మెయిన్ ఫీచర్

దక్షిణాదేవిస్తోత్రం.. కర్మ సాఫల్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ గవతి లక్ష్మీదేవి దక్షిణ భుజమునుండి ప్రకటితమైన కారణమున ఈ దేవి ‘దక్షిణ’ అను నామంతో ఖ్యాతిపొందింది. ఈ దేవి లక్ష్మీదేవి కళభే. సమస్త యజ్ఞయాగాది కర్మలయందు ఆ కర్మల ఫలితము ప్రసాదించుట ఈమె సహజగుణము. ఈమె భగవంతుడైన విష్ణువునకు శక్తిస్వరూప. ఈ దేవి శుభ, శుద్ధిగ- శుద్ధిరూప- సుశీల అనే నామాలతో ప్రసిద్ధిపొందింది.
ఈమెను పూజించిన విధానాన్ని ధ్యాన స్తోత్ర పూజావిధాన క్రమము ‘కణ్వశాఖ’లో వర్ణించి ఉంది.
దక్షిణాదేవి దగ్గరకు యజ్ఞపురుషుడు వచ్చాడు. ఆమెను చూసి మోహితుడైనాడు. ఆమెతో ఇలా సంభాషించాడు. ‘ఓ సౌభాగ్యవతీ! నీవు నా అదృష్టవశాన నాకు లభ్యమైనావు. కార్తిక పౌర్ణమినాడు జరిగే రాధామహోత్సవము జరుగుతున్నప్పుడు భగవతి మహాలక్ష్మి దక్షిణభాగంనుండి నీవు ప్రకటితమైనావు. నీకు దక్షిణగా పేరిడి నిన్ను పూజించినారు. దీనిని చూసిన రాధాదేవి నీవు గోలోకమును వీడెదవుగాక’ అని శాపమిచ్చింది. కనుక నా సౌభాగ్యవశముచే నీవు నాకు ప్రాప్తమైనావు. కనుక నీవు నన్ను భర్తగా అంగీకరించు’ అన్నాడు. ఇంకా ఇలా చెప్పాడు ‘ఓ దక్షిణాదేవి నీవు పురుషులు చేయు పురుషుల కర్మకు ఫలమును ప్రసాదించు ఆదరణీయురాలవగుదువు. నీవు లేకుంటే ప్రాణులందరి కర్మలన్నియు నిష్ఫలములగును. నీవు లేకున్న కర్మలు చేయువారి కర్మలు రాణించవు. శోభిల్లవు. త్రిమూర్తులు, దిక్పాలకులు, సకల దేవతలు నీవు లేకున్నచో కర్మల ఫలములనొసగుటకు అసమర్థులౌతారు.
త్రిమూర్తులలో బ్రహ్మస్వయంగా కర్మరూపుడు. పరమశివుడు ఫలరూపుడు. విష్ణువగు నేను యజ్ఞరూపమున ప్రకటితుడిని. వీరందరికీ నీవే సారరూపము. ఫలములందించు పరబ్రహ్మ నిర్గుణయుగు భగవతి ప్రకృతి భగవంతుడైన శ్రీకృష్ణుడు నీ సహయోగము వలన శక్తిమంతులై విరాజిల్లుతున్నారు. నీవే నా శక్తివి. జన్మజన్మాంతరములలో నిరంతరం నీవు నా సమీపమున వసింపుము. నేను నీ సకల కార్యములందు సాయమొనరించి సఫలుడనౌదునని యజ్ఞపురుషుడు దక్షిణాదేవితో సంభాషించాడు.
ఆ యజ్ఞపురుషుని మాటలకు యజ్ఞ అధిష్టాత్రీదేవి భగవతి దక్షిణ ప్రసన్నురాలైంది. ఆ యజ్ఞపురుషుని తన నాథునిగా స్వామిగా స్వీకరించింది. ఇది భగవతి దక్షిణాస్తోత్రం. ఈ స్తోత్రపాఠమును పఠించిన వారికి సకల యజ్ఞముల ఫలము సులభవౌతుంది. ఈ దక్షిణాస్తోత్రమును పఠించినవారికి అనుకొన్న పనులన్నీయు కూడా నిర్విఘ్నముగా నెరవేరును. దక్షిణాదేవి ఉపాఖ్యానము చదివిన వారికి సకల కర్మల ఫలములను ప్రసాదించు. ఈ తల్లిని స్మరించినవారికి సకల కోరికలు ఈడేరుతాయి. వారి కర్మలన్నీ సఫలీకృతవౌతాయి. సంతానవృద్ధి, ఐశ్వర్యవంతులౌతారు.ఆపదలల్లో ఉన్నవారెవరైనా ఈ దక్షిణాస్తోత్రమును పఠించినచో వారికి ఆపదలు దూరమవుతాయి. యజ్ఞములుగానీ, కర్మలను గానీ చేసిన వెంటనే కర్తఅయిన వాడు దక్షిణను తప్పక ఇవ్వాలి. అప్పుడే సద్యోఫలప్రాప్తి కలుగుతుంది. ఒకవేళ ఈ విషయం తెలుసుకొనక ఇవ్వకపోతే ఆ తల్లి అనుగ్రహం పొందడంలో వెనుకంజపడవచ్చు. కనుక భగవతి దక్షిణను ఉపాసించి దక్షిణ ప్రాముఖ్యతను తెలుసుకొని అందరూ ఆచరణలో చూపించి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఆ దేవి అనుగ్రహానికి పాత్రులు కావాలి.

- పి.వి. సీతారామమూర్తి 9490386015