మెయిన్ ఫీచర్

పుస్తకమే జ్ఞాన సరస్వతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమోస్తు వేద వ్యాస నిర్మిత ప్రతిష్ఠతాయై
నమోస్తు మహలక్ష్మీ, మహాకాళి సమేతాయై
నమోస్తు అష్ట తీర్థ జల మహోమాన్వితాయై
నమోస్తు బాసర క్షేత్ర విలసితాయై
ప్రకృతిలో ప్రతి అక్షరం తెలుసుకుంటే జ్ఞాన సంబంధమైనదే. చదువుకునే మనసు, తెలుసుకునే బుద్ధి చాతుర్యముంటే ప్రతి వ్యక్తి వక్తవుతాడు. నలుగురికి ఉపయోగపడతాడు. అతడు నాయకుడు కావచ్చు. ఉపాధ్యాయుడు కావచ్చు. అధికారి కావచ్చు. దేశ ప్రగతికి తోడ్పడతాడు. చదువు, బుద్ధి ఈ రెండు శ్రీ జ్ఞాన సరస్వతీ కటాక్షం వల్ల కలుగుతాయి. వ్యక్తి కోరికను బట్టి దేవి కటాక్షిస్తుంది. ఒక సరస్వతే మూడు కోరికల ప్రదాత. నవరాత్రి నారీమణి, పుస్తక వీణాధారిణి కృపాదృష్టియే సర్వులకు రక్ష.
బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతీ దేవి సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపుడైన వ్యాస భగవానునిచే ప్రతిష్టించబడింది. ఈమె జ్ఞాన దేవత కనుక జ్ఞానంకోసం బాసర క్షేత్రంలో అక్షరాభ్యాసం చేయిస్తారు. అక్కడికి వెళ్లినవారంతా జ్ఞానమేకాదు సర్వసంపదలను కోరుకుంటారు. ఆ తల్లి కటాక్షవీక్షణాలు ప్రసరిస్తే చాలు ముల్లోకాలకు అధీనం అవుతాయ. దేవీ దేవతలు ఎక్కడున్నా రస స్వరూపులే భావాగ్రహాలే.
చదవది ఎంత కలిగిన.. రసజ్ఞత ఇంచుక చాలకున్నా. ఆ చదువు నిరర్ధకంబు అని... చదువుకునే చదువులో శ్రద్ధలేకుంటే ఆ చదువు నిరర్దకంబు అదెలా అంటే వంట పదార్ధంలో ఉప్పులేనట్టుగా వుంటుంది. చదువులో శ్రద్ధ, గురుభక్తి ఈ రెండు వుంటే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. రామాయణంలో, నవ వ్యాకరణ పండితుడు శ్రద్ధ్భాక్తులు కలిగిన హనుమంతుడి మాట తీరు చెబుతాడు శ్రీరాముడు. మరో మాట కూడ భాగవతంలో బమ్మెర పోతన తెలియజేస్తాడు అది ఇలా వుంది.
చదవని వాడజ్ఞుడగు, చదివిన సద సద్విలేక
చతురత కలుగున్ చదవగవలయును జనులకు
వందల ఏళ్ల కిందట మహా కవి బమ్మెర పోతన చదువు అవసరం అనివార్యత ప్రాధాన్యత గురించి సరళంగా స్పష్టంగా చెప్పారు.
పుస్తకం హస్త భూషణం అని కూడా అన్నారు పెద్దలు. ఒకనాటి యువత నేటి మహానాయకులు వారు చదివిన పుస్తకాలపై చర్చించుకునేవారు. వారి చేతిలో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు కనిపించేవి. క్రమశిక్షణతో విద్యార్థులందరూ సర్వం దేవీ కటాక్షమని ఎంచి పుస్తకం పట్టుకుని తల్లీ నిన్ను దలంచి పుస్తకమున్ చేతబూనితిన్... భగవతీ, భారతి, సరస్వతీ అనే ప్రార్థనా పద్యాన్ని చదివి నమస్కరించి వారి చదువులు ఆరంభిస్తారు.
పుస్తకప్రియులు ఎవరైనా సరే కుల మతాలు కాని దేశ కాల పరిస్థితులో కానీ దేవీ కటాక్షం తప్పక వుంటుందని, అక్షర రూపంలో కనిపిస్తుందని ప్రతి మేధావి అంగీకరిస్తాడు. అక్షరాలు ఏవైనా కావచ్చు, భాష కూడా ఏదైనా కావచ్చు. దైవానికి అక్షర భేదం లేదు. క్షరం కానిది అక్షరం. అక్షరాల సమూహమే ఓ పుస్తకమవుతుంది. ఈ రోజుల్లోను ప్రపంచ వీక్షణకు పుస్తక పఠనం తొలిమెట్టు. జ్ఞానసరస్వతీ దేవిని పూజిస్తేచాలు జ్ఞానవాకిళ్లు తెరుచుకుంటాయ.
పుస్తకాలు ప్రతిభా పాఠవాలు నేర్పించే గురువులు. తెలియని విషయాలను విశదీకరించే మిత్రులు. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానంతోపోటు భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. అందుకే మన పెద్దలు పుస్తకమే జ్ఞానసరస్వతి అన్నారు.
పుస్తక పఠనంలో జ్ఞానసంపద ఎంతో వుంటుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకునే స్పృహ పెరుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది. ఊహా శక్తిని పెంచుతుంది. గమ్యాన్ని చేరుకోవాలనే పట్టుదల అలవడుతుంది. సామాజిక సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది. భిన్నంగా ఆలోచించే శక్తినిస్తుంది. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారం కనుక్కోగలరు. ఆకర్షణీయంగా మాట్లాడే నైపుణ్యం, సొంతమవుతుంది. స్వీయ విశే్లషణ సామర్ధ్యం మెరుగవుతుంది.
అక్షర జ్ఞానంవల్ల ఇన్ని ప్రయోజనాలు వున్నాయి. కనుక బుద్ధిబలం, యశోధైర్యం, నిర్భయత్వం, వాక్కుపటుత్వం, ధనలాభం, అధికార బలం కావాలనుకునేవారు అమ్మవారిని సరస్వతీరూపంగా భావించి పూజిస్తే చాలు ఇవన్నీ అమ్మ ప్రసాదిస్తుంది. ఈ సంవత్సరం హేవలంబి, హేవళంబి, హేమలంబ ముగ్గురమ్మల ఏకాత్మ భావన కలిసి వచ్చింది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిస్తే కొలువులు యువతకు కోరినవన్నీ వస్తాయని సంవత్సర ఫలితాలంటారు పండితులు.

- జమలాపురం ప్రసాదరావు