మెయన్ ఫీచర్

కఢతేరుస్తున్న కార్పొరేట్ విద్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుస్తకాల బరువును మోయలేక మూడో అంతస్తులో కుప్పకూలి ప్రాణాలొదిలింది తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.వర్షిత. ఈ మరణానికిగల గల కారణాల్ని పక్కన పెడుదాం! ఓ 14 సం.ల బాలిక 12 కిలోల బరువుతో మూడో అంతస్తు ఎక్కి దిగాలా అనేది ఓ ప్రశ్న! సాధారణంగా భారతీయ బాలికలు రక్తహీనతతో, కనీస సమతుల్య ఆహారం తీసుకోలేక బలహీనంగా వుంటారనేది తెలిసిందే! కాని, ఏ దేశంలో మోయలేనన్ని పుస్తకాల్ని చదువుల పేరున బడి కార్మికులుగా మన పిల్లలు మోయాల్సి వస్తున్నది. ఈ సందర్భంగా యశ్‌పాల్ కమిటీ సిఫార్సుల్ని పక్కన పెడుదాం! ఈమధ్యనే సిబియస్‌ఇ ఇచ్చిన ఆదేశాలుగాని, తెలంగాణ ప్రభుత్వమే ఇచ్చిన నిర్దేశాలు గాని ఎందుకు అమలు జరగడంలేదనేది మరో ప్రశ్న! వర్షిత చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అనేది ఇంకో అంశం!
పాఠశాల భవన సముదాయం ఎలా వుండాలో, ఉపాధ్యాయ శిక్షణలో ఓ పాఠ్యాంశమే వుంటుంది. విశాలమైన గదులు, కిటికీలతో పెద్ద వరండాలతో సరళలేఖలో (-), ఎల్ (జ) ఆకారంలో యూ(శ్రీ) ఆకారంలో, వర్తులాకారంలో, లేదా ఆంగ్ల పెద్దక్షరం ఐ(ని) ఆకారంలో వుండాలని, అది పై అంతస్తు అనే మాట లేకుండా వుండాలని వివరిస్తుంది. కాని, పట్టణీకరణతో, ప్రైవేటీకరణతో, కార్పొరేటీకరణ చెందిన విద్య భూమికి నిలువుగా (్పళూఆజషళ) వుండే భవనాల్లోకి దూరిపోయింది. ఆటస్థలమంటే ఏంటో తెలియని ఈ కానె్సంట్రేటెడ్ సెల్స్ (్ళ్యశషళశఆ్ఘఆళజూ షళఒ)లో హాయిగా గాలి పీల్చుకోలేని స్థితి. ఇలాంటి అంతస్తుల్ని చిట్టి కాళ్లు వీపుపై తన బరువుకు మించిన బరువుతో, రెండు చేతుల్లో అదనపు భారంతో ఎలా ఎక్కుతాడో అని ఏనాడు ఆలోచించని వైనం.
బండబారిన చదువుల పేరున పిల్లలు రోజు ఎంత బరువుని మోయాలో తెలియదు. తెలుసుకోవాలనే ఇంగిత జ్ఞానం లేని తల్లిదండ్రులు, తెలిసినా యాజమాన్యాన్ని ప్రశ్నించలేని దుర్బలత్వం! ఏనాటికీ జ్ఞానోదయం కాని మూర్ఖత్వం! లాభాల వేట తప్ప మానవీయ కోణం తెలియని పెట్టుబడి వ్యవస్థకు మెదడులో ఆలోచించే నాడీ కణ వ్యవస్థ లేని తల్లిదండ్రుల్ని సొమ్ము చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. కార్పొరేట్ విద్యను ప్రభుత్వం నియంత్రించడం కాదు, వారే ప్రభుత్వాన్ని రింగ్ మాస్టరుగా ఆడిస్తుంటే రాజకీయ పార్టీలు కార్పొరేట్ శక్తులకు ‘బి’ ఫాంనిచ్చి గెలిపించడమే కాక, కోట్లాది రూపాయల్ని పార్టీ ఫండుగా తీసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వాలే కార్పొరేటీకరించబడుతున్నాయి. ఈ రుబ్బే చదువులే నిజమైన చదువులని ప్రభుత్వమే పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ టీచర్లకే నారాయణ సంస్థల ఉపాధ్యాయులచే పాఠాలు చెప్పించాలనే దాకా పోయిందంటే ఎవరు ఎవర్ని నియంత్రిస్తున్నారో! అందుకే ఇలాంటి వారి చేతుల్లో వున్న ఉరితాళ్లను బిగించే చెరసాలల్ని పిల్లల పాలిట కలల ప్రపంచంగా తల్లిదండ్రులు భావించి అప్పజెబుతున్నారు. పేగు బంధం తెగితేగాని, అవి వధ శాలలని గుర్తించడంలేదు. ఇలాంటి సంఘటనలతో కూడా వీటికేమైనా ఆదరణ తగ్గుతున్నదా అంటే అదీ లేదు. పోయినోళ్లు ఉన్నోళ్ల తీపిగుర్తులంటూ మిగతా పిల్లల్ని అదే బలిపీఠానికి పంపిస్తున్నారు. ఇదంతా పిల్లల రేపటి బంగారు భవిష్యత్తుకేనని భ్రమిస్తున్నారు. వాటినే బృందావనాలుగా భావిస్తున్నారు. దీనిని పిల్లలపై ప్రేమ అందామా, బాధ్యత అందామా లేక శాడిజం అందామా? ‘చదువు..’ అనే సుత్తి దెబ్బలకు తట్టుకోలేక తనువు చాలించిన తర్వాత యాజమాన్యాల్ని శాపనార్థాలు పెట్టడం, తర్వాత గొంతులు మూగబోవడం తెలుగు రాష్ట్రాల్లో నిత్యకృత్యమయ్యాయి.
ఉమ్మడి రాష్ట్రంలో 2011-12 విద్యా సంవత్సరంలోనే 1300 మంది విద్యాకుసుమాలు నేల రాలాయంటే తల్లిదండ్రులకు నారాయణ, చైతన్య, భాష్యం లాంటి రోగాలు ఎంతగా అంటుకున్నాయో తెలుస్తున్నది. ఇక అంతకుముందు తనువు చాలించినవారు, ఇప్పుడు ప్రాణాల్ని బలి ఇస్తున్నవారు అటు తల్లిదండ్రుల్ని, ఇటు పౌర సమాజాన్ని కదిలించలేకపోతున్నారంటే మనమెంత బండబారిపోయామో తెలుస్తున్నది. దీనికి ఎవరిని నిందిద్దాం? ఈ ఉరిశాలల్ని స్వర్గ్ధామాలని తలుస్తున్న తల్లిదండ్రుల్నా? ఉషోదయం పేరున చీకట్లను విస్తరిస్తున్న కార్పొరేటు సంస్థలదా? వీరే పాలకులుగా మారిన ప్రభుత్వానిదా? వీటి ఘనతల్ని చాటుతున్న విద్యాశాఖదా? పత్రికలదా? టీవీలదా? ఈ మారణకాండ గూర్చి పట్టింపులేని ఉపాధ్యాయ వర్గందా? తరగతి గదిలో జరుగుతున్న కార్పొరేట్ హత్యల్ని బాలల జీవించే హక్కుగా గుర్తించని బాలల హక్కుల సంఘాలదా? ఇలాంటి సంఘటనల సందర్భంగా సొమ్ము చేసుకుంటున్న విద్యార్థి సంఘాలదా? రాజకీయ వాదులదా? గుడ్డివారిలా వ్యవహరిస్తున్న సామాజిక మేధావులదా?
నీరదా రెడ్డి, చక్రపాణి, రత్నకుమారి, యశ్‌పాల్ లాంటి పదుల సంఖ్యలో ఏర్పాటైన కమిటీలుగాని, 2009లో వచ్చిన విద్యా హక్కు చట్టంగాని ఈ ‘చైనా’ రోగాన్ని నిలువరింపజేయలేకపోతున్నాయి. విద్యా హక్కు చట్టమంటే, ఈ వధశాలలకు తమ పిల్లల్ని పంపే హక్కన్నమాట! రేపటి భవిష్యత్తు అనే ఊహాజనిత కొరడాతో కార్పొరేట్ శక్తులు పిల్లల్ని చంపే హక్కన్నమాట! ప్రభుత్వ రంగంలోనే విద్యా రంగాన్ని నడపాల్సిన బాధ్యత తమది కాదని తప్పించుకునే ప్రభుత్వాల హక్కన్నమాట! ప్రభుత్వ అండదండలతో, తల్లిదండ్రుల వ్యవహారంతో, పట్టింపులేని సమాజంతో, ఫీజులు తగ్గిస్తే చాలు, తరగతి గది చావులు తమకెందుకని, ఇవే నిజమైన ప్రగతిమెట్లని భావిస్తున్న తల్లిదండ్రుల సంఘాలతో అర్థరహిత ఆలోచనలతో, ఈ దుర్ఘటల్ని రాజకీయం చేసే విద్యార్థి, రాజకీయ వేదికల నిర్లక్ష్యంతో వెరసి ఈ కార్పొరేట్ సంస్థలు పిల్లల పాలిట యమకూపాలుగా మారితే పిల్లలు ఎవరికి మొరపెట్టుకోవాలి?
కనిపించేదంతా మిథ్య! కనిపించనిదంతా మాయ! మధ్యనుండేదే భ్రమ అనే తాత్విక చింతనలా పిల్లలు ఓ భ్రమగా మారిపోయారు. తర్కంలేని చదువు ఓ వాస్తవంగా మారిపోయింది. ప్రాణాల్ని హరించే చదువే నిజమైన చదువనే ధోరణి బాగా పెరిగిపోయింది. దీన్నో జాడ్యం అందామా! ఈ విద్యాలయాల్ని మమతల కోవెలలందామా? లేదా మానవీయతకు తావులేని మృత్యు కుహరాలు అందామా? జ్ఞానానికి తప్ప, చదువు ప్రాణాలు తీయడానికి కాదని గుర్తించని హంతక వ్యవస్థకు అందరం బాధ్యులమే! అయినా మనం మనంగా లేనప్పుడు, ఏదో ఓ అదృశ్యశక్తి మనను నియంత్రిస్తుంటే, సిరియాళుణ్ణి వధించిన తల్లిదండ్రుల పాత్రనే మనం పోషిస్తాం. ప్రాణం కన్నా కీర్తే గొప్పదని భావిస్తాం! పోతే పిల్లలేగా పోయేది? బతికి బయటపడి, ఏ ఐఐటిలోనో చేరితే, చేరి ఐఐటి ఆటలో నెగ్గితే, ఏ కార్పొరేట్ గద్దనో లక్షలాది రూపాయల ప్యాకేజీ ఇచ్చి తన్నుకుపోతే ఆ సంబరమే వేరు కాదా! ఇంతటి ఘనకీర్తిని అందుకోలేక, పొందలేక తనువులు చాలించడం పిల్లల పిరికి చర్య కాదా! అందుకే మనం ఓ జిజియాబాయి, ఓ సావిత్రి బాయి పూలే కాలేకపోతున్నాం. కాకతీయ గణపతి దేవుడిగానో, ఓ అబ్రహాం లింకన్‌గానో ఆలోచించలేకపోతున్నాం. ఓ రవీంద్రుడిలాగానో, ఓ గిజుబాయిలాగానో మాట్లాడలేకపోతున్నాం. పోనీ వ్యక్తిగతంగా పిల్లల ముందు నిజాయితీగా వుంటున్నామా? నిబద్ధతతో, బాధ్యతతో, జవాబుదారీతనంతో, విలువలతో బతుకీడుస్తున్నామా? మనకున్నదంతా ఒకే హక్కు దరిద్రపు గొట్టు ఆలోచన! అడ్డమైన గడ్డి తినైనా, అక్రమంగా సంపాదించైనా, పిల్లల్ని ఓ చదువుల బందిలి దొడ్డిలో పారవేయాలనుకోవడమే! దీన్నో పెద్ద బాధ్యతగా భావించడమే! పైగా, మన తల్లిదండ్రులు, మన చదువుల పట్ల శ్రద్ధ తీసుకోలేదని, వీధి బడి చదువులని, సర్కారీ చదువులని, అందుకే తమ బతుకులు బండబారాయని తల్లిదండ్రులపై ఓ ఏడ్పు! నిజంగా వారి పిల్లల పెంపక విధానం మనకు అబ్బిందా అనేది ఏనాడూ పట్టని నైజం.
చదువుకున్నామనే ధీమా, ఉద్యోగాలు వెలగబెడుతున్నామనే అహం, పిల్లల్ని బాగా రుబ్బిస్తున్నామనే మూర్ఖపు పట్టు, వెరసి ప్రస్తుత విద్యావిధానం పట్ల అందర్ని అవిటివాళ్లుగా మార్చాయి. ఇంతటి నిర్లక్ష్య, నిస్సత్తువ వ్యవస్థలో చావుల్ని అనివార్యంగా భావించడం ఓ అలవాటుగా మారితే, కార్పొరేట్ సంస్థలు వ్యధశాలలుగానే ఎదుగుతాయి. ‘‘చేతనైనంతనే చదువు, ఒత్తిడికి గురికాకు, ఇబ్బంది పడకు..’’ అంటూనే పిల్లల ఎదలోని బాధల్ని వినడానికి మనసొప్పని తల్లిదండ్రులు, పిల్లల ప్రాణాలు గాలిలో కలిస్తేగాని చలించరు. దీనిని ఏ విధమైన పెంపకమని నిర్వచించాలి. ఒకప్పుడు ఇంటర్‌కే పరిమితమైన ఈ ఒత్తిడి చదువు ఇప్పుడు ప్రాథమిక స్థాయికి అంటుకున్నది. వృత్తి కోర్సులకు అంటుకున్నది. విశ్వవిద్యాలయాలకు విస్తరించింది. ఇందుగలదు, అందులేదనే సందేహం లేకుండా, చావు అన్ని విద్యాసంస్థలకు విస్తరించింది.
మనకు చదువంటే ఏంటో తెలిసి చావదు. ప్రాణం విలువేంటో అర్థం కాదు. ప్రభుత్వ బాధ్యతలేంటో తెలుసుకోం. తెలిసినా నిలదీయం. ఎవరైనా గొంతెత్తితే వారితో గొంతు కలపం. ఇలాంటి ఆత్మహత్య సదృశ్య వ్యవస్థలో చదువును అందించాల్సింది పిల్లలకు కాదు పెద్దలకే! పెద్దలమని భావిస్తున్న బుద్ధి వికసించని తల్లిదండ్రులకే! ఊహల ప్రపంచం తప్ప రేపటి అమెరికా ఏంటో తెలియదు. ఆస్ట్రేలియా ఏంటో తెలియదు. పిల్లల్ని మరబొమ్మల్లా భావించి, ఎగుమతి చేయాలనే నిస్వార్థ చింతన తప్ప! దేశీయ బాధ్యత, చుట్టూ వుండే సామాజిక బాధ్యత ఏనాడు పట్టని తల్లిదండ్రులే ఈ అస్తవ్యస్థ సమాజానికి ప్రధాన కారకులు. పిల్లల్ని పెంచడం తెలియని మనకు, మన ఆడపిల్లలు మాత్రం భద్రంగా ఉండాలనే సంకుచిత స్వభావం మనను వెన్నంటి వున్నంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది. మనమెలాగూ ఈ వ్యవస్థను మార్చలేం. కనీసం, ఓ మహాత్ముడు వస్తే బాగుండనే ఇంగితజ్ఞానం కూడా మనకు కలగడంలేదంటే, మనమెంతగా ఊబిలోకి కూరుకపోయామో తెలుస్తున్నది. తిరుగుబాటు, ఎర్రజెండా కాదు, చివరికి నల్ల జెండాను కూడా ఎత్తలేని స్వార్థపరులం. ఇలాంటి వాళ్లకు ఇంతకైనా మెరుగైన వ్యవస్థ వుంటుందా అనేదే ఓ పెద్ద అనుమానం. అందుకే వీరు చీకట్లో కూడా ఏదైనా లాభం జరగాలని చూస్తారు. లాభం లేకుంటే చీకటినే కాదు, వెలుతుర్ని కూడా నిందిస్తారు. ఇలాంటి ప్రబుద్ధులున్నారనే ప్రభుత్వాలు కూడా పరమ ప్రబుద్ధులచే అలరారుతున్నాయి. యథారాజా, తథా ప్రజ కాదు- యథాప్రజ తథా రాజ! అందుకే తల్లిదండ్రులు జిందాబాద్! పిల్లలు ముర్దాబాద్! చంపే చదువులే ముద్దు! సర్కారి చదువులు.. మాట్లాడద్దు!!

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162