మెయిన్ ఫీచర్

ఆడపిల్ల జీవితాల్లో వెలుగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్ల పుడితే భారం.. ఇక ఆ పిల్లకు చదువంటే అనవసర ఖర్చు..పసితనం ఛాయలు పోకుండానే పెళ్లి..ఇలా ఎన్నో సమస్యలు తారసపడుతుంటాయి. కొందరు మాత్రమే వీటిపై స్పందిస్తారు. అటువంటి కోవకు చెందిన అమ్మాయే షాలిని చౌహాన్. ఇంట్లో మగపిల్లలకు తిండిపెట్టినట్లు వారికి కడుపునిండా తిండపెట్టకుండా బడికి పంపే బదులు పెళ్లి చేసి పంపిస్తే పోలా అని ఆలోచించే తల్లిదండ్రులకు సింహస్వప్నం ఈ పందొమ్మిదేళ్ల షాలిని. కుదరదు నువ్వు ఇలా సామాజిక సేవ అంటూ సమయాన్ని వృథా చేయటం తగదు అని తల్లిదండ్రులు అడ్డుచెప్పినా.. ఆమె చేసిన పోరాట ఫలితమే నేడు ఆ గ్రామంలో ప్రతి ఆడపిల్ల బడికి వెళుతుంది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని పట్రియాచల్ గ్రామంలో షాలినీ చౌహాన్ అనే యువతి బాలకార్మిక, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటానికి తెరలేపింది. ఆమె పోరాటానికి ఆదిలో ఎన్నో ఇబ్బందులే ఎదురయ్యాయి. పదకొండేళ్లకే ఓ ఎన్జీఓ సంస్థలో చేరి సేవలందిస్తున్న షాలినీ చౌహాన్ బాల్య వివాహాలపై రూపాందించిన ఓ వీడియో ఆమెను ఈ సమస్యపై పోరాడేలా చేసింది. గ్రామంలో ప్రతి ఆడపిల్ల పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి. యుక్త వయసు వచ్చిన తరువాతే పెళ్లి చేయాలంటే చైతన్య పోరాటమే సరైన మార్గం అని భావించింది. ఇందుకోసం ఒక టీమ్‌ను ఏర్పాటుచేయాలని భావించింది. తన స్నేహితులతో ఆమె ఓ టీమ్‌ను ఏర్పాటుచేసింది. తొలుత ఈ టీమ్ సభ్యురాళ్లు గ్రామంలోని 2500 మంది పిల్లల జనన ధృవీకరణ పత్రాలను సంపాదించారు. ఇంటింటికి వెళ్లి ఆ పిల్లలు ఏమి చేస్తున్నారో ఆరా తీయటం ఆరంభించారు. ఎవరైనా పిల్లలను స్కూలుకు పంపకపోయినా.. లేదా చిన్న వయసులోనే పెళ్లి చేసినా తెలుసుకుని అడ్డుకోవటం ప్రారంభించారు. పనిలో పెట్టిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేవారు. ఇలా తమ ప్రయత్నాలు ఫలవంతం కావటానికి వారు గ్రామ పెద్దల సాయమే కాదు జిల్లా అధికారుల సాయం కూడా తీసుకునేవారు. అర్ధరాత్రి అని చూడకుండా ఆమె పోలీసుస్టేషన్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయాలకు సైతం వెళుతుంది. ఈ అమ్మాయి తమతో మాట్లాడటం ఏమిటి అని ఆ అధికారులు భావించరు. ఎందుకంటే షాలినీ చేసేది మంచి పని కాబట్టి వారు కూడా సహకరించేవారు. అందుకే ఆ గ్రామంలో ఏ ఆడపిల్ల పాఠశాలకు వెళ్లలేదని బాధపడదు. అపుడే తనకు పెళ్లి చేసేస్తారేమో అని భయపడదు. ఓ ఆడపిల్ల సమస్య మరో ఆడపిల్లకే తెలుస్తుంది అని నమ్మే షాలినీ భవిష్యత్తులో పిల్లలు, మహిళల హక్కులపై పనిచేస్తానని చెబుతుంది. సరదాగా జీవితాన్నా ఎంజాయ్ చేయాలనుకునే యువతకు షాలినీ ఆశయం అనుసరణీయంకావాలని కోరుకుందాం.

నువ్వ చదువుకున్నట్లు మా పిల్లలను చదివించమనే అడిగే హక్కు నీకు లేదని చాలామంది తల్లిదండ్రులు అనేవారు. వారందరికీ ఒకే సమాధానం చెప్పేదాన్ని. పిల్లలను చదివించకపోయినా.. బాల్య వివాహం చేసినా అది సామాజిక సమస్య అవుతుందని22 హెచ్చరించేదాన్ని. గ్రామం లో బాల్యవివాహలు జరగకూడదని ఎంతగానో ప్రయత్నించాను. అయినప్పటికీ మా కళ్లెదుటే ఓ బాల్య వివాహం జరిగింది. అపుడు నేను, నా టీమ్ సభ్యులు చాలా నిరాశకు గురయ్యాం.

-షాలినీ చౌహాన్