మెయన్ ఫీచర్

ఉన్నత సంస్థల ఉత్థాన పతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నదీనాం సాగరో గతిః’ అన్నట్లు సినీ రంగంలో గ్లామర్ తగ్గి వార్థక్యం వస్తే రాజకీయ అరంగేట్రం చేయటం భారతదేశంలో పరిపాటి. అమెరికాలో కూడా రీగన్ తన సినీ పాపులారిటీని ఓట్ల కిందికి మార్చుకొని అమెరికా అధ్యక్షుడయినాడు. తమిళనాడులో ఎంజిఆర్, శివాజీ గణేశన్, జయలలిత, తెలుగునాట ఎన్‌టిఆర్, జమున, జయసుధ, చిరంజీవి, మురళీమోహన్, కృష్ణంరాజు, బాబూమోహన్, ఉత్తరాదిలో రాజ్‌బబ్బర్, జయప్రద, శత్రుఘ్నసిన్హా ఇలా ఎన్నో పేర్లు చెప్పవచ్చు.
కమలహాసన్ మంచి నటుడు అని మళ్లీ మళ్లీ చెప్పనక్కరలేదు. మరి ఇప్పుడాయన ఎందుకు పాలిటిక్స్‌లో అరంగేట్రం చేస్తున్నాడు? సంపాదన కోసమేనా? కేంద్రంపైన భారతీయతపైన యుద్ధం ప్రకటించి అరవింద్ కేజ్రీవాల్ అనే న్యూఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపరునితో చేతులు కలపడం ద్వారా ఈయన ఉత్థానం పతనదిశకు మరలింది. రజనీకాంత్, పవన్‌కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు త్వరలో తేలిపోతుంది. ‘అడ్డం వచ్చిన వారిని అడ్డంగా నరుకుతా’ అనిన రాములమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది?
చాణుక్యుడు రచించిన అర్థశాస్తమ్రు అందరికీ సుపరిచితమే. ఐతే ఆయన నీతి శాస్తమ్రు అనే మరొక గ్రంథం కూడా వ్రాశాడు. ఇది ఎక్కువమందికి తెలియదు. ‘వినాశకాలే విపరీతబుద్ధి’ అనే నీతి ఈ గ్రంథంలోనిదే. ఒక వ్యక్తి లేదా సంస్థ తన పతనదశకు చేరుకుంటున్నపుడు వారికి వికృతబుద్ధులు భగవంతుడు పుట్టిస్తాడని దీని అర్థం.
2016 ఏప్రిల్ 23 నాడు అగర్తలాలో ఒక సంఘటన జరిగింది. పండిత రవిశంకర్ శాంతిదూతగా ఐసిస్ వార్షిక చర్చలకు ఆహ్వానం పంపాడు. అందుకు సమాధానంగా వారు తలలేని మొండెం ఫొటోను కానుకగా పంపించారు. అంటే హత్యారాజకీయాలే తమ లక్ష్యం, కాని శాంతి చర్చలు కావు అని వారు ప్రతీకాత్మకంగా చెప్పారు. గౌతమబుద్ధుడు పుట్టిన భూమి మీదనే అబుబకర్ బాగ్దాదీ ఎలా పుట్టాడు? ఈ ప్రశ్నకు ఓ తత్త్వవేత్త సమాధానం చెబుతాడు. ఐసిస్, లష్కరే తోయిబా, ఇత్తెహాదుల్ మజ్లిస్, సిమి, అల్‌ఖైదా, మావోయిజం వీరంతా లక్ష్యసాధనకు హింసను ఆశ్రయిస్తున్నారు. ఐసిస్ సిరియాలో తాత్కాలిక విజయాలు సాధించిన మాట నిజమే. కాని ఇవాళ నాటో దళాలు ఐసిస్ కార్యకర్తలను వెంటబడి వేటాడుతున్నారు. మోసిల్ నగరం ఐసిస్‌నుండి విముక్తమయింది. సుప్రీంకోర్టు లాయరు షబ్‌నంలోనీ మాట్లాడుతూ ‘మా కాశ్మీరులో నిరుద్యోగ విద్యార్థులు ఐసిస్‌లో చేరుతున్నారు’ అని టివిలో చెప్పడం చూచాను. అంటే యువత ఉద్యోగాలు లేక ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుపెట్టాలని ఈమె సూచిస్తున్నదా?
1975లో శ్రీమతి ఇందిరాగాంధీ అకారణంగా దేశంలో ఎమర్జెన్సీ విధించింది. అలహాబాదు హైకోర్టు ఆమె ఎన్నిక (లోక్‌సభకు) చెల్లదు అని తీర్పు వెల్లడించింది. అంతే, మొత్తం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టింది. జూలై 1975 సాయంత్రం జయప్రకాశ్ నారాయణ్‌ను అరెస్టు చేసినపుడు ఆయన ‘వినాశకాలే విపరీతబుద్ధి’ అన్నాడు. ఆ తర్వాతి చరిత్ర పాఠకులందరికీ తెలుసు. సరిగ్గా సోనియా గాంధీ రాజకీయ పతనానికి ముందు ఇలాంటి విపరీతబుద్ధులు పుట్టాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి సోనియాగాంధీని, మన్మోహన్‌సింగ్‌ను 2010లో కలిశాడు. ‘మీ విపరీత ప్రవర్తనవల్ల కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో తుడిచిపెట్టుకొని పోతున్నది’ అని హెచ్చరించాడు. ఐనా ఆయన మాటను ఆమె వినలేదు. పి.చిదంబరం హోంమంత్రి అయినాడు. కార్తి యధాశక్తి దేశాన్ని దోచుకొని హవాలా, మనీలాండరింగ్ మార్గాల్లో సింగపూర్, మలేసియా, జర్మనీ వంటి దేశాలకు డబ్బు తరలించారు. సోనియాగాంధీకి ఈ విషయాలు తెలిసినా దొంగకు తేలుకుట్టినట్లు కిక్కిరుమనలేదు. ఎయిర్‌సెల్ మాక్సిన్ దుర్మార్గాల నుండి అన్నీ ఇప్పుడు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి.
ఇక మాలెగాం బాంబు పేలుళ్ళలో అమీన్ అజ్మల్ వంటి పాకిస్తానీ ఉగ్రవాదులు పట్టుబడితే వారిని మెల్లగా పాకిస్తాన్‌కు పంపించి ఆ కేసుల్లో కల్నల్ పురోహిత్, అసీమానంద, సాధ్వీ ప్రజ్ఞలను ఇరికించాడు. రాహుల్ గాంధీ, చిదంబరం, దిగ్విజయ్‌సింగ్‌లు కలిసి ‘కాషాయ ఉగ్రవాదం’ అనే పదం సృష్టించారు. అంటే హిందూ ఉగ్రవాదం. ఐసిస్ కన్నా ప్రమాదకరమైనది అంటూ ఎన్నికల విజయాల కోసం ప్రచారం చేశారు. ఇదంతా వినాశకాలే విపరీతబుద్ధీ అనే సామెతను గుర్తుకుతెస్తున్నది.
మమతాబెనర్జీ మొన్న (సెప్టెంబర్ 17) కలకత్తాలో దుర్గాపూజపై నిషేధాజ్ఞలు విధించడం, కామ్రేడ్స్ కాళీమాతను అశ్లీల భాషలో నిందించటం అందరికీ తెలిసిందే. వీళ్లు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే మాల్దా సరిహద్దులోని మైనారిటీ ఓట్ల కోసం.
2016 ఏప్రిల్ నెల 22వ తేదీ ఒక సంఘటన జరిగింది. తమిళనాడులోని ఉదకమండలంలో ఒక చర్చి ఉంది. అంలో జోసఫ్ జయపాల్ అనే బిషప్ ఉన్నాడు. ఈయన అమెరికాకు వెళ్లి ఒక మైనర్‌ను రేప్ చేశాడు. అందుకు అమెరికన్ కోర్టు శిక్ష విధించింది. వాటికన్ కోపగించింది. కాని ఇండియాకు రాగానే జోసఫ్ జయపాల్‌కు ఊటీ చర్చి మద్దతు పలికింది. ఇది తగునా?
ఆశారాం బాపు, రహీంబాబాలు, నిత్యానంద స్వాములు హైందవ ధర్మానికి అపకీర్తి తెచ్చారు. పాలకొల్లు వద్ద పరిశుద్ధ బాబు లైంగిక వేధింపులు చేశాడని వార్త వస్తే సరేలే అని ఊరుకున్నారు. రాం రహీం డేరాబాబా ఒక హంతకుడు. ఐనా పది లక్షలమంది శిష్యులున్నారు. ఇదెలా జరిగింది? సత్యము, అహింస, త్యాగము వంటి దివ్య సిద్ధాంతాల ప్రాతిపదికగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మన తాత తండ్రులంతా తాము కాంగ్రెసు పార్టీ సభ్యులం అని చెప్పుకోవడానికి గర్వపడేవారు. మొత్తం జాతి రాట్నం వడికి మాంచెస్టర్, గ్లాస్కో మిల్లులు మూతవేయించింది. అలాంటి మహాసంస్థ నేడు ఏమయింది? మహాత్మాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ యుగానికి చేరేసరికి ఎలా వికృతి చెందిందో గమనించాలి.
‘కాంగ్రెస్ ముక్త భారత్’ కావాలి అని నరేంద్ర మోదీ పిలుపునిస్తే ‘హిందూ ముక్త భారత్ కావాలి’ అంట్నుది కాంగ్రెస్. 2017 సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో ఒక కాంగ్రెస్ శిక్షణాశిబిరం జరిగింది. ఆ పార్టీ ఎంపి శశిధరూర్ మాట్లాడుతూ ‘న్యూఢిల్లీ జవర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని కన్హయ్య కుమార్ అనే విద్యార్థి నాయకుడు భగత్‌సింగ్‌లాంటివాడు’ అని పోల్చాడు. భగత్‌సింగ్ బ్రిటీషువారికి వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడాడు. మరి కన్హయ్య కుమార్ మాటేమిటి? ఇతడు చైనా గూఢచారిగా ఢిల్లీలో పనిచేస్తున్నాడు. భారతదేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలి అంటున్నాడు. మణిశంకర్ అయ్యర్‌కు స్వాతంత్య్ర వీర దామోదర్ సావర్కర్ పేరు చెపితే అసహ్యం. కారణం సావర్కర్ 1940 ప్రాంతంలో హిందూ మహాసభ అనే సంస్థ నాయకుడు కావటం. ఈయనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు తమ సంస్థ నుండి బహిష్కరించలేదు? నరేంద్ర మోదీ ఈయనమీద ఎందుకు చర్య తీసుకోలేదు?
మహాత్మాగాంధీ, మహదేవ్ దేశాయ్, మదన్‌మోహన్ మాలవీయ, లోకమాన్య తిలక్ వంటి మహాపురుషులున్న పార్టీ ఇవ్వాళ శశిధరూర్, మణిశంకర్ అయ్యర్‌లు, దిగ్విజయ్‌సింగ్‌లు, దేశద్రోహులు మిగిలారు. అరుంధతీరాయ్ వామపక్ష ఉగ్రవాద రచయిత్రి. ఆమె అమెరికాకు పోయి ఇండియాలో అసహనం పెరిగిందనీ, క్రైస్తవులకు రక్షణ లేదని ప్రచారం చేసి వచ్చింది. ఈమధ్య రాహుల్ గాంధీ అమెరికా వెళ్లినపుడు ఇలా అన్నారు. ‘‘ప్రపంచంలోని అన్ని ఉగ్రవాదాలకన్నా హిందూ ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైనది’’. అంతేకాదు సెప్టెంబర్ 2017లో అమెరికాలో ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ ‘ఆనువంశిక రాజకీయాలను’ సమర్థించాడు.
హర్యానాలోని పానీపట్‌వద్ద సంఝౌతా ఎక్స్‌ప్రెస్ (2007) విధ్వంసంలో 68 మంది మరణించారు. ఆ సందర్భంలో ఒక పాకిస్తానీ దొరికాడు. అతని పేరు అజ్మల్ అలీ. అతనిని యుపిఎ ప్రభుత్వం 9 రోజులలో పాకిస్తాన్‌కు పారిపోయేటట్లు చేసింది. ఇందుకు పి.చిదంబరం, దిగ్విజయ్‌సింగ్, సుశీల్ కుమార్ షిండే సహకరించారు అని ఆరోపణ. ఇది నిజమేనా? అంతేకాదు, ‘హిందూ టెర్రర్’ అనే నినాదం తీసుకువచ్చారు. ఇది భావ్యమా? పాకిస్తాన్ పట్టుకొన్న కులభూషణ్ యాదవ్‌ను ఎన్‌డిఎ ప్రభుత్వం ఇప్పటికీ విడిపించలేకపోయింది. ది హేగ్ అంతర్జాతీయ కోర్టు ఆమధ్య తన జడ్జిమెంట్‌లో భారత్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది కూడా?
మాలెగాం అంశంపై విచారణ జరుపుతున్న హేమంత్ కర్కారేను ఎవరు చంపారు? ఆ తర్వాత రఘువంశీని యుపిఏ నియమించింది. అతడు తన రిపోర్టులో సంఝౌతా ఎక్స్‌ప్రెస్ దుర్మార్గం పాకిస్తానీయుల పనేనని తేల్చాడు. మక్కా మసీదు (హైదరాబాద్) బాంబు దాడికి సామ్యం వుందని తేల్చారు. ఐనా సరే వసీన్ పఠాన్ (ఎంఐఎం) హిందూ టెర్రరిజం గురించి మాట్లాడుతున్నాడు. హిందువుల్లో టెర్రరిస్టులు ఉంటే సాక్ష్యాధారాలు చూపి శిక్షించవచ్చు. ఎందుకంటే మన దేశంలో ఒక రాజ్యాంగమూ ప్రజాస్వామ్యమూ ఉంది.
1947లో అంజుమన్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే ఉగ్రవాద సంస్థ ఆనాటి నిజాం రాష్ట్రంలో ఉండేది. వీరు చేసిన దుర్మార్గాలు, ఆలయ విధ్వంసాలు తెలంగాణ కొత్త ప్రభుత్వం పాఠ్యాంశాలుగా చేర్చి ఉండవలసింది. అలాకాక అంజుమన్‌కు మరో రూపమైన ఎంఐఎంతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం దేనిని తెలియజేస్తుంది? 1947లో బట్టలు విప్పించి బతకమ్మలు ఆడించిన ఘట్టాలు వందేమాతరం రామచంద్రరావుగారి గ్రంథంలో చూడండి.
అన్నా హజారే మహోన్నత ఆదర్శాలతో స్థాపించిన సంస్థలో పనిచేసిన అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా అయినాడు. మహమ్మద్ ప్రవక్త బోధించిన వాహిబ్ భారుూచారా ఎక్కడ? ఈ ఐసిస్, లష్కరే తోయిబాల ఉగ్రవాదం ఎక్కడ? సున్నీలు, సూఫీలు, షియాలు, వౌల్వీలు కాస్త ప్రశాంతంగా కూర్చొని ఆలోచించాలి.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్