మెయిన్ ఫీచర్

మనసంతా పువ్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈమె చేతిలో ఏ పువ్వు వాడదు * పూల సంరక్షణ పేటెంట్ పొందిన తొలి భారతీయురాలు
* హైదరాబాద్ మహిళా ప్రొఫెసర్ అరుదైన ఘనత

రెక్కలు విచ్చుకున్న పూలు సువాసనలతో.. అందాలతో మైమరిపిస్తుంటే ఏ మగువైనా పరవశించకుండా ఉండదు. విప్పారిన పూరేకులు వాడిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. కాని ఆ ఆశ నెరవేరదని తల్లడిల్లుపోతుంటాం. కాని ఈ కనక మహాలక్ష్మి చేతిలో ఏ పువ్వు వాడిపోదు. నిర్మలమైన ప్రేమకు, మదిలోని భావాలకు వారధిగా నిలిచేటట్లు నిత్యం తాజాగా ఉంచేలా చేయటం మహాలక్ష్మిరెడ్డికి సాధ్యం. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ఏ పువ్వూ తన ప్రాణాన్ని తీస్తున్నారని విలపించకుండా లియోఫిలసేషన్ సాంకేతిక పరిజ్ఞానంతో పూలను తాజాదనంతో ఉంచుతున్నారు. ఎండాకాలమైనా.. వానాకాలమైనా.. ఎన్ని సంవత్సరాలైనా నిత్యం తాజాగా పూలను సంరక్షించే టెక్నిక్‌పై పేటెంట్ హక్కును పొందిన తొలి భారతీయురాలు. ఫ్లొరల్ ప్రిజర్వేషన్ ఫ్రీజీ -డ్రైయింగ్ టెక్నాలజీ ద్వారా పూలను సంరక్షించే విధానంపై పేటెంట్ హక్కు పొందారు. ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ప్రయోగాలకు దక్కిన ఫలితం ఇది. శాస్ర్తియ పద్ధతులతో పువ్వులను ఏళ్లతరబడి తాజాగా ఉంచుతున్న ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ కృషి తెలుసుకుందాం.
పూలంటే ప్రాణం
హైదరాబాద్‌లోని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ మహాలక్ష్మి రెడ్డికి చిన్నప్పటి నుంచి పూలు అంటే ప్రాణం. వాటిని చూస్తూ ఎంతో ఆనందాన్ని పొందేవారు. 3మాతృదినోత్సవం సందర్భంగా మా అమ్మకు పూలగుత్తి ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేదాన్ని. ఆ పూలగుత్తిలోని పూలు కొన్నిరోజులకు ఎండిపోయేవి. దీంతో ఎంతో బాధపడేదాన్ని. ఆనాడే అనుకున్నాను. ఈ పూలను నిత్యం తాజాగా ఉండాలంటే ఏమి చేయాలి అని, ఈ అంశంపైనే నా ఆలోచనలు పరిభ్రమించేవి.
అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం
3హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌కు వెళ్లాను. ఈ ఎగ్జిబిషన్ 1998లో జరిగింది. ఓ స్టాల్‌లోని పూలు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి. ఈ పూలన్నీ తాజాగా ఉండాలంటే ఏమి చేయాలి అని తీవ్రంగా ఆలోచించి ప్రయోగాలు చేయటం మొదలుపెట్టాను. పూల సంరక్షణపై ఏర్పడిన మక్కువే ప్రయోగాల వైపు నడిపించింది. 2008 నుంచి పరిశోధనలు చేయటం ఆరంభించాను. యూనివర్శిటీవారు కూడా నాలుగేళ్ల సమయాన్ని పరిశోధనల కోసం అనుమతి ఇచ్చారు. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క జాతికి చెంది ఉంటుంది. వాటి రంగు, వాసన వేరువేరుగా ఉంటాయి. వాటికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటే పూలు ఎండిపోకుండా ఉంటాయి. వాస్తవానికి పువ్వులు కొన్నిరోజులకు ఎండిపోతాయి. ఎంత నిల్వచేసినా వాడిపోకుండా ఉండవు. కాని మేము లియోఫెరిజర్ పద్ధతిలో నిల్వచేస్తాం. ఈ విధానంలో ముందు తాజా పూలను సేకరిస్తాం. ప్రీజ్ చేస్తాం. సాంకేతిక పద్ధతిలో రేకుల రంగూ, రూపూ, వాసనా కోల్పోకుండా ఆరబెడతాం. ఇలా మైనస్ డిగ్రీల నుంచి పువ్వుల రేకులను ప్రాసెస్ క్రమంలో వాడిపోకుండా లియోఫెలిసేషన్ ద్వారా ప్రిజర్వ్ చేస్తాం. ఇలా చేసేటప్పుడు పూవు తీరును బట్టి కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది.2
అలుపెరగని ప్రయోగాలు
పూల సంరక్షణ కోసం మహాలక్ష్మి చేసిన ప్రయోగాల ప్రాజెక్టుకు సైన్స్ అండ్ టెక్మాలజీ సంస్థ నిధులు సమకూర్చింది. 2013లో ఈ ప్రాజెక్టు వర్క్ ప్రారంభించగా త్వరలోనే పూర్తిచేశారు. పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసుకోవటం, వెనువెంటనే ఇవ్వటం జరిగింది. ఓర్పు, సహనం ఉంటేనే ఇలాంటి ప్రయోగాలు ఫలవంతమవుతాయి. మహలక్ష్మి రెడ్డి కూడా ఈ పరిశోధనల కోసం ఎంతో కష్టపడ్డారు. యూనివర్శిటీ ఇచ్చిన అవకాశాన్ని వృధా చేయకుండా ఎంతో కష్టపడి పనిచేసి తన సత్తా చాటారు. పరిశోధనల సందర్భంగా రిఫరెన్స్ కోసం సరైన వనరులు ఉండేవి కావు. చెన్నైలో లెబొరెటరీ, యంత్రాలు ఉండేవి. చెన్నైకి వెళ్లి వచ్చే సందర్భాల్లో వ్యయప్రయాసలకు గురయ్యేవారు. లియోఫెలిసెషన్ ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేయమని ఓ కంపెనీని అడిగినా తొలుత వారు తిరస్కరించారు. కాని మహాలక్ష్మిరెడ్డి ప్రయోగాల కోసం పడుతున్న తపన, కృషిని గుర్తించిన అదే కంపెనీ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విధంగా ఎన్నో కష్టాలకోర్చి చేసిన ప్రయోగాలు ఫలవంతం కావటంతో నేడు తులిప్, బర్డ్‌ఆఫ్ ప్యారడైజ్, గులాబీ వంటి ఎన్నోరకాల పూలను ప్రిజర్వ్ చేసి తాజాగా అందిస్తున్నారు. ఇలా ప్రత్యేక పద్ధతుల్లో భద్రపరిచిన పూలతో అందమైన పూల బొకేలను తయారుచేసి స్నేహితులకు, బంధువులకు కానుకలుగా అందించవచ్చు. ఇటీవలనే రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డైరక్టరేట్ ఆఫ్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఒడిసా సంస్థలు సైతం మహాలక్ష్మిని సంప్రదించి పూలను ప్రిజర్వ్ చేసేందుకు సంప్రదించాయి. ఇలా ప్రాసెస్ చేసిన పూలను తాము మ్యూజియంలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పటం జరిగింది. పూజ, వేడుక ఏదైనా తమ గొంతు కోసి ప్రాణాలు తీస్తున్నారని విలపించే పువ్వులు నేడు మహాలక్ష్మిరెడ్డి చేసిన కృషి వల్ల తాజాగా నవనవలాడుతూ నవ్వులు చిందుస్తున్నాయి.
నిర్మలమైన ప్రేమకు గుర్తు పువ్వులు. మనలోని భావోద్వేగాలకు ప్రతీకలుగా నిలిచే పూల ఆయుష్షును, జీవితాన్ని పెంచుతున్నాను. దీనివల్ల పూల ప్రేమికులు మధురమైన జ్ఞాపకాలను పొందగలరు.
-మహాలక్ష్మిరెడ్డి

టి.ఆశాలత