మెయిన్ ఫీచర్

పడిలేచిన కెరటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె మూడు జాతీయ అవార్డులు స్వీకరించిన ఏకైక నటి. రెండుసార్లు జాతీయ అవార్డులు స్వీకరించిన షబానాఅజ్మీ తరువాత మరెవ్వరు మూడు సార్లు ఈ అవార్డు తీసుకోలేదు. బాలీవుడ్‌లో ముగ్గురు ఖాన్స్ మద్దతు లేకుండా సొంతంగా ఎదిగిన టాలెంటెడ్ హీరోయిన్. రొమాంటిక్ కామెడీతో ‘‘తను వెడ్స్ మను’’ సినిమాతో తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకున్న కంగనా రనౌత్ జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో విమర్శలు, ప్రశంసలు కలగలిపితేనే ఆమె జీవితం. ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో వచ్చిన విభేదాలపై చట్టపరంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్న తెగువ గల నటి. ఇటీవల ఆమె తన జీవితంలో ఎదురైన ఎన్నో ఎత్తుపల్లాలపై స్పందిస్తూ.. అంతే ముక్కుసూటిగా తన హృదయ స్పందనను తెలియజేసింది.
ఉన్నత కుటుంబ నేపథ్యం..
హిమాచల్‌ప్రదేశ్‌లో పుట్టిన కంగన కుటుంబ సభ్యులందరూ బాగా చదువుకున్నవారే. ఆమె తాత ఎమ్మెల్యే. మరో తాత ఐఏఎస్ అధికారి. తల్లి టీచర్. తండ్రి వ్యాపారవేత్త. డాక్టర్ అవ్వాలనే ప్రయత్నంలో విఫలమై.. స్వతంత్రంగా జీవించాలనే ఆశయంతో ఆమె ఒంటరిగా ఢిల్లీలో అడుగుపెట్టింది. అక్కడ అనుకోకుండా మోడలింగ్‌లోకి ప్రవేశించటం చకచక జరిగిపోయింది. ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమెకు తొలి సినిమా అవకాశం 2004లో ‘గ్యాంగ్‌స్టర్’తో వచ్చింది.
యోగా గురువే మార్గదర్శి
కంగనా 18 ఏళ్ల వయసులో ముంబయిలో అవకాశాల కోసం తిరుగుతుండగా.. ఓ రోజు జుహు బీచ్‌లో యోగాసనాలు వేస్తున్న సూర్య నారాయణ సింగ్ అనే గురువును చూసింది. ఆయనకు తన వద్ద ఉన్న డబ్బునంతా ఇచ్చేసి యోగాసనాలు నేర్చుకుంది. ఇప్పటికీ ఆయనే ఆమెకు యోగా గురువు.సినిమా అవకాశాలు రాకపోవటం. వచ్చినా ప్రతిభను ప్రదర్శించే పాత్రలు రాకపోవటంతో జీవితం మీద విరక్తి పెరిగింది. కంగనాలో ఏర్పడుతున్న నిరాశ నిస్పృహలను గమనించిన యోగా గురువు సూర్యనారాయణ సింగ్ ఆమెకు కొన్ని స్వామి వివేకానంద రాసిన పుస్తకాలు ఇచ్చి చదవమన్నారు.
సేవామార్గంలో పయనం..
తాను సంపాదిస్తున్న సొమ్ములో ఎక్కువ భాగం సేవాకార్యక్రమాలకే వినియోగిస్తోంది. మహారాష్టల్రోని థానే జిల్లాలో ఉన్న రామకృష్ణ మఠానికి క్రమం తప్పకుండా వెళుతుంది. అక్కడ వక్తిత్వ వికాస పాఠాలు బోధిస్తుంది. మఠం చేపట్టే ఎన్నో సేవాకార్యక్రమాలకు ఆమె ధన సహాయం చేస్తోంది. మఠం నిర్వహించే ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు సమకూరుస్తోంది.
మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలకే..
మహిళల పట్ల బాధ్యతాయుతంగా ఉండే కంగనా అలాంటి పాత్రలనే పోషిస్తూ హీరోయన్ ఇమేజ్‌ను సంపాదించుకుంది. అందుకే తన వ్యక్తిత్వంపై ముప్పేటా దాడి జరిగినా.. ఏమాత్రం చలించకుండా కొరడా దెబ్బల వంటి సమాధానాలు ఇచ్చి నోర్లు మూతబడేటట్లు చేసింది. ఆమె పిచ్చిదని వేసిన ముద్రను తన నటనతోనే తిప్పికొట్టగలిగింది. మహిళ గౌరవానికి భంగం కలిగించే ఫెయిర్‌నెస్ క్రీముల యాడ్స్‌లో సైతం ఆమె నటించటానికి అంగీకరించలేదు. నలుపు రంగు ఎక్కువగా ఉండే మహిళలను అవమానించటం తనకు ఇష్టం లేదని.. కోట్లు ఇస్తామన్నా తిరస్కరించిన గొప్ప నటి. అందం చర్మకాంతిలో రాదని, వ్యక్తిత్వంలో వస్తుందని చెబుతుంది. ఏదిఏమైనప్పటికీ బాలీవుడ్‌లో వినూత్న నటిగా చెరగని ముద్ర వేసుకున్న ఈ నటి ఇప్పటికీ తాను హిందువునని, స్వామి వివేకానంద, భగవద్గీతే తనకు ప్రేరణ అని బహిరంగంగా ప్రకటించిన ఏకైక ధీర నటి.

స్వామి వివేకానందే స్ఫూర్తి..

స్వామి వివేకానంద పుస్తకాలు చదివిన తరువాత ఆమెకు జీవితం కొత్తగా అనిపించింది. యోగాను విపరీతంగా సాధన చేసింది. రాజయోగ సాధనకు మించి కుండలినీ యోగా చేసే స్థాయికి ఆమె వెళ్లగలిగింది. దాదాపు రెండేళ్లు ఒక యోగినిగా జీవించింది. తెలుపు, నలుపు దుస్తులు మాత్రమే ధరించేది. కాని ఈ రంగుల ప్రపంచం ఆమెను ఓ పిచ్చిదాని వలే చూసింది. అందుకే తోటి నటులు ఆమెను సైకో అని ముద్ర వేసింది. కాని వాటన్నింటిని ఆమె లెక్కచేయలేదు. తరువాత ఆమె తన కెరీర్ మీద దృష్టి సారించింది. మూడు పదులు దాటని వయసులోనే పరిణితి చెందిన సీనియర్ హీరోయిన్‌ల నటనను ప్రదర్శించగల ప్రతిభ ఉన్న ఈ నటి చేతినిండా నేడు సినిమాలు ఉన్నాయి. అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. అలా తనలో దాగివున్న నటిని మళ్లీ మేలుకొల్పి బాలీవుడ్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకుంది.

ఖాన్స్‌తోనే చేయాలా..

బాలీవుడ్‌లో ఖాన్స్‌తోనే సినిమా చేయాల్సిన అవసరం ఉందా అని సూటిగా ప్రశ్నిస్తోంది. సినిమాల్లోకి రావటానికి సొంత తండ్రి మాటనే జవదాటి వచ్చాను. నా తండ్రి నాకిచ్చిన స్వేచ్ఛ వల్ల జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎవరో నడవమన్నట్లు నడవను. నాస్వభావానికి అనుగుణంగా నడుచుకుంటాను. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినపుడు ప్రారంభంలో పెద్ద హీరోలతో నటించాలని అనుకున్నా.. కాని ఆవకాశాలు రాలేదు. దీంతో సంప్రదాయ మార్గానే్న అనుసరించాను. ఖాన్స్‌తో నటిస్తేనే నటిగా నిలుదొక్కుకోగలం అనుకోవటం పొరపాటు. తన జీవితంలో ఇటీవల కాలంలో చోటచేసుకుంటున్న వివాదాస్పద సంఘటనలు ఒకింత ఆశ్చర్యానికి గురిచేసినా నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ వివరణలు ఇస్తున్నాను. సర్కస్‌లో జంతువును ఆడించే విధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోలేదు. సైకో అని నిందించిన యువ హీరోకు అంతే ఘాటుగా సమాధానం ఇస్తూ.. ‘అసూయ, క్రూరత్వం ఆయన మాటల్లో దాగివుందని, చిత్రసీమలో నన్ను నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. వాటిని ధైర్యంగానే ఎదుర్కొంటాను. ఎందుకంటే నేను స్వామి వివేకానంద బోధనలతో ప్రేరణ పొందినదాన్ని. అంతేకాదు హిందువుని.’ అని అంటోంది

-హరిచందన