ఎడిట్ పేజీ

కులమా.. గుణమా? ఏది ముఖ్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులో శైవ బ్రాహ్మణులను అయ్యర్‌లు అని పిలుస్తారు. వైష్ణవ మతస్థులను అయ్యంగార్ అంటారు. కుమారి జయలలిత అయ్యంగార్ కుటుంబంలో జన్మించింది. మణిశంకర అయ్యర్ శైవ కుటుంబంలో పుట్టాడు. ఈయన మతం మార్చుకున్నాడు కాబట్టి హిందూ బ్రాహ్మణుడు కాదు. కమ్యూనిస్టులకు సన్నిహితంగా ఉంటాడు కాబట్టి ఇండియన్ నేషనలిస్టు కూడా కాదు. ఆది నుండి నెహ్రూ కుటుంబానికి ఈయన వీర విధేయుడు. 2014 ఎన్నికలలో ఇలా అన్నాడు- ‘‘నరేంద్రమోడీ భారత ప్రధాని కావటం అసంభవం. ఒకవేళ టీకొట్టు పెట్టుకోవాలంటే మా ఎఐసిసి కార్యాలయంలో ఓ గారేజ్ రూం ఇస్తాము. అక్కడికి వచ్చి టీ వ్యాపారం చేసుకోవచ్చు’’. 2014 ఎన్నికలలో నరేంద్ర మోదీ అనూహ్యంగా ఘన విజయం సాదించాడు. దానితో ఈ అయ్యర్ పాకిస్తాన్ వెళ్లి అక్కడి ఐఎస్‌ఐ ఉగ్రవాదులనుకలిసి మనము (అంటే కాంగ్రెస్, ఉగ్రవాదులు) కలిసి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అని బహిరంగంగా ‘దునియా’ టివి ద్వారా పిలుపునిచ్చాడు. మణిశంకర్ అయ్యర్ మోదీమీద ఎందుకింత కక్ష కట్టాడు? అండమాన్ దీవులకు వెళ్లి అక్కడ స్వతంత్ర వీరసావర్కార్ గారి స్మృతి చిహ్నాన్ని పగులగొట్టి వచ్చాడు. ఇవన్నీ ఉన్మాద చేష్టలు కావా??
డిసెంబర్ 7వ తేదీ 2017 నాడు మణిశంకర అయ్యర్ ఇలా అన్నాడు- ‘‘ నరేంద్ర మోదీ నీచ జాతివాడు. టీ అమ్ముకొనే కూలీ. రాహుల్ గాంధీ యజ్ఞోపవీతంగల బ్రాహ్మణుడు. అందుకని మోదీని ఓడించండి’’- ఈ వాక్యాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి.
1. భారతదేశం నెహ్రూ వంశం తప్ప మరొకరికి పరిపాలించే అధికారం ఇవ్వకూడదు.
2. రాహుల్ బాబు ముత్తాత కాశ్మీరీ బ్రాహ్మణుడు. కాని ఇతని నాయనమ్మ పార్సీని వివాహమాడింది. ఇక రాహుల్ బాబు ఆయన తల్లి సోనియా గాంధీ వాటికన్‌లో బాప్టిజంద్వారా మతం పుచ్చుకున్నారు. కాబట్టి మణిశంకర అయ్యర్ చెప్పినట్లు రాహుల్ బాబు యజ్ఞోపవీతంగల బ్రాహ్మణుడు కాదు.
3. మోదీ టీ అమ్ముకున్నమాట నిజమే. అది శ్రమైకజీవన సౌందర్యానికి చిహ్నం. ఒక శ్రామికుడు భారత ప్రధాని అయితే సంతోషింపవలసి సోకాల్డ్ సెక్యులర్ వర్గాలు రాత్రింబవళ్ళు మోదీ ప్రభుత్వంపై ఎందుకు దుమ్మెత్తిపోస్తున్నట్లు?
4. మోదీని నీచకులస్థుడు అని నిందించాడు అయ్యర్. ‘‘ఉత్తమ కులమునకు అధమ కులమునకు ఉత్తి జన్మమే కారణమెట్లగును?’’ అని నేటికి ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే కర్ణాటకలోని ధార్మిక ప్రవక్త బసవన్నగారు ప్రశ్నించారు. వాల్మీకి బోయవాడు. వ్యాసుడు జాలరికి పుట్టినవాడు. మండోదరి కప్పలు పట్టేవారి వంశంలో పుట్టి బ్రాహ్మణుడైన రావణుణ్ణి వివాహమాడింది. వైష్ణవ సద్గురువు యామునాచార్యుడు ముస్లిము. వామదేవ శాస్ర్తీగా నేడు పిలువబడుతున్నాడు. డేవిడ్ ఫ్రాలే అమెరిక్ క్రిస్టియన్. వశిష్ఠుని భార్య అరుంధతి చెప్పులు కుట్టుకునేవాని కూతురు. కౌండిన్య మహర్షి మంగలి. ముని వాహనాళ్వారు మాల కులస్థుడు. శ్రీకృష్ణుడు గొడ్లు కాచుకునే కురమ. విదురుడు దాసీ పుత్రుడు. సత్యకామ జాబాలి వేశ్యపుత్రుడు. వీరంతా భారతదేశంలో వేద ఉపనిషత్తులు ప్రవచించారు. ప్రత్యక్ష దైవాలుగా పూజింపబడ్డారు. ఇదే భారతీయ సంస్కృతి.
ఇక బ్రాహ్మణ కులంలో పుట్టిన మణిశంకర అయ్యర్ మనీష్ తివారి, సంజయ్‌ఝా, ఇందిరా తివారి, సుప్రియా చతుర్వేది, శీలా దీక్షిత్, సాందీప్ దీక్షిత్, ఏచూరి సీతారామ శర్మ, ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్, గుడిపాటి వెంకటాచలం, శ్రీరంగం శ్రీనివాసరావు, భాగవతుల శివశంకర శాస్ర్తీ, రాచకొండ విశ్వనాథ శాస్ర్తీ, గుంటూరు శేషేంద్ర శర్మ, నయనతార షెహగల్- వీరంతా జన్మసిద్ధంగా బ్రాహ్మణులు. కాని వీరిలో బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణాలున్నాయా? ఈ తాగుబోతుల గుంపును బ్రాహ్మణులు అని పిలువగలమా?
మణిశంకర్ అయ్యర్, రాహుల్ బాబును బ్రాహ్మణునిగా వర్ణస్తున్నాడు. వీరిరువురూ గోమాంసం భక్షణ చేస్తారు. హిందువులను ద్వేషిస్తారు. ఎన్నికల సమయంలో తప్ప మరెప్పుడూ గుడికి పోరు. హిందూ మతోన్మాదం నశించాలి అని వీరిరువురూ పదే పదే ప్రకటించారు. జిహాదీ ఉగ్రవాదం నశించాలి అని ఒక్క రోజు కూడా వీరు కోరుకోలేదు. ఒసామాజీ హఫీజ్ సయ్యద్‌జీ అంటూ వారిని పూజనీయులుగా భావించారు. డోక్లామ్ వద్ద మొన్న చైనా తన సైన్యాన్ని మోహరించినపుడు రాహుల్‌బాబు చైనా ఎంబసీకి వెళ్లి గుసగుసలాడి రహస్య మంతనాలు జరిపివచ్చాడు. ఇది దేశద్రోహం కాదా? దీనికి ఎవరు సమాధానం చెపుతారు??
నరేంద్ర మోదీని అంతమొందించడానికి 2004 నుంచి కాంగ్రెస్ నేతలు నరహంతక ముఠాలను అహమ్మాదాబాద్‌కు పంపారన్నది ఆరోపణ. ఇషత్ జహానా ముఠా గుజరాత్ చేరిన తర్వాత స్థానిక పోలీసులు వారిని ఎన్‌కౌంటర్ చేశారు. అపుడు వేణీ ప్రసాద్ వర్మ నరేంద్ర మోదీని ‘మాన్ ఈటర్’ అని తిట్టాడు (అంటే నరమాంసం రుచి మరిగిన పులి అని అర్థం). రాహుల్ బాబు ‘ఖూన్ కాదలాల్’, ‘వౌత్ కా సౌదాగర్’ అన్నాడు. అంటే నరరక్తం అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్న మోదీ, శవరాజకీయం చేస్తున్న వ్యక్తి అని అర్థం. ఇంత ద్వేషం ఎందుకు? రాహుల్‌బాబు ప్రధానమంత్రి కాలేకపోయాడు. దేశ సంపదను స్విస్ బ్యాంకులకు పనామా, మారిషస్ బ్యాంకులకు ఇంకా తరలించకుండా ఎన్‌డిఎ ప్రభుత్వం అడ్డుకుంటున్నది. అందుకే ఇంత ద్వేషం. ఈ చిదంబరాలు దిగంబరాలు చేసిన నిర్వాకం అధికారికంగా వెలుగులోకి వచ్చింది. అయినా వీరింకా ఏముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారు? ఇంకా ఎంత దోచుకుంటారు?
హైదరాబాద్ గాంధీ భవన్‌కు వెళ్లి ఎవరిని కదిలించినా మణిశంకర్ అయ్యర్ గారి లీలలు చెపుతారు. వీళ్లు నేడు వక్తలు - ప్రవక్తలు??
రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక దేశ ప్రధానిని ‘నీచ కులస్థుడు’ అని నిదించడానికి వీళ్లకు నోరెట్లా వచ్చింది? తప్పు నరేంద్ర మోదీదే- ఈ అయ్యర్ పాకిస్తాన్ గూఢచర్యం చేసినపుడే చట్టబద్ధంగా చర్య తీసుకొని ఉండవలసింది. ఐనా అలా జరగలేదు.
రణజిత్ సుర్జీవాలా కాంగ్రెసు అధికార ప్రతినిధి. 7 డిసెంబర్ 2017 నాడు రాత్రి మాట్లాడుతూ- మణిశంకర్ అయ్యర్‌ను మేము పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేశాము అన్నాడు.
మరి మోదీని ‘శవాలపై వ్యాపారం చేస్తున్న హంతకుడు’ అని రాహుల్‌బాబు తిట్టాడు కదా, అతనిని పార్టీనుండి ఎందుకు సస్పెండ్ చేయలేదు?? సరికదా పదోన్నతి కల్పించారు.
చెట్టు పోయే కాలానికి కుక్కమూతి పిందెలు పుడుతాయని ఓ తెలుగు సామెత ఉంది. మదన్ మోహన్ మాలవియా, గోపాలకృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, టంగుటూరి ప్రకాశం పంతులు, నేతాజీ సుభాష్ బాబు వంటి మహాత్ములు నడిపిన సంస్థయేనా ఇది?? రాట్నం గుర్తుగల ఆనాటి పార్టీ వేరు - ఆవు దూడ గుర్తుగల పార్టీ వేరు (ఆవు- ఇందిరమ్మ, దూడ సంజయ్ గాంధి) ఇపుడు హస్తం గుర్తుగల ఇటాలియన్ పార్టీ వేరు. ఇది మహాత్మా గాంధీ నడిపిన ఇండియన్ నేషనల్ కాంగ్రెసు కాదు. మణిశంకర్ అయ్యర్‌లు, మనీష్ తివారీలు, కపిల్ సిబల్, జయరాం రమేష్‌లు నడుపుతున్న మరొక పార్టీ. ఈ దుష్టమాత్రుల బారాత్!
1939లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలా అన్నారు- ‘‘నేను జీవితంలో జవహర్‌లాల్ నెహ్రూవల్ల పొందినన్ని అవమానాలు మరెవ్వరివల్లా పొందలేదు’’- నాటి బోసు బాబు నుండి నిన్నటి పి.వి.నరసింహారావు వరకు- వీరిని నెహ్రూ కుటుంబం ఎన్ని విధాలుగా అవమానించిందో చరిత్ర పుటలలో నిక్షిప్తమై వుంది.
ఇవాళ రాహుల్ గాంధీ అనే ఒక పిల్లవాడు, అతడి బృందం నరేంద్ర మోదీని ‘శవాల వ్యాపారి’, ‘చాయ్ అమ్ముకునే నీచుడు’ అంటున్నాడు. ఇంత జరుగుతున్నా ఈ దేశ ప్రజలు నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చిత్తగిస్తున్నారు. నరేంద్ర మోదీని నూటొక్కసార్లు తుపాకీతో కాల్చి చంపండి అన్నాడు కామ్రేడ్ కె.నారాయణ (రాజమండ్రి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో)- ఇదేనా ఒక శ్రమైక జీవికి- చాయ్‌వాలాకు ఈ కార్మికుల కర్షకుల పార్టీ ఇచ్చే గౌరవం?
8 డిసెంబర్ 2017 శుక్రవారం రాత్రి అహమ్మదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఇలా చెప్పారు- ‘‘2015లో నన్ను చంపడానికి మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్‌కు వెళ్లి ‘సుపారీ’ ఇచ్చివచ్చారు. అంతేకాదు నన్ను మనీష్ తివారి, వేణీ ప్రసాద్ వర్మ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేణుకా చౌదరి, ఆనంద్ శర్మ, జయరాం రమేష్ వంటి కాంగ్రెస్ నాయకులు ఎలాంటి భాషతో తిట్టారో చూడండి. ‘‘మోదీ పిచ్చి కుక్క అన్నారు. మతి స్థిమితం లేనివాడు అన్నారు. విషాన్ని చిమ్ముతున్నాడు అన్నారు. గడాఫీ, ముసోలిని, హిట్లర్ తర్వాత నరేంద్ర మోదీ అన్నారు. రావణాసురుడు అన్నాడు. భస్మాసురుడు అన్నారు. తేలు, కొజ్జా, కోతి, గాడిద, పాము అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలచేత ఎన్నోకోబడిన ఒక దేశ ప్రధానిని ఇలా తిట్టడం ప్రజాస్వామ్యంలో న్యాయమా’’ అని మోదీ ప్రశ్నించారు.
మోదీజీ! మిమ్మల్ని నిర్మూలించటానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన బృందం 2004లో చాలాసార్లు ప్రయత్నాలు చేసింది. మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వెళ్లి ఐఎస్‌ఐ ఏజెంట్లతో ఒప్పందం (2015) కుదుర్చుకొని వచ్చిన వార్త లోగడ వెలుగులోకి వచ్చింది. మరి మీరు వీరిపై ఎందుకు ఇప్పటివరకు చర్య తీసుకోలేదు?? ఎన్నికల సమయంలో ఈ తిట్ల దండకం ఎందుకు గుర్తుకు చేయవలసి వచ్చింది? ‘అభివృద్ధి’ని గురించి మాట్లాడాలి కదా అని కాంగ్రెస్ వారు ప్రశ్నించారు. నిజమే, భారతదేశం డబుల్ డిజిట్ గ్రోత్ సాధించిన ఏకైక రాష్ట్రం గుజరాత్ అని మరువకూడదు.
సల్మాన్ ఖుర్షీద్ ప్రధానిని నపుంసకుడు అని తిట్టాడు. దీనికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పలేదు. నేను నెహ్రూను చూచిన తరానికి చెందినవాడిని. ఆనాటి కథలు చెప్పడం మొదలుపెడితే ఈ తరం పాఠకులు దిగ్భ్రాంతులవుతారు. నాగరిక సమాజం సిగ్గుపడేలా నేడు మణిశంకర్ అయ్యర్ ప్రవర్తించాడు. ఎద్దుమాంసం తినే మొద్దు ముండాకొడుకు, బారులకు పోతున్న సాంబారు అయ్యరు సన్నాసి ఏబ్రాసి జిన్నాకు వారసుడు, రాహులుని మిత్రుడు. భారత్‌కు శత్రువు.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్