మెయిన్ ఫీచర్

రంగుల తారకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ పండుగలలో దసరాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా ఈ పండుగును ప్రతి ఇంటా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. గోపికలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు దుస్తులు ధరించి చిన్ని కృష్ణుడితో ఆడిపాడారు. ఈ ఆనంద నృత్య తాండవ దృశ్యం మనకు దాండియా, గర్బా నృత్యాలలో కనిపిస్తుంది. అందుకే శరన్నవరాత్రులు తెచ్చే సందడి మాటల్లో చెప్పలేం. బొమ్మల కొలువులూ, దాండియా నృత్యాలూ, అమ్మాయిల కేరింతల మధ్య ప్రతి ఇల్లూ కోలాహలంగా ఉంటుంది. అటు సంప్రదాయాన్ని ఇటు ఆడంబరతనూ కనిపించేలా నవరాత్రి తొమ్మిది రోజులూ తొమ్మిది రంగుల్లో చీరలే కాదు పటియాలా, అనార్కలీ, పరికణీ,ఓణీ, లాంగ్‌స్కర్ట్, అంగార్ఖా-్ధతి వంటి డ్రెస్స్‌లను ఎంపిక చేసుకుంటారు. తొమ్మిది అవతారాల్లో దర్శనమిచ్చే అమ్మవారిని పూజించే మహిళలు సైతం ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రంగుల దుస్తులను ఎంపికచేసుకుని ధరిస్తారు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు ఈ సంప్రదాయాన్ని తప్పక పాటిస్తారు. ఒక్కొక్క రంగులో ఒక్కొక్క ఫలితం దాగి ఉంది. శక్తి ఆనందం, చైతన్యం మూర్త్భివించిన పార్వతీమాతను విద్య, ఆరోగ్యం, ఆయుష్షు, విజయం అందించమని ఏవిధంగా ప్రార్థిస్తామో వాటికి శుభ సూచికలుగా నిలిచే రంగులైన పసుపు, ఆకుపచ్చ, గ్రే, ఆరంజ్, వైట్, ఎరుపు, బ్లూ, పింక్, ఊదా రంగుల్లో మనకు నచ్చిని దుస్తులను ఎంపిక చేసుకుని ధరిస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. నవరాత్రి తొలిరోజునాడు పసుపు రంగును ఎంపిక చేసుకుంటారు. పసుపు ఉదయించే సూర్యుడికి సూచిక. మన జీవన గమనానికి కావల్సిన శక్తిని ఇచ్చే సూర్యుడి రంగు. ఆకుపచ్చ రంగు మానసిక శాంతిని ఇస్తుంది. గ్రే రంగు మనిషిని కూల్‌గా ఉంచుతుంది. అంతేకాదు మనసును బ్యాలెన్స్ చేసే శక్తి దీనికి ఉంది. నాలుగవ రోజు చతుర్థినాడు ఆరంజ్ రంగు వస్త్రాలను ఎంపిక చేసుకుంటారు. ఆరంజ్ రంగు సృజనాత్మకతను, ఉత్సాహాన్ని అందిస్తుంది. ఐదవ రోజు పంచమినాడు వైట్ కలర్ దుస్తులు వేసుకుంటే స్వచ్ఛమైన మనసు, శాంతి కలుగుతుంది. ఆరవ రోజు షష్టినాడు ఎరుపు రంగులో బంగారు రంగు ఎంబ్రాయిడరీ వేసిన చీర లేదా లెహంగా ధరిస్తే కాత్యాయనీ ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.
శక్తి, మానసిక వికాశం లభిస్తుంది. ఏడవరోజు సప్తమినాడు రాయల్ బ్లూ, లైట్ బ్లూ- ఈ రెండింటిలో ఏదైనా ఎంపిక చేసుకుని ధరిస్తే శక్తి, ఆధిపత్యం అనే ఫలితాలు దక్కుతాయి. అష్టమినాడు ధరించే పింక్ కలర్ వల్ల అందరి క్షేమాన్ని కోరుకునే లక్షణం అలవడుతుంది. తొమ్మిదవ రోజు నవమినాడు ఊదా రంగు లగ్జరీ, అధికారం, రాయల్టీ లక్షణాలకు చిహ్నం. ఈ రంగులో చీరగానీ, డ్రెస్స్‌లుగానీ ధరిస్తే ఈ సుగుణాలు దక్కుతాయనే నమ్మకం. ఏదిఏమైనప్పటికీ నమ్మకాలే మనిషిని ముందుకు నడిపిస్తుంటాయి. నవ్వుల సిరులను మోసుకువచ్చే నవరాత్రి ఉత్సవాల్లో లేటెస్ట్ ఫ్యాషన్‌కు తగ్గట్టుగా నేటితరం పైనపేర్కొన్న రంగుల్లో దుస్తులు ధరించి ముస్తాబయితే అచ్చం మీరు సినిమా తారకల వలే వెలిగిపోవటం ఖాయం.