మెయిన్ ఫీచర్

ఆధ్యాత్మిక ఉషోదయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురువు అంటే చీకటినుండి వెలుగుకు దారి చూపించేవారు అని అర్థం. ‘తమసోమా జ్యోతిర్గమయ’ అంటూ శిష్యులకు దారిదీపం అయినవారు డాక్టర్ డి.ఉషారెడ్డి. ఈవిడ మెరీడియన్ స్కూల్స్‌కి ప్రిన్సిపాల్, సిఇఓ. ఎడ్యుకేషనల్ ఫిలాసఫీస్ ఆఫ్ జిడ్డు కృష్ణమూర్తి అండ్ శ్రీ అరబిందో (జిడ్డు కృష్ణమూర్తి, అరబిందో తాత్త్విక విద్య)మీద పరిశోధన చేసి పిహెచ్‌డి పట్టా పొందారు. అసలు అరబిందో, జిడ్డు కృష్ణమూర్తి తత్త్వం అర్థం చేసుకోవడమే ఎంతో కష్టమైన విషయం. అలాంటిది, ఆ తత్త్వాలమీద పరిశోధన చేసి పిహెచ్‌డి చేయడమంటే మామూలు విషయం కాదు. ఆధ్యాత్మికంగా, మానసికంగా ఉన్నతమైన ఆలోచనలను సొంతం చేసుకున్నందునే ఆవిడ చేయగలిగారు.

అన్ని రంగాలకూ దారిదీపం
వేలాదిమంది విద్యార్థులకు దారిదీపం అయి, వారికి విద్యతోపాటు సంగీతం, నృత్యం, ఆటలు వంటి అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. డా.ఉషారెడ్డి. ఆమె స్ఫూర్తి, ప్రోత్సాహం వలన విద్యార్థులు బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో తదితర పోటీలలో ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఎన్నో బంగారు పతాకాలు సాధించుకున్నారు. సిబిఎస్ పరీక్షల్లోనూ మేటీ అనిపించుకున్నారు. విద్యార్థులకు ఆట, పాట, మాట, సంగీతం, నృత్యం ఎన్నో రంగాలలో విద్వత్తు వస్తోంది. డాఉషారెడ్డి నేతృత్వంలో, ఆవిడ శిష్యులకు సిబిఎస్ నేషనల్ సైన్స్ పోటీలలో ఎన్నో అవార్డులు లభించాయి.
సంఘ సేవకురాలు..
కేవలం పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవడమే కాదు, సంఘసేవ ఎంతో ముఖ్యం అని అంటారు ఉషారెడ్డి. ఈవిడ స్ఫూర్తితో మెరిడియన్ స్కూల్‌కి కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అవార్డు రాడిసన్ బ్లూవారు ఇచ్చారు. ఈ విధంగా అందరికీ సహాయం చేయడంలోని మానవజన్మ సుకృతమైందని నిరూపించారు. తన వద్ద పనిచేసే అధ్యాపక వర్గాన్ని కూడా ప్రేమతో చూసుకుంటారు. ప్రకృతి వైపరీత్యం, సునామీ, కర్నూలు వరదలలో మునిగిపోయినపుడు స్వయంగా వెళ్లి కొన్ని వేలమందికి సహాయం చేశారు. చెన్నైలో వరదలు వచ్చినపుడు విద్యార్థులతో వెళ్లి కంచి వద్ద ఎన్నో గ్రామాలకు సహాయం చేశారు. ఈ విధంగా ఎంతోమందిని సంఘ సేవకులుగా తీర్చిదిద్దారు.
పల్లెల దత్తత
పల్లెలనుండి పట్నాలు దూరం కాకూడదు, అలా అయితే సామాజిక అసమానత పెరిగిపోతుంది అని నమ్ముతారు డా.ఉషారెడ్డి. అందుకే మహబూబ్‌నగర్‌లో 13 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. ఈ భాగస్వామ్యంవలన పల్లెలలో విద్యార్థులు ఎంతో లాభం పొందుతున్నారు. ఆమె దత్తతు తీసుకున్న పల్లెలలో విద్యార్థులు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారు. విద్యార్థుల అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తున్నారు. నిరంతర సంఘ సేవకురాలిగా అలసట ఎరుగని మనిషి ఆమె. తాను చేసే సేవతో ఎంతోమందికి సహాయం చేస్తూ మరెంతోమందికి దారి చూపిస్తున్నారు.
కూచిపూడి నర్తకి
మన తెలుగువారికి మణిమయ కిరీటం కూచిపూడి. చూసేవారికి, చేసేవారికి భక్తి, ముక్తి, రక్తి ఇచ్చి రసగంగలో పావనం చేసే అద్భుత సంప్రదాయ నృత్యం మన కూచిపూడి. డా.ఉషారెడ్డి స్వయంగా కూచిపూడి నృత్యాన్ని అభ్యాసించారు. అందుకే తన విద్యార్థులను సంప్రదాయ నృత్యం, గానంలో ప్రోత్సహిస్తున్నారు. ఇది ఎంతో గొప్ప విషయం. కళను నేర్చుకున్నవారు కళను ప్రోత్సహిస్తారు. ఎంతోమంది విద్యార్థులను కళలలో రుచి, అభిరుచి కల్పించడం ద్వారా మన కళలకు గొప్ప చేయూతనిస్తున్నారు డా. ఉషారెడ్డి.
చదువుల తల్లి
వేల మంది విద్యార్థులకు కొన్ని దశాబ్దాలుగా స్ఫూర్తిని ఇస్తూ వెలుగుకు చూపిస్తున్నారు. ఈవిడ జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ వారి రిషీ వేలీ స్కూల్‌లో చదువుకు న్నా రు. చెన్నైలో స్టెల్లా మేరీ కాలేజీలో బి.ఏ చేశారు. మన కోహినూర్ వజ్రంలాంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చేశారు. తదుపరి అన్నామలై విశ్వవిద్యాలయంలో బిఇడి చేశారు. చెన్నైలో ఐఐఎంటిలో ఎడ్యుకేషన్ మానేజ్‌మెంట్‌లో డిప్లొమా చేశారు. అన్నామలై విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. అప్పుడు ఆవిడ పరిశోధనాంశం శ్రీఅరమిందోస్ ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ యాజ్ యాన్ ఎక్స్‌పెరిమెంట్ ఇన్ స్కూల్స్. ఆ తరువాత జిడ్డు కృష్ణమూర్తి ఇంకా అరబిందో తత్త్వం మీద పరిశోధన చేసి పిహెచ్‌డి చేశారు.
ఎన్నో అవార్డులు సొంతం
విద్య, కళా రంగాల్లో ఈమెకు ఎనె్నన్నో అవార్డులు దక్కాయ. 2001లో బెస్ట్‌ప్రిన్సిపాల్ అవార్డు, 2002లో ఒరిస్సా మాజీ గవర్నర్ నుండి ఎమినెంట్ ఎడ్యుకేషనిస్ట్ అవార్డు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నుండి మెరిటోరియస్ వర్క్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అవార్డు 2003లో శ్రీ సుర్జీత్‌సింగ్ బర్నాల చేతులమీదుగా, 2004లో డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్ర స్థాయి ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు, 2008లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎన్.డి.తివారి నుండి స్పెషల్ అప్రీసియేషన్ అవార్డ్ ఫర్ ఎడ్యుకేషన్, 2008లో సర్లా చోప్రా మెమోరియల్ అవార్డు, 2008-09లో అవంతికాశిక్ష సమ్మాన్ అవార్డు, 2010లో దక్కన్ క్రానికల్ వారు బెస్ట్ ప్రిన్సిపాల్ అవార్డుని ఇచ్చారు. 5 సెప్టెంబర్ 2011 నాడు అప్పటి రాష్టప్రతి శ్రీమతి ప్రతిభా దేవిసింగ్ పాటిల్ నుండి నేషనల్ అవార్డు తీసుకున్నారు. బ్రిటీష్ కౌన్సిల్ నుండి అంతర్జాతీయ స్కూలు అవార్డు 2012-15, 2015-18 తీసుకున్నారు. అలాగే ఢిల్లీలో సిబిఎస్‌ఇకి సిసిఈ మాస్టర్ ట్రైనర్, సిబిఎస్‌ఇ మాస్టర్ ట్రైనర్, 75 సిబిఎస్‌ఇ స్కూళ్ళకు హైదరాబాద్‌తోసహా స్కూళ్ళకి చైర్ పర్సన్.
2013లో కెఆర్‌డి గ్రూప్ నుండి ఢిల్లీలో క్వాలిటీ ఇనిషియేటివ్ మిషన్ ఎడ్యుకేషనల్ లీడర్‌షిప్ అవార్డు తీసుకున్నారు. 2013లో ఈ ఇండియా హెచ్‌ఐసిసి హైదరాబాద్ పానల్‌లో ఉన్నారు. 2014 సెప్టెంబరులో ఈవిడ చేసిన సంఘ సేవకు ఇన్నర్ వీల్ రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ నార్త్‌వారు గుర్తించారు. బ్రెయిన్ ఫీడ్ మాగజైన్ ‘ఆచార్య దేవోభవ 2015’ అవార్డు ఇచ్చారు. 23 ఏప్రిల్ 2016లో రోటరీ క్లబ్ పర్ల్స్ ఆఫ్ హైదరాబాద్ విద్యారంగానికి చేసిన సేవకు అవార్డును ఇచ్చారు.ఇవి కొన్ని మాత్రమే! ఇలా ఎన్నో ఎనె్నన్నో అవార్డులు పొందినా, నిండుకుండ తొణకదు.
ఒకవైపు వ్యక్తిగతంగా బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు నిర్వాహకురాలిగా, విద్యావేత్తగా, గురువుగా, సంఘసేవికగా, పరిశోధకురాలిగా, కళాకారిణిగా సునాయాసంగా నిర్వహిస్తున్నారు.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి