మెయిన్ ఫీచర్

వైవిధ్యమే.. విజయ రహస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యాపారంలో విజయం సాధించటం అంటే అంత సులువు కాదు. వినూత్న
ఆలోచనలతో దూసుకుపోయే వేగం ఉండాలి. ప్రతి మనిషిలోనూ ఏవో కొన్ని నైపుణ్యాలు దాగి ఉంటాయి. వాటిని మార్కెట్ చేసుకోవటం ఎలాగో చాలామందికి తెలియదు. గడపదాటి బయటకు వస్తున్న నేటి ఆధునిక మహిళకు వస్తువు ఎలా ఖరీదు కట్టాలో తెలుసుకోవటంతో పాటు వ్యాపార
మెలకువలను ఆకళింపు చేసుకుంటూ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. మగవారి ఆధిపత్యం అధికంగా ఉండే వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి తమదైన ముద్ర వేసుకుంటూ దూసుకుపోతున్న వ్యాపారవేత్తలు వీరు. సొంత వ్యాపారం చేయాలనుకునే పలువురికి స్ఫూర్తిగా నిలుస్తారు.

శక్తివంతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటుచేసుకోవాలి

సుమ్మి గంభీర్, కో-్ఫండర్, గ్లోబల్ లింకర్, బిజినెస్ నెట్‌వర్కింగ్ ఫ్లాట్‌ఫామ్.
వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే మహిళలు ఇతరులతో తమ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో తరచూ చూసుకోవాలి. వ్యాపార సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు వినియోగదారులతో దగ్గరవ్వాలి. వారితో సంబంధాలను ఎప్పటికప్పుడు వినూత్నంగా పునరుద్ధరించుకోవాలి. దీని కోసం వెబ్‌సైట్‌ను లేదా ఇతర నెట్‌వర్కింగ్‌ని వినియోగించుకుంటే మేలు.
వ్యాపారంలో నాయకురాలిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. నిపుణులు అందించే సలహాలతో సొంతంగా ఆర్టికల్స్ రాస్తుండాలి. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండాలి. మీ బ్లాగులో మీ అభిప్రాయాలను పంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది.
వ్యాపారవేత్తలు కూడా విజయవంతమైన నాయకులే. అధికారాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ.. జట్టుకు నాయకత్వం వహిస్తే వ్యాపారంలో మేజిక్ చోటుచేసుకుంటుంది.
పరిశ్రమ వ్యవస్థాపకులు ప్రధాన కార్యకలాపాల పట్ల పరధ్యానంగా ఉండరాదు. బాధ్యతలను భుజస్కందాలపై వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనివల్ల మరిన్ని అవకాశాలు వస్తాయి.
కొత్త విషయాలను నేర్చుకోవటానికి నిరంతరం ప్రయత్నించాలి. నిపుణులతో సమావేశాలు నిర్వహించటం, పనిలో మెరుగైన మార్గాలను అనే్వషించటం వల్ల ఉద్యోగులు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకోవచ్చు. వినూత్న ఆలోచనలకు దోహదం చేస్తాయి.
మాటతీరే దోహదం
షీతల్ మెహ్రా, అంతర్జాతీయ ప్రోటోకాల్ కన్సల్టెంట్, ముంబయి
వ్యాపార సమావేశాల నిర్వహణ, ఏమైన ఉత్తర్వులు జారీచేసే సందర్భంలో స్వల్పంగానైనా సలహాలను తీసుకోవద్దు. నేడు వ్యాపార ప్రపంచంలో పోటీతత్వం పెరగటం వల్ల దృఢంగా ఉండటమే మంచిది.
కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంచుకోవటానికి నిరంతరం ప్రయత్నించండి. అలాగే వ్యాపార సమావేశాల్లో ‘నో’ అనే మాటను భావోద్వేగంగానూ, ‘సరే’ అనే పదాన్ని నిష్పాక్షికంగా వాడండి.
ఆపీసులు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి. సమయపాలన అమలు జరిగేటట్లు ఖచ్చితంగా ఉండాలి. మీ ఇంటి నుంచి లేదా ఆఫీసు నుంచి ఏదైన కాల్ వచ్చిందంటే మీరు ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో ఉన్నప్పటికీ స్వీకరించాలి. అత్యవసర సమాచారాన్ని అందజేస్తున్నారని గ్రహించాలి.
బాడీ లాంగ్వేజీ, కదలికలు, ముఖంలోని భావాలు, చూపులు అన్నీ కూడా ఇతరులను ప్రభావితం చేసేలా ఉండాలి. వీటి ద్వారా స్ట్రాంగ్ మెస్సేజ్ వెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రకృతి ధర్మాన్ని కాపాడండి..
దీపాంజలి దాల్మియా -్ఫండర్, హైడే, బయోడిగ్రేడబుల్ అండ్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ కంపెనీ, ఢిల్లీ.
రెగ్యులర్ శానిటరీ నాప్కిన్స్‌ను తొంభై శాతం పాస్టిక్ పాలిమర్స్‌తో తయారుచేస్తారు. యాంటీ బాక్టీరియల్ అంటూ రసాయనాలతో తయారుచేసిన ఫెర్‌ఫ్యూమ్స్ వాడతారు. ఇవి మహిళల శరీరానికి ఎంతో హానికరం.
మహిళల సున్నితమైన భాగాల వద్ద సింథటిక్ నాప్కిన్స్ వాడటం వల్ల గర్భాశయ క్యాన్సర్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అంటువ్యాధులు వ్యాపిస్తాయి. బిడ్డలు లోపాలతో పుట్టే అవకాశాలు కూడా అధికం.
పర్యావరణాన్ని కాపాడండి. ప్రతి ఏడాది మహిళలు తొమ్మిదివేల టన్నుల శానిటరీ నాప్కిన్స్ వృథా చేస్తున్నట్లు అంచనా. వాడేసి పారేయటం వల్ల వేలాది ఎకరాలు వీటితో నిండిపోతున్నాయి. ఆర్గానిక్ నాప్కిన్స్ వాడటం వల్ల విషపూరితమైన వ్యర్థాల నుంచి రక్షణ పొందవచ్చు.
ప్రతి మహిళ తన జీవిత కాలంలో 11 నుంచి 17 వేల వరకు నాప్కిన్స్ ఉపయోగిస్తుందని అంచనా. చాలామంది మహిళలు సింథటిక్ నాప్కిన్స్ వాడటం వల్ల సున్నితమైన భాగాల వద్ద దద్దుర్లు వస్తుంటాయి. ఇలాంటి నాప్కిన్స్ తయారుచేయటం శ్రేయస్కరం కాదు.
ఈ మగువలు వ్యాపార రంగంలో సాధించిన విజయాలు పలువరికి మార్గనిర్దేశనం చేస్తాయ.