మెయన్ ఫీచర్

ఇవిగో జెనీవా రహస్య ఖాతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులు స్ర్తిల పేర్లకు ముందు గౌరవసూచికంగా కుమారి-శ్రీమతి వంటి మాటలు వాడుతుంటారు. అలాగా ఇటాలియన్ భాషలో ‘‘మదామ్’’, ‘‘సింగ్నోరా’’ వంటి మాటలు ఉపయోగిస్తారు. సింగ్నోరా గాంధీ అంటే ‘శ్రీమతి గాంధీ’ అని అర్థం. ఈ పదాన్ని ఇటలీలోని మిలన్ కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో ఉదహరించింది.
సందర్భమేమిటంటే బ్రిటన్ నుండి పనిచేసే ఒక ఛాపర్ సంస్థ 12 హెలికాప్టర్లు ఇండియాకు అమ్మింది. అలా ఒప్పందాన్ని కుదుర్చుకునే నిమిత్తం ఆ కంపెనీవారు ప్రముఖ కాంగ్రెస్ నాయకులకు భారీగా ముడుపులు సమర్పించింది. అలాంటి వారి పేర్లలో సింగ్నోరా గాంధీ పేరు ఉంది. ఇటలీలోని కోర్టు ముడుపులు ఇచ్చినవారిని, పట్టుకొని శిక్షించింది. మరి తీసుకున్న భారతీయుల మాటేంటి? సింగ్నోరా గాంధీ ఈ డబ్బును జెనీవాలోని సరాసిన్ బ్యాంకులో దాచిపెట్టిందని ఆరోపణ. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపితే జెనీవా రహస్య బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బు మొత్తం వివరాలు తెలుస్తాయి. అంటే క్రిస్టియన్ మైఖేల్, హస్కేలు ఈ డబ్బును ఇండియాకు తీసుకురాలేదు. ఇటలీ నుండి నేరుగా జెనీవా బ్యాంకు ఖాతాకే తరలించారని అర్థం. మైఖేల్, హస్కేలు అగస్టా ఛాపర్ కంపెనీకి చెందిన వ్యక్తులు. రక్షణరంగం కొనుగోళ్లలో భారీగా ముడుపులు అందుతుంటాయి. మనకు బోఫోర్స్ నాటి నుండి ఇది అనుభవమే. రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి 2016, ఏప్రిల్ 28న ఒక ఇంగ్లీషు న్యూస్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ జెనీవాకు చెందిన సరాసిన్ బ్యాంక్, పిక్టెట్ బ్యాంకుల్లో ఈ డబ్బు ఉందని ఆరోపించారు. ఏ ఆరోపణ అయినా విచారణలో తేలాల్సిందే. అయితే సర్కమస్టాన్సియల్ ఎవిడెన్స్‌ను బట్టి ఇందులో కొంత సత్యం ఉండవచ్చు. స్విస్ బ్యాంక్, పనామా బ్యాంకుల్లో డబ్బు దాచుకునేందుకు పెద్దలు ఇప్పుడు ముందుకు రారు. ఎందుకంటే ఈ రెండు బ్యాంకుల వ్యవహారం చాలా అల్లరి సృష్టించింది. అందుకని సురక్షితంగా ఉండే మరికొన్ని మారుమూల బ్యాంకులను వెతుక్కోవడం సహజం.
మారిషస్ బ్యాంకు, వర్జిన్‌ల్యాండ్ బ్యాంక్, జర్మనీ బ్యాంకుల పేర్లు పత్రికల్లో వచ్చాయి. పేర్లు వస్తే చాలదు అక్కడ అకౌంట్లు బయటపడాలి. సరిగ్గా ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే బెంగాల్‌లో ఒక సుందర దృశ్యం కనిపించింది. నిజాయితీకి మారుపేరైన బుద్ధదేవ్ భట్టాచార్య-రాహుల్ గాంధీలు ఒకే వేదికపై నిలబడి ఎన్నికల ప్రచారం చేయడం. ఉత్తర దక్షిణ ధృవావలుగా గత నలబై సంవత్సరాలుగా బెంగాల్‌లో పోరాడిన రెండు పార్టీలు ఒకే వేదికపై నిలబడి ఎన్నికల ప్రచారం చేయడతం ఉత్తర దక్షిణ ధృవాలుగా గత నలబై సంవత్సరాలుగా బెంగాల్‌లో పోరాడిన రెండు పార్టీలు ఒకే వేదికపైకి రావడం ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం. సరాసిన్ బ్యాంకు అకౌంటును గురించి బుద్ధదేవ్ భట్టాచార్య పార్టీ కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారు?
ఇటలీనుండి ఒకామె ఇండియా వచ్చింది. ఆమెకు ఇటలీకి చెందిన మాఫియా గ్యాంగ్ రూ. 3500 కోట్లు ముడుపులు చెల్లించింది. ఆ డబ్బు ఇచ్చిన వారిని ఇటలీ ప్రభుత్వం శిక్షించింది. పుచ్చుకున్న భారతీయుల మాటేమిటి? వారిని పట్టుకుంటాం అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏప్రిల్ 28న కలకత్తాలో అన్నారు. ఒక్కరినీ వదలం అని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఇది జరుగుతుందా? ప్రణబ్ ముఖర్జీ, వీరప్పమొయిలీ, సింగ్నోరా గాంధీ, రాహుల్ గాంధీ, చిదంబరం, ఎకె ఆంటోనీ, ఎస్‌కె త్యాగి, అహ్మద్ పటేల్, మన్మోహన్ సింగ్ ఇలాంటి పెద్దపేర్లున్నాయి. వీరిపై కేసులు పెట్టడం అరెస్టు చేయడం జరిగేపనా? డబ్బులు సోనియా ఖాతాలోకి వెళ్లాయి. కేసులు మన్మోహన్‌సింగ్, ప్రణబ్ ముఖర్జీలపై పెట్టడం ఎంతవరకు సమంజసం?
ఎకె ఆంటోనీ, పళ్లంరాజు (నాటి రక్షణశాఖ సహాయమంత్రి), ‘మా తప్పేం లేదు’ అంటున్నారు. ఒక్కొక్క జర్నలిస్టుకు రూ.10లక్షల చొప్పున 20 మంది జర్నలిస్టులకు రెండు కోట్లు ముట్టాయి. వీరు చేసిన సహాయం ఏమిటి? రక్షణశాఖలోని కొన్ని రహస్య ఫైళ్లు ఇటలీకి తరించబడ్డాయి. ఇదెలా జరిగింది? ప్రస్తుతం మనకు కొం దరి ప్రముఖుల ఫోటోలు దొరుగుతున్నాయి. తరలించబడిన ఫైళ్లు కూడా లభ్యమైనాయి. వీటల్లో డిఫెన్స్ సీక్రెట్లు ఉన్నాయి. అంటే అగస్టా కుంభకోణం వెనుక దేశద్రోహం, గూఢచర్యం కూడ జరిగిందని అర్థం.
రాజీవ్ దేశాయ్ కాంగ్రెస్ నాయకుడు. ఈ అగస్టా కేసు గురించి మాట్లాడవలసిందిగా ఒక ఇంగ్లీషు టివి ఛానల్ వారు పిలిస్తే ఆయన ‘‘డాక్టర్ ముంజే 1934లో ముస్సోలినీని’’ కలిశా అంటున్నాడు. అంటే ఏమిటి? సోనియాగాంధీ చేసిన దుర్మార్గాన్ని కప్పిపుచ్చడానికి హిందూమహాసభ నాయకునిపై బురద చల్లుతున్నారు. 1934లో డాక్టర్ ముంజే ముస్సోలినీని కలిసిన మాట నిజమేనా? నిజమే అయితే తప్పేమిటి? నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిట్లర్‌ను కలిసిన మాట నిజమే. బ్రిటిష్ వారి పాలన నుండి విముక్తి పొందడంకోసం నాయకలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ సహాయం అందితే అక్కడికి వెళ్లారు. హిట్లర్, ముస్సోలినీలు నియంతలు కావచ్చు. కాని వారితో రష్యాతో సహా అన్ని దేశాలు తొలిదశలో స్నేహం చేయడం మరచిపోకూడదు. ఐనా ఇటలీ కోర్టు 2018లో అగస్టా కుంభకోణం గురించి తీర్పు ఇస్తే దానిపై చర్చ జరుగుతుంటే ఈ పెద్దమనిషి ముంజే అనే హిందూ నాయకుని పేరును ఉదహరించడంలోని ఆంతర్యం ఏమిటి? అంటే ప్రస్తుతం కేంద్రంలో భారతీయతకు అనుకూల ప్రభుత్వం ఉంది. అది రాజీవ్ దేశాయ్‌కి ఇష్టం లేదు.
ప్రణబ్ ముఖర్జీ భారత రాష్టప్రతి. ఎస్‌పి త్యాగి భారత వైమానిక దళ మాజీ చీఫ్, సిగ్నోరా గాంధీ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి అధ్యక్షురాలు. వీరంతా ముడుపులు తీసుకున్నారా? నమ్మశక్యంగా లేదు. ‘ఆధారాలు ఉంటే విచారించండి’ అన్నారు సోనియాగాంధీ. సరిగ్గా ముప్పయ్యేళ్ల క్రితం బోఫోర్స్ శతఘు్నల కొనుగోళ్ల కేసులో విచారణ జరిపినప్పుడు కూడా ఈమె ఇలాగే ప్రశ్నించారు, ‘ఆధారాలు ఉంటే చూపించండి?’ అని. బోఫోర్స్ కోర్టుల్లో పాతికేళ్లు నడిచింది. చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లయింది. ఇపుడు అగస్టా హెలికాప్టర్ల కొనుగోళ్ల కుంభోణమూ అంతేనా?మన రక్షణ వ్యవస్థ నైతిక స్థయర్యం దెబ్బతింటుంటే చైనా, పాకిస్తాన్‌లకు లాభం. 1962లో చైనా చేతిలో ఇండియా ఓడిపోయింది. ఇది 2016. ఇవ్వా ళ చైనాకు విజయావకాశాలు లభించవు. అగస్టా కేసులో అగస్త్యభ్రాతల పేర్లన్నీ బయటకు రావలసిందే.
‘ఎలాంటి వారినైనా వదిలేది లేదు’ అని మనోహర్ పారికర్ అంటున్నారు. ఆదర్శహౌజింగ్ కుంభకోణం, 2జి వాయుతరంగాల కుంభకోణం, బొగ్గు కుంభకోణం, ఎయిర్‌సెల్ చిదంబరంగారి కుంభకోణం, నేషనల్ హెరాల్డ్ కుంభకోణం, లలిత్‌మోడీ, ఆండర్‌సన్ ఖత్రోచీ, విజయ్‌మాల్యా, క్రిస్టియన్ మైఖేల్, సింగ్నోరా గాంధీ, ఎంత సుదీర్ఘ పరంపర? నరేంద్ర మోదీ పదవీకాలం మూడేళ్లు కూడా లేదు. ఇన్ని కుంభకోణాలు, ఇంత డబ్బు వెలికి తీసుకొని రాగలడా?
క్రిస్టియన్ మైఖేల్ ఇట్లా అన్నాడు. ‘‘ఒక కంపెనీ ఒక వస్తువును ఉత్పత్తి చేసినప్పుడు దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కోసం కొనుగోలుదార్లకు ప్రోత్సాహకాలు ఇస్తారు. దానికే కమిషన్ అని పేరు. దీన్ని లంచాలు అని పిలిస్తే ఎలా?’’ ఒక అధికార వార్త ప్రకారం గౌతమ్ ఖైతాన్, జ్యూలీ త్యాగిలకు సంబంధించిన ధనం మారిషస్‌కు తరలించబడినట్టు తెలుస్తున్నది. దీన్ని మనోహర్ పారికర్ నిర్ధారించవలసి ఉంది. సామాన్యంగా ఒక విమానాన్ని కొనుగోలు చేసినప్పుడు ఫీల్డు టెస్టు తప్పనిసరి. మరి అగస్ట్ఛాపర్ డీల్‌లో ఫీల్డ్ టెస్టు ఎందుకు జరగలేదు?
బరోడాలో మనీష్ భంగోరే అనే టెలిఫోన్ ఆపరేటర్ ఉన్నాడు. ఆయనవద్ద ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం టెలిఫోన్ సంభాషణలు పూర్తి జాబితా ఉంది. నల్లధనం దావూద్ హవాలా మార్గంలో దుబాయికి తరలించిన వివరాలు కూడా ఉన్నాయి. ఈ మనీష్‌కూ దావూద్‌కున్న సంబంధం ఏమిటి? అని ఎదురు ప్రశ్న వేశాడు. ఇదీ మనదేశ పరిస్థితి. మిలన్ కోర్టుకు చెందిన న్యాయమూర్తి ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. ‘‘నా విచారణ సందర్భంగా భారత దేశంలోని యుపిఎ ప్రభుత్వం సహకరించలేదు. అందులో ఎపి అంటే అహ్మద్ పటేల్ అని అర్థం. ఫ్యాక్స్ ద్వారా సోనియా పేరుగల సమాచారం అందింది. ఆమెకు కూడా ఈ కేసులో గల ప్రత్యక్ష సంబంధం ఉంది. ముడుపులు తీసుకున్నవారి పేర్లు విచారించవలసిన బాధ్యత భారత ప్రభుత్వానిదే.’’
కీర్తి సోమయ్య అనే లోక్‌సభ సభ్యుడు చేసిన ఆరోపణ ప్రకారం కామన్‌వెల్త్ గేమ్స్‌లో నేరస్థుడైన కనిష్కసింగ్ ఈ అగస్టా కుంభకోణంలో రాహుల్ గాంధీకి బినామీగా వ్యవహరించాడు. ఇక ఎస్‌పి త్యాగి ఇటలీలోని ఫ్లారెన్స్, మిలన్, వెనిస్ వంటి నగరాలను సందర్శించి చేసిన ఘనకార్యాలన్నీ సిబిఐ విచారణలో వెలిగివస్తున్నాయి. యుపిఎ పాలనా కాలంలో ఇ-డి, సిబిఐలకు ప్రభుత్వం వ్రాసిన రహస్యపత్రం దొరికింది. అందులో ఇలా ఉంది ‘‘అగాస్టా కుంభకోణంపై విచారణ ఆపేయండి. లేదా చేస్తున్నట్టు నటించండి.’’ ఇప్పుడు క్రిస్టినా అనే గూఢచారిణి పేరు వెలుగులోకి వచ్చింది. ఇమె మైఖేల్ క్రిస్టియన్ పక్షాన ఎవరెవరిని కలిసిందో విచారిస్తున్నారు.
అగస్టా కుంభకోణంలో సోనియాగాంధీకి అందిన లంచాలు ఇండియాకు రాలే దు. జూరిచ్‌లోని పిక్టెడ్ బ్యాంకులో జనీవాలని సరసిన్ బ్యాంకుల ఖాతాల్లో ఈ మొత్తాలు జమచేశారు. ముడుపులు నాలు గు వర్గాలుగా విభజించారు. 1. సోనియా ఆమె రాజకీయ పరివారం, 2. బ్యూరోక్రాట్లు, 3. వైమానిక ఉద్యోగులు వారి పరివారం. 4. మధ్యవర్తిత్వం నెరపిన జర్నలిస్టులు. మొత్తం 3600 కోట్ల కొనుగోళ్లలో మొత్తం ముడుపుల శాతం 15%. ఈ ముడుపులు ప్రైజ్ మనీ లేదా ప్రోత్సాహక కమిషన్లు అని పేరు.
ఇటలీకి చెందిన కంపెనీ నుండి తుప్పు పట్టిన సముద్ర ఫిరంగులు ఎందుకు కొన్నట్టు? అందులోనూ నియమ ఉల్లం ఘన జరిగింది. ఈ డబ్బు ఏ బ్యాంకు ఖాతాలోకి వెళ్లిందో, మోదీ విచారణ జరపాలి.

- ముదిగొండ శివప్రసాద్