మెయిన్ ఫీచర్

గొబ్బియల్లో.. గొబ్బియల్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్న ఆచారాల మేళవింపు భిన్నత్వంలో ఏకత్వం చాటే సంబరాలు

తెలుగువారి పండుగల్లో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉంది. పల్లె పడుచుల ఆటపాటలతో పల్లెలు వింత శోభను సంతరించుకుంటాయి. ముంగిళ్లలో
మురిపించే రంగవల్లుల మధ్య గొబ్బియల్లో.. గొబ్బియల్లో అని పాడే గొబ్బెమ్మ పాటలతో ఏటు చూసినా ఆనంద కోలాహలం. చిట్టిచిన్నారులు ఆయురారోగ్యాలతో ఏటేటా ఎదగాలని భోగిపండ్లను పోసే రమణులతోప్రతి ఇల్లు పేరంటం సంతరించుకుంటుంది. చిరునవ్వులు చిందిస్తుంది. మంచుకురిసే వేళలో వేసే భోగిమంటలు నేలంతా వెలుగు పంచుకుంటుంది. తెలుగు లోగిళ్లలోనే కాదు దేశమంతా సంక్రాంతి సంబరాలను విభిన్న పద్ధతుల్లో జరుపుకుంటారు. ఆచార వ్వవహారాల్లో తేడాలు ఉన్నా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ పండుగలో భిన్నత్వంలో ఏకత్వం ప్రతిబింబిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగను నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతిరోజూ ఒక్కొక్క ప్రత్యేకతను సంతరించుకుంటుంది. భోగిమంటలు వేసుకుని ఆ మంటల్లో పాత వస్తువులను వేసి కొత్తవాటికి ఆహ్వానం పలుకుతారు. ఈ మంటలు మార్పునకు నాంది పలుకుతుందనే భావన. పిల్లలకు మేలు జరగాలని, ఎలాంటి దుష్టశక్తుల పీడ ఉండకూడదని భోగి పళ్లు పోస్తారు. సంక్రాంతినాడు కొత్తబట్టలు ధరించి ఇంటిల్లిపాదీ ఆనందోత్సాహాలతో మునిగి తేలుతారు. ఇంటిముందు ముచ్చటైన ముగ్గులను తీర్చిదిద్దుతారు. కొత్తబియ్యంతో చేసిన వంటల ఘుమఘుమలు అతిథులను రారామ్మని ఆహ్వానిస్తాయి. పతంగులు ఎగురవేయటం, కోడిపందాలతో సందడిగా ఉంటుంది.
కర్నాటకలో
కర్నాటకలో ‘పొంగల్’ అని పిలుస్తారు. ఇంద్రుడ్ని పూజిస్తారు కాబట్టి ఇక్కడ భోగిని ‘ఇంద్రన్’ అని అంటారు. ‘కోలం’ పేరుతో వేసే ముగ్గులు చూడటానికి రెండు కళ్లూ చాలవు.
తమిళనాడులో..
నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. భోగిమంటలు వేస్తారు. రెండవ రోజు ధాయి పొంగల్ అంటారు. చిక్కటి పాలు, బియ్యం, బెల్లంతో తియ్యటి పొంగలి పెడతారు. మూడవ రోజు పండుగను మట్టు పొంగల్ అంటారు. ఈరోజున ఇక్కడ జల్లికట్టు నిర్వహిస్తారు. నాలుగవ రోజున కనుమ జరుపుకుంటారు.
బీహార్‌లో..
బీహార్, జార్ఖండ్‌లలో రెండు రోజులపాటు జరుపుకుంటారు. వీరు ఈ పండుగను ‘సక్రాత్, కిచిడి’ అని పిలుస్తారు. సంక్రాంతినాడు నదుల్లో, చెరువుల్లో స్నానాలు చేసి, అక్కడ కుండల్లో పొంగలి చేస్తారు. దీనినే వీరు ‘టిల్‌గడ్’ అని అంటారు. ఇది ఎనిమిది రకాల తృణధాన్యాలతో చేసే బలవర్థకమైన ఆహారం. అలాగే నువ్వులతో చేసే తీపి ఉండలు కూడా ఇక్కడ ప్రత్యేకం. రెండవ రోజు కిచిడి చేస్తారు. పప్పు, బియ్యం, కేలీఫ్లవర్, బఠానీలు, బంగాళాదుంపలు కలిపి ఈ కిచిడీని వండుతారు.
గుజరాత్‌లో..
గుజరాత్‌లో పతంగుల పండుగ ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ కూడా రెండు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ కాలంలో లభించే కూరగాయలతో ప్రత్యేక వంటకాన్ని తయారు చేస్తారు. చిక్కి వంటకం కూడా ఇక్కడ ప్రత్యేకత.
పంజాబ్‌లో..
పంజాబ్: పంజాబ్‌లో ‘లోహిరి’ అనే పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడకూడా పంటలు చేతికి వస్తాయి. ముఖ్యంగా చెరుకు గడల తియ్యదనం కనిపిస్తోంది. ఇక్కడ రైతులు పండుగ అంటారు.
మహారాష్టల్రో..
ఇక్కడ కూడా మూడు రోజుల పాటు ఆనందంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంకరాసుర అనే దేవతను ఈ పండుగ సందర్భంగా మహిళలు కొలుస్తారు. మహిళలు నల్లదుస్తులు ధరించి పసుపు, కుంకమలు ఇచ్చుకుంటారు. భర్తకు ఆయుష్షును ప్రసాదించమని వేడుకుంటారు. అలాగే ఒకరికొకరు బహుమతులు, దుస్తులు ఇచ్చుకుంటారు.
బెంగాల్‌లో..
నోరూరించే స్వీట్లు చేయటం బెంగాల్ వనితల ప్రత్యేకం. ప్రతి ఇంట్లో చేసుకుంటారు. సంక్రాంతి నాడు వేలాదిమంది భక్తులు గంగానదీ తీరానికి వచ్చి స్నానాలు చేసి శివుడికి, గంగాదేవికి పూజలు చేస్తారు.
అస్సాంలో..
బిహు అని ఈ పండుగను పిలుస్తారు. పల్లెవాసులు ఆనందోత్సాహాలతో జరుపుకునే వేడుక. భోగిమంటలు వేసుకున్న తరువాత గ్రామస్తులంతా ఒకచోట కూర్చొని పాటలు పాడతారు. అలాగే జంతువులు, పక్షుల పందేలు నిర్వహించుకుంటారు. బంధువులను, స్నేహితులను ఇంటికి ఆహ్వానించి ప్రత్యేక వంటలతో ఆతిథ్యం ఇస్తారు. దేశ విదేశాలకు చెందినవారు అస్సాంలో జరిగే బిహు వేడుకలను తిలకించేందుకు వస్తుంటారు.