మెయిన్ ఫీచర్

చూసేలా తీస్తేనే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తీసేలా తీస్తే.. చూసేవాళ్లు చూస్తారు. ఈ విషయాన్ని లెక్కలేనన్ని సినిమాలు లెక్కలేనన్నిసార్లు రుజువు చేశాయ. చేస్తూనే ఉన్నాయ. సినిమా కషా టలతో చిన్న సినిమా కుదేలైపోతుందని గగ్గోలు పెట్టే సమయాన్ని.. ప్రేక్షకుడికి దగ్గరయ్యే సత్తావున్న సినిమాగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయాలపై ఒకింత దృష్టిపెడితే -్భరీ బడ్జెట్ సినిమాను సైతం ఢీకొట్టే సత్తా ఉన్న సినిమాలు వస్తాయ. పోటీని తట్టుకుని పది తరువాత ఇరవై.. తరువాత వంద థియేటర్లకు విస్తరిస్తాయ.
ఇది విశే్లషణ కాదు, ప్రేక్షకుడి మాట.

సినిమా అంటే... సినిమా!
సినిమాలో -తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, తమిళం ఇలా భాషా చిత్రాలు ఉంటాయేమోగానీ... చిన్న సినిమా, పెద్ద సినిమా, బుల్లి సినిమా.. భారీ సినిమాల్లాంటి తేడాలు ఏమీ ఉండవు. సినిమా బడ్జెట్టు.. అందులో నటీనటులు.. నిర్మాణ సంస్థ స్థాయి.. ప్రాజెక్టుకు ఇచ్చే బూస్టప్.. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చిన్నా పెద్దా అన్నది మనం అన్వయించుకుంటున్నాం అంతే. నిజానికి.. ఈ అన్వయింపునకు ప్రత్యేకమైన కొలమానం కూడా ఏమీ ఉండదు. స్టార్ ఇమేజ్ వున్న నటులు చేస్తే పెద్ద సినిమా అని ముద్ర వేసేస్తాం. కొత్త లేదా స్టార్ ఇమేజ్‌లేని వారితో సినిమా రూపొందిస్తే చిన్న సినిమా అన్న ట్యాగ్‌లైన్ తగిలిస్తాం. లేదూ బడ్జెట్‌ను బట్టి, వసూళ్ల స్థాయినిబట్టి, విడుదలవుతున్న థియేటర్లను బట్టి.. ఇలా రకరకాల కొలమానాల ప్రాతిపదికన చిన్న, పెద్ద సినిమా అంటున్నాం తప్ప, నిజానికి సినిమాపరంగా అలాంటి సైజులు ఏమీ ఉండవు. ఏ సినిమా నిర్మించాలన్నా పరిశ్రమలోని ‘ట్వెంటీఫోర్ ప్రేమ్స్’ అహరహం కలిసి కష్టపడాల్సిందే. నిజానికి ప్రేక్షకుడూ చిన్న సినిమా, పెద్ద సినిమా అని చర్చించుకుంటున్నా -అంతరాల విషయంలో అంత సీరియస్‌గా ఉండడు. కథలో నాణ్యత, కథనంలో నవ్యత ఉంటే ఏ సినిమానైనా మళ్లీ మళ్లీ చూస్తాడు. రిపీట్ ఆడియన్ అవుతాడు. సినిమా బాగలేదనిపిస్తే -పెద్ద సినిమా అంటూ ఆర్భాటంగా వెయ్య థియేటర్లలో విడుదలైనా నేలకేసి కొట్టేస్తాడు. బాక్సాఫీస్ లెక్కల్లో చుక్కలు చూపిస్తాడు.
చాలాకాలంగా పరిశ్రమలో కొందమంది నుంచి వినిపిస్తున్న మాట -చిన్న సినిమాను చిదిమేస్తున్నారని. పెద్ద సినిమాలు వరుసగా విడుదలయ్యే ప్రతిసారీ -చిత్ర పరిశ్రమ నుంచి వినిపించే మాటే ఇది. చిన్న సినిమా ప్రదర్శనకు థియేటర్లు దొరకడం లేదన్న ఆవేదనా వీరినుంచి వినిపిస్తూ ఉంటుంది. థియేటర్లపై కొందరి గుత్త్ధాపత్యం కొనసాగుతోందని, అందువల్లే చిన్న సినిమాల ప్రదర్శనకు థియేటర్లు లభించడం లేదన్న అభియోగం ఎక్కువగా వినిపిస్తోంటుంది. ప్రధాన నగరాలు, పట్టణాల్లోని కొన్ని థియేటర్లపై కొందరి గుత్త్ధాపత్యం కొనసాగుతోన్న మాట వాస్తవమే. అది -ఇప్పుడే మొదలైంది కాదు. చాలా ఏళ్లుగా ‘బిగ్‌షాట్స్’ చేతిలోనే థియేటర్లు ఉండిపోయాయన్నది కాదనలేని నిజం. అయితే, అందువల్లే చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం లేదనడం మాత్రం సబబుకాదు.
కేవలం భారీ బడ్జెట్ సినిమాలనే థియేటర్లలో ఆడించాలంటే, ఎప్పటికీ ఎవరికీ సాధ్యంకాదు. ఎందుకంటే, తెలుగు చిత్ర పరిశ్రమలో సాలీనా 20కి మించి స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉండవు. ఇవన్నీ గ్యారంటీగా సూపర్ హిట్ అవుతాయన్న నమ్మకమూ ఉండదు. సినిమా నచ్చకపోతే, అది ఎంత బడ్జెట్‌తో తీసిన సినిమా అయినా, ఏ హీరో నటించిన సినిమానైనా ప్రేక్షకుడు తిప్పి కొడుతున్నాడు. రెండోరోజుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల లెక్కల్లో చుక్కలు చూపిస్తున్నాడు. అందువల్ల ఏ థియేటర్ వాళ్లయినా తమ థియేటర్ నిర్వహణకు తప్పనిసరిగా చిన్న సినిమాలు ప్రదర్శించక తప్పదు. అలాకాదని మొండికేస్తే, థియేటర్‌ను మూసేయక తప్పదు. సో.. చిన్న సినిమాల ప్రదర్శనకు థియేటర్లు దొరకడం లేదన్నది అర్థంలేని వాదన.
ప్రస్తుతం సినీ నిర్మాణానికి మంచి క్రేజ్ ఉంది. చిత్ర పరిశ్రమకు చెందిన వారికి మంచి గుర్తింపూ దొరుకుతుంది. ఈ గుర్తింపు కోసమే పలువురు నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు. ఇతర వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదించినవారు, ఆ సొమ్ముతో చిత్ర నిర్మాణం పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇది మంచి పరిణామమే. కానీ, సొమ్ముంటే సరిపోదని, చిత్ర నిర్మాణం పట్ల సరైన అవగాహన ఏర్పర్చుకోవాలన్న ఆలోచన లేకపోవడమే కొంప ముంచుతుంది. కనీస అవగాహన లేకుండా నిర్మాతలుగా మారుతున్నవారు, పరిశ్రమలో తొలి సినిమాతోనో లేక సినిమా పూర్తి చేయకుండానేనో బోర్లాపడుతున్న ఉదాహరణలు కోకొల్లలు. సాధారణంగా ఏ రంగంలోనైనా బాగా డబ్బు సంపాదించినవారి చుట్టూ కోటరీ ఏర్పడుతుంది. అదే సమయంలో అతి తక్కువ ఖర్చుతో సినిమా నిర్మించి, కోట్లాది రూపాయలు లాభాలొచ్చేలా చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపించే కొందరు వ్యక్తులూ కొత్త నిర్మాతల కొంప ముంచుతున్నారు. సినిమాపై కమిట్‌మెంట్ లేకుండా, కబుర్లతో పడిగొట్టే వారి వలకు చిక్కి ఆర్థికంగా శల్యమవుతున్న నిర్మాతలు పరిశ్రమలో లెక్కకు మించి కనిపిస్తారు.
కొత్తగా నిర్మాతల అవతారం ఎత్తుతున్న వారిలో 80 శాతం మందికి చిత్ర నిర్మాణం పట్ల సరైన అవగాహన ఉండదు. చిత్ర నిర్మాణ సమయంలో చెప్పే బడ్జెట్‌కు, సినిమా నిర్మాణం పూర్తవ్వడానికి అయ్యే ఖర్చు మధ్య అంతరం చెప్పలేనంత. చిత్ర నిర్మాణం అనేది కదనరంగం లాంటిది. ఒకసారి బరిలోకి దిగిన తరువాత విజయమో? వీర స్వర్గమో తప్పదు. లేకపోతే ప్రత్యర్థికి బందీగా చిక్కాలి. అదేవిధంగా డబ్బు ఉన్నా లేకున్నా చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించిన తరువాత ఏదొక విధంగా పూర్తిచేయాలి. లేకపోతే లక్షలాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతాయ. ఒకవేళ చిత్ర నిర్మాణం మధ్యలో ఆగిపోతే దాన్ని తిరిగి ప్రారంభించడం కష్టంతో కూడిన పని. మధ్యలో నిర్మాణం ఆగిపోయి, మళ్లీ వాటివంక చూసే పరిస్థితి లేని సినిమాలు ఎన్నో.
అష్టకష్టాలుపడి చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసినా, విడుదలకు నోచుకోని సినిమాలు నేటికీ ఎన్నో. దీనికి కారణం సినిమా విడుదలకు, ప్రమోషన్‌కు అవసరమైన డబ్బు నిర్మాతల వద్ద లేకపోవడమే. గతంలో సినిమాల ప్రదర్శనకు ప్రింట్లు ఉపయోగించేవారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కనుక, ప్రింట్ల స్థానంలో ‘క్యూబ్’ విధానం వచ్చింది. దీంతో అటు నిర్మాతలకు ఇటు పంపిణీదారులకు ప్రింట్ల ఖర్చు తగ్గింది. ‘క్యూబ్’ నిర్వాహకులకు సొమ్ము చెల్లిస్తే శాటిలైట్ ద్వారా థియేటర్లలో సినిమా ప్రదర్శించొచ్చు. ఎన్ని ఆటలకు డబ్బు చెల్లిస్తే అన్ని ఆటలకు మాత్రమే క్యూబ్ ద్వారా ప్రదర్శించే అవకాశం ఉంటుంది. సాధారణంగా వారానికి ఒక థియేటర్‌లో 28 ఆటలు ప్రదర్శిస్తారు. అయితే, క్యూబ్‌కు డబ్బు చెల్లించడానికీ కొందరు నిర్మాతలు వెనుకంజ వేస్తున్నారు. దీన్నిబట్టి సదరు నిర్మాతకు తను నిర్మించిన సినిమామీద ఎంత నమ్మకం ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది.
ప్రతి హీరోకీ ఒక రేంజ్ ఉంటుంది. ఆ హీరోతో చేసిన ఒక్క సినిమా బాగా సొమ్ము చేస్తే, ఇక ఆ హీరో రేంజ్ పెంచుకుంటూ వెళ్తాడు. అతని బిజినెస్ రేంజ్‌కు తగ్గట్టుగానే సినిమా నిర్మాణానికీ నిర్మాతలు బడ్జెట్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఇలా బడ్జెట్‌ను పెంచుకుంటూ పోవడం కూడా ముంచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తీసిన సినిమా ప్రేక్షకాదరణ పొందినప్పటికీ, అంచనాలకు అందని రేంజ్‌కు చేరుకోలేక అటు నిర్మాతలకు ఇటు పంపిణీదారులకు నష్టాలే మిగులుతున్నాయి.
తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో మాదిరిగా కథలో నవ్యత, కథనంలో నాణ్యతలతో చిత్ర నిర్మాణం చేపట్టకుండా ఇతరులను నిందిస్తూ కాలం గడపడం వలన మనం అనుకునే చిన్న సినిమాకు ఎటువంటి లాభమూ ఉండదన్న విషయాన్ని గుర్తెరగాలి. సినిమాను సినిమాలాగే నిబద్ధతతో తీస్తే -సెనె్సషన్ సృష్టిస్తున్న చిన్న సినిమాలు ఎన్ని రాలేదు. చిన్న సినిమాగా విడుదలైన ‘క్షణం’ ఒక్కటి చాలు, -చిన్న సినిమాను బతకనివ్వడం లేదన్న అపవాదును కొట్టిపారేయడానికి. ఏమంటారు?
...............................
క్షణం

మాజీ ప్రియురాలి లైఫ్‌తో విధి ఆడిన సస్పెన్స్ క్రైం నాటకాన్ని హీరో చేధించిన ఇనె్వస్టిగేషన్ థ్రిల్లర్ కథ. సస్పెన్స్ ఎడిసోడ్స్, రొమాంటిక్ సీన్స్‌తో కథను అల్లుకోవడంలోనే కాదు, నటనలోనూ మంచి వేరియేషన్స్ చూపించి వన్‌మాన్ షో ఆడేశాడు అడవి శేష్. ఆడియన్స్‌కి కావాల్సింది అందేసింది కనుక -హిట్ మార్కులేసేశారు.

కృష్ణగాడి....

ఫ్యాక్షన్ బ్రాక్‌డ్రాప్‌లో కథను చూపిస్తూ.. సాధారణ జీవితం నడిపే హీరోకి, గొప్పింటి అమ్మాయకి మధ్య ప్రేమ అగచాట్లు, ప్రేమను గెలిచుకోవడానికి హీరోకి ఫిక్స్ చేసిన టార్గెట్టే ప్రాజెక్టుకు ప్లస్ పాయంట్లు. ఎవడే సుబ్రహ్మణ్యం, భలెభలె మగాడివోయ హిట్లు కొట్టిన హీరో నాని కోణంలో సినిమాను నడిపించేయడం -ప్రాజెక్టు పర్‌ఫెక్ ట స్కెచ్.

నేనూ.. శైలజ

చిన్నప్పటి స్నేహిత ప్రియురాలిని వదులుకోలేక -పెళ్లి కుదిరిందని తెలిసీ.. ఆమె ఇంటికెళ్లి తిష్టవేసి.. పెద్దవాళ్లను ఇంప్రెస్ చేసి.. ప్రేమను పెళ్లి పీటలెక్కించేసీ.. బాక్సాఫీస్ రొటీన్ హిట్టు ఫార్ములానే కొత్తకోణంలో చూపిస్తూ ఎమోషనల్ బాండింగ్‌కు కనెక్ట్ చేసే కథ. జాగ్రత్తలు తీసుకున్నారు కనుకే, పడిపోయన హీరో రామ్ గ్రాఫ్‌ను నిలబెట్టింది.
..............................

-మస్తాన్‌రావు