మెయన్ ఫీచర్

రాజకీయ హోరులో జాతుల ఫోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిమానవుడే అసలు సిసలైన శాస్తజ్ఞ్రుడు.. నిపుణుడు.. సృజనశీలి, సత్యానే్వషి, నిత్యానే్వషి..! ఈ అనే్వషణలో ప్రకృతితో పోరాడడం, స్వీయానుభవం వెరసి నేటి కోట్లాది ఆవిష్కరణలు.. అంటే మనసొప్పని మహానుభావులు దేశవ్యాపితంగానే కాదు, ప్రపంచవ్యాపితంగా కోకొల్లలు! రాజులో, రాణులో, తత్వవేత్తలో, నోబుల్ పురస్కార గ్రహీతలో, మహా రచయితలో, సామాజిక మేధావులో చరిత్ర నిర్మాతలు కారంటే ఒంటికాలిమీద లేచేవారుండవచ్చు! కాని, నాడు నేడు రేపు మానవ ఇతిహాసానికి కారకుడు నిరంతరం శ్రమించే సాదాసీదా మానవుడే! గార్డెన్ చైల్డ్ పరిశోధన చేసి రాసిన ‘మానవుడే చరిత్ర నిర్మాత’ అన్న పుస్తకాన్ని తిరగేస్తే ఈ వాస్తవాలు మన మదిని తొలుస్తాయి. ఆహార సేకరణలో, వ్యక్తిగత భద్రత కోసం మనుగడ సాగించిన, సాగిస్తున్న క్రమంలో అనేక పనిముట్లను మానవుడు తయారు చేసుకుంటూ వాడినట్లు చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. పాత కొత్త రాతియుగాల, లోహ యుగాల చారిత్రక సత్యాలివి.
అలాంటి అభివృద్ధి దశలో మానవుడికి మతం లేదు. జాతిలేదు. కులం అసలుకే లేదు. వివిధ వస్తువుల తయారీలోగల నేర్పరితనం, నైపుణ్యతలు మానవులను ఆయా వృత్తులవైపు మొగ్గేలా చేశాయి. నాటి సామాజిక అవసరాల దృష్ట్యా కొందరు వీటికే పరిమితం కావడం జరిగింది. అయినా కుల వ్యవస్థకు ఎలాంటి బీజాలు పడలేదు. ఇప్పటికీ ఈ విధానాన్ని ఆదివాసుల ఆవాసాల ప్రాంతాల్లోనూ చూడవచ్చు. అక్కడ అందరు వేటగాళ్లు, వ్యవసాయదారులు, పశువుల పెంపకందారులే! వీటి నిర్వహణకు కావల్సిన పరికరాల్ని, ఆ సమూహాలే తయారు చేసుకుంటాయి. అయితే, అదనపు ఉత్పత్తి, అనుభవంతో పొందిన కొందరి తెలివితేటలు, వీరి ఆధిపత్య ధోరణి నాటి సమాజాల్ని చీల్చడం ప్రారంభించాయి. ఇందులో నుంచి పుట్టిందే శ్రమజీవుల విభజన! దీని ఆరవ వేలే ఈ దేశంలోని కులవ్యవస్థ. నిజానికిది ప్రపంచ వ్యాపితంగా జరిగిన ప్రక్రియనే! కానీ పాశ్చాత్య పారిశ్రామికీకరణతో ఆధునిక విద్యావ్యవస్థతో ఈ విభజన తెరమరుగై శ్రమ విభజనగా రూపాంతరం చెందితే, ఈ దేశంలో కులాల మధ్యన పని నిర్దేశకంగా మారింది. దీనికి కర్మ సిద్ధాంతాన్ని భూస్వామ్య వ్యవస్థ, బ్రాహ్మణీయ భావజాలం నాటి నుండి నేటిదాకా నారు పోస్తూ, నీరు పోస్తూనే ఉన్నవి. భారత్‌లాంటి సనాతన దేశాలలో ఇదో రుగ్మతగా మారి, నైపుణ్యం గల ప్రాథమిక స్థాయి ఉత్పత్తుదారులందరిని శ్రామికులుగా విభజించి వేసింది. ఒకనాడు సమాజాన్ని మొత్తంగా సాకిన ఈ వర్గాలు నేడు వెనుకబడిన వర్గాలుగా, ఆదివాసులుగా, గిరిజనులుగా (ఆదివాసులు, గిరిజనులు ఒకటి కాదు), పంచములుగా ముద్రించబడుతుంటే, వీరి శ్రమశక్తిపై బతుకీడ్చిన నేటి ఉన్నత వర్గాలు రాజకీయ అధికారం చెలాయిస్తూ సమాజానికి తామే పథ నిర్దేశకులమని దబాయిస్తున్నారు.
సామాజిక అభివృద్ధిలో భాగంగా ఈ కులదొంతరలు ఏనాడో కూలిపోవాల్సింది. అంబేద్కర్ కూడా ఇదే భావించి, రిజర్వేషన్లను ఓ పది సంవత్సరాల పాటు కొనసాగిస్తే సరిపోతుందని అన్నాడు. కాని, జరిగింది, జరుగుతున్నది వేరు. ఫలితంగా ఈ దేశంలో మత సమస్యతోపాటు జాతుల, కుల సమస్యలు రోజురోజుకు మరింతగా బలోపేతమవుతున్నాయి. వీటిని నివారించి, నిర్మూలించాల్సిన రాజకీయ పార్టీలు వారి ఉనికికై మరింతగా పెంచి పోషిస్తున్నాయి. కనుమరుగు కావాల్సిన కులవ్యవస్థ మరింతగా బరి గీసుకుంటున్నది. ఎన్నికల రంగమంతా వీటి చుట్టే తిరుగుతూ, రాజకీయ ఎజెండాలుగా మారుతున్నాయి.
ఆదివాసి జనాభాతో దేశంలో నాలుగవ స్థానంలో ఉన్న గుజరాత్‌లో ఆదివాసులు 15శాతం కాగా, 182 అసెంబ్లీ స్థానాల్లో వీరికి 27 స్థానాలు కేటాయిస్తే గిరిజనులుగా గుర్తించబడిన గిరిజనేతరులైన రబారి, బర్వాడ్, చరణ్ వర్గాల వారే విద్యా, ఉద్యోగాలతోపాటు రాజకీయ లబ్ధిని అధికంగా అనుభవిస్తున్నారని అసలైన ఆదివాసి తెగలకు చెందిన భిల్, కున్‌బి, వర్ణి, గామిట్ (ఱ్దజ, ఖశఇజ, జ్ఘీజ, ద్ఘిౄజఆ)లు ఆరోపిస్తున్నారు. దీంతో భిలిస్తాన్ (ఱ్దజజఒఆ్ఘశ) ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని వారు ముందుకు తెస్తున్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ఇదే ప్రధాన నినాదంగా మారింది. గత పార్లమెంటు ఎన్నికల్లో గుజరాత్‌లో నమోదైన ‘నోటా’ (్యఆ్ఘ) ఓట్లల్లో ఈ ప్రాంతాల నుంచే అధికంగా నమోదు కావడం గమనార్హం!
ఇలాంటి సెగలు ఈనాడు దేశవ్యాపితంగా కనపడుతున్నాయి. అదే గుజరాత్‌లో పటేళ్ల ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో కాపుల ఉద్యమం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని కదిలించాయి. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోనైతే జాతుల సమస్యే నిత్య కుంపటిలా రాజుకుంటున్నది. ఇప్పుడు తెలంగాణకు ఈ సెగ (్ఘౄళ) బాగానే తగిలింది. ఇవి దేశవ్యాప్తమైతే, మరో బిర్సాముండా, కొమురం భీమ్, అల్లూరి ఉద్యమాల ఘాటును ఈ దేశ పాపాల పాలకులు చవి చూడాల్సిందే! దాదాపు నెహ్రూ హయాం నుంచి నేడు మోదీ దాకా ఈ వర్గాల్ని ఎన్నికల దృష్టిలో, ఓట్ల లెక్కలతో చూడడమే ఈ అనిశ్చితికి కారణం. ఇదో రాచపుండులా, నిరంతరం జ్వలించే అగ్నిపర్వతంలా తయారయ్యాయి. ఈ మధ్యన జరిగిన, జరుగుతున్న సంఘటనల్ని చూస్తే రాబోయే రోజుల్లో, ముఖ్యంగా 2019 ఎన్నికలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంతోపాటు, ప్రతిపక్షాలకు కూడా అగ్నిపరీక్షగా మారే అవకాశం లేకపోలేదు.
తెలంగాణలో ఈ నెల 9, 13వ తేదీలలో జరిగిన రెండు సంఘటనలు ఈ ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నాయి. మొదటిది గిరిజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన తుడుం దెబ్బ కాగా రెండోది అదే సరూర్‌నగర్ ప్రాంతంలో జరిగిన బంజారాభేరి. దాదాపు 33 ఆదివాసి తెగలకు చెందినవారు 1976 నుంచి తమ హక్కులను బంజారాలు కైవసం చేసుకుంటున్నారని, వారిని తక్షణమే గిరిజన జాబితా నుంచి తొలగించాలని నినదించారు. ఈ సమావేశానికి కొమురం భీమ్ మనవడు సోలేవాల్ హాజరై తీవ్రస్వరంతో మాట్లాడారు. రాజస్థాన్‌లో ఉన్నత వర్గాల జాబితాలో, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడులో వెనుకబడిన తరగతుల జాబితాలో, కర్నాటకలో ఎస్సీల జాబితాలో వున్న బంజారాలను, రాజకీయ ప్రయోజనాల్ని ఆశించి 1976లో గుర్తింపబడిన గిరిజనులు (జూళశ్యఆజచిజళజూ)గా ఉన్న వారిని ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందని ఆరోపిస్తున్నారు. వీరితోపాటు, నాడు ‘మధురా’లను (్ఘౄఆ్దఖ్ఘూఒ) కూడా ఇదే జాబితాలో చేర్చడం, తిరిగి వారి ఆర్థిక, సామాజిక హోదాను గుర్తించి (బంజారాలు వీరిని వ్యతిరేకించారు) తొలగించడం జరిగింది. ఇప్పుడు ఇదే పరిస్థితి బంజారులకు ఎదురైంది. ఆదివాసుల ఆరోపణ కూడా ఇదే! విద్య, ఉద్యోగాది అవకాశాల్ని మైదాన ప్రాంతాల్లో ఉండే గిరిజనులుగా మారిన బంజారులే అధికంగా అనుభవించడమేగాక, రాజకీయ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారని అంటున్నారు. దేశవ్యాప్తంగా 15మంది ఐఎఎస్‌లుగా, 12 మంది ఐపిఎస్‌లుగా బంజారాలు ఉంటే తమ వర్గానికి చెందినవారు ఒక్కరంటే ఒక్కరు లేరని వారు వాపోతున్నారు. తెలంగాణలోని గిరిజనులకు చెందిన 12 మంది ఎంఎల్‌ఎలలో ఏడుగురు బంజారులేనని, అయిదుగురు మాత్రమే ఆదివాసులను వీరు ఆవేదన చెందుతున్నారు.
మూడు రోజుల తర్వాత జరిగిన బంజారా భేరీలో, తమ తెలివితేటలలో ఉద్యోగాలు సాధించుకుంటే, ఆదివాసులు ఓర్వలేకపోతున్నారని, తామూ గిరిజనులమేనని, రాజకీయ ప్రయోజనాలకే కొన్ని రాజకీయ పార్టీలు ఆదివాసుల్ని (బంజారేతర) రెచ్చగొడుతున్నాయని, రాబోయే ఎన్నికల్లో ఇలాంటి పార్టీలు తగు మూల్యం చెల్లిస్తాయని హెచ్చరించారు. ఏది ఏమైనా 1971 నాటి జనాభా లెక్కలతో పోలిస్తే 2011 జనాభా లెక్కల నాటికి బంజారుల జనాభా అనూహ్యంగా పెరగడం గమనార్హం. ఈ కాలంలో దీనికి విలోమంగా కొన్ని ఆదివాసుల తెగలు కనుమరుగవుతున్న జాబితాలోకి నెట్టివేయబడడం కొసమెరుపు!
ఇక ఇదే నెల 5న గంగపుత్రులు గర్జన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. నిర్వాహకులు ఊహించిన దానికంటే, లక్షలాది జనం తరలి రావడం తమకే ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, తమది అస్థిత్వ పోరాటమని, అందరూ అనుకుంటున్నట్లు రాజకీయ యుద్ధం కాదని తమ ఉనికికే భంగం కలిగేలా, భూమిపై వేటాడి, పండ్లు, ఫలాల్ని సేకరించి జీవించే ముదిరాజ్‌లను గంగపుత్రులతో సమానంగా చూపడం సరికాదని వారు భావిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాసకర్తతో, గంగపుత్ర ఐక్యవేదిక అధ్యక్షుడు డా.రమేష్‌బాబు మాట్లాడుతూ, వైఎస్‌ఆర్ హయాంలో బిసి ‘డి’ గ్రూప్‌లో 19వ స్థానంలో ఉన్న ముదిరాజ్‌లను బిసి ‘ఎ’ గ్రూప్‌లో 1వ స్థానంలో వున్న గంగపుత్రులతో కలపాలని నిర్ణయిస్తే తాము కోర్టుకు వెళ్లి ఆపివేయించామని, తిరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నదని అంటున్నారు. గంగపుత్రులు తక్కువగా ఉన్న ఆవాస ప్రాంతాల్లోని చెరువు, కుంటల్లో ముదిరాజులు కూడా చేపలు పట్టుకోవచ్చని జీవోను విడుదల చేయడంతో యావత్ రాష్ట్రం అంతా, తమకు చేపలు పట్టుకునే అర్హత వుంది కాబట్టి తమని బిసి ‘ఎ’ జాబితాకు మార్చాలని వారు కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్ లాంటి జిల్లాలో ముదిరాజ్‌లు గంగపుత్రులుగా (గూండ్ల) తప్పుడు ధ్రువీకరణ పత్రాల్ని పొందుతున్నారని, అధికారులు సహకరిస్తూ, గంగపుత్రుల అవకాశాల్ని దెబ్బతీస్తున్నారని తెలిపారు. అలాగే గంగపుత్రులు గుజరాత్, గోవాలో ఎస్టీలుగా గుర్తించబడినట్లే, ఇక్కడ కూడా తమని ఎస్టీ వర్గంలో చేర్చాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో ఇవి ఎలాంటి రూపాన్ని తీసుకుంటాయో చూడాలి.
బ్రిటిషు పాలన కాలంలో ఆదివాసుల హక్కుల పోరాటాలుగా, వర్గపోరుగా పరిణతి చెందిన ఉద్యమాలు, స్వతంత్ర భారత్‌లో అస్థిత్వ, ఉనికి పోరాటాలుగా మారడం బాధాకరం! వీటికి తోడు, మత, కుల రాజకీయాలు రోజురోజుకు బలోపేతమవుతున్నాయి. ఈ బలహీనతల్ని గుర్తించిన పాలకులు, రాజకీయ ప్రయోజనాల్ని ఆశిస్తూ, ఓ వర్గాన్ని చేరదీయడం, అవకాశాల్ని కల్గించడంతో, మరోవర్గ ప్రయోజనాలు కొడిగడుతున్నాయి. సమగ్ర అభివృద్ధి జరగని వ్యవస్థలో ఇలాంటి విషబీజాలు మొలవడంలో ఆశ్చర్యం లేదు! కాకపోతే, ఈ బీజాలకు వింజామరల్ని వీస్తున్నది రాజకీయ పార్టీలే! ఇలాంటి ఉనికి పోరాటాలుంటేనే, తమ పాలన సాగుతుందని, వీటిని ప్రేరేపిస్తున్నారు. అయితే, ఈ ఉద్యమాలల్లో వాస్తవాలు లేవా అంటే, ఇరువైపులా కనపడుతాయి. కాని, ఒకరి ప్రయోజనాలకై మరొకరి ప్రయోజనాల్ని దెబ్బతీయడం ఆక్షేపణీయం. వీటిని గర్హించాల్సిందే! పోతే ఈ రాజకీయ చదరంగంలో తామో పావులుగా మారుతున్నామని, ఐక్యపోరుతో ఉద్యమాలు సాగిస్తే ఈ పాలకులు ఏదో ఒక రోజు తోకముడవక మానరని గుర్తించాలి. అయితే, ఈ ఐక్యత ఈ దేశంలో సాధ్యమా అనేదే ప్రశ్న. ఈ పాలకుల బలమంతా ఈ అనైక్యతలోనే కావడం గమనార్హం!
*
- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162
*
(వ్యాసకర్త గిరిజన విద్య స్థితిగతులపై పరిశోధకుడు)