మెయన్ ఫీచర్

మానవుల్లో మహోన్నతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకంచీ క్షేత్రం మనదేశంలో గల సప్తమోక్ష పురాలలో ఒకటి. భారత భూమికి ఇది నాభిస్థానం. కాంచీక్షేత్రం శ్రీచక్రాకృతిలో నిర్మితమైంది. అందులో బిందుస్థానీయంగా శ్రీకామాక్షీ అమ్మవారి దేవాలయం ఉంటుంది. ఇక్కడి స్వామి-ఏకామ్రేశ్వరస్వామి. మూగవాడు.. కామాక్షి ఏకామ్రనాథుల దయచే మాటలు వచ్చి ఐదువందల శ్లోకాలతో కామాక్షీ మాతను, స్వామిని కీర్తించిచడం వల్ల వారికి ‘‘మూక వాక్ప్రదాయక, మూక వాక్ప్రదాయని’’ అని బిరుదు కలిగింది. ఈ శ్లోకాలకే మూక పంచశతి2అని ఆ భక్తుణ్ణి మూక శంకరులు అని పిలుస్తారు.
అగస్త్య మహర్షి కాంచీ క్షేత్రానికి విచ్చేసి, కామాక్షీ దేవి ని పూజించాడు. శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈశ్వరార్చన చేశాడు. శ్రీ కామాక్షీ దేవి విగ్రహం ముందు, శ్రీ ఆది శంకరులు సాలగ్రామ శిలపై లిఖించి ప్రతిష్ఠించిన శ్రీచక్ర అధిష్ఠోత్రిగా సూక్ష్మ రూపిణిగా దర్శనమిస్తుంది. ఇదే కామకోటి పీఠం. అసలు కామకోటి అంటే అర్థం ఏమిటి? కోటి అంటే 3తరువాత2 అని. దేని తరువాత? ధర్మ, అర్థ, కామ, మోక్షములనే నాలుగు పురుషార్ధాలలో ధర్మం తో-అర్థకామాల్ని సాధిస్తే, తరువాతది-మోక్షం పురుషా ర్థం. దేశం నలుమూలలా నాలుగు చతురామ్నాయ పీఠాలను స్థాపించి, మోక్షపీఠంగా, సర్వజ్ఞపీఠంగా కంచి కామకోటి పీఠాన్ని స్థాపించారు-శ్రీ శంకర భగవత్పాదులు.
గురుపరంపరగా వస్తున్న కామకోటి పీఠానికి, 66వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి. 68వ పీఠాధిపతిగా అధిష్ఠించినవారు కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామియే. 1894, మే 20 దక్షిణ భారతదేశం, తమిళనాడులోని విల్లిపురంలో, శ్రీ సుబ్రహ్మణ్యశాస్ర్తీ, శ్రీమతి మహాలక్ష్మి పుణ్యదంపతులకు సుబ్రహ్మణ్వేశ్వరుని వరప్రసాదంగా జన్మించినవారు స్వామినాధన్. కార్తికేయుడు ఆరు రూపాలుగా ఆరు ప్రదేశాలలో తమిళనాడులో వెలసి ఉన్నాడని భక్తుల విశ్వాసం. అందులో మహర్షిరూపంలో స్వామి వెలిశాడు. ఆ స్వామిని సేవించగా జన్మించిన కారణజన్ముడే-స్వామినాధన్. అందుకే ఆయన మహర్షి అయినారు. 13వ ఏటనే సన్యాసదీక్షను స్వీకరించి, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఆశ్రమనామంతో ఎనిమిది దశాబ్దాలకు పైగా పీఠాధిపత్యం వహిం చి, కంచి పరమాచార్యులుగా ప్రసిద్ధి చెందారు.
స్వామినాధన్ తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. ఎనిమిదవ ఏట ఉపనయనం జరిగింది. తిండివనంలో ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూల్‌లో చేరాడు. 66వ కంచి పీఠాధిపతులు, తిండివనంలో చాతుర్మాస్యదీక్ష వహించారు. తండ్రితో పాటుగా, స్వామినాధన్ ప్రతిరోజు స్వామివారి దర్శనానికి వెళ్లి తీర్థం తీసుకునేవాడు. బాలుణ్ణి చూచినప్పటి నుంచి, పీఠాధిపతులకు స్వామినాధన్ పట్ల ఒక అవ్యాజమైన ప్రేమ, కాబోయే కామకోటి పీఠాధిపతి అన్న స్ఫూర్తి జనించింది. భజగోవింద శ్లోకంలో శంకర భగవత్పాదులు మనలో పుట్టే ఆశ కం టికి కనబడదు, ప్రాణాంతకమవుతుంది..ఆశాపాశములతో బంధింపబడి, ప్రాణత్యాగం చేస్తున్నాడు మానవుడు. సాలెపురుగు తన నోటి నుంచి వెలువడే ద్రవంతో గూడు నిర్మించుకొని చివరకు అందులో చిక్కుకుని, బయటపడలేక మరణిస్తుంది. మనిషి కూడా తన మదిలో చెలరేగే ఆశలతో మమేకమై, వాటిలో సతమతమై నశిస్తున్నాడు అని బోధించారు. బాలస్వామినాథన్ మదిలో కూడా శంకరులు చెప్పినదే మెదిలింది. కారణ జన్ములకు వయసుతో నిమిత్తం లేదు. అతిపిన్న వయసులోనే బుద్బుదమైన జీవితం మీద కొన్ని అభిప్రాయాలు కలుగుతాయి.
యోగి అయినవాడు తన హృదయ పుండరీకమున పరమాత్మను దర్శింపదలచి జితేంద్రియుడై యోగాన్ని అనుష్ఠిస్తున్నప్పుడు అణిమాది సిద్ధులు అతణ్ణి వరిస్తా యి. అందులోనిదే కీర్తికాంత కూడా. ఆ సిద్ధయోగి వలన ఫలాలను కోరే జనులు అతణ్ణి కింద నడవనివ్వరు. ఆ వలలో చిక్కుకొని అతడు యోగభ్రష్టుడవుతాడు. వీటిని అదుపులో ఉంచుకోవడం చాలా కష్టం. శ్రీ కంచి పరమాచార్యులు యోగసిద్ధులు. భూత, భవిష్యత్ వర్తమానాలన్నీ వారికి దృశ్యమానం. అయితే వారు హనుమంతు డి వంటివారు. సిద్ధించిన యోగ ఫలాన్ని సమాజాభివృద్ధికి, దీనజనోద్ధరణకు, సనాతన ధర్మ పునరుద్ధరణకు, విశ్వశాంతికి ఉపకరించి, మహాత్ముడైనారు, మహర్షి అయినారు. అందుకు ఎన్నో సందర్భాలున్నాయి.
తిరుచిరాపల్లిలో 1963 ఆశ్వీజమాసం, శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలను జరుపుతున్నారు స్వామి. భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. స్వామి దర్శనాన్ని ఎలాగైనా చేసుకోవాలని తొంబై సంవత్సరాల వయస్సుగల వృద్ధురాలు విశ్వ ప్రయత్నం చేస్తోంది. వృద్ధాప్యానికి తోడు ఆమెకు కళ్లు కూడా కనిపించడంలేదు. మూడు రోజులుగా భోజనం కూడా లేదు. నీరసంతో కళ్లు లోతుకు పోయినాయి. శివశివా శంకరా శంక రా హరహర మహాదేవ అంటూనే ఉంది. స్వామి ఒక ప్రత్యేక వాకిలి గుండా బయటికి రెండు పర్యాయాలు వస్తారు. కొంతమంది భక్తులు ఆ వాకిలి దగ్గర ఆ ముదుసలిని కూర్చోబెట్టారు. శివనామం చేస్తూ కూర్చున్నది. వేరే ధ్యాస లేదు. శిష్యులు వార్తను స్వామికి వినిపించారు. ఎఱ్ఱని ఎండలో శివనామం చేస్తున్న అవ్వను చూశారు. నిన్ను చూడటానికి వచ్చానన్నారు. ఆమెకు కాస్త చెవుడు. పక్కనున్న భక్తులు చెప్పారు. ఆమాటలు విని,వచ్చావా స్వామీ, కాసేపు నిలబడు, నీ కాళ్లకు మొక్కాలి, నిన్ను తనివితీరా చూడాలి2అన్నది.నీకు చూపులేదు కదా, ఎలా చూస్తావు? పోనీ నీమాట వింటాను అదే నీ ఆకారాన్ని చూపిస్తుందన్నది. ఎంత తెలియని ఆధ్మాత్మికత ఉన్నదో అందులో. స్వామి ఆమెను ఎండలో కాస్త దూరంగా నిలబెట్టి, ఆమె చుట్టూ ప్రదక్షిణం చేశారు. ఆ ప్రదక్షిణలో, ఎనిమిది దిక్కులలో, ఒక్కొక్క దిక్కులో ఆగుతూ దిక్పాలకులను ఆవాహనం చేస్తూ అవ్వా నేను నీకు కనబడుతున్నానాఅని అడిగారు. స్వామి ఆకారం ఆహార్యం అంతా వర్ణించి చెప్పిం ది అవ్వ. కటించూపుతో తిరిగి వెళ్లింది ఆమె!‚
ఒకసారి, చిదంబరం క్షేత్రం పక్కన ఉన్న ఆనందతాండవపురంలో స్వామి పిల్లలందరినీ 34శ్రీరామాయనమః2అని వందసార్లు వ్రాసి తీసుకుని రమ్మన్నారు. వ్రా సి తెచ్చిన పిల్లలందరికి, ఒక్కొక్కరికీ ఒక్కొక్క కామాక్షీ అమ్మవారి బంగారు ముద్రను ఆశీర్వదిస్తూ బహూకరించారు. ఒక బాలుడికి బంగారు నాణెం ఇవ్వడానికి ముందు నీవు వ్రాసింది నోటితో చెప్పమన్నారు. చుట్టూ ఉన్న పండితులు, అం మూకఃఅతను మూగవాడని వినయం గా చెప్పారు. స్వామికి ఆవిషయం తెలీదా! తెలుసు, అందుకే మళ్లీ అడిగారు. ఆ మూగ బాలుడు44శ్రీ రామాయనమః2 అని బిగ్గరగా అన్నాడు. అదీ పరమాచార్యుల కరుణ. మరో సంఘటన. ఒక పేదవాడు స్వామిని దర్శించి, కుమార్తె వివాహానికి పదమూడు కాసుల బం గారం, వియ్యాలవారు అడుగుతున్నారని సహాయం చేయమని అతిదీనంగా విన్నవించుకున్నాడు. నేను సన్యాసిని, నీకివ్వడానికి నాదగ్గర బంగారం లేదు అని, అమ్మ కామాక్షీదేవి దగ్గరకెళ్లి విన్నవించుకో నీగోడు. కరుణిస్తుంది, అన్నారు స్వామి. అతను బయలుదేరి వెళ్లాడు. ఈ లోపల ఉత్తరదేశం నుంచి ఎవరో ఒక వాణిజ్య ప్రముఖుడు వచ్చి స్వామిని దర్శించి, వెళ్లబోయే ముందు ఒక పొట్లాన్ని తీసి పళ్లెంలో పెట్టి, స్వామికి సమర్పించాడు. అందులో కాస్త బంగారం ఉన్నదని చెప్పిన వ్యాపారితో స్వామి, సన్యాసికి బంగారమెందుకు? అన్నారు. నేను ఇవ్వదలచుకొన్నాను, మీ యిష్ట వచ్చినట్టు వినియోగించండి అన్నాడు. కొద్ది సేపటికి కామాక్షీ దేవాలయానికి వెళ్లి, తల్లికి తన గోడును వినిపించిన పేదవాడు వచ్చాడు. ఆ పళ్లెంలో ఉన్న పొట్లం చూడమన్నారు స్వామి. స్వామీ బంగారు కాసులున్నాయి. ఎన్ని? పదమూడు స్వామి. నీవు కోనినవెన్ని? పదమూడే స్వామీ. మనసారా ప్రార్థించావుగా, తల్లి కరుణించింది. తీసికెళ్లు, కుమార్తె వివాహం జరిపించు అన్నారు. తనకు లభించిన సిద్ధులను ప్రజా ప్రయోజనాలకు, స్వార్థ రహితంగా వినియోగించిన యోగి పుంగవుడు-శ్రీ కంచి పరమాచార్యులు.
చాలా విచిత్రమైన పరిస్థితుల్లో పరమాచార్యులవారు, కామకోటి పీఠాధిపత్యాన్ని స్వీకరించవలసి వచ్చింది. 66వ కంచి పీఠాధిపతికి మశూచి వ్యాధి సోకింది. ఆయనవద్ద శిష్యునిగా ఉంటున్నారు, సుబ్రహ్మణ్యశాస్ర్తీగారి తోడల్లుని కుమారుడు పెద్దస్వామిగారు. 66వ పీఠాధిపతులు సిద్ధిపొందారు. సామినాధన్ పెద్దతల్లి కుమారుని 67వ, పీఠాధిపతిగా అభిషేకించారు. ఆ పిల్లవాడికి మశూచి సోకి కాలం చేశారు. స్వామినాధన్‌ని తీసుకొని అక్కయ్యను పలకరిద్దామని బయలుదేరింది మహాలక్ష్మమ్మ. మొదలియార్ గారు పీఠంలో వాహనాల మీద ఆజమాయిషీ చేసేవారు. 13 ఏళ్ల స్వామినాధన్‌ను గుఱ్ఱంబండి ఎక్కించుకొని పీఠానికి తీసుకెళ్లారు. 67వ పీఠాధిపతి కాలం చేశారు కనుక పీఠాధిపత్యం వహించమన్నారు స్వామినాధన్‌ను. ఆవిధంగా శ్రీ కంచికామకోటి పీఠాధిపతులైనారు. ఆశ్రమనామం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి. అదీ ఈశ్వర సంకల్పం.
స్వామి చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు వారింటికి జ్యోతిష్యం బాగా వచ్చిన వారి నాయనగారి స్నేహితులు వచ్చారు. పిల్లవాడి జాతకం చూసి, చెంబు నీళ్లు తీసుకొని రమ్మని, పిల్లవాడి కాళ్లు కడిగి, నెత్తిన నీళ్లు చల్లుకొని పిల్లవానికి సాష్టాంగ నమస్కారం చేశారు. 3ఒకానొకప్పుడు అశేష ప్రపంచం ఈ పిల్లవాడి పాదాలకు ప్రణమిల్లుతుంది. అప్పటికి నేను బ్రతికి ఉండను. అందుకే ఆ భాగ్యం ఇప్పుడు పొందుతున్నానన్నారు. ఇలాంటి లీలలు అనేకం. అవి జరుగుతూ ఉంటాయి...కాని స్వామి మాత్రం ఇవేం పట్టనట్టు ఉంటారు. వారికి కనకాభిషేకం జరుగుతున్నప్పుడు వారిని దర్శించినవారికి ఇది అర్థమవుతుంది. ఏనభయ ఏడు చాతుర్మాస్యదీక్షలు చేసిన శ్రీ పరమాచార్యులు 1994, జనవరి 8న సిద్ధి పొందారు. ఆయన మానవుల్లో మహోన్నతులు.

-పసుమర్తి కామేశ్వర శర్మ సెల్: 9440737464