మెయిన్ ఫీచర్

ఆకాశవీధిలో హరివిల్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. చిన్న పిల్లల నుంచి పెద్దలవరకూ గాలిపటాలు ఎగరేస్తూ మురిసిపోతుంటారు. గాలిపటానే్న ‘పతంగి’ అని అంటారు. గాలిపటాలను స్వేచ్ఛాయుత వాతావరణ జీవితానికి సూచికగా అన్ని వయసులవారు ఆనందోత్సాహాల మధ్య ఎగురవేస్తారు. హిందూ సంప్రదాయంలో ప్రతి ఆచారం, సంప్రదాయం వెనుక భౌతిక, మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఇమిడి వుంటాయి. మార్కెట్‌లో వివిధరకాల గాలిపటాలు పలు ఆకారాల్లో లభిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాక ఇతర రాష్ట్రాల్లోను ఈ పండుగను జరుపుకుంటారు. ఆకాశవీధిలో గువ్వల్లా ఎగిరే పతంగులు మన కళ్లకు పని పెడతాయి. అంతేగాక నింగికి రంగులు పులిమేటట్లు వుంటాయి. రంగురంగుల కాగితాలతో రూపొందించిన పతంగులు ఆకాశవీధిలో తారలవలె మెరుస్తూ మానవాళికి శుభసంకేతాలు చేరవేస్తాయి. గాలిపటాలు తమ ఆనందాలను దేవతలకు తెలుపుతున్నారా అన్నట్లు ఉల్లాసంగా ఎగురవేస్తారు. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో గాలి ఎటువైపు నుంచి ఎటు వస్తుందో తద్వారా వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి అనే విషయం అనుభవజ్ఞులైన రైతులకు అవగతమవుతుంది.

చైనా మంజా నిషేధం
కొనే్నళ్ల క్రితం అత్యధికంగా చైనా మాంజాను పతంగులకు ఉపయోగించారు. ఈ మాంజా పక్షులకు ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యావరణ చట్టం 1986, వన్యప్రాణి చట్టం 1972 ప్రకారం చైనా మాంజాను విక్రయించినా, వాడినా వారిపై చర్యలకు హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. పతంగులకు కాటన్ దారమే వాడాలని సూచించింది.

గాలిపటం ఆకాశంలో ఎంత ఎత్తుకు ఎగిరినా దారం తెగితే ఎక్కడో పడిపోతుంది. అలాగే నీవు కూడా పైకి ఎగిరిపోతున్నకొలది జాగ్రత్త అని పరోక్షంగా ఉపదేశిస్తుంది గాలిపటం. ప్రతి మనిషికీ ఆత్మనిగ్రహం అవసరమని, సన్నని దారంతో గాలిపటాన్ని అదుపులో పెట్టగలిగినట్లు మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలని చెబుతుంది. ఒడుపుగా లాగితే తెగిపోతుంది. వదలకుండా పట్టుకుంటే ఎగరలేదు. ఆ రెండింటినీ సమన్వయం చేసుకుంటేనే గాలిపటమైనా, జీవితమైనా ముందుకు వెళుతుందని అర్థం.
గాలిపటాలను ఉదయం వేళ ఎగురవేసేవారికి ఎక్కువ సమయం సూర్యరశ్మిలో వుండటం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగం. శరీరానికి విటమిన్ డి అందుతుంది. అంతేగాక శ్వాస సంబంధ ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటంవల్ల కంటి చూపు మెరుగవుతుందని ఆధునిక అధ్యయనాలు చెబుతున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో వున్న కైట్ మ్యూజియంలో వేలాది గాలిపటాలున్నాయి.
ఎగురవేసేటపుడు జాగ్రత్తలు
గాలిపటాలు ఎగరవేయడానికి మైదాన ప్రాంతాలు మంచిది. తెగిన గాలిపటం కోసం చిన్నారులు పరుగెత్తకుండా, విద్యుత్ తీగలకు దూరంగా వుంటాలి. గాలిపటాలు చెట్లకు, తీగలకు చుట్టుకున్నపుడు వాటిని తీసుకునే సాహసం చేయకూడదు. విద్యుత్ వాహక దారాలను గాలిపటాలకు అసలు కట్టకూడదు. ఇటీవలి కాలంలో వినోదానికి పరిమితమైన ఈ గాలిపటాలు 1860-1910 కాలంలో శాస్త్ర సాంకేతిక పరిశధనలో ఉపయోగించారు.చివరగా- చేతిలో దారం వుందికదాని ఎంత దూరమైనా గాలిపటాన్ని వదిలినా ఏదో ఒక సమయంలో మళ్లీ చుట్టచుట్టి గుప్పెట్లోకే తీసుకుంటాయి. అంత ఎత్తుకు ఎదిగినా భగవంతుని చేతిలోనే వున్నామన్న సంగతి మరువకూడదు. గాలిపటానికి ఎన్ని రంగులున్నా, ఎంత పొడవు తోక పెట్టుకున్నా ఎవరి ఇంటిమీద వాలినా దారం చుట్టక తప్పదు. అదే సూత్రం మనిషికీ వర్తిస్తుందని గాలిపటం ఇచ్చే అద్భుత సందేశం.

అంతర్జాతీయ గాలిపటాల పండుగ

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో వివిధ దేశాలవారు ఇక్కడివచ్చి గాలిపటాలను ఎగురవేస్తారు. ఏటా సంక్రాంతికి ఇక్కడ అంతర్జాతీయ గాలిపటాల పండుగ చేస్తారు. రకరకాల ఆకారాల్లో అబ్బురపరిచే ఈ గాలిపటాల్ని చూడడానికి దేశ విదేశాల నుంచి సందర్శకులు వస్తారు. గత సంవత్సరం రిమోట్? కంట్రోల్‌తో నియంత్రించే గాలిపటాల్ని కూడా ఎగురవేసారు. గుజరాత్ టూరిజం శాఖ ఈ పండుగను ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌గా జరుపుతుంది. ‘ఉత్తరాయణ్’ పేరిట జరుపుకునే పండుగనాడు కొన్ని మిలియన్ల గాలిపటాలు ఎగురవేస్తారు. దాదాపు 300 ఏళ్ల నుంచి గుజరాత్‌లో కైట్లను ఎగురవేయడం సంప్రదాయంగా వస్తోంది. 1986 నుంచి ప్రాంతీయ పండుగగా జరుపుతున్నారు. 1989లో ‘ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్’గా గుజరాత్ టూరిజమ్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. దీపావళి నుంచి సంక్రాంతివరకు దాదాపు 60 మిలియన్లకుపైగా పతంగులను అమ్ముతారు. ప్రపంచంలోని అతి పెద్ద పతంగుల మ్యూజియం పెయ్‌షాంగ్‌లో వుంది. 8,100 చ.మీ విస్తీర్ణంలో వుండే ఈ ప్రదర్శనశాలలో పలు దేశాల గాలిపటాలున్నాయి. చైనా, జపాన్, భారత్, ఇండోనేషియా, యుఎస్‌ఏలో జరిగే కైట్ ఫెస్టివల్స్ ప్రసిద్ధిచెందాయి. జపాన్‌లో మేలో, చైనాలో ఏప్రిల్‌లో, జకర్తాలో జూలైలో తెలంగాణలో జనవరిలో జరుపుకుంటారు. పర్యాటక శాఖ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంది. రాత్రి పూట పతంగుల ఎగురవేత ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా, శిల్పారామం, నెక్లెస్‌రోడ్‌లో పతంగుల ఉత్సవాలు జరుగుతాయి. వీటితోపాటు పతంగుల తయారీ, కళాబృందాల నృత్యాలు కూడా నిర్వహిస్తారు.

-కె.రామ్మోహనరావు