మెయిన్ ఫీచర్

దీపారాధనతో లక్ష్మీకటాక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దల కోసం దీపం

ఈ రోజు నరకంవల్ల భయం ఉండకూడదని అభ్యంగన స్నానాలు చేసి పితృతర్పణాదులు సమర్పించి, దీపాలు వెలిగిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్నపుడు కృష్ణపక్ష చతుర్దశి అమావాస్య ప్రదోష కాలంలో కాగడాలు చేత బట్టుకుని పితృ దేవతలకు దారి చూపాలి. మరణించి పితృలోకాలకు వెళ్లిన మన పెద్దల్ని తలచుకుని ఒక్కొక్కళ్ల పేరిట ఒక్కో దీపాన్ని వెలిగించాలి. పితృదేవతలు స్వర్గానికి వెళ్ళేలా చేయమని దేవుడిని వేడుకుంటూ పెట్టిన ఈ దీపాలు వారికి దారి చూపేలా వెలుగులివ్వాలని కోరుకోవాలి. నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని దీపరాత్రిగా పేర్కొంటారు. నిజానికి నరకచతుర్దశిని ఎకాలరాత్రి2 అనీ, దీపావళీ అమావాస్యను ఎమహారాత్ర2 అని శాస్త్రం పేర్కొంటుంది. ఉత్కళ, వంగ రాష్ట్రాల్లో కొన్నిచోట్ల ఈ రోజున మహాకాళీ పూజను పెద్ద స్థాయిలో నేటికీ నిర్వహిస్తుంటారు. ఈ నరక చతుర్దశి ప్రాతఃకాలాన నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసినవారికి నరక భయముండదని పురాణ వచనం. ఎందుకంటే అమావాస్యనాడు తలంటుకోకూడదంటారు. నరక చతుర్దశి నాటి సాయంత్రం కనీసం ఐదు ప్రదేశాల్లో దీపాలు ఉంచాలి. ఇంటి దీపం, ధాన్యపు కొట్టం, రావిచెట్టు మొదట, వంటిల్లు, బావి వద్ద దీపాలు వెలిగిచాంచాలి. ఈ దీపాల దర్శనంవల్ల నరక తిమిరం ఉండదు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామ లక్ష్మీం, నాశయామ్యహం, అభూతిమసమృద్ధించ, సర్వాం నిర్గుదమే గృహాత్- అంటే ఆకలి దప్పికలతో కృశించేదైన జ్యేష్ఠాదేవిని నేను నాశనం చేస్తాను. నా గృహం నుండి అభాగ్యాన్ని తొలగించి అనుగ్రహించు అని లక్ష్మీదేవిని నరక చతుర్దశినాడు ప్రార్థించాలి.

హిందువులు ఆచరించే పండుగలలో దీపావళి ముఖ్యమైనది. భారతదేశం నలుమూలలా, ఉత్సాహంగా ఈ పండుగను ఆచరిస్తారు. దీపావళి ముందురోజు జరుపుకునేది ఎనరకచతుర్ధశి2. ఎనరక2 అంటే చీకటి, అజ్ఞానం, దుఃఖం అన్న అర్థాలు ఉన్నాయి. ఎక్కడ తామసగుణం ప్రధానంగా ఉంటుందో అక్కడ నరకం వుంటుంది. లోకోద్ధరణకోసం అవతరించిన శ్రీకృష్ణుడు అజ్ఞానాంధకారమును నిర్మూలించటం కోసం నరకుడిని నిగ్రహించాడు. చతుర్దశి విద్యకు2 పర్యాయపదం. ఆరు వేదాంగములు నాలుగు వేదాల ధర్మశాస్త్రం, పురాణం, మీమాంస, తర్కం వీటిని పధ్నాలుగు విద్యలంటారు. నరకాసురుడు అపహరించిన చతుర్దశి అనగా విద్య లేనపుడు అజ్ఞానాంధకారం సర్వత్రా వ్యాపిస్తుంది. కృష్ణుడు అజ్ఞానాన్ని(నరకుణ్ణి) నిగ్రహించి విద్యా ప్రసాదంతో నవయుగాన్ని ప్రారంభించాడు. దీపం జ్ఞాన సంకేతం. అందువల్ల దీపాన్ని వెలిగించాలి. పురాణ కథనం ప్రకారం శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో లోక కంటకుడైన నరకుని సంహారం చేసిన రోజు నరక చతుర్దశి. ఆనాడు ఆచరించవలసిన మూడు ప్రధాన కర్మలు తైలాభ్యంగనం, యమతర్పణం, ఉల్కాదానం. అసలు అజ్ఞానమనే అంధకారానికి సంకేతమే నరకుడు. ‘నరీయతే ఇతి నరః2- ముక్తి లభించేవరకూ చావని తత్వమేదో అది జీవభావం. జీవుడు నరుడైతే, జీవుడికున్న అజ్ఞానమే నరకుడు. నరకుణ్ణి జ్ఞానజ్యోతితో అణచినవాడు నారాయణుడు.

నరకాసురుడు ఎవరో కాదు

శ్రీ మహావిష్ణువు వరాహావతార మెత్తినపుడు ఆయనకు భూదేవికి సాంగత్యమేర్పడింది. దాని ఫలమే ఈ నరకాసురుడు. భూదేవి కుమారుడు. వాడికా విషయం తెలియదు. బ్రహ్మను గురించి కఠోర తపస్సు చేసి అనేక వరాలు అడిగి పొందాడు. దేవతలను హింసించాడు. మహర్షులను నిర్బంధించాడు. అపుడు అందరూ శ్రీకృష్ణుని ప్రార్థించగా సత్యభామతో బయలుదేరి యుద్ధంలో నరకున్ని సంహరించాడు. అపుడు సంతోషంతో అందరూ ఆ మరునాటి రోజు దీపాలు వెలిగించి దీపావళిని జరుపుకుంటారు. బ్రహ్మతో నరకుడు దేవా! నేను చావులేని వరం కోరుకోను. నువ్వు ఎవరికి ఆ వరం ప్రసాదించవని తెలుసు. భూదేవి నా తల్లి అని తెలుసుకున్నాను. నాకు చావు అంటూ వుంటే అది నా తల్లి చేతిలోనే జరగాలి. ఆ వరం ప్రసాదించు2 అని అన్నాడు నరకుడు. బ్రహ్మదేవుడు లోలోపల నవ్వుకుంటూ, తథాస్తు2 అని అంతర్థానమయ్యెను. ఈ విధంగా నరకుడి మరణం తన తల్లి అయిన సత్యభామ చేతిలో జరిగింది. శ్రీకృష్ణుడు నరకాసురా! ఈమె భూదేవి అవతారం. నీ సంహారం కోసమే అవతరించింది. సత్యభామ లేనిదే నేను నిన్ను సంహరించలేను2 అన్నాడు. అప్పుడు అమ్మా!2 అంటూ నరకుడు కన్నుమూశాడు. నాటినుంచే నరకాసురుని మరణాన్ని చీకటిమీద వెలుగు సాధించిన విజయంగా నరకచతుర్దశి జరుకుంటున్నాం.

-కె.రామ్మోహన్‌రావు