మెయిన్ ఫీచర్

ఆమె నడక సాధికారిత కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ యువతి నడకతో దేశం మొత్తం చుట్టిరావటం అంటే మాటలు కాదు. కాని మూడు పదుల వయసున్న సృష్ట్భిక్షి చేస్తోంది. ఆమె చేస్తున్న పనిలో స్వార్థం లేదు. సాధికారిత దిశగా ప్రతి మహిళ అడుగులు వేయాలనే తపన మాత్రమే ఉంది. అందుకే అలుపెరగకుండా పయనిస్తోంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 260 రోజుల్లో 3800 కిలోమీటర్లు పయనిస్తూ హైదరాబాద్‌కు చేరుకుంది. హాంకాంగ్‌లో ఐదెంకెల జీతం వచ్చే ఉద్యోగాన్ని, కాలుమీద కాలేసుకుని హయిగా, ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశాన్ని వదిలేసుకుని సృష్ట్భిక్షి
ఈ చైతన్య యాత్ర విశేషాలు ఆమె మాటల్లోనే..

తల్లిబిడ్డలపై సామూహిక మానభంగం జరిగిన సంఘటన కదిలించింది. వెంటనే హాంకాంగ్ నుంచి వచ్చేశాను. డెహ్రాడూన్‌లో పుట్టాను. తండ్రి ఆర్మీ అధికారి. భారతదేశంలో మానభంగాలు జరగటం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఆడపిల్లల భద్రత అనేది సామాజిక సమస్యగా గుర్తించటం లేదు. అలాగే సాధికారిత కూడా కలగా మిగిలిపోయిందనే విషయాన్ని గుర్తించాను. మహిళలకు భద్రత, ఆర్థిక స్వావలంబన, అక్షరాస్యత, డిజిటల్ లిటరసీని అందించాలనే నినాదంతో కాలినడకన దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నాను.
కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3,800 కిలోమీటర్లు 260 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా బయలుదేరాను. ఇపుడు తెలంగాణలో ప్రవేశించాను అని ముప్పయేళ్ల సృష్ట్భిక్షి వెల్లడించింది. సామాజిక కార్యకర్తను కాకపోయినా..అథ్లెట్‌ను. జీవితంలో నేను కూడా వేధింపులకు గురయ్యాను. అందుకే ఈ యాత్ర అనేది ప్రారంభించాను.వెంట తీసుకువచ్చే కిట్‌లో రెండు రకాల షూస్, టీ షర్ట్, వర్షంలో తడవకుండా వేసుకునే దుస్తులు, ప్రొటీన్ డబ్బా, నట్స్, మోకాలి దగ్గర ధరించే క్యాప్స్, ఎండ నుంచి కాపాడే దుస్తులు, సంగీతం వినే పరికరాలు ఉంటాయి. వీటితో గత 70 రోజుల నుంచి నడక ప్రారంభించాను. ఇప్పటి వరకు మూడు రాష్ట్రాలను చుట్టేశాను. తెలంగాణలోకి ప్రవేశించాను.

ప్రతిచోటా ప్రోత్సాహమే..

ఇప్పటి వరకు వెళ్లిన ప్రతిచోటాప్రోత్సాహం లభిస్తోంది. వెళ్లిన చోట చక్కటి స్వాగతం పలుకుతూ ఆహ్వానిస్తున్నారు. నాతో పాటు మరో 12 మందితో కూడిన బృందం కూడా ఈ చైతన్య యాత్రలో ఉంటుంది. రోజుకు 30 కిలోమీటర్లు చొప్పున ఇప్పటికి సుమారు 1200 కి.మీ నడిచాం. అనేక గ్రామాల్లో వర్క్‌షాపులు, భద్రత కోసం తీసుకోవాల్సిన శిక్షణ ఉంటుంది. ఇప్పటివరకు 34 వర్క్‌షాప్స్ నిర్వహించాం. ఈ నడక పూర్తయ్యాక ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తాం. ఉద్యోగాలు చేస్తూ కూడా సంపాదిస్తున్న మహిళలకు బ్యాంకింగ్ రంగం గురించి అసలు తెలియదు. అటువంటి మహిళలకు వర్క్‌షాప్స్‌లో శిక్షణ ఇస్తున్నాం. తాను చేస్తున్న ఈ ప్రయత్నానికి పోలీసులు, కలెక్టర్లు అందరూ కూడా సహకరిస్తూ కావల్సిన సదుపాయాలు, ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదయం ఐదు గంటలకే నడక మొదలు
ఉదయం ఐదు గంటలకే నడక ప్రారంభమవుతోంది. మధ్యాహ్నాం ఒంటిగంట వరకు నడుస్తాను. భోజనం అయిన తరువాత మధాహ్నాం వేళల్లో వర్క్‌షాప్స్ నిర్వహిస్తాను. సాయంత్రం ఆరోజు చేసిన కార్యక్రమాల వివరాలను ఆన్‌లైన్‌లో ఫాలోవర్స్‌కు పోస్ట్ చేస్తాను. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో పర్యటించాను. ఎక్కడ చూసినా ఆర్థిక, లింగ వివక్షత కనిపిస్తోంది. ఇప్పటికీ ఆడపిల్లలు నిర్భయంగా బయటకు పంపాలంటే భయపడుతున్నారు. గ్రామీణులతో కలిసి మాట్లాతుంటే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి. ఆర్థిక, సామాజిక వెనుకబాటుతనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నడక దిగ్విజయంగా సాగటానికి భర్త ప్రోత్సాహం ఎంతో ఉందని ఆమె చెబుతున్నారు.

గ్రామీణుల చైతన్యం బాగుంది. వెళ్లిన ప్రతిచోట చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వర్క్‌షాప్స్‌లోనూ, శిక్షణలోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అర్థవంతమైన చర్చలు చేస్తున్నాం.రోజుకి 30 కిలోమీటర్లు చొప్పున ఇప్పటి వరకు 1200 కి.మీ నడిచాం. మహిళల భద్రత, హక్కులు, ఆర్థిక స్వావలంబన, అక్షరాస్యత, నాయకత్వంపై అవగాహన కల్పిస్తున్నాం.
-సృష్ట్భిక్షి