మెయిన్ ఫీచర్

స్వరధార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్ని దశాబ్దాలుగా అక్కడ పాటకు విరామం లేదు. పాటే ఆ ఇంట తొలి ప్రాధాన్యం. శ్రాస్తీయ సంగీతానికి చిరునామాగా మారిన ఆ ఇల్లే కె. కోదండపాణి గానామృతంతో ఓలలాడిన సంగీత కళానిధి. స్వర రాగ ఝురి వలే అఖండంగా.. అనంతంగా సాగే ఆ స్వర ధారాలను ఈనాటకీ తెలుగు ప్రజలు దోసిలి పడుతున్నారు. తాత నేర్పిన సంగీతానికి బాణీలు కట్టీ అలవోకగా ఆలపిస్తూ ఆయన గళ మాధుర్యాన్ని తెలుగుప్రజలకు గుర్తుకు తెస్తున్నారు ఆయన మనవరాళ్లు సంగీత కళ, రాజ్యలక్ష్మి. శాస్ర్తియ సంగీతం పట్ల తమకున్న మమకారం, మక్కువ గురించి వారి మాటల్లోనే..

కర్నాటక సంగీత విద్వాంసురాలు శ్రీరంగం గోపాలరత్నం వద్ద శిక్షణ తీసుకున్నాం. ఆమె మమ్మల్ని మనవరాళ్లుగా చూసుకునేది. ఆమె తనతో మమ్మల్ని కూడా సంగీత కచ్చేరీలకు తీసుకువెళ్లేవారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్నాం. ఇక్కడ సంగీతం నేర్పించాలన్నా, సంగీత ఉత్సవాలు నిర్వహించాలన్నా సరైన కమ్యూనిటీ భవనమే లేదు. మేము వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటే స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది.
- రాజ్యలక్ష్మి

తాత వద్దే తొలి పాఠాలు..
చిన్నప్పటి నుంచి తాత కె.కోదండపాణి వద్ద సంగీత పాఠాలు నేర్చుకున్నాం. మనవరాళ్లగా మాకు ఆయన వద్ద పాఠాలు నేర్చుకునే బంగారు అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నాం. తాత కోదండపాణి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ రావటానికి ముందు జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి, సుప్రసిద్ధ రచయిత దాసరధిలతో కలిసి హైదరాబాద్‌లో ఒక సాంస్కృతిక సర్కిల్‌ను ఏర్పాటుచేశారు. తాతగారి వద్ద తొలి శిక్షణ తర్వాత అఖిల భారత రేడియో నిర్మాత ఎన్.ఎస్ శ్రీనివాస్ వద్ద కర్నాటక శాస్ర్తియ సంగీతంలో శిక్షణ తీసుకున్నాం. అలాగే హైదరాబాద్ బ్రదర్స్‌గా పిలుచుకునే డి. శేషాచారి, రాఘవాచారి వద్ద శిక్షణ తీసుకున్నాం.
కళాకారులకు ఇక్కడ ఆదరణ..
మిగతా నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్ నగరంలో శాస్ర్తియ సంగీతానికి, సినిమా పాటలకు ఆదరణ బాగుంటుంది. అనేక టీవీ ఛానల్స్ వర్థమాన గాయకులకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ఇపుడు యువ కళాకారులు సైతం అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నారు. ఇది చాలా మంచి పరిణామం. ఏది ఏమైనా ఏ సంగీతానికైనా శాస్ర్తియ సంగీతమే ఆధారం.
ప్రభుత్వ పాఠశాలల్లో
సంగీత టీచర్ తప్పనిసరి చేయాలి..
పిల్లలకు చిన్నప్పటి నుంచే సంగీత కళ పట్ల అభిరుచిని కలిగించాలంటే ప్రతి పాఠశాలలోనూ సంగీత టీచర్‌ను నియమిస్తే పాటకు ఆదరణ చెక్కుచెదరదు. ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ సంగీత టీచర్‌ను నియమిస్తే బాగుంటుంది. అలాగే సంగీత శిక్షణా సంస్థలను ప్రభుత్వమే ఏర్పాటుచేసినా సంగీతం పట్ల అనురక్తి కలుగుతుంది.
వర్క్‌షాప్స్ నిర్వహణ..
వర్క్‌షాప్స్, సంగీత ఉత్సవాలను నిర్వహిస్తూ ఈ అక్కాచెల్లెల్లు సంగీత సేవ చేస్తున్నారు. పిల్లలకు దేశభక్తి పాటలు నేర్పిస్తున్నారు. అలాగే 13 భాషల్లో పాటలు పాడే ‘స్వతంత్ర స్వరం’ అనే ప్రాజెక్టునకు వీరు రూపకల్పన చేశారు. భక్తి సంగీతాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఉన్నాం. అన్నమాచార్య, భక్త రామదాసు, త్యాగరాజ కీర్తనలు, అలాగే శ్రీరంగం గోపాలరత్నం, డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి తదితర మహనీయుల సంగీతాన్ని రాబోయే తరానికి నేర్పించటానికి ఈ సంగీత సిస్టర్స్ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారు. వీరి ప్రయత్నం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.