ఎడిట్ పేజీ

పిన్నరాయల పెద్దకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలోని సర్వాంగ సుందర ప్రదేశాలలో కేరళ ఒకటి. ఇక్కడి నదీనదాలు నారికేళోద్యానాలు సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయి. ఇది పరశురాముని భూమి అని పేరు. లోగడ ఆదిశంకరాచార్యులు కాలడి గ్రామం నుంచి బయలుదేరి మొత్తం భారతదేశం పర్యటించి జాతీయ ఏకాత్మతాభావాన్ని కలిగించాడు. ఆ తరువాత నారాయణగురు మాతా అమృతానందమాయి (జాలరి కులస్థురాలు) నిద్రాణమైన ప్రజలలో సామాజిక సమరసతను కల్పించారు. 1940వ దశకంలో కేరళలోకి కమ్యూనిజం ఒక కాన్సర్ వలె ప్రవేశించింది. క్రమక్రమంగా ఇక్కడ సమ్మెలు లాకౌట్లు హత్యా రాజకీయాలు మొదలైనాయి. భారతదేశానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యమూ, ఒక రాజ్యాంగమూ ఏర్పడిన తరువాత కూడా ఇక్కడ సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సంపాదించుకోవాలని ప్రచారం చేశారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలో జిహాదీ ఉగ్రవాద ముఠాలు చురుకుగా పనిచేస్తున్నాయి. సిరియాలో ఖలీఫా సామ్రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో పోరాడుతున్న నరహంతక మతసంస్థ ఐసిస్‌లో కేరళ కమ్యూనిస్టులు జతకట్టారు. కేరళనుండి దుబాయి మీదుగా ఈ ఉగ్రవాద జిహాదీ మూకలు రిక్రూట్ చేయబడుతున్నాయి. ఎ.కె.ఆంటోనీ వంటి వారి నేతృత్వంలో ఇక్కడ క్రైస్తవ సామాజిక వర్గాలు కూడా సంఘటితంగా ఉన్నాయి.
ఆర్.ఎస్.ఎస్. నాయకుడు ఎం.ఎస్.గోల్వాల్కర్ 1950 ప్రాంతంలో కేరళ పర్యటనకు వెళ్లినప్పుడు ఒక వ్యక్తిని హత్య చేసి కమ్యూనిస్టులు ఆయనకు స్వాగతం పలికారు. ‘హింసతోకాక ప్రేమతో మానవ హృదయాలను జయించండి’ అని ఆ రోజున కేరళ ప్రజలు గోల్వార్కర్ సందేశమిచ్చాడు. ఐతే హింస, ద్వేషాల్ని అప్పటికే మార్క్సిజం కేరళలో బాగా నూరిపోసింది.
కేరళలో కన్నూరు జిల్లా కేంద్రానికి సమీపంలో పినరాయ్ అనే ఒక కుగ్రామం ఉంది. అక్కడ ఒక నిరుపేద కుటుంబంలో విజయన్ అనే యువకుడు జన్మించాడు. ఈయనకు మాతృభాష మలయాళం తప్ప హిందీ-ఇంగ్లీషు వంటి భాషలు రావు. సిపిఎం కార్యకర్తగా ఆయన అంచెలు అంచెలుగా ఎదిగాడు. ‘అడ్డం వచ్చిన వారిని అడ్డంగా నరకండి’ అని కేరళ ప్రజలకు ఇతడు పిలుపునిచ్చాడు. పినరాయ్ గ్రామానికి సమీపంలో వరపురం అనే గ్రామంలో 1939లో మొదటిసారి కమ్యూనిస్టు జెండా ఎగిరింది. అక్కడి నుండి క్రమక్రమంగా చుట్టుపక్కల గ్రామాలల్లో కమ్యూనిస్టులు అలజడి సృష్టించారు. తమ గ్రామాలల్లో ఎర్రజెండా తప్ప మరేదీ ఎగురకూడదని శాసించారు. ఒకవేళ ఎవరైనా తమ ఆజ్ఞను కాదంటే వారు గ్రామాలు వదలిపోవలసిందే!! విచత్రం ఏమంటే ఇటు సిపిఎం, అటు కాంగ్రెసు పార్టీ కూడా ఈ ఉగ్రవాద జిహాదీ ముఠాల మద్దతులోనే గత అరవై సంవత్సరాలుగా రాజ్యపాలన చేస్తున్నాయి.
కేరళలోని దేవాలయాల్లో హిందూ సామాజిక బృందాలు కలసి భజనలు చేస్తూ ఉంటాయి. వీటిపై పినరాయ్ విజయన్ నిషేధం విధించాడు. కేరళలోని సామాజిక ఉత్సవం ఓనం పండుగపై ఆంక్షలు పెట్టాడు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఓనం ముగ్గులు వేయకూడదు అని శాసించాడు. ఐతే ప్రభుత్వ ఉద్యోగులు ఈ శాసనాన్ని ధిక్కరించి ముగ్గులు వేశారు. దీనిని విజయన్ భరించలేకపోయాడు. ఒక్క కన్నూరు జిల్లాలోనే 84 మంది ఆర్‌ఎస్‌ఎస్ బిజెపి కార్యకర్తలు హత్యకు గురయ్యారు. కేరళలో ఉత్తమన్ పేరుకు తగ్గట్లే ఉత్తముడు. ఇతడొక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఈయన కుమారుడు రెమిత్ హిందూ సామాజిక సంస్థల కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. వీరుకూడా హత్యకు గురయ్యారు. దీనివెనుక విజయన్ హస్తముందంటారు. కారణం... కన్నూరు జిల్లాలో ఎర్రజెండా తప్ప మరొకటి ఎగరకూడదు. కేరళలో జరిగిన 280 హత్యలలో 120 మంది ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. పినరాయ్ విజయన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక 16 నెలల కాలంలో 14మంది బిజెపి కార్యకర్తలు హత్య చేయబడ్డారు. గత ఏడాది అక్టోబర్ 3న కన్నూరు జిల్లాలోని పయ్యన్నూర్ నుండి కేరళ ప్రాంత బీజేపీ అధ్యక్షుడు కమ్మునం రాజశేఖరన్ ఒక పాదయాత్ర నిర్వహించాడు. ఈ యాత్ర తొమ్మిది కిలోమీటర్లు సాగింది. పినరాయ్ అనే గ్రామం నుండి కమలం జెండాతో ఊరేగింపు సాగటం విజయన్‌ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘‘జిహాదీ ఉగ్రవాదం నశించాలి. హత్యా రాజకీయాలు ఆపాలి’’ అంటూ ఊరేగింపులో నినాదాలిచ్చారు. ఈ ఊరేగింపునకు అఖిలభారత బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా హాజరుకావడంతో ఈ సంఘటన జాతీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పినరాయ్ గ్రామంలో ముఖ్యమంత్రి విజయన్ ఇంటికి సమీపంలోనే చంద్రన్ అనే హిందూ సామాజిక కార్యకర్త ఉన్నాడు. అతినినికూడా హత్య చేయించారు. దానితో గ్రామం నుంచి చాలామంది భయంతో ఇతర ప్రాంతాలకు వలసపోయారు. అశోకన్ అనే క్రియాశీల కమ్యూనిస్టు కార్యకర్త. ఈయన కుమార్తె అఖిల. ఈమె లవ్‌జిహాదీకి గురి అయింది. కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఐతే సీపీఎం, అఖిలను రక్షించడానికి ముందుకు రాలేదు.
1962లో చైనా భారత్‌పై దండయాత్ర చేసినప్పుడు కమ్యూనిస్టు పార్టీ నిలువునా చీలిపోయింది. రివిజనిస్టులు నశించాలి అంటూ సిపిఐమీద, సిపిఎం కార్యకర్తలు దాడి చేశారు. 1975లో ఇందిరాగాంధీ దేశంపై అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సిపిఐ ఇందిరాగాంధీని సమర్థించింది. సిపిఎం మాత్రం వ్యతిరేకించింది. కేరళలో వందలాది హిందూ సామాజిక సంస్థల కార్యకర్తలు అరెస్టు అయినారు. ఇది తర్వాతి కాలంలో పుట్టిన బీజేపీకి పునాదిగా ఉపయోగపడింది. అప్పటివరకు కమ్యూనిస్టుల మాత్రమే పోరాటాలు చేస్తారని నమ్మిన కేరళ ప్రజలు హిందూ జాతీయవాదులు కూడా ప్రాణాలకు తెగించి పోరాడగలరు అని తెలుసుకున్నారు. ఈ దశలో పినరాయ్ విజయవన్ హింస ద్వారా రాజ్యాధికారం సంపాదించుకొని తనను వ్యతిరేకించినవారిని హింసించడం మొదలుపెట్టాడు. సొంత పార్టీ నుండి ఎవరైనా బయటకుపోతే ఇదేగతి పడుతుందని చెప్పి భయభ్రాంతులను చేశాడు. ఆమధ్య విశాఖలో జరిగిన సిపిఎం మహాసభలలో పినరాయ్ తాను పార్టీకి ప్రధాన కార్యదర్శి కావాలని ఉవ్విళ్లూరాడు. ఐతే ఈయనకు మలయాళం తప్ప మరే భాష రానికారణంగా ఏచూరి సీతారామశాస్ర్తీని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేశారు. దీనిని విజయన్ భరించలేకపోతున్నాడు. తన రాజ్యాధికారానికి అడ్డం వస్తాడని సీనియర్ పార్టీ నేత వి.ఎస్.అచ్యుతానందన్ (దర్జీ సామాజిక వర్గానికి చెందిన వృద్ధ నాయకుడు) ఎదగకుండా అణచివేశాడు.
గత ఏడాది నవంబర్ 11న తిరువనంతపురంలో బీజేపీ లక్షమందితో జరిపిన ప్రదర్శన కేరళలో సీపీఎం పునాదులను కదిలించింది. ‘‘జిహాదీ ఉగ్రవాదం నశించాలి. హత్యా రాజకీయాలు ఆపాలి’ అంటూ నినాదాలతో కేరళను హోరెత్తించారు. దీనివలన వెంటనే కేరళ ప్రభుత్వం పడిపోకపోయినా ఇకమీద హత్యారాజకీయాలు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వస్తుంది. కె.బాలకృష్ణన్ ఒక బంగారం స్మగ్లర్ ఇచ్చిన ఖరీదైన కారులో ‘హిందూ వ్యతిరేక ర్యాలీ’ నిర్వహించాడు. పేదప్రజల పార్టీ ఈ స్మగ్లింగ్ కారు ఎలా ఉపయోగించింది? అని ప్రశ్నిస్తే ఇది స్మగ్లర్ కారు అని తనకు తెలియదు అని చెప్పాడు. అదేనెల 15న కేరళలో సీపీఎం మంత్రివర్గం నుండి థామస్ చండి అనే మంత్రి భూకబ్జా నేరాల కింద తొలగింపబడ్డాడు. ఇంతకుముందు ఒకరిని లైంగిక నేరాల కింద మరొకరిని ఆర్థిక నేరాల కింద తొలగించారు. ఇదేనా పేదల పార్టీ ప్రభుత్వ నైతికత?? నవంబర్ 12 నవంబరు 2017 నాడు త్రిశూరు జిల్లాలో సైకిల్ మీద పోతున్న ఒక ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను చంపడం ద్వారా ఈ హత్యల సంఖ్య 281కి చేరింది. మృతుని పేరు ఆనంద్. ఇతడిని లోగడ కేరళ ప్రభుత్వం అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చాడు.
సైద్ధాంతికంగా ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. కేరళలో బెంగాల్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టులు ముస్లిం, క్రైస్తవ వర్గాలతో సన్నిహితంగా ఉన్నారు. జిహాదీ ఉగ్రవాదం అసలు సమస్యే కాదు. హిందూ ఉగ్రవాదమే సమస్య అన్నారు. వైదికభావజాలం నశించాలి, బూర్జువా ఆర్థిక వ్యవస్థ నిర్మూలించబడాలి వంటి నినాదాలు ఇస్తున్నారు. 5 వందల సంవత్సరాల క్రితం జన్మించిన పోతన మహాకవి ‘సత్కవుల్ హాలికులైననేమి’ అని స్వయంగా పొలం దున్ని పంట పండించాడు. ఆయన జయంతి ఉత్సవాలు వరంగల్‌లో లోగడ జరిపినప్పుడు ఎందుకు బహిష్కరించారు? ప్రపంచ తెలుగు మహాసభలను ఎందుకు బహిష్కరించారు. అంటే వీరికి తెలుగుభాషా సంస్కృతులు అక్కర లేదని తెలియడం లేదా? రాజకీయంగా ఆ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించిన ముఖ్యమంత్రులను, పార్టీలను ఎదుర్కొనవచ్చు. కానీ భాషా సమావేశాలపై ద్వేషం ఎందుకు? భాగవతం, పోతన వ్రాశాడు. అందుకని పోతన సభలు నిషేధించారు. విష్ణువు దుర్మార్గమైన దేవుడు అని కంచ ఐలయ్య ప్రకటించాడు. అందుకని ఉభయ తెలుగు రాష్ట్రాలలో సామ్యవాదులు అతడికి మద్దతు ఇచ్చారు. నేడు చైనా, అమెరికాతో పోటీ పడుతున్న మరొక సామ్రాజ్యవాద విస్తరణకాంక్ష గల దేశం. దానికి వీళ్లు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. దేశీయ ఉత్పత్తులను తిరస్కరించడం, చైనా ఉత్పత్తులను ప్రోత్సహించడం చేస్తున్నారు. ఇదంతా కూడా సామ్యవాదమేనా? భారతదేశ వ్యతిరేక ధోరణిలో పనిచేయటం సమర్ధనీయమా?

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్