వ్యక్తులు, సంస్థలు ఎంతగా కృషి చేసినా తెలుగు పరిశోధనా కేంద్రాన్ని తెలుగు ప్రాంతానికి తీసుకురావడం కష్టం. రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటేనే ఆ పని జరుగుతుంది. మరి తెలుగు భాషాభివృద్ధికి పరిశోధనలకు, అనువాదాలకు తోడ్పడే ‘సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ తెలుగు’ రాష్ట్రాలలోకి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే తీసుకురాగలవు. త్వరలో తీసుకువస్తాయని ఆశిద్దామని ఊరుకోకుండా అందుకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడం అవసరం.

- వేదగిరి రాంబాబు సెల్: 93913 43916