మెయన్ ఫీచర్

వైరుధ్య’మూలం.. భాషా జాతుల వాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పెయిన్ దేశం నుంచి విడిపోవాలని ‘కాటలోనియా’ అన్న ప్రాంతంలో ఉద్యమం జరుగుతుండడం ఐరోపాలోని ‘్భషా’ వైరుధ్యాలకు మరో సాక్ష్యం! వైవిధ్యాల మధ్య సమన్వయం లేకపోవడం, వైవిధ్యాలు వైరుధ్యాలన్న ‘్భవం’ లేదా ‘భ్రాంతి’ ఆవహించడం ఐరోపాలోని వివిధ దేశాలలో కొనసాగుతున్న ‘విచ్ఛిన్న ఉద్యమాల’కు కారణం! రెండు లక్షల చదరపు మైళ్ల - ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల - విస్తీర్ణం నాలుగున్నర కోట్ల జనాభాకల ‘స్పెయిన్’ ఐరోపాలోని పెద్ద దేశాలలో ఒకటి! మధ్యధరా సముద్రానికి పశ్చిమంగా ఐరోపా నైరుతి భాగంలో నెలకొని ఉన్న స్పెయిన్‌ను ‘జిబ్రాల్టర్’ జలసంధి ఆఫ్రికా ఖండం నుంచి వేరుచేస్తోంది. దేశంలో ‘స్పెయనీయ’ - స్పానిష్ - భాషను మాట్లాడుతున్నారు. కానీ ముప్పయిరెండు లక్షల చదరపు కిలోమీటర్ల ‘కాటలోనియా’లోని ఎనభయి లక్షల జనాభాలో అత్యధికులు ‘కాటులోనీ’ - కెటాలన్ - భాషను మాట్లాడుతున్నారు. స్పెయిన్‌లోని ఇతర ప్రాంతాల - ప్రావినె్సస్ - కంటె ఈ ‘కాటలోనియా’ అత్యధిక సంపన్నమైన, అత్యంత సమృద్ధమైన ప్రాంతం! ‘స్పెయనీయ’ భాషా ప్రజల సమష్టి స్వభావం ఇతర భాషల వారితో సహజీవనం చేయలేకపోవడం. ఈ స్వభావం ఐరోపాలోని అన్ని ‘్భషా’ జన సముదాయాలకూ ఉంది. ‘స్పెయనీయ’ భాష వారికి మరింత ఎక్కువగా ఉంది. అందువల్లనే ఐరోపా నుంచి అమెరికాలోకి చొరబడిన అన్ని ఐరోపా భాషల వారు రెండు శతాబ్దులలో ‘ఆంగ్లీకరణ’కు గురిఅయ్యారు. స్పెయిన్ వారు మాత్రం అలా గురికాలేదు. ‘అమెరికా సంయుక్త రాష్ట్రాల’ - యుఎస్‌ఏ - లో ఇంగ్లీషు భాష తరువాత ఎక్కువగా మాట్లాడేది ఇప్పటికీ ‘స్పెయనీయ’ భాష! ఈ ‘హిస్పానిక్’ తెగ వారిని దిగమింగడం ఆంగ్లేయ అమెరికాకు సాధ్యం కావడంలేదు. అందువల్ల స్వదేశంలో వీరి - స్పెయనీయుల - ఔద్ధత్యం మరీ ఎక్కువ! ఈ ‘ఆధిపత్య’ ధోరణికి ప్రతిక్రియగానే స్పెయిన్ నుంచి విడిపోవాలని ‘కాటలోనియా’ వాసులు భావిస్తున్నారు-ట-! రెండేళ్ల క్రితం ఒక బహిరంగ సభలో ప్రసంగించిన స్పెయిన్ ప్రధానమంత్రి మారియానో రోజోయ్ దగ్గరకు వెళ్లిన ఒక ‘కాటలోనీ’ బాలుడు ఆయన చెంపను పగులగొట్టాడు! ఆ ‘కుర్రకుంక’ను పోలీసులు పట్టుకొన్నప్పటికీ తరువాత వదలివేశారు. అర్భకుడు మరి... స్పెయిన్ నుంచి తమ ప్రాంతం విడిపోయి స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఏర్పడాలన్న కోర్కె ప్రాతిపదికగా ‘కాటలోనియా’లో అక్టోబర్ ఒకటవ తేదీన జనాభిప్రాయ సేకరణ జరిగింది. స్పెయిన్ కేంద్ర ప్రభుత్వం ఈ జనాభిప్రాయ సేకరణ - రెఫరెండమ్ - ను నిషేధించినప్పటికీ ప్రాంతీయ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇలా ‘తిరుగుబాటు చేసిన’ ప్రాంతీయ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అయినప్పటికీ కాటలోనియా ప్రాంతీయ ప్రభుత్వం ‘ప్రాంతీయ పార్లమెంట్’ను సమావేశపరచింది. ‘కాటలోనియా సర్వ స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఏర్పడినట్టు’ ఈ ప్రాంతీయ పార్లమెంటు ఇరవై ఆరవ తేదీన తీర్మానించింది! స్పెయిన్ ప్రభుత్వం ఈ ప్రాంతీయ పార్లమెంటును రద్దు చేసింది.. కానీ సమైక్యవాదులకూ, స్వతంత్రవాదులకూ మధ్య ‘కాటలోనియా’లో అంతర్యుద్ధం ఆరంభమైంది!! భాషా వైరుధ్యాల ఫలితం యిది..
ఐరోపా వారికి కొన్ని సహస్రాబ్దుల పాటు ‘జాతీయత’ - నేషనలిజమ్’ గురించి తెలియదు. క్రీస్తు శకం పదమూడవ పదునాలుగవ శతాబ్దుల క్రితమే ఐరోపావాసులు ‘జాతులు’గా ఏర్పడతారు! భారతీయతకు దూరం కావడం వేద విజ్ఞాన జీవన పద్ధతికి సంస్కృతికి దూరం కావడం ఇందుకు కారణం! తొలి మానవులు తొలి సంస్కృతి తొలి జాతీయత భారతదేశంలో పుట్టి పెరిగి క్రమంగా ప్రపంచం నలుమూలలకు విస్తరించడం యుగయుగాల చరిత్ర. ఇలా వ్యాపించిన వారు వివిధ ప్రాంతాలలో స్థిరపడి క్రమంగా భారతీయతను మరచిపోవడం చరిత్ర! ఇలా మరచిన ఐరోపావారు కొన్ని వేల ఏళ్లు మానవీయ సంస్కృతికి సంస్కారాలకు దూరమయ్యారు. ఆ తరువాత తాము కొత్త జన సముదాయాలుగా రూపొందారు. ఇలా రూపొందిన ఐరోపా వారికి ‘జాతి’ - నేషన్ - గురించి, ‘సంస్కృతి’ - కల్చర్ - గురించి అవగాహన లేదు. రెండు మూడు సహస్రాబ్దుల పాటు ఐరోపా జన సముదాయాలకు తెలిసింది కేవలం ‘నాగరికము’ - సివిలిజేషన్! ఒక నగరము, లేదా ఒక పట్టణము, దాని శివారు ప్రాంతం ఒక ‘రాజ్యం’గా ఏర్పడడం ఐరోపాను ఆవహించిన గ్రీసు నాగరికత.. నగరాలకు చెందిన వారు నాగరికులు, నగరాలకు చెందినది నాగరికము! తరువాతి కాలంలో ‘గ్రీసు’ నాగరికులు ఐరోపాలో ఈ ‘నగర రాజ్యాల - సిటీ స్టేట్స్ -ను జయించి ‘సామ్రాజ్యం’ - ఎంపయిర్ - నిర్మించారు! ఈ ‘సామ్రాజ్య నిర్మాణ’ వాంఛ కారణంగానే ‘గ్రీసు’లోని చిన్న ప్రాంతంలోని ‘నగర రాజ్యం’ - సిటీ స్టేట్ - అధినేత ‘అలెగ్జాండర్’ అనే వాడు క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది - కలియుగం ఇరవయి ఎనిమిదవ శతాబ్ది -లో ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరాడు. తమ ఐరోపాలో ‘నగర రాజ్యాలు’ మాత్రమే ఉన్నాయి. అందువల్ల ప్రపంచమంతటా ‘నగర రాజ్యాలు’ మాత్రమే ఉన్నట్టు గ్రీసు మేధావులు భ్రమించారు. ‘అలెగ్జాండర్’ వెంట వచ్చి భారతదేశంలోకి చొరబడిన ఈ మేధావులు అందువల్లనే ‘తక్షశిల’ రాజ్యం రాజు ‘అలెగ్జాండర్‌ను శరణు వేడినట్టు’ అబద్ధాల చరిత్ర వ్రాసిపోయారు. తక్షశిల రాజ్యం కాదు. ఏ రాజ్యానికీ రాజధాని కూడ కాదు. తక్షశిల మహా విద్యాలయ కేంద్రం! తమకు తెలిసింది మాత్రమే విజ్ఞానమని భావించిన బావిలోని కప్పలు అలనాటి ఐరోపావాసులు...
విభిన్న భాషలు, వివిధ మతాలు, ఇంకా అనేకానేక వైవిధ్యాలు సమాంతరంగా పరిఢవిల్లడం అనాదిగా భారతీయ చరిత్ర! ఇలాంటి వైవిధ్య స్వరూపాలన్నీ ‘అద్వితీయ స్వభావ’బద్ధం కావడం భారతదేశం ఒక జాతిగా ఒకే జాతిగా వికసించడానికి అనాదిగా భూమిక. వంద భాషల, పదుల మతాల, అనేకానేక వైవిధ్యాల భారతదేశం అనాదిగా ఒకే సంస్కృతిబద్ధమైంది. వైవిధ్యవంతమైన వైవిధ్య పరిరక్షకమైన సనాతన - శాశ్వత - అద్వితీయ సంస్కృతిని విశాల భారత ఖండాన్ని ఒకే జాతిగా వికసింపజేసింది. దీనికి భిన్నంగా ‘ఒక దేశంలో ఒకే భాష ఒకే మతం ఉండాలన్న కృతక సిద్ధాంతం’ ఐరోపాలో కృత్రిమ జాతులను సృష్టించింది. సృష్టిస్తోంది! తమది కాని దాన్ని సహించలేని సమష్టి స్వభావం ఈ కృతక సిద్ధాంతానికి కారణం! తాము మాట్లాడే భాషకంటె భిన్నమైన భాషను, తాము అవలంబించే మతం కంటె భిన్నమైన మతాన్ని సహించలేని ఐరోపా జన సముదాయాలు వైవిధ్య విధ్వంసకులుగా మారడం ప్రపంచ చరిత్ర. ఐరోపా వారు శతాబ్దులపాటు వైవిధ్యాలను విధ్వంసం చేశారు. ఈ భస్మాసుర ప్రవృత్తి ప్రస్తుతం ఐరోపా నెత్తిన చేతులను పెడుతోంది. ‘గ్రీసు నాగరికము’ - సివిలిజేషన్ - ను ధ్వంసం చేసి రోము ‘నాగరికము’ ప్రబలింది. ఈ రోము నాగరికము హిబ్రూ - యూదు- లను ఆసియా నుండి తరిమికొట్టింది. క్రైస్తవ మతం రోము నాగరికాన్ని నామరూపాలు లేకుండా నశింపచేసింది. శతాబ్దులపాటు ఐరోపాలోను ఆఫ్రికాలోను పశ్చిమ ఆసియాలోను క్రైస్తవం ఇస్లాంతో ఘర్షణ పడింది. ‘ఇస్లాం’ గెలిచిన చోట ‘క్రైస్తవం’ మిగలలేదు. ‘క్రైస్తవం’ గెలిచిన చోట ‘ఇస్లాం’ మిగలలేదు. క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దిలో ‘ఇస్లాం’ జిహాదీలు స్పెయిన్‌లోకి చొరబడి క్రైస్తవాన్ని ధ్వంసం చేయ యత్నించారు. కొన్ని ప్రాంతాలను కైవసం చేసుకున్నారు. చివరికి ‘క్రైస్తవం’ నిలిచింది. స్పెయిన్ నుంచి ఇస్లాంను బహిష్కరించడం చరిత్ర! ఇలా ఒక ‘నాగరికాన్ని’ ధ్వంసం చేసి మరో ‘నాగరికం’ పరిఢవిల్లడం ఐరోపా చరిత్ర! ‘్భరతీయత’ను మరచిన ఐరోపా వారు వైవిధ్యాల మధ్య సమన్వయాన్ని కాక వైరుధ్యాన్ని దర్శించారు. అసంఖ్యాక వైవిధ్యాలు సమాంతరంగా సహజీవనం చేయడం యుగాలుగా భారతీయ సంస్కృతి, భారత జాతీయత! ఒక వైవిధ్యం తరువాత మరో వైవిధ్యం ‘ప్రబలడం’ ఐరోపా నాగరికత. అంతేకాని వైవిధ్యాలన్నీ వైరుధ్యం లేకుండా సమాంతరంగా సహజీవనం చేసిన చరిత్ర ఐరోపాకు లేదు! ఇదీ భారతీయతకు భారతీయతను మరచిన వారికి మధ్యగల తేడా! అనేక భాషలు సమాంతరంగా పరిఢవిల్లిన చరిత్ర మనది. ఈ భాషా జన సముదాయాలు ప్రత్యేక ‘జాతులు’ కాలేదు... తెలుగు జాతి, తమిళ జాతి, కన్నడ జాతి, హిందీ జాతి, పంజాబీ జాతి, కశ్మీరీ జాతి, అస్సామీ జాతి ఏర్పడలేదు. ఈ భాషలను మరెన్నో భాషలను మాట్లాడే జన సముదాయాలు అన్నీ ఒకే భారత జాతిగా వికసించడం అనాది చరిత్ర...
ఈ స్వభావానికి దూరమైపోయిన ఐరోపా వారు ‘జాతీయత’ను ‘్భష’ ప్రతీకగా ఏర్పాటు చేసుకున్నారు. ‘క్రీమియా’ ‘స్కాట్‌లాండ్’, ‘కాటలోనియా’.. ..ఇలా వరుస క్రమంలో ‘్భషల’ పేరుతో ‘కొత్త జాతులు’ పుట్టుకొస్తుండడం ఐరోపాలో రగులుతున్న విచ్ఛిన్న, వైవిధ్య విధ్వంసక స్వభావ కీలలకు నిదర్శనం. ఐరోపావారి ‘వలస’గా మారిన ఉత్తర అమెరికా ఖండంలోని కెనడా దేశంలోని ‘క్యూబెక్’ ప్రాంత వివాదం ‘జాతీయతకు భాష ప్రాతిపదిక’ అన్న కృత్రిమ సిద్ధాంతానికి మరో ఉదాహరణ! ‘ఉక్రయిన్’ దేశంలో భాగంగా ఉండిన ‘క్రీమియా’లో రష్యా భాష మాట్లాడే వారి సంఖ్య అధికం! క్రీమియా రెండేళ్ల క్రితం ‘ఉక్రెయిన్’ నుంచి విడిపోయి రష్యాలో కలిసిపోయింది! బ్రిటన్‌లో భాగంగా ఉన్న ‘స్కాట్‌లాండ్’ 2014 సెప్టెంబర్‌లో విడిపోవడానికి సిద్ధమైంది! ‘స్కాటీయ’ భాషకూ ఇంగ్లీషు మాట్లాడే ఇంగ్లాండునకూ మధ్య సమన్వయం కుదరడంలేదు. ‘రెఫరెండం’లో వెంట్రుకవాసిలో ‘విభజన’ తప్పిపోయింది. ‘ఫ్రాన్స్’ భాష మాట్లాడే ‘క్యూబెక్’ వారు ఇంగ్లీషు మాట్లాడే కెనడా దేశం నుంచి విడిపోడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు ‘కాటలోనియా’ స్పెయిన్ నుంచి విడిపోవాలన్న వాదానికి, ప్రాతిపదిక కూడ ‘్భషా జాతుల’ సిద్ధాంతమే!
నగర రాజ్యాలు - సిటీ స్టేట్స్ - ‘దేశ రాజ్యాలు’ - కంట్రీ స్టేట్స్ -గా ఏర్పడడం ఐరోపా నాగరికంలోని తరువాతి దశ! ఈ దశలోనే ఐరోపాలో ఒక ప్రాంతాన్ని మరో ప్రాంతం ఆక్రమించడం మొదలైంది. అలా ‘కాటలోనియా’ క్రీస్తు శకం నాలుగవ శతాబ్దిలో ‘రోము’ సామ్రాజ్యంలో ‘వలస’గా మారింది. ఎనిమిదవ శతాబ్దిలో ‘జిహాదీ’లు ఈ వలసను ఆశ్రయించారు! పదిహేనవ శతాబ్దిలో కాటలోనియా మళ్లీ ‘స్పెయిన్’లో కలిసిపోయింది! అదే సమయంలో ‘జాతి’కి ప్రాతిపదిక ‘్భష’ అన్న కృత్రిమ ‘జాతీయత’ ఐరోపాను ఆవహించింది! అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే కథ.. ఇదే వ్యథ..

-హెబ్బార్ నాగేశ్వరరావు 9951038352