మెయిన్ ఫీచర్

కలలో..ఇలలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆట అంటే ఆలోచన కాదు. అలా భావిస్తే అసలు గెలవలేరు. ఆటను వృత్తిగా భావించవద్దు. ప్రజలు సందేహిస్తారు. మంచి క్రీడాకారిణిగా ఎదగాలంటే బాధలను కూడా తట్టుకోవాలి’’.
ఈ మాటలు అన్నది ఎవరో కాదు అంతర్జాతీయ వేదికపై కరణం మల్లేశ్వరి తరువాత భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించిన వెయిట్ లెఫ్టర్ మీరాబాయి చాను. రియో ఒలింపిక్స్‌లో ఓడినా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ స్వర్ణపతకాన్ని సాధించి మురిపించింది. భరతమాత మెడలో అలంకరించింది. రియో ఒలింపిక్స్‌లో కళ్లల్లో కనిపించిన ఆవేదన నేడు ఆమెకు ఆనందబాష్పాల రూపంలో వచ్చి దేశ గౌరవాన్ని నిలబెట్టింది. అవమానాలను ఎదుర్కొన్న చోట ఆశలను రేకెత్తించింది.
వాస్తవానికి మీరాబాయి సోదరి వివాహం జరగబోతోంది. పెళ్లి వేడుకల్లో తన తల్లిదండ్రులు, బంధువులు నిమగ్నమైనా కఠోర సాధన చేసి ఆ వేడుక చూడకపోయినా.. స్వర్ణం సాధించటం పెళ్లి వేడుకల్లో పాల్గొనలేదనే బాధను మరిపించిందని చెబుతోంది. మణిపురికి చెందిన మీరాబాయి 8,ఆగస్టు 1994 ఇంపాల్‌ని ఒక కుగ్రామంలోజన్మించింది. ఆమె పుట్టిన గ్రామంలో వెయిట్ లిఫ్టింగ్‌లో ఎలాంటి శిక్షణా కేంద్రం లేదు. కాని వెయిట్ లిఫ్టింగ్ ఆంటే చిన్నప్పటి నుంచి మక్కువ. ఎందుకంటే కుంజురాణి దేవి అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఆమె స్ఫూర్తితోనే మీరాబాయి ఈ క్రీడలోకి ప్రవేశించింది.

60కి.మీ దూరం ప్రయాణం చేసి శిక్షణ..

గ్రామం నుంచి ఆమె 60 కి.మీ దూరం ట్రైన్‌లో ప్రయాణం చేసి ఇంపాల్‌లోని కుమాన్ లంపక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శిక్షణ తీసుకునేది. 13 ఏళ్ల వయసు నుంచి శిక్షణ తీసుకోవటం ఆరంభించింది. కఠోర సాధన చేసేది. ఆ సాధనే ఆమెను రాటుదేల్చింది. 2011లో ఇంటర్నేషనల్ యూత్ చాంపియన్ షిప్‌లో గోల్డ్‌మెడల్ సాధించింది. దక్షిణ ఆసియా గేమ్స్‌లో మీరాబాయి చూపిన ప్రతిభ అధికారుల దృష్టికి వెళ్లింది. అథ్లెట్‌గా రాణిస్తున్న ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ.. 2013లో జూనియర్ నేషనల్ చాంపియన్‌షిప్ సాధించింది. జూనియర్ లెవల్‌లో విజయాలు సాధించటం చాలా సులభమే. సీనియర్ లెవల్‌లోనే సత్తా చాటాల్సిన ఆవశ్యకతను గుర్తించిన మీరాబాయి అందుకు తగ్గట్టు తనను తాను తీర్చిదిద్దుకుంది.

దేశం తరపున ఎన్నో పతకాలు..
దేశం తరపున ఆడి ఎన్నో పతకాలను సాధించింది. 2014లో కామన్‌వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. వెయిట్‌లిఫ్టింగ్ ప్రయాణంలో సిల్వర్ మెడల్‌తో ఆరంభమైన ఆమె ప్రస్థానం 48 కిలోల బరువు నుంచి 170 కిలోల బరువు ఎత్తే స్థాయికి ఎదిగింది.

కుంజురాణిదేవి స్ఫూర్తి..
మీరాబాయికి కుంజురాణిదేవి స్ఫూర్తిగా నిలిచారు. నేను చిన్న వయసులో ఉండగా ఓ రోజు కుంజురాణిదేవిని చూశాను. ఆమె ఆట అంటే ఎంతో ఇష్టం. ఆమె బరువులు ఎత్తటం చూసి స్ఫూర్తి పొంది నాతల్లిదండ్రులకు చెప్పాను. నేను ఎప్పటికైనా దేశం మెచ్చే వెయిట్ లిఫ్టర్‌ను అవుతానని ఎంతో విశ్వాసంతో వారికి నచ్చజెప్పాను. తల్లిదండ్రులు కూడా అంగీకరించారని ఆమె తన చిన్ననాటి సంగతులు గుర్తుచేసింది. టెన్నిస్‌లో సానియా మీర్జా వలే కుంజురాణిదేవి రాణించారని మీరాబాయి అభిప్రాయం. తన గురువు, స్ఫూర్తిప్రదాతగా నిలిచిన కుంజురాణి రికార్డును సైతం మీరాబాయి అధిగమించింది. ఆనాడు జూనియర్ టీం కోచ్‌గా కుంజురాణి ఉండేవారు. ఆమె వద్ద ఉంటూ 107 కిలోల విభాగంలో ఆమె జాతీయ స్థాయిలో రికార్డు నెలకొల్పింది. అలాగే ఆసియన్ చాంపియన్ షిప్‌లోనూ 190 కిలోల విభాగంలో కుంజురాణి నెలకొల్పిన రికార్డును అధిగమించటం విశేషం. ఇపుడు ఆమె వెయిట్ లిఫ్టింగ్ సామర్థ్యం 192 కిలోలు. తన సాధనలోనూ, ధ్యేయంలోనూ ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ముందుకు సాగుతుంది. పాటియాలలో ఉన్న రోజుల్లో కఠోర శిక్షణ తీసుకున్నది. కనీసం ఇంటికి కూడా వెళ్లేది కాదు. కోచ్ విజయ్ పర్యవేక్షణలో రాటుదేలింది. ఆయన ఇచ్చిన శిక్షణ నేడు తన విజయపరంపరకు కారణం అని కూడా మీరాబాయి వినయంగా చెబుతుంది. కాని ఆమె మనస్సులో తెలియని బాధగా రియో ఒలింపిక్స్ నిలిచింది. ఆ పోటీల్లో కొన్ని పొరపాట్లు చేసింది. వాటిని సరిదిద్దుకుని, ఆటంకాలను అధిగమిస్తూ.. దేశం మెచ్చే క్రీడాకారిణిగా నిలచి తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది.

‘‘నేను ఇంపాల్‌లో జూనియర్స్ విభాగంలో శిక్షణ తీసుకునేందుకు శిక్షణాకేంద్రంలో అడుగుపెట్టాను. నాకు ఆరోజుల్లో సరైన సదుపాయాలు కూడా లేవు. అటువంటి సమయంలో నా కోచ్ ఓ రోజు నేను రోజు తీసుకోవాల్సిన ఆహారం వివరాలకు సంబంధించిన డైట్ చార్ట్ చేతిలో పెట్టారు. అందులో రోజూ చికెన్, పాలు తీసుకోమని రాసి ఉంది. కాని అవి కొనుగోలు చేసే స్తోమత ఆనాడు లేదు. అయినప్పటికీ అలాంటి ఆటంకాలన్నింటినీ అధిగమించాను. ఇపుడు అలాంటి సమస్య లేదు.
***
నేను మల్లేశ్వరి మేడమ్‌ను అనుకరించాను. రెండు దశాబ్దాలుగా బంగారు పతకం సాధించాలని మనసులో కలలు కనేదాన్ని. ఇపుడు ఆ కల సాకరమైంది.
***
రాబోయే కాలంలో మరింత కష్టపడి కామన్‌వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో సత్తా చాటాలనుకుంటున్నాను. 2020లో టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించటమే లక్ష్యంగా ముందుకు సాగుతాను. -మీరాబాయి

-హరిచందన