మెయిన్ ఫీచర్

గీతాసారం.. జీవన వేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

30న గీతా జయంతి సందర్భంగా..
*
గీకారం త్యాగరూపం స్సాత్
‘త’కారమ్ తత్వ బోధకమ్
గీతవాక్యమిధం తత్వమ్
జ్ఞేయం సర్వముముక్షుబిః- అనగా
‘గీత’ అనే అక్షరం త్యాగాన్ని, ‘త’ అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశిస్తున్నది. గీత అనే రెండు అక్షరములకు అర్థం ఇదేనని ముముక్షువులు చెబుతారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మఫల త్యామనీ లేక సర్వసంగ ఫల త్యాగమని అర్థం ఉంది. అలానే తత్వబోధన ఆత్మ సాక్షాత్కారమనీ, బంధం నుండి విముక్తి కలగటం అనే అర్థం ఉంది. ఈ పరమ రహస్యాన్ని గీతాశాస్తమ్రు ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవనాని నోట వెలువడిన పుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి.
ప్రపంచ సాహిత్యంలో దైవత్వం పొందిన తొలి ధార్మిక గ్రంథం భగవద్గీత. ఐతిహాసికమైన మహాభారతంలోని భాగమైనా, ఉపనిషత్తు స్థాయిని పొందిన కావ్యఖండం. భారత జాతి సంస్కృతికి తార్కాణంగా నిలిచిన జ్ఞాన ప్రవాహం. హిందువులే కాక ప్రపంచమంతా కూడా భగవద్గీతఅనుసరించ దగ్గది. అర్జునునికి చేసే కర్తవ్య బోధ చేసే నెపంతో శ్రీకృష్ణుడు కలియుగంలో మానవులను జాగృతం చేశాడు.
జగద్గురువైన శ్రీకృష్ణుడు గీతామృతాన్ని పంచిన శుభమాసం మార్గశిరం. ‘మాసానాం మార్గశీర్షోహమ్’ అని గీతాచార్యుడు స్వయంగా భగవద్గీతలోని పదో అధ్యాయంలో 35వ శ్లోకంలో చెప్పాడు. మార్గశిర శుద్ధ ఏకాదశిని ‘గీతాజయంతి’గా సంభావిస్తాం మనం. ఈ రోజు కౌరవ రాజు ధృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని చేశారు. ఈ భగవద్గీత మానవుడికి లభించిన దివ్యగ్రంథం. సుమారు ఆరువేల సంవత్సరాల పూర్వకాలం ఉపదేశింపబడగా, ప్రస్తుత కాలపు మానవునకు ఉపయోగపడటం ఇందులోని విశేషం.
లక్ష్యాన్ని తేల్చుకోలేక, మార్గాన్ని ఎంచుకోలేకా, మంచి చెడులిన బేరీజు వేసుకోలేకా, జీవన పరమార్థాన్ని అర్థం చేసుకోలేకా, ఉక్కిరి బిక్కిరైపోతున్న ఆధునిక మానవుడికి భగవద్గీత ఓ కర్తవ్య దీక్షోపదేశం, దేశ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు ‘గీత’ను అత్యుత్తమ వ్యక్తిత్వవికాస గ్రంథంగా అధ్యయనం చేస్తున్నారు. భగవద్గీత మహాభారత యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సన్నద్ధులవుతారు. పాండవ వీరుడైన అర్జునుకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపులా వారు శంఖాన్ని పూరించారు. అర్జునుని కోరికపై శ్రీకృష్ణుడు రథాన్ని మధ్యకు తెచ్చాడు యుద్ధంలో పాల్గొనడానికి వచ్చిన అర్జునుడు తన శత్రువర్గంగా నిలచి ఉన్నబంధువులను, గురువులను, మిత్రులను చూసి యుద్ధ విరక్తుడవుతాడు. అపుడు యుద్ధం చేయడానికి అర్జునుణ్ని సారథియైన కృష్ణుడు కార్యోన్ముఖుడిని చేయడానికి గీతను ప్రబోధం చేశాడు. ప్రశ్నోత్తరాల రూపంలో సాగిన ఈ గీత అర్జునుని సందేహాలకు భగవానుడు బదులిస్తాడు. భగవద్గీత మహాభారతం భీష్మ పర్వంలో వర్ణింపబడిన ఒక మహ్తత్తరమైన సంభాషణ స్వరూపమైన వేదాంత స్రవంతి. 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఉన్న 700 శ్లోకాలకు భగవద్గీత అని పేరు. పద్దెనిమిది అధ్యాయాలుగా విభజితమైన ఈగీతలో సారథియైన శ్రీకృష్ణుడు రథియైన పార్థునికి చేసిన వేద, వేదాంత, యోగ విశేష ప్రభోదాలున్నాయి. ఈ భగవద్గీతకే ‘గీత’ అని చిన్న పేరు. గీతోపనిషత్తు అనే పర్యాయ పదాలున్నాయి. గీతాశాస్త్రంలో ఉపదేశించిన విషయాలు కొత్తగా కల్పించబడినవి కావు. అవి సనాతనమైనవి.
భక్తితోనో, జ్ఞానంతోనో, వైరాగ్యంతోనో సాధించగలిగే ఆధ్యాత్మిక ప్రగతి కర్మయోగం అని శ్రీకృష్ణుడు ఉపదేశించారు. కర్త, భక్త, జ్ఞాన యోగాలనే మూడు జీవన మార్గాలను ఇందు గీతాచార్యుడు సూచించారు. ఆదిశంకరులు తమ భజగోవిందంలో ‘్భగవద్గీత’లోని ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకొని జీవితంలోఅనుసరించినా ‘మోక్షం’ లభిస్తుందని బోధిచాయి. ‘్భగవద్గీత కించ ధధీత్’ అన్నారు. భగవద్గీతను ఏకొంచెం అధ్యయనం చేసినా వారి గురించి యముడు కూడా చర్చించడని శంకరాచార్యుడన్నారు.
గీత, గంగ, గాయత్రి, గోవింద అనే నాలుగు ‘గ’కారాలు హృదయంలో నిలిస్తే వానికి పునర్జన్మ ఉండదు. ఎందుకంటే సర్వగీతాల సమన్వం భగవద్గీత. ఇది భగవానుని దివ్యవాణి. సమస్త వేదాల, శాస్త్రాలమయం గీత అని మహాభారతం పేర్కొనబడింది. నాలుగు వేదాలు, 108 ఉపనిషత్తులు మరి అన్నీ హిందూ దార్శనికతల సారాంశం భగవద్గీతలో ఇమిడి ఉంది. భగవంతుని చేరుటకు ఉత్తమమైన వెలుగు భగవద్గీతే. భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్‌స్క్రిప్షన్ ఫర్ లైఫ్’ అన్నారు పెద్దలు. సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుని గీతోపదేశంలో భరతావని ధర్మభూమిగా, కర్మక్షేత్రంగా పరిపక్వమైంది. అట్టి ఈ పని పవిత్ర గ్రంథాన్ని మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున స్మరించినా మహాపుణ్యం వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళి సర్వసమస్యలకు పరిష్కారాన్ని సూచించే ఈ గ్రంథాన్ని ఈ రోజు నుంచైనా పఠించడానికి కృషిచేయాలి. జీవితాన్ని యుద్ధంలో పోల్చాడు భగవానుడు. అక్కడ పోరాటం తప్పదు. ఇక్కడ పోరాటం తప్పదు ప్రతిఫలాన్ని అపేక్షించకుండా, ఓ యజ్ఞంలా పనిచేయడమే కర్మయోగం అని నిర్విచిస్తాడు గీతాచార్యుడు. కోపంలోంచి అవివేకం పుడుతుంది. అవివేకం కారణంగా మతిమరుపు మొదలవుతుంది. ఆ ప్రభావంతో బుద్ధి నశిస్తుంది. దాంతో మనిషి పతనం ప్రారంభమయినట్టే వాటి నుంచి బయటపడిన మనిషి సర్వోన్నతుడవుతాడు. అర్జునుడిలో బంధుప్రీతి రగిలి యుద్ధం చేయననీ మొరాయించకపోతే, ధృతరాష్ట్రుడు సంజయుడిని కురుక్షేత్రంలో ఏం జరుగుతోందని అడిగి ఉండకపోతే, మహాభారతం మధ్యలో భగవద్గీతను మహర్షి ఇమిడ్చి ఉండకపోతే, ఇంతటి ఉత్తమ గ్రంథం మనకు లభించి ఉండేది కాదు. మానవ జన్మలో అద్భుతంగా దాగివున్నమేధస్సుని ఎలా జీవితానికి అన్వయించాలో తెలుసకునే అద్వితీయ అవకాశాన్ని ఇచ్చే ఏకైక గ్రంథం భగవద్గీత. మతాలకతీతంగా మానవత్వపు నిర్వచనాన్ని మహోత్తరంగా తెలిపే గ్రంథం. జీవన దిక్సూచి భగవద్గీత. అంతేగాక ఇందులో భగవంతుని తత్వము, ఆత్మతత్వము, జీవన గమ్యమూ, గమ్య సాధనా యోగములు బోధింపబడినవి. భగవద్గీతలో మొత్తం 18 యోగాలు ఉన్నాయి.
భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణమే మార్గమని హిందువుల విశ్వాసం. శ్రీకష్ణుడను గొల్లవాడు ఉపనిషత్తులనెడి గోవులనుండి అర్జునుడు అనెడి దూడను నిమిత్తంగా చేసుకొని గీత అను అమృతమును పితికెను. బుద్ధిమంతులు అంతా ఈ గీతామృతమును పానము చేయవచ్చును. ప్రతి వ్యక్తి గీతను శ్రవణ, కీర్తన, పఠన, పాఠన, మనన, ధారణాదుల ద్వారా సేవింపవలెను. అది పద్మనాభుని మఖ కమలములనుండి ప్రభవించినదని మహాభారతంలో భీష్మ పర్వంలోనే పేర్కొనబడింది.
*

గీతా సూక్తులు
- మనము మన పనిని ఫలితం ఆశించకుండా నిర్వహించాలి.
- శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము.
- కోపమే అనిన అనర్థాలకు మూలము.
- కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవడం.
- జరిగింది, జరుగుతున్నదీ జరగబోయేది అంతా మనమంచికే.
*
ప్రతిఫలాపేక్ష విడిచి కర్మలను ఆచరించడమనే అద్భుతమైన సూచనలిచ్చి, మానవ బలహీనతల్ని రూపుమాపి ఉత్తమ సమాజాన్ని నిర్మించగలిగే బలాన్నివ్వడం భగవద్గీత గొప్పతనం.
- స్వామి వివేకానంద
*

అహింసా సిద్ధాంతానికి గీత నుండే స్ఫూర్తి పొందాను. నాకు ఏ సమస్య వచ్చినా ఏ సందేహం వచ్చినా నన్ను నిరాశ ఆవరించినా వెంటనే భగవద్గీత గ్రంథాన్ని చదువుతాను.
- మహాత్మాగాంధీ
*

జ్ఞానం గురించి లోతైన అవగాహన నాకు
భగవద్గీత వల్లే
ఏర్పడింది.
- మాక్స్ ముల్లర్
*
సూక్తులూ .. సందేశాలూ
‘‘ఏక్ ఓంకార్ సద్గురు ప్రసాది’’ - ఒక్క ఓంకారమే శాశ్వతమైనది. కానీ అది సద్గురు అనుగ్రహము వల్లనే లభిస్తుంది
- 500 సంవత్సరములకు పూర్వము - నానక్
నిత్యుడు, శాశ్వతుడు, అమర్త్యుడు అయిన భగవంతుని ప్రార్థించుము పరమాత్మ శాశ్వత నామమే ఓమ్
-200 ఏళ్లకు పూర్వం దయానంద సరస్వతి
జగత్తు మిథ్య. ఇందులో కేవలం ‘‘హరి’’ నామం మాత్రమే సత్యం
- 1200 సంవత్సరములకు పూర్వం ఆది శంకరాచార్య
లా-ఇల్- అల్లా మహమ్మదు - ఉర్ -రసుల్ -అల్లా
సర్వాంతర్యామి అయిన భగవంతుడు తప్ప మరెవ్వరూ ప్రార్థింప అర్హులు కారు
- 1400 సంవత్సరములకు పూర్వం మహమ్మదు ప్రవక్త
ప్రార్థన వల్లనే ఈశ్వరుని పొందవచ్చును. నా దరి చేరుము. అపుడే మీరు దేవునికుమారులుగా పిలువబడుదురు.
- 2000 సంవత్సరాలకు పూర్వం జీసస్

- కె.రామ్మోహన్‌రావు