మెయన్ ఫీచర్

శాస్త్ర చర్చకు సభ్య భాషతోనే బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరైనా సైద్ధాంతిక చర్చ చేయదలచుకున్నప్పుడు సిద్ధాంతాన్ని తర్కాన్ని ఉపయోగించాలి. అలా వాదంలో బలం లేనప్పుడు ‘వాది’ బలం ప్రదర్శింపబడుతుంది. వాది బలం ఉంటే బాహుబలం అని అర్థం.
భారతదేశం మీదికి గత రెండు వేల సంవత్సరాలుగా విదేశీ దండయాత్రలు జరిగాయి. హూణులు, యవనులు, మంగోలులు, అరబ్బులు, మొగలాయిలు, బ్రిటీషువారు- ఇట్లా అనేక ఆటవిక జాతులు ఈ దేశాన్ని దోచుకున్నాయి. అప్పుడు క్షత్రియులు ఖడ్గబలంతో వారిని ఎదుర్కొన్నారు. బ్రాహ్మణులు ఆధ్యాత్మిక శక్తిని ప్రదర్శించారు. ఐతే ఆటవిక జాతుల పశుబలం ముందు భారతదేశం నిలువలేకపోయింది. ఎందువల్ల? శాపానుగ్రహశక్తి కలవారిని భూసురులు అంటారు. ఈ రెండు దైవీ శక్తులను వారు కోల్పోయారు. అలాగే క్షత్రియుడు భోగలాలసుడు కావటంవల్లనూ అంతర్గత వైరాలవల్లనూ రాజ్యాన్ని శత్రువులకు అప్పగించారు.
రాబర్ట్ క్లైవ్ ఎలా జయించాడు?
అప్పుడు ఇక్కడ పెద్దపెద్ద సంస్థానాలు ఉండేవి. లక్షలాది పీఠాధిపతులు సాధువులు మహంతులు పూజారులు ఉండేవారు. ఐనా భారతదేశం ఎందుకు ఓడిపోయింది? మొదటి కారణం- క్షత్రియులు తమలో తాము పోరాడుకున్నారు. బ్రాహ్మణులు, వడిగళ్ తెన్‌గళ్ శైవ, స్మార్త, విశిష్టాద్వైత, అద్వైత, ద్వైత శాక్తేయాది భిన్న మార్గాలుగా విడివడిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ను రెండు తెలుగు రాష్ట్రాలుగా విభజించడానికి కారణం ప్రాంతీయ విద్వేషాలు. ఇక మాల - మాదిగ సామాజిక వర్గాలు పరస్పరం కొట్టుకుంటున్నాయి. కమ్మ - కాపు - రెడ్డి సామాజిక వర్గాలు రాజ్యాధికారం కోసం పోరాడుతున్నాయి. రోజా అనే సినీ తార ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అశ్లీల భాషలో నిందిస్తున్నది. దీనిని వెర్బల్ టెర్రరిజం అంటారు.
వాదంలో బలం తగ్గినపుడు వాది వెర్బల్ టెర్రరిష్టు అవుతాడు. 2017 నవంబరు మొదటివారంలో కేరళలోని కొచ్చిన్‌లో ఐసిస్ ఉగ్రవాదులు ఒక ఆడియోను విడుదల చేశారు. అందులో ‘‘ఈ భూమి మీద హిందువులకు క్రైస్తవులకు జీవించే అర్హత లేదు. కుంభమేళా వంటి పెద్ద పెద్ద తీర్థ సమావేశాలు జరిగినపుడు బాంబులు అమర్చి వారిని చంపండి’’ అని ఆ ఆడియోలో ఉంది. దీనిపై కేరళ డిజిపి లోకనాధ్ బెహరా వ్యాఖ్యానిస్తూ, ఇది ఎవరు విడుదల చేశారో విచారిస్తున్నాము, దీనికి భయపడకండి అని కోరాడు. గత అనుభవాల దృష్ట్యా ప్రజలు తప్పనిసరిగా భయపడతారు. ముంబాయిలో లోగడ జరిగిన బాంబు ప్రేలుళ్లల్లో వందలాది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని స్టేట్ ఎంపైర్ బిల్డింగ్‌ను 2002లో జీహాదీ ఉగ్రవాదులు కూల్చివేశారు. అపుడు అమెరికాలోని క్రూసేడర్లు ఒసామా బిన్ లాడన్‌ను కాల్చి చంపారు.
ప్రపంచంలో హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు, కమ్యూనిస్టులు అనే నాలుగు ప్రధాన వర్గాలున్నాయి. హిందువులు ఒక్క హిందూ దేశంలోనే మెజారిటీలో ఉన్నారు. ప్రస్తుతం అరుణాచలప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, కాశ్మీర్ వంటి ప్రాంతాలల్లో ఇప్పటికే హిందువులు మైనారిటీలో ఉన్నారు. కేరళ, బెంగాల్, త్రిపుర అనే మూడు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు మతం బలంగా ఉంది. ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. వీరిలో చాలా అంతర్గత విభేదాలున్నాయి. ఐనా ఆర్థిక లాభాల కోసం మత వ్ఢ్యౌంతో పరస్పరం కలహించుకోవటం నేడు చూస్తున్నాం. ఇండియాలోని కోట్లాది హిందూ గొర్రెలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత మనపై ఉంది అని వాటికన్ ప్రకటించింది. గొర్రెల కాపరిని గుడ్ షెప్పర్డ్ అంటారు. లవ్ జీహాదీ ద్వారాను ఆర్థిక ప్రలోభాల ద్వారాను భారీగా మతమార్పిడులు జరుగుతున్నాయి. ఐనా మన పాలకులు మేల్కొనలేదు.
ఉత్తరప్రదేశ్‌లో హిందువుల పుణ్యక్షేత్రాలు మధుర, కాశి, బదరీనాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి చాలా ప్రాంతాలల్లో ఉన్నాయి. అలహాబాదు వంటి ప్రాంతాలల్లో పండాలు గూండాలుగా ప్రవర్తిస్తుంటారు. దీనిని విదేశీ శక్తులు సద్వినియోగం చేసుకున్నాయి. ‘బ్రాహ్మణ వైశ్య క్షత్రియులను చంపేయండి’ అంటూ కుమారి మాయావతి పిలుపునిచ్చింది. ఈమె కాన్షీరామ్ అనే ఒక క్రైస్తవ మత ప్రచారకుని శిష్యురాలు. హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీలో కంచె ఐలయ్య అనే ఒక యాదవ కులస్థుడు ఉన్నాడు. అతడు క్రైస్తవ మతం పుచ్చుకున్నాడు. బాపనోళ్ళ పిలక పంది తోకలా ఉంది అన్నాడు. కోమటోళ్లు చూడడానికి అసహ్యంగా బొజ్జలు పెంచుకుని పంగనామాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కోమటోళ్లంతా సామాజిక స్మగ్లర్లు, బాపనోళ్లు ఆధ్యాత్మిక ఫాసిష్టులు అన్నాడు. ముందే చెప్పినట్లు ఈ తిట్ల పురాణం సిద్ధాంత చర్చ సందర్భంలో అవసరమా? కత్తి పద్మారావు అనే వాడు గణేశుణ్ణి, హిందువుల పండుగలను తిట్టాడు. మరి మొహర్రం పండుగలో గుండెలు బాదుకుంటూ ఏడుస్తారు. నిప్పులమీద నడుస్తారు. బక్రీదు నాడు ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల గొర్రెలు ఆవులు ఒంటెలను చంపుతారు. ఈ దుర్మార్గాన్ని కంచెలు కత్తిలు ఎందుకు విమర్శించలేదు?? ఈ విధంగా సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా భారతదేశాన్ని విదేశీయలు ఇప్పటికీ ఆక్రమించుకుంటున్నారు. 2000 సంవత్సరంలో నేపాల్ రాజ్యాంగాన్ని చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు మార్చివేశారు. హిందూ అనే పదం తొలగించి సెక్యులర్ అనే మాటను చేర్చారు. 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ భారత రాజ్యాంగాన్ని సవరించి (అమెండ్‌మెంట్) సెక్యులర్ అనే పదాన్ని చేర్చింది. హిందూ ధార్మిక సంస్థలనన్నింటినీ నిషేధించింది. కేరళలో ముఖ్యమంత్రి పిన్నారాయ్ విజయన్ అధికారం చేపట్టిన తరువాత హిందూ సామాజిక వర్గాలకు చెందిన వందలాది కార్యకర్తలు హత్యకు గురౌతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి కమ్యూనిస్టుల చేతిలో మరణించిన ప్రజల సంఖ్య ఆరు కోట్లు (పది కోట్లు అని మరొక సర్వే తెలిపింది). ఇదంతా ఎందుకు? అంటే ‘సమసమాజ స్థాపన కోసం’ అని చెపుతున్నారు. కంచ ఐలయ్యలకు ఏమీ తీసిపోరు. శ్రీశ్రీ తనకు నచ్చనివారిని ‘దొంగ లంజకొడుకులు’ అని తన గేయ గ్రంథం మహాప్రస్థానంలో తిట్టాడు. తాగిన మత్తులో ‘ఏమిటోయ్ పొట్టి కవీ’ అంటూ దాశరథి కృష్ణమాచార్యులవారిని నిందించాడు. దాశరథి కూడా కమ్యూనిస్టు తొత్తువురా- నువ్వు మావో పిత్తువురా! అంటూ అశ్లీల భాషలో తిట్ల పంచాంగం విప్పాడు. కర్నాటకలో కలుబురిగి అనే ఒక లింగాయత్ ‘శివలింగాలమీద మూత్రాభిషేకం చేయండి’ అన్నాడు. ఈ తిట్లు రాజ్యాంగబద్ధమేనా??
చట్టబద్ధంగా ఎన్నికైన కల్వకుంట చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నవారిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు? ‘దేశ ప్రధాని నరేంద్ర మోదీని నూటొక్కసార్లు తుపాకీతో కాల్చి చంపండి’ అని కామ్రేడ్ నారాయణ (సిపిఐ) రాజమండ్రిలోని పత్రికా విలేకరుల సమావేశంలో బహిరంగంగా (2016) ప్రకటించాడు. మరి ఆయనపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకోలేదు.
ఇందుకు చాలా కారణాలున్నాయి. ఒక బ్రాహ్మణ స్ర్తిని లవ్ జీహాదీతో ఒక ముస్లిం యువకుడు అపహరించుకొనిపోయాడు అని చలం 1940వ దశకంలో ఓ పుస్తకం వ్రాస్తే దానిని ఆనాటి సమాజం క్షమించింది. ‘మనం ఎందుకు పుట్టాము? అంటే సంభోగించటం కోసం’ అన్నాడు చలం. ఈ చంచల దృక్పథాన్ని ఒక్క విశ్వనాథ సత్యనారాయణ తప్ప మరో రచయిత ఎదిరించలేదు. హిందూ దేవి దేవతలను విమర్శించే వీళ్లు క్రైస్తవ ముస్లిం కమ్యూనిస్టు పీఠాధిపతులను ఎందుకు విమర్శించలేకపోతున్నారు?
సినిమాకు ఓ సెన్సారు బోర్డు ఉంది. కాని టీవీకి అలాంటిది కూడా లేదు. జబర్దస్త్ అనే అశ్లీల కార్యక్రమం చూస్తున్నారా? దీనిపై ఎన్నో మహిళా సంఘాలు తమ నిరసన తెలియజేశాయి. ఐనా దున్నపోతుమీద వాన అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అనాధాలయాన్ని ఆనందాలయంగా మార్చాలి కాని అనాథ పిల్లలను అవమానించటం దుర్మార్గం. ‘‘వాడి ఆవేశానికి ఆమె ఆశకూ పుట్టినవాడు అనాధ శిశువు- ఒకడికి ముందు పొట్ట వెనుక బట్ట (తల) ఉంది. ఇలాంటి వ్యక్తిగత దూషణలతో ఈ కార్యక్రమం నడస్తున్నది. వీటిని నియంత్రించేదెవరు?
1955 ఎన్నికల సందర్భంగా మాకినేని బసవపున్నయ్య మాట్లాడుతూ- ‘‘కృష్ణా జిల్లా కమ్మ కుల స్ర్తిల మెడలపై కాడి కట్టి పొలం దున్నిస్తాను’’ అన్నాడు. తత్ఫలితంగా ఈ ఒక్క మాటతో అక్కడ కమ్యూనిస్టులు ఘోర పరాజయం పాలైనారు. మొన్న మణిశంకర్ అయ్యర్ అనే కాంగ్రెసు నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘నీచ జాతి వాడు’ అని తిట్టాడు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జగన్ ఎన్నివిధాలుగా నిందిస్తున్నారో చూడండి. దీనివల్ల ప్రజలకు ఆయా వ్యక్తులపై నిరసన జ్వాలలు పెరుగుతాయి. వేణీప్రసాద్ వర్మ అనే ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు నరేంద్ర మోదీని ‘పిచ్చికుక్క’ అని తిట్టడం సభ్యసమాజం హర్షించగలదా??
కంచె ఐలయ్య బాపనోళ్లు తోడేళ్లు, కోమోటోళ్లు స్మగ్లర్లు అనటంలో శాస్ర్తియ చర్చ ఏమి ఉంది? కేవలం కుల ద్వేషం ఉంది.
ఉగ్రవాదం అంటే బాంబులు విసరటం అని సామాన్యార్థం. ఐతే ‘వెర్బల్ టెర్రరిజం’ కూడా ఉగ్రవాదం కిందకే వస్తుంది.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్