మెయన్ ఫీచర్

ఈ ప్రశ్నకు బదులేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో పరిస్థితులు నానాటికీ తీసికట్టు చందంగా మారిపోతున్నాయి. ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. కొందరి చేష్టలు, ప్రకటనలు ఆందోళనకలిగిస్తున్నాయి. ఆయా పరిస్థితులపై వచ్చే ప్రశ్నలకు సమాధానాలు దొరకబట్టడం కష్టమే. జాతీయత, దేశభక్తి వంటివి గాలికి వదిలేశారు. సొంత అజెండాలతో అడుగులు వేస్తున్నారు. ఇవి ఆందోళన కలిగిస్తున్నాయి. బ్రిజేష్ మిశ్రాకు లోగడ పద్మ విభూషణ బిరుదునిచ్చి సత్కరించారు. ప్రస్తుతం ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగస్తా ఛాపర్ కొనుగోలు ఒప్పందంలో అవినీతిలో బ్రిజేష్ మిశ్రా ముద్దాయి అని తేలింది. మరి ఆయనకిచ్చిన పద్మ బిరుదాన్ని ఎందుకు రద్దు చేయలేదు? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? ఆరుషి హత్య కేసులో కింది కోర్టు తీర్పును పై కోర్టు ‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కారణంగా కొట్టివేసి, ఆరుషి తల్లిదండ్రులను జైలునుండి విడుదల చేసింది. మరి ఆరుషిని దయ్యం గాలిలోనుండి ఎగురుకుంటూ వచ్చి చంపిందా? తల్వార్ దంపతుల నిర్దోషిత్వం ఎంత? సరే వారు నిందితులు కానప్పుడు ఆరుషిని చంపినది ఎవరో తేలాలికదా? దీనికి ఎవరు సమాధానం చెబుతారు? సల్మాన్‌ఖాన్ తాగి డ్రైవ్ చేస్తుంటే రోడ్డు మీద ఒక అనాధ చనిపోయాడు. దానికి శిక్ష లేదు సరికదా ‘రోడ్డుమీద గేదెలు పడుకుంటాయి. కాని మనుషులు కాదు’ అంటూ బాలీవుడ్ వెనకేసుకుని వచ్చింది. మరి హత్య చేసిందెవరు? నిందితులను కనిపెట్టనివారిపై చర్య ఏది? ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మకు వంగవీటి మోహనరంగా, నందమూరి తారకరామావరావు వంటి సెనే్సషనల్ ఇతివృత్తాలు తప్ప మరేవీ దొరకలేదా? వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్టు లక్ష్మీస్ ఎన్‌టిఆర్ సినిమా తీసి ఈయన ఏం కాబోతున్నాడు? బాపనోళ్లు ఆధ్యాత్మిక ఫాసిస్టులు, కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు, బాపనోడి పిలక పంది తోకలా వుంటుంది, తిరుపతి వెంకన్న దుర్మార్గపు దైవం. ఇలా పుస్తకాలు వ్రాసిన కంచ ఐలయ్యను శిక్షించడానికి సుప్రీంకోర్టు ముందుకు రాలేదు. ఆర్టికల్ 19-ఎబి-326 అధికరణల వల్ల భావ స్వేచ్ఛ ఉన్నదని విడిచిపెట్టింది. మరి ఈ వెర్బల్ టెర్రరిజం భావస్వేచ్ఛ కిందకి వస్తుందా? అతడు మతం పుచ్చుకున్న షెపర్డ్. అలాంటప్పుడు హిందు దేవీదేవతలను దూషించే అధికారం ఆయనకు ఎక్కడిది? ఆ విషయాలను అడిగేవారు ఎవరు? అలా అడిగేవారికి మద్దతు ఇచ్చేది ఎవరు?
దీపావళి పండుగకు టపాకాయలు కాలిస్తే శబ్ద కాలుష్యం, ధూమ కాలుష్యం వస్తాయని భావించి సుప్రీంకోర్టు ఢిల్లీలో టపాసులు కాల్చటాన్ని నిషేధించింది. సంతోషం. మరి మైకులు పెట్టి మీనార్ల మీద నుండి అరిచినప్పుడు ధ్వని కాలుష్యం రావడం లేదా? దానిని నిషేధించే ధైర్యం చట్టానికి లేకపోయిందా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు. భారత రాజ్యాంగంలోని 19 ఎబిసిడిఇల ప్రకారం పౌరులకు ప్రాథమిక హక్కులు సంక్రమించాయి. వాక్ స్వాతంత్య్రం పత్రికా స్వాతంత్య్రం దేశంలో ఎక్కడైనా తిరిగే, ఎక్కడైనా ఆస్తి కొనుక్కునే అవకాశాలు కల్పించింది. రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం పౌరుడు సుప్రీంకోర్టు, హైకోర్టులకు వెళ్లి తమ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని మొరపెట్టుకోవచ్చు. ఐతే ఆరు లక్షల మంది కాశ్మీరీ పండిట్లను కాశ్మీర్‌నుండి తరిమేశారు. వారికి ప్రాథమిక హక్కు లు లేకుండా పోయాయి. భారత రాష్టప్రతి కూడా 19వ అధికరణం కింద కాశ్మీర్‌లో ఒక్క అంగుళం స్థలం కొనుగోలు చేయలేడు. ఎందువలన?
ప్రణవ్ ముఖర్జీ భారత రాష్టప్రతిగా పదవీ విరమణ చేశాక మళ్లీ సోనియా రాహుల్ గాంధీలను ఉన్నత పదవులలో చూడాలని ‘యాక్టివ్ పాలిటిక్స్‌‘లోకి దిగాలనుకుంటున్నాడు. ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ అయితే ‘్భరతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదు’ అని పదవీ విరమణ తర్వాత వ్యక్తం చేశాడు. ఇది ఏరు దాటి తెప్ప తగలేయడం కాదా? ఉన్నత పదవులను అనుభవించి చివరిలో ఇలా మాట్లాడేవారిని ప్రశ్నించేవారు ఏరీ?
తెలంగాణలో సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలలో తెరాస వర్గాలు డబ్బు పంచి విజయం సాధించడం ‘లంచం’ కిందికే వస్తుంది అన్నాడు బిజెపి నాయకుడు జి.కిషన్‌రెడ్డి. మరి సైద్ధాంతిక నిబద్ధత గల కార్మికులు లంచాలు తీసుకుంటుంటే తప్పు కార్మికులది కాదా? అడిగితే ఆగ్రహం ఎందుకు? ఇస్లామిక్ దండయాత్రల కాలంలో పెద్ద సంఖ్యలో దళితులను మతం మార్పిడి చేశారు. విక్టోరియా రాణి యుగంలో భారతీయ ఉత్పత్తి, వృత్తులు దాదాపు సర్వనాశనం చేయబడ్డాయి.
మరి కంచ ఐలయ్య క్రైస్తవ మతంలో చేరి భారతీయ ఉత్పత్తి వర్గాలను బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు అణచివేస్తున్నారని ప్రచారం చేయడం ఇంటర్నేషనల్ ఎవాంజలిజంలో అంతర్భాగం కాదా? భారతదేశానికి త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా వుంది. ఐతే కర్నాటకలో ప్రాంతీయ ప్రభుత్వ జెండా రూపొందించారు. ‘కన్నడ ఆత్మాభిమానం’ పేరుతో జనాలను రెచ్చగొట్టి అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓట్లు సంపాదించుకోవాలని ప్రయత్నించడం న్యాయమేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు తక్కువ. వర్షానికి బెంగుళూరు నగరం అతలాకుతలమైంది. రహదారులు ఎక్కడికక్కడ భారీ గోతులతో ధ్వంసమయ్యాయి. అయినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నా స్పందన కరువైంది. కానీ నాడు ఎంఎల్‌ఎలందరికీ వెండిపళ్లాలు బంగారు డాలర్లు 25 కోట్ల వ్యయంతో పంచిపెట్టాలని అక్టోబర్ 16న అసెంబ్లీ స్పీకర్ తీర్మానం ఆమోదించారు. ప్రజాస్వామ్యం అంటే నవ్వులాటగా మారిపోలేదూ? అడిగేవారు ఉన్నారా? ఈనెల 15న కేరళలో జరిగిన ఉప ఎన్నికలలో సిపిఎం అభ్యర్థిని ఒక కాంగ్రెస్ అభ్యర్థి ఓడించాడు. ఆ కోపంతో తలచ్చేరిలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తను సిపిఎం మాఫియా హతమార్చింది. ఇది న్యాయమా? దేశంలో చాలామందిలో అసహనం పెరిగిపోయింది. సిద్ధాంత రాద్ధాంతాల మధ్య భారతీయతను మరచిపోతున్నారు. ఇది ప్రమాదకర పరిణామం. జవాబు లేని ప్రశ్నలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రజల్లో చైతన్యం వచ్చి తమను పట్టించుకోనివారికి గుణపాఠం చెబితే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్