మెయిన్ ఫీచర్

దివ్యంగా దీపాల పండక్కి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపాల పండుగ వేళ సంప్రదాయ వస్త్రశ్రేణికి అమ్మాయిలు ప్రాధాన్యం ఇస్తారు. చీరలను సందర్భానుసారంగా ఎంచుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి సమయంలో డిజైనర్ చీరలను ఎంచుకుంటే మంచిది. చీరలూ, వాటి డిజైన్లు, రంగులతో పాటు వాటిపై ధరించే బ్లవుజులు విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. సౌకర్యమైన డిజైన్లలోనే కుదిరినంత ట్రెండీగా కుట్టించుకునే ప్రయత్నం చేయాలి. లేలేత రంగుల్లో తేలికగా ఉండే ఈ చీరలు ఆకట్టుకునే రంగుల్లో.. ఆహ్లాదకరమైన డిజైన్లలో సొగసుకీ, సౌకర్యానికి పెట్టింది పేరు. కాటన్ సిల్క్ చీరకు బంగారు బోర్డర్ చీర కుచ్చిళ్లలో దోబూచులాడుతూ అందంగా కనిపిస్తుంది. పూజకు లేదా పండుగ వేళ ఉదయం వేళ చేసే ఏ వేడుకకైనా ఈ చీర బాగుంటుంది. బంగారు బోర్డర్ వల్ల సొగసుగా కనిపిస్తారు. ఈ చీర మీద ముత్యాల నెక్లెస్, డాగ్గింగ్ ఇయర్ రింగ్స్ ధరిస్తే క్లాసీ లుక్ సొంతమవ్వడం ఖాయం. అలాగే డిజైనర్ చీరలు రెండు రంగుల కలబోత. హెవీ డిజైన్లు లేకండా సింపుల్‌గా కనిపిస్తాయి.
రెండు రంగులు మేళవించటం వల్ల ఇలాంటి చీరలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చూడచక్కని బోర్డర్ ఉంటాయి. పండుగనాడే ఇతర ఫంక్షన్లలోనూ ఈ చీరలు అమ్మాయిలకు సౌకర్యవంతంగా ఉంటాయి. డిజైనర్ టచ్ ఉన్న క్రేఫ్ చీరలు కట్టుకుంటే హుందాగా కనబడతారు. సింపుల్‌కు పెట్టింది పేరైన ఈ చీరలు మెయంటెనెన్స్ కూడా మిగతా చీరల్లా కాదు. వీటిల్లో ఆర్ట్‌ప్రింట్ చీరలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే బాలీవడ్ భామలు సైతం డిజైనర్ చీరల పట్ల ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అవార్డు ఫంక్షన్లలోనూ, ప్రమోషన్ల ఈవెంట్ల కోసం బాలీవుడ్ హీరోయిన్లు డిజైనర్ చీరలనే కట్టుకుంటున్నారు.
పొడవైన హియర్ రింగ్స్, హైహిల్స్ వేసుకుంటే ఈ చీరల్లో కనిపించే సొగసు మరెందులోనూ ఉండదు. అందుకే వయసుతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా అందరూ డిజైనర్ చీరలను ఇష్టపడతున్నారంటే అతిశయోక్తి కాదు.