మెయన్ ఫీచర్

పారడైజ్ లాస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలియస్ అసాంజే వెలువరించిన ‘వికీలీక్’ పేపర్లు సృష్టించిన ప్రకంపనలు సద్దుమణగకముందే పనామా పత్రాలు బయటకు వచ్చాయి. వీటిల్లో బ్రిటన్ చైనా రష్యా భారత్ వంటి ప్రపంచ అధినేతల పేర్లున్నాయి. వీరంతా నల్లకుబేరులు. అంటే తమతమ దేశాలకు చెందిన ఆస్తులను లెక్కపత్రం లేకుండా హవాలా మనీలాండరింగ్ మార్గాలలో ఏవేవో బ్యాంకులలో దాచుకున్నవారు వాటికి పన్ను కట్టలేదు. డబ్బు-ఎకౌంట్స్ కోడ్ నేమ్స్‌తో ఉంటాయి. ఒక్క బోఫోర్స్ శతఘు్నల కొనుగోలుకు సంబంధించిన మొత్తాలేకాదు అగస్టా ఛాపర్ కొనుగోళ్లు జలాంతర్గాముల కొనుగోళ్ల వంటి ఎన్నో రక్షణ శాఖకు సంబంధించిన క్రయవిక్రయాల కమీషన్లన్నీ స్వీడన్, వర్జిన్ ఐలండ్, మారిషస్, దుబాయి వంటి ఎన్నో దేశాలలోని బ్యాంకులకు చేరాయి.
ఇప్పుడు పారడైజ్ పత్రాలు విడుదల అయినాయి. వాషింగ్టన్‌లోని ఒక దర్యాప్తు సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. మొత్తం 180 దేశాలకు సంబంధించిన వారి పేర్లు ఇందులో ఉన్నాయి. భారతదేశానికి సంబంధించిన 714 మంది పేర్లున్నాయి. ఇండియా అవినీతి పత్రాల బాగోతంలో 19వ స్థానంలో ఉంది. జర్మనీకి చెందిన సూడేషీ డి టాంగ్ పత్రిక ఈ వివరాలు వెల్లడించింది. 13.4 మిలియన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. వందలాది జర్నలిస్టులు అహోరాత్రులు పరిశ్రమ చేసి ఈ జాబితాలు సేకరించారు. వీటిని పరిగణనలోనికి తీసుకుని దర్యాప్తు జరుపుతాము అని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఐతే ఈ జాబితాలో ఉన్నవారి పేర్లు చూస్తే ఈ ‘విచారణ’ అంత సులభం కాదు-అనిపిస్తుంది. ఎందుకంటే వీరిలో గుజరాత్ ప్రముఖులు కూడా ఉన్నారు. ముఖేష్ అంబానీపై చర్య తీసుకోవడం సాధ్యమేనా? లోగడ పనామా పత్రాల ప్రకంపనల వలన కొందరు దేశాధినేతలు ఇబ్బందులలో పడ్డారు. వారితో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఉండటం గమనార్హం.
బ్రిటన్ రాణి ఎలిజబెత్ రష్యా అధిపతి పుతిన్ చైనా అధ్యక్షుడు జింగ్ వంటివారిపై చర్యలు తీసుకోవడం ఎలా సాధ్యం? హిందీ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ పేరు లోగడ పత్రాల్లో ఉన్నట్లే ఈ పారడైజ్ పత్రాల్లో కూడా ఉంది.
ప్రముఖ వ్యక్తులు.. సంస్థలు
పన్ను ఎగవేయడం దేశ సంపదను విదేశాలకు తరలించడం వంటివి లోగడ యుపిఎ పరిపాలనాకాలంలో జరిగాయి. అప్పుడు స్విట్జర్లాండ్‌లోని బ్యాంకు ఖాతాలలో దాచిన డబ్బు వివరాలు తెలుసుకోవడం కష్టమైంది. అందుకు రెండు కారణాలు. మొదటిది ఆ బ్యాంకులు సీక్రెసీని పాటిస్తాయి. రెండవది అక్కడి అకౌంట్లు కోడ్‌నేమ్స్‌లో ఉంటాయి. తులీప్ లోటస్ అనే పేర్లతో ఉన్న ఎకౌంట్లు రాజీవ్‌గాంధీకి చెందినవి అని విచారణలో అనుమానించారు. మరికొన్ని ఎకౌంట్లు ఇటలీ దేశ పౌరుల పేర్లతో ఉన్నాయి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న భారతీయ వ్యక్తుల సంస్థల పేర్లు ఇలా ఉన్నాయి.. అమితాబ్‌బచ్చన్, మాన్యతదత్, నీరారాడియా, సచిన్‌పైలట్, జయంత్‌సిన్హా, రవీంద్ర కిశోర్, వాయలార్ రవి కుమారుడు రవికృష్ణ, కార్తి చిదంబరం, వైఎస్ జగన్మోహనరెడ్డి, విజయ్‌మాల్యా, అశోక్ పీఠ్, హర్ష, విల్సన్‌రాస్, ముఖేశ్ అంబానీ.
ఇండియన్ పీనల్‌కోడ్ 120 ప్రకారం వీరిపై చర్య తీసుకోవచ్చు. ఐతే ఇదంతా ‘కుట్ర, కక్షసాధింపు చర్య’ అంటున్నారు. ‘నాకెట్టి సంబంధమూ లేదు. నేను ఆ సంస్థకు ఎప్పుడో ట్రస్టీగా ఉన్నాను. ఇప్పుడు కాదు’ అని అమితాబ్ సమర్థించుకున్నాడు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సిఇఐ (స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) ఇప్పుడు రంగంలోకి దిగింది. విజయ్‌మాల్యా సంస్థలపై నిఘాపెట్టింది. ఫైనాన్షియల్ స్టెబిలిటి అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ వంటి బహుళ నియంత్రణ వేదికలపై ఇప్పుడు పరిశోధన మొదలయింది.
నరేంద్రమోదీ భారత ఆర్థిక రంగంలోని దుర్మార్గాలను ప్రక్షాళన చేసే నిమిత్తం పెద్దనోట్ల రద్దు అనే పెద్ద అంగ వేశారు. అదే క్రమంలో ఈ పనామా, పారడైజ్ పత్రాలను పరిగణనలోకి తీసుకొని డబ్బును ఇండియాకు తెప్పించవలసి ఉంది. ఇందుకు చాలా ఇబ్బందులు, అంతర్జాతీయ నిబంధనలు ఉన్నమాట నిజమే. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ‘‘జగన్‌రెడ్డి విజయసాయిరెడ్డిగార్ల పేర్లు పారడైజ్ పత్రాలలో ఉన్నాయని’’ నిర్ధారించారు. దీనిని జగన్‌రెడ్డి ఖండించారు. ‘ఒకవేళ నా పేరు ఉండి ఉంటే నన్ను పదిహేను రోజులలోగా అరెస్టు చేయండి’ అని జగన్‌రెడ్డి సవాలు విసిరారు. ఇక్కడ ఒక సాంకేతికమైన చట్టపరమైన అంశం ఉంది. లోగడ వికీలీక్ పేపర్లు పనామా పేపర్లలో వచ్చిన పేర్లు కేంద్రానికి తెలిసినప్పటికీ ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు పారడైజ్ పత్రాల సంగతి కూడా అంతే. ఎందుకంటే ఈ లీకైన పత్రాలకు సంబంధించి విచారణ జరగాలి. ఆ తర్వాత వాటిని కోర్టులకు సమర్పించాలి. వారు నిదానంగా పరిశీలించి వీలువెంట తీర్పు వెలువరిస్తారు. అంటే అరెస్టు చేసే అధికారం, ఉరితీసే అధికారం సుప్రీంకోర్టుకే ఉందికాని రాష్ట్ర ప్రభుత్వములో మంత్రికి లేదు. ఇదీ సంగతి.
ఇక రెండవ అంశం కార్తి. పి.చిదంబరంగారి కుమారుడు. సచిన్ పైలట్. రాజేష్‌పైలట్ గారి కుమారుడు. వీరిద్దరూ కేంద్రమంత్రులుగా పనిచేశారు. ఇక జగన్‌రెడ్డి. ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వై.ఎస్. తనయుడు. ఈ పెద్దలంతా సోనియా అనుగ్రహం వల్లనే అధికారంలోకి వచ్చారు. అంటే ఆమె వీరిని ధన సంపాదనకు అనుమతించింది. అంటే తన సంపాదనకు ఇలాంటి వారిని క్విడ్‌ప్రోకోగా వాడుకున్నదని పరిశోధనలో వెల్లడి అవుతున్నది. ఇప్పుడు భారత ప్రభుత్వం సిబిఐ ద్వారా విచారణ జరిపిస్తుంది. ముందుగా పత్రాలలో పేర్కొన్న సంస్థలకు విదేశీయ అనుబంధ సంస్థలున్నాయా? ఉంటే వారు లోగడ సమర్పించిన వార్షిక నివేదికలను, నూతనంగా వెలుగులోకి వచ్చిన మొత్తాలతో బేరీజు వేసుకొని చూస్తుంది. తేడావచ్చినప్పుడు కేసు నమోదు చేస్తుంది. అందుకు ఆయా దేశాల బ్యాంకులు ప్రభుత్వాలు సహకరిస్తే సమన్వయం కుదురుతుంది. అర్థమయిందికదా! ఇది కాలహరణ ప్రక్రియ. అవే నేరాలు నిరూపణ అయినా విజయమాల్యా లలిత్ మోడీలను ఇండియాకి పిలిపించడంలో భారత ప్రభుత్వం విఫలమయింది. ఎందుకంటే బ్రిటన్ సహకరించడం లేదు. ఇప్పుడు వి.కె.శశికళ దినకరన్‌ల మీద ఐటి దాడులు జరిగితే ఇది రాజకీయ కక్ష సాధింపు అంటున్నారు. ఈ పారడైజ్ విచారణ కూడా ‘వెండెట్టా’ అంటారు.
ముఖ్యమైన గణాంకాలు 5 :
1. పనామా పేపర్ల లీక్ తర్వాత కేంద్రప్రభుత్వం 800 కోట్ల మేరకు పన్ను వసూలు చేసింది.
2. స్విస్ మాగ్‌జైన్ స్వైజన్ ఇల్లస్య్రిస్టే 1991లో ప్రచురించిన ఒక వ్యాసం ద్వారా రాజీవ్‌గాంధీ దాచిన మొత్తం 2.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులు అని తెలుస్తున్నది. ఇది బోఫోర్స్ శతఘు్నల కొనుగోలు ముడుపుల డబ్బు కావచ్చు.
3. సెప్టెంబరు 2017 నాటికి లక్షమంది డైరక్టర్లు గుర్తింపబడ్డారు.
4. 2 లక్షల డబ్బా (బినామీ-షెల్) కంపెనీలు గుర్తించబడ్డాయి.
5. పెద్దనోట్ల ద్దు తర్వాత 13 బ్యాంకుల నుండి 5800 అక్రమ లావాదేవీల సమాచారం అందింది. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ ఎఫైర్స్ పక్షాన 447వ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది.
6. నెదర్లాండ్స్ సింగపూర్ బ్రిటన్ వర్జిన్ ఐలండ్స్ మారిషస్ వంటి దేశాలకు డబ్బు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
లోగడ పనామా పత్రాలలో వెల్లడి అయినవి అధికంగా వ్యక్తుల పేర్లు - ఇప్పుడు పారడైజ్ పత్రాలల్లో సంస్థల పేర్లున్నాయి. అంటే ఈ సంస్థల రిమోట్ కంట్రోల్‌ను పరోక్షంగా ఆయా దేశాల నుంచి ఆయా వ్యక్తులు చేస్తుంటారన్నమాట. ఐసిఐహెచ్ ద్వారా దాదాపు రెండు వందల మంది అనుభవంగల జర్నలిస్టులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొంటారు. 1950 నుండి 2016 వరకు ఖాతాలను వీరు ప్రామాణికంగా పరిశీలిస్తారు. కేమడ దీవులలో ఎలిజబెత్ రాణి దాచిన ధనం ఫోనెస్క్ కంపెనీకి చేరిన బోఫోర్స్ ధనం వందలాది డబ్బా కంపెనీల గుట్టు రట్టు చేస్తారు. సిపిఎం నాయకుడు తెలికపల్లి రవి ఒక సూటి ప్రశ్న వేశారు. ‘‘పాకిస్తాన్ సైనిక నియంతృత్వ దేశం ఐనా పనామా పత్రాలలో నవాజ్ షరీఫ్ పేరు వెల్లడి కాగానే ఆయనపై చర్య తీసుకని పదవీభ్రష్టుడ్ని చేశారు. ఇండాయా ప్రజాస్వామిక దేశం ఐనా ఒక్కడిని కూడా పదవినుండి తొలగించలేదు. ఒక రూపాయి కూడా వెనుకకు తీసుకురాలేదు ఎందువల్ల?’’ దీనికి కేంద్రం సమాధానం చెప్పుతుంది అని ఆశిద్దాం.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్