మెయిన్ ఫీచర్

శుభమాసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘యాదృశీ భావనాయస్య సిద్ధిర్భవతి తాదృశీ’’- పరమాత్మను ఏయే రూపంలో ఆరాధిస్తే ఆయా రూపంలోనే పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు, అనుగ్రహిస్తాడు. పరమాత్మను సాకారంగాను, నిరాకారంగాను, సాకారంలో పురుషరూపంలోను స్ర్తి రూపంలోను, వివిధ విధాలుగా ఆరాధిస్తారు. హరిని రామ, కృష్ణాద్యవతారములోను, లింగరూపంలో హరుని, గణేశ అంబిక, శివ విష్ణు సూర్యుడు పంచాయతనంగా ఆరాధిస్తాం. వీరితోపాటు ‘కాలము’ను కూడా పరమేశ్వర స్వరూపంగా ఆరాధించటం మన భారతీయుల సాంప్రదాయం.
‘‘కాలః కలయతా మహమ్’’ అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణ్భగవానుడు. ‘కాలం’ నా స్వరూపమేనన్నాడు. ‘కాలాయ నమః’- శివుడు కాల స్వరూపుడు అని చెప్పింది శృతి; శివ సహస్రనామాలు. కనుక కాలాన్ని పుం రూపంలో ఆరాధిస్తున్నాం. స్ర్తి రూపంలో ‘మహాకాళీ, భద్రకాళీ’ అని పార్వతీ స్వరూపంగా ఆరాధిస్తున్నాం.
సూర్యోదయం కాగానే మనుషులు సంతోషిస్తున్నారుట, సూర్యాస్తమయం కాగానే మళ్లీ సంతోషిస్తున్నారట, కాని సూర్యాస్తమయ సూర్యోదయాల మధ్య జీవితం తరిగిపోతోందన్న సంగతి తెలిసికోలేకపోతున్నారు. కాలస్వరూపం జీవితం. ఇది ఆధ్యాత్మికం.

ఉపనిషత్తులు ఏమని పేర్కొన్నాయి?
‘‘ప్రణ వోహి ధనుః, శరోహ్యాత్మా బ్రహ్మ తల్లక్ష్య ముచ్యతే’’ అన్నది ఉపనిషత్తు. ధనుస్సు ఓంకారము అని, ఆత్మ బాణమని, బ్రహ్మ లక్ష్యమనీ బోధించినాయి. వేదపురాణాగమ శాస్త్రాలకు ఆధారము ప్రణవ నాదము (ఓంకారము). ‘‘యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతేషు ప్రతిష్ఠితః’’ అన్నది వేదం. ఈ నేపథ్యంలో ధనుర్మాస వైశిష్ట్యాన్ని దర్శించాలి.

నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి కీర్తనలలో
శ్రీరామచంద్రుడు ధనుస్సు యొక్క అగ్రమును, రామేశ్వరమును దగ్గరలో ఉన్న ప్రదేశమునందు లక్షీకరించుటవలన ఆ ప్రదేశానికి ‘్ధనుష్కోటి’ అని సంకేతమేర్పడినది. భారతదేశంలో కోటికిపైన పుణ్య నదీ నదములు ఉన్నాయని ప్రసిద్ధి. ఇది సామాన్యార్థం. యోగులు ధనురాకారముగా నున్న కనుబొమల మధ్య స్థానమునే ధనుష్కోటి అని, నదులులాగా ప్రవహించే నాడీ ద్వారములకు ఇది కేంద్రము అని, ధ్యాన యోగ లక్ష్యమని భ్రూమధ్య స్థానమను భావిస్తారు. కనుక భక్త్భివంతో సంపూర్ణ శరణాగతితో పరమాత్మకు ఉపచారములు చేస్తూ, నిరాకారంగా యోగ సాధనలో పరమాత్మ వెలుగును దర్శించాలని ‘కోటి నదులు ధనుష్కోటిలో నుండగా ఏటికి తిరిగేవే మనసా’ అన్న తోడిరాగ కీర్తనలో ధనుర్మాసారాధనకు స్ఫూర్తినిస్తూ అందించాడీ కీర్తన, నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి.
ప్రతిఋతువునందు ఋతు ధర్మాలను అనుసరించి, సంధికాలములు, కాల పరిణామము, వాతావరణ పరిణామముననుసరించి, శరీర మానసిక రుగ్మతలు కలుగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని మహర్షులు మనకి నోములు, వ్రతాలు, నియమాలను పండుగలనే పేరుతో ఏర్పాటుచేశారు. గోపికలాచరించిన కాత్యాయనీ వ్రతం, గోదాదేవి భక్తిశ్రద్ధలతో నోచిన తిరుప్పావై ప్రధానంగా పేర్కొనబడతాయి, రుూ ధనుర్మాసంలో.

రామాయణం ఏమి చెప్పింది?
ధనుర్భంగం జరిగితే గాని సీతాకల్యాణం జరుగదు. అప్పుడే లోక కల్యాణం జరుగుతుంది. జీవుడు పరమాత్మని ఆశ్రయించటం, ఐక్యమవటం-కల్యాణం. అలాగే చీకటి పథమైన దక్షిణాయనం, ప్రాతః సంధ్యా సమయమైన ధనుర్మాసంలో పూర్తి అయితేనే వెలుగును చూపుతూ రవి మకరరాశిలో ప్రవేశించినపుడే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రాప్తిస్తుంది. భోగి పండుగతో ధనుర్మాసం ముగింపు జరిగితే మరునాడు సంక్రాంతి పండుగనాడు నూతన దివ్యకాంతులతో వస్తుంది ఉత్తరాయణం. శ్రీరాముడు రావణాసుర వధకు ధనుష్ఠంకారము చేసి ధనుస్సును చేత బట్టి బయలుదేరాడు. అది ఎలా ఉన్నదంటే, త్రిపురాసుర సంహారానికి శివుడు వేదమయమగు ధనుస్సును తీసికొని వెడుతున్నట్లున్నదట. రామాయణంలో యుద్ధకాండలో అందించాడు వాల్మీకి మహర్షి. ఇది ధనుర్మాసానికి దీప్తినిస్తుంది.

కాలదేవుడు- సూర్యభగవానుడు: జనన మరణాలు సర్వం కాలాధీనము. జనన మరణాలు, జగద్వ్యవహారములు నడిపేవాడు- సూర్యభగవానుడు. కనుక సూర్యుడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర (త్రిమూర్త్మాత్మకుడు) రూపునిగా ఆరాధిస్తున్నాము. కనుక సూర్యుడే ‘కాల’దేవుడు. సూర్య కిరణముల పరిపాక విశేషము చేత రాత్రింబవళ్ళు, వారములు పక్షములు, మాసములు, ఋతువులు, ఆయనములు, సంవత్సరములు మొదలగు కాలభేదములు ఏర్పడుతున్నాయని చెప్పింది యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం.

ద్వాదశరాశులు- సూర్యగమనం: ఇరువది ఏడు నక్షత్రములు- అవే అవే అశ్వని నుండి రేవతి వరకు ఉన్న నక్షత్రములు. ఒక్కొక్క నక్షత్రానికి నాల్గు పాదములు, వెరసి నూట ఎనిమిది పాదములు. ఒక్కొక్క రాశిలో 9 పాదము చొప్పున పనె్నండు రాశులుగా ఏర్పడ్డాయి. అవే మేషాది మీనరాశులు. నవగ్రహాలు ఈ పనె్నండు రాశులలోనూ సంచరిస్తాయి. చంద్రుడు ఒక్కొక్క రాశిలో రెండుంపాతిక రోజులు ఉంటాడు. చంద్రునికి సంబంధించినవి తిథులు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక నెల రోజులు ఉంటాడు. అనగా ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి నెల రోజులు పడుతుంది. సూర్యుడు మేషరాశిలో సంచరించే సమయాన్ని మేషమాసమంటారు, అలాగే ధనుస్సు రాశిలో (్ధనూరాశిలో) సంచరించే కాలాన్ని ‘్ధనుర్మాసం’ అని పిలుస్తారు. ఇదీ ధనుర్మాసమంటే అర్థం.

ధనుర్మాసం- సంధికాలం: మానవుల మాసకాలం పితృదేవతలకు ఒక రోజు. మన సంవత్సరకాలం దేవతలకు ఒక రోజు. మనకు రాత్రింబవళ్లు ఉన్నట్లుగా, దేవతలకు కూడా వున్నాయి. సూర్యుడు మిథునరాశిలో నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే కాలాన్ని దక్షిణాయన పుణ్యకాలమంటారు. ఇది ఆరు నెలలు. మకరరాశిలో ప్రవేశించే సరికి ఉత్తరాయణం. మధ్యలో ఉన్నది ధనూరాశి. మనకు దక్షిణాయనంగా చెప్పబడే ఆరు నెలలు దేవతలకు రాత్రి, మన ఉత్తరాయణం ఆరు నెలలు వారికి పగలు. మనకు రాత్రింబవళ్ళ సంధికాలం సంధ్య (ప్రాతఃసంధ్య) అయినట్లు, వారికి కూడా రాత్రింబవళ్ల సంధ్యకాలం సంధ్యే. అనగా దక్షిణాయనం ఆరు నెలలుపూర్తికాగా, అంటే వృశ్చికరాశిని దాటి సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే సమయం దేవతలకు రాత్రి చివరి భాగం. సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలో ప్రవేశించేకాలం- సమయం దేవతలకు ప్రాతఃకాలం.

ధనుర్మాసం- బ్రాహ్మీ ముహూర్తకాలం: ‘పంచ పంచ ఉషఃకాలః’ అంటే సూర్యోదయానికి పూర్వం అయిదు గడియలు (రెండు గంటలు) మనకి ఉషఃకాలం. దీనినే మనం బ్రాహ్మీకాలమని, బ్రాహ్మీ ముహూర్తమని పరమ పవిత్రమైన కాలమనీ అంటాం. ఈ విధంగానే ధనుర్మాసం దేవతలకు ఉషఃకాలం, సంధ్యాకాలం. అందుకే మనకు తెల్లవారు జాముననే లేచి స్నాన సంధ్యాదులాచరించి, భగవదారాధనకు శుభసమయంగా చెప్పారు. ఈ సమయమే, ఈ ధనుర్మాసమే దేవతలకు కూడా ప్రాతః సంధ్యా సమయం గావటమే, ధనుర్మాస విశిష్టత. నెల రోజులు పర్వదినాలే.

‘్ధనుస్సు’కు విశేషార్థాలు: ‘్ధన్యతే ప్రార్థ్యతే-ఇతి ధనుః’ అని వ్యుత్పత్తి. ప్రార్థింపబడువాడు, ప్రార్థింపబడునది- ధనుః అని చెప్పబడింది. సర్వకాల సర్వావస్థలయందు ప్రార్థింపబడు పరమేశ్వరుడే ‘్ధనుః’ అని పిలవబడుతున్నాడు. ఇది ధనుర్మాస విశేషం.

విష్ణు సహస్రనామం ఏమి చెప్పింది: ‘్ధనుర్థరో ధనుర్వేదో దండో దమయా దమః’- ధనుస్సును ధరించినవాడు, ధనుర్వేదవేత్తయని అర్థము (నాలుగు వేదములు గాక ధనుర్వేదము కూడా చెప్పబడింది). ధనురేవ వేదః ధనూ రూప వేదః- ధనుస్సే వేదము, ధనుస్సే వేదము, ధనూరూప వేదము, ధనుస్సు వంటి వేదము, ధనుస్సు, వేదము అని- ఇవన్నీ శ్రీమహావిష్ణువు దివ్య నామములు. దీనిని బట్టి వేదమే ధనుస్సు, ధనుస్సే వేదము అని అర్థము. ఆ వేద వేద్యుడే పరమాత్మ. ఆయన్ని ఆరాధించే మాసం- ధనుర్మాసం. (కోదై ...గోదాదేవి)
విష్ణుచిత్తుడు- గోదాదేవి: పూర్వం ‘విల్లి’ అనే రాజు పరిపాలించటం చేత దక్షిణాపథంలో మధురకు యాభై మైళ్ళ దూరంలో ‘శ్రీవిల్లి పుత్తూర’నే చిన్న నగరమొకటుంది. సర్వసంపదలకు, లలితకళలకు పేరు పొందింది. హిరణ్యాక్షుని బారి నుండి భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామియే, వటపత్రసాయియై భూదేవి కోరికపై, అవతరించాడా నగరంలో. స్వామిని అత్యంత భక్తిశ్రద్ధలతో ముకుందార్యుడు అనే శ్రీవైష్ణవుడు, ధర్మపత్ని పద్మావతీ దంపతులకు జన్మించిన బాలకునకు భట్టనాథుడు అని పేరు పెట్టుకున్నారు.
భట్టనాథుడు తన చిత్తంలో సదా విష్ణువుని నిలుపుకొని స్వామికి పూలమాలలు, తులసి మాలలు అర్పించి అర్చించేవాడు. అందుకే ఆయనకు ‘విష్ణుచిత్తుడు’ అనే పేరు వచ్చింది. ఆయనే పెరియాళ్వార్, అనగా పెద్ద (గొప్ప) భక్తుడు. ఆళ్వారు అనగా రక్షకుడు అని అర్థం ఏ విధంగా? అపారమైన భక్తి సాగరంలో తాను మునిగి, తనను నమ్మినవారిని కూడా ముంచి తేల్చి ఆనంద పరవశుల్ని చేసి, తాను తరించి, ఇతరులను తరింపజేసేవాడు అని అర్థం. సంతానం లేని విష్ణుచిత్తునికి, ఒకనాడు తులసి వనంలో పాదులు చేస్తుండగా లభించిన శిశువుకు ‘కోదై’ అని నామకరణం చేశాడు. పూలమాలలను పరమాత్మకు నిత్యం కైంకర్యం చేస్తున్నాను గనుక ఆ వటపత్రశాయియే ఆ పిల్లను అనుగ్రహించాడని ‘కోదై’ అనగా ‘పూలమాల’ అని పేరు పెట్టుకున్నాడు.
‘‘యత్రాకృతి స్తత్ర గుణాభవంతి’’ అన్న సూక్తి ప్రకారము సుందరాకృతితోపాటు మంచి గుణములను పొంది, చిన్ననాటినుంచే శ్రీరంగనాథునిపై మనస్సును లగ్నం చేసి ఆరాధిస్తోంది. ఆమె భూదేవి అంశ అని, అందరూ ప్రశంసించారు. భూదేవియే ఆమె నిచ్చింది. ‘గో’శబ్దానికి ‘్భదేవి’ అని అర్థం ఉంది. అందుకే ఆమెకు ‘గో’దాదేవి అని పేరొచ్చింది. కోదై- గోదాదేవి అయింది. కృష్ణునికి సమర్పించే పూలదండలను తను ముందుగా ధరించిన తరువాత స్వామికి సమర్పించిన గోదాదేవిని ‘ఆముక్తమాల్యద’ అన్నారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు, ఆ తల్లి పేరు మీదనే ఒక అత్యుత్తమ గ్రంథాన్ని రచించి మన కందించాడు. ఆయనకు ప్రేరణ కలిగించినది. నేటి కృష్ణా జిల్లా శ్రీకాకుళ గ్రామంలో పవిత్ర కృష్ణానదీ తీరంలో వెలిసిన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువే. ఆ గ్రామంలోనే ఈ రచనకు అంకురార్పణ చేశాడు.
తిరుప్పావై
గోదాదేవి శ్రీరంగనాథునే వివాహమాడుతానని, దానికి ఏదైనా నోములు, వ్రతాలు చెప్పమని తండ్రిని అడిగింది. ‘మార్గళీవ్రతం’ అనగా ధనుర్మాస వ్రతం గురించి చెప్పాడు. శ్రీకృష్ణుని పొందకోరి, గోపికలాచరించిన ‘కాత్యాయనీ వ్రతాన్ని’ వివరించాడు. సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిన రోజునుంచి మకరరాశిలో ప్రవేశించే ముందు రోజు వరకు అత్యంత భక్తిశ్రద్ధలతో సంపూర్ణ శరణాగతితో ధనుర్మాస వ్రతాన్ని, రోజుకొక పాశురము అనగా భక్తినిండారిన పాటతో బ్రాహ్మీ ముహూర్తంలో, స్నేహితురాండ్రనందరినీ మేల్కొలిపి, వ్రతాన్నాచరించింది. ఆ వ్రతము పేరు ‘తిరుప్పావై’. తిరు అంటే ‘శ్రీ’, అనగా శుభప్రదమైన, లక్ష్మీప్రదమైన ‘పావై’ అంటే వ్రతము, నోము. ద్రావిడ భాషలో ఉన్న దీనికి తెలుగులో ‘సిరినోము’ అని పిలుస్తారు. మేలైన నోము గనుక ‘మేలినోము’ అని కూడా అంటారు.
ముప్పది పాశురములలో వేదములు, ఉపనిషత్తులు, రామాయణము, శ్రీమద్భాగవతము (దశమ స్కంధము) మున్నగువాటిలోని అంతరార్థములను జిజ్ఞాసువులకు అందించింది ఆండాళ్ తల్లి. ‘ఆండాళ్’ అంటే కాపాడునది అని అర్థం. వ్రతము చివరలో రంగనాధుడు కనిపించి ఆమె హృదయ పరిపక్వతకు సంతసించి తపోనియమాలు వీడి సర్వభోగములను అమృతత్త్వ మనసుతో అనుభవించమన్నాడు. ఆ దేవదేవుని ఆజ్ఞానుసారం శ్రీరంగ క్షేత్రంలో ‘్భగి’ పండుగ రోజున వైభవంగా గోదా రంగనాథుల కల్యాణం జరిగింది. గోదాదేవి, యోగ నిద్రా ముద్రితుడైన శ్రీరంగనాథునిలో ఐక్యమయ్యింది. శరీరమే ఒక ధనస్సు. ఆ ధనుస్సు లక్ష్యం ఓంకార ప్రణవ స్వరూపుడైన పరమాత్మను చేరడమే. అందుకోసం మనస్సు అనే బాణాన్ని ఆత్మ లక్ష్యంవైపు గురి చూడాలని చెప్తున్నాయి వేదోపనిషత్తులు, పురాణేతిహాసములు, నోములు, వ్రతాలు. అందరిలో వున్నది ఒకే చైతన్యం. స్వార్థరహితంగా సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కళ్యాణాన్ని దర్శించటమే, ధనుర్మాస వైశిష్ట్యం, తిరుప్పావై ప్రాశస్త్యం.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464