మెయిన్ ఫీచర్

తెరకెక్కనున్న విజేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితం నేర్పే పాఠాలు అరటి పండు ఒలిచిపెట్టినంత సులువుగా ఉండవు. ఒక్కొక్కసారి కఠినంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే వ్యక్తుల జీవితగాథలు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి. అందుకే వీరి జీవితగాథలను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా మెండుగా ఉంటుంది. ఈ ఆసక్తిని కథలుగా మలిచి వెండితెరపై మెరిపించే సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలే కాదు నటులు సైతం ఆసక్తి వీరి జీవితగాథల్లో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. సెలబ్రిటీల బయోపిక్ సినిమాలకు ఉన్న ప్రజాదరణ మరే సినిమాలకు నేడు లేదు. క్రీడారంగంలో సంచలనాలు సృష్టిస్తున్న సైనా నెహ్వల్, సానియా మీర్జా, పీవీ సింధూ, పుల్లెల గోపిచంద్‌ల బయోపిక్ సినిమాలపై ఇప్పటికే ప్రకటనలు సైతం వెలువడ్డాయి. వెండి తెరపై నిజ జీవితాలు మెరుస్తాయా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే వీరి జీవిత కథలు ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. సైనా నెహ్వాల్ పాత్ర కోసం శ్రద్ధాకపూర్ గట్టి కసరత్తే చేస్తోంది. ఇప్పటికే ఈ హీరోయిన్ నైనా నెహ్వాల్ కలిసి అనేక విషయాలను ముచ్చటించటం జరిగింది. ఈ స్పోర్ట్ పర్సనాల్టీలపై స్క్రిప్ట్ తయారుచేసే పనిలో నిమగ్నమవుతున్నారు.

గోపిచంద్ బయోపిక్

బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ పాత్రలో నటుడు సుదీర్ బాబు నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రొడ్యూసర్, డైరెక్టర్ ప్రవీణ్ ఈ ప్రాజెక్టు వర్క్ కోసం తీవ్ర కసరత్తే చేస్తున్నారు. నటుడు సుదీర్ బాబు, ప్రవీణ్ కలిసి ఈ సినిమాను బాగా తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గోపిచంద్ జీవితానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి వాస్తవికత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. బాలీవుడ్‌లో బాగ్ మిల్కా, క్వీన్, కహానీ చిత్రాలతో జీవితగాథలను తెరకెక్కించిన విక్రమ్ మల్హోత్ర సహకారంతో గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ చిత్రం అంతా గోపిచంద్ మీద ఉంటుంది. ఆటల్లో శిక్షణ ఇచ్చేందుకు ఆయన చేసే ఆలోచనలు, విజయాలు, ఓటమి ఎదురైనపుడు ఆయనలో కలిగే భావోద్వేగాలు, అనుకున్న లక్ష్యాన్ని సాధించటానికి పడే తపన, పోరాటం తదితర విషయాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. క్రీడాకారుల జీవితాల మీద సినిమాలు రావటం వల్ల భవిష్యత్తులు మరింత మంది క్రీడాకారులుగా ఎదగటానికి దోహదం చేస్తుందంటారు దర్శకుడు ప్రవీణ్.

స్క్రిప్ట్ దశలో సింధు బయోపిక్

చిత్ర పరిశ్రమలో బయోపిక్స్ సంస్కృతి వెల్లువెత్తడటం, దీనిపై ప్రతి ప్రేక్షకుడు ఆసక్తి కనబరుస్తుండంతో ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకున్నారు సోను సూద్. ఒలింపిక్స్‌లో సిల్వర్ పతకం సాధించిన పి.వి సింధూ బయోపిక్ తీస్తానని సోను స్వయంగా వెల్లడించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బయోపిక్ స్క్రిప్ట్ దశకు చేరుకుంది.

నిర్మాతగా మారినపుడు ఓ నటుడు ముందు స్క్రిప్ట్ తయారుచేసుకుని వెళ్లాలంటే ఎంతో హంగామా ఉంటుంది. మరి ఓ ప్రముఖ క్రీడాకారిణిపై స్క్రిప్ట్ తయారుచేయాలంటే ఆమె వ్యక్తిత్వానికి సంబంధించిన వివరాలన్నీ తెలుసుకోవాల్సి ఉంది. ఈ బయోపిక్ సంబంధించిన డ్రాఫ్ట్ రెడీ అయింది. స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాం.

-సోను సూద్

ఎన్టీయార్ బయోపిక్ అంటే చిన్నపిల్లల ఆట కాదు..

తెలుగు లెజండరీ నందమూరి తారక రామారావు బయోపిక్ వస్తున్నట్లు ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీయార్‌గా తానే నటిస్తున్నట్లు చెప్పటం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమకు దిక్చూచి అయిన ఎన్టీయార్‌పై సినిమా తీయటం అంటే చిన్న పిల్లల ఆట వంటిది కాదంటున్నారు బాలయ్య. ఇటీవలనే చెన్నై వెళ్లి తన తండ్రితో పనిచేసిన వారందరినీ కలవటం జరిగింది. ఆయన గురించి వివరాలు సేకరించాం. అలాగే బ్యూరోక్రాట్స్, స్నేహితులు, రాజకీయ నాయకులు తదితరులను కలిసి మంచి స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాం. మంచి సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు బాలయ్య వెల్లడించటం జరిగింది.

మనం కొట్టే ప్రతి షాట్ ప్రత్యర్థిపై విజయం సాధించాలనుకోవటం కష్టమే. ప్రతి షాట్ కోసం శక్తి మొత్తాన్ని ధారపోయాల్సిందే. ఆట గురించి పూర్తిగా తెలుసుకోండి. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత పరిపూర్ణత సాధిస్తారని సైనా చెప్పినట్లు శ్రద్ధాకపూర్ చెప్పారు.

ప్రతి షాట్ హిట్ కష్టమే

బ్యాడ్మింటన్‌లో మరో సంచలన క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ వస్తుంది. అయితే సైనా బిజీగా ఉండటం వల్ల దీనిపై ఎలాంటి ప్రకటన ఇంకా వెలువడలేదు. త్వరలో ఆమె నోటి నుంచి వెలువడే అవకాశాలు లేకపోలేదు. కాని ఈ బయోపిక్‌పై తెరవెనుక ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. సైనా క్యారక్టర్ చేసే శ్రద్ధాకపూర్ ఇటీవల హైదరాబాద్ వచ్చినపుడు సైనాను కలుసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఆమె సైనాతో కాసేపు టెన్నిస్ కూడా ఆడారు. సైనాను కలిసిన ఫొటోను శ్రద్ధాకపూర్ పోస్ట్ చేస్తే విపరీతమైన స్పందన కూడా వచ్చింది. అచ్చం సైనా సిస్టర్ వలే ఉన్నావని కామెంట్స్ రావటం ఎంతో ఆనందంగా ఉందని శ్రద్ధాకపూర్ సంతోషపడిపోతుంది. ఆటలోని ప్రాధమిక మెళకువలను సైనా నుంచి నేర్చుకున్నారు.

‘మా కుమార్తె సానియా మీర్జాపై సినిమా తీయటం వాస్తవం. చిత్ర నిర్మాతలు సానియాను కలిసి ఆమె జీవిత చరిత్ర గురించి అడిగారు. పరిణితి చోప్రా తన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చూపితే బాగుంటుందని సానియా కూడా అభిప్రాయపడుతుంది.

-నసీమా (సానియా తల్లి)

ఒక్కోసారి ఒకరి మీద చిత్రం తీస్తున్నామంటే ఆ చిత్రం ఆరంభం కాకముందే విపరీతమైన హైప్ సృష్టిస్తుంది. సానియా మీర్జా విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె బయోపిక్‌పై సినిమా వస్తుందంటే సర్వత్రా ఆసక్తి రేకెత్తింది. ఎవరు ఇందులో నటిస్తున్నారు. ఎవరు తీస్తున్నారనే ఉత్సుకత కలిగింది. టెన్నిస్ క్రీడాకారులు, ఆటను ఇష్టపడే అభిమానులు, సినిమా ప్రేమికులు ఇలా అందరూ అందాల సానియా మీర్జా బయోపిక్‌పై విపరీతంగా చర్చలు, ఊహాగానాలు జరిపారు. చివరకు సానియా మీర్జా మీడియా ఎదుట తన బయోపిక్ వస్తుందని వెల్లడించాల్సి వచ్చింది. సానియా పాత్రలో పరిణితి చోప్రా నటిస్తుందని అనుకుంటున్నారు.

చిత్రాలు..గోపిచంద్, * సింధు, * సైనా నెహ్వల్ *సానియా మీర్జా