మెయిన్ ఫీచర్

మకరజ్యోతి దర్శనం పూర్వజన్మ పుణ్యఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ బరిమలై స్వామియే శరణం అయ్యప్ప అన్న నినాదాలతో మారు మ్రోగుతుండగా అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామిని ఆభరణాలతో అలంకరించి, హారతి ఇచ్చే సమయంలోనే, ఆలయానికి ఈశాన్య దిశలో ఉండే పర్వతాలపై మకరజ్యోతి దర్శనమిస్తుంది. స్వయంగా ఆ జ్యోతి దర్శనం చేసుకోవాలని మాలలు ధరించి స్వాములు కోటానుకోట్లమంది జనం శబరిమలైలో వేచి ఉంటారు. అందరూ చేతులెత్తి స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ గొంతెత్తి తన్మయత్వంతో పలుకుతుంటారు. సాయం సంధ్యవేళ ఈ మకరజ్యోతి దర్శనం వేయ జన్మల పుణ్యఫలంగా భావిస్తారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాల వల్ల దూరదర్శన్లూ ఈ మకరజ్యోతి దర్శనం కావిస్తారు.
మకరజ్యోతిని ధర్శించిన అయ్యప్ప భక్తులు నిలువెల్లా పులకించిపోతారు. తమ తమ జన్మధన్యమైందని భావిస్తారు.
మకరజ్యోతి భగవత్ లీలగానే భక్తులు భావిస్తారు. ‘ ప్రజలను రక్షించేందుకు నేను తపస్సులోకి వెళుతున్నాను, ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు నా కళ్లను తెరిచి ఈ విశ్వాన్ని వీక్షిస్తాను, ఆ రోజు నా విగ్రహాన్ని ఆభరణాలతో అందంగా అలంకరించి, పూజించే అవకాశం కల్పిస్తున్నాను, అదే రోజు ‘పొన్నాంబల మేదు’ పర్వతాలపై మకరజ్యోతి దర్శన భాగ్యం కల్పిస్తాను’ అంటూ స్వామి అయ్యప్ప పాంథాళ దేశ రాజైన రాజశేఖరుడితో చెప్పాడట. రాజశేఖరుడి వద్ద కొంత కాలం పెరిగిన అయ్యప్ప అడవుల్లోకి వెళ్లే సమయంలో ఈ విషయాన్ని వెల్లడించాడని అయ్యప్ప జీవిత చరిత్ర చెబుతుంది.
పాంథాళ దేశ రాజైన రాజశేఖరుడికి బిడ్డలు లేరు. ఈ కారణంగానే ఈ రాజుకు భగవంతుడే స్వయంగా శిశువురూపంలో పంపానదీ తీరాన లభ్యమయ్యాడు. ఆశిశువును రాజశేఖరుడు భగవత్‌ప్రసాదంగా భావించి పెంచుకున్నారు. ఎన్నో ఆటంకాలు మరెన్నో చిక్కులను ఎదుర్కొని స్వామి అయ్యప్ప యవ్వనంలో అడుగు పెట్టాడు. తాను బ్రహ్మచారిగానే ఉంటానని తనను అందరూ పూజిస్తారని, తనను నమ్మినవారిని కంటికి రెప్పగా కాపాడుతానని తన్ను పెంచిన తండ్రికి చెబుతూ రాజశేఖరడను రాజును వదిలి వేసి స్వామి అయ్యప్ప శబరిమలై కొండలపైకి వెళ్లాడు. పవిత్రమైన శబరికొండలపై (పొన్నాంబల మేడు) శాశ్వతంగా విగ్రహరూపంలో నిలిచిపోయాడని చారిత్రిక కథనం. అయ్యప్ప కోరిక మేరకు ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజు పాంథాల రాజు రాజశేఖరుడు స్వయంగా చేయించిన ఆభరణాలను తన రాజప్రాసాదం నుండి తీసుకువచ్చి, అయ్యప్పస్వామికి అలంకరిస్తారు. అప్పటినుంచీ పాంథాల రాజ కుటుంబీకుల నివాసం నుండే ప్రతి ఏటా మకర సంక్రాంతికి ఆభరణాలను శబరిమలైకి తీసుకురావడం పరిపాటైంది. మకర సంక్రాంతికి రెండు రోజుల ముందు ఆభరణాలతో ఉన్న పెట్టెలను పాంథాళ రాజప్రాసాదం నుండి తీసుకుని వళియ కోయిక్కాల్, అయిరూర్ పుతిక్ కెరు ఆలయం, పెరున్నత్తిల్ ఆలయం, నలైక్కల్ శివాలయం, వెల్లచిమ్మల, పంపానది మీదుగా శబరి పీఠానికి తీసుకువస్తారు. మకర సంక్రాంతిరోజు సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు ఈ ఆభరణాలు అయ్యప్ప సన్నిధికి చేరతాయి. ఆభరణాలు ఉన్న పెట్టెలను తీసుకువచ్చే సమయంలో అయ్యప్ప భక్తులు ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ చేసే నినాదాలతో ఈ ప్రాంతం పర్వతాలు మార్మోగుతాయ.
ఆభరణాలు ఉన్న పెట్టెలను స్వామి సన్నిధికి తీసుకువచ్చే సమయంలో పెట్టెల వెంట ఆకాశంలో ఒక గరుడపక్షి కూడా వస్తుంది. ఆభరణాలను మకర సంక్రాంతి రోజు సాయంత్రం స్వామి సన్నిధికి చేర్చిన తర్వాత స్వామికి అలంకరించగానే ఈ గరుడపక్షి ఆలయం చుట్టూ ఆకాశంలోనే మూడు పర్యాయాలు ప్రదక్షణలు చేసి అడవుల్లోకి వెళ్లిపోతుంది. అయ్యప్ప విగ్రహాన్ని ఆభరణాలతో అలంకరించిన వెంటనే పూజారులు స్వామికి హారతి ఇస్తారు. ఇదే సమయంలో ఆలయానికి ఈశాన్యంవైపు పర్వతాలపై మకరజ్యోతి కనిపిస్తుంది. కొన్ని సెకన్లపాటు మాత్రమే జ్యోతి ఉంటుంది. మకరజ్యోతి కనిపించేందుకు ఒక రోజు ముందు ఒక నక్షత్రం (ఉత్తరానక్షత్రం) దేదీప్యమానంగా కనిపిస్తుంది. ఆ రోజు వరకు ఈ నక్షత్రం జాడ ఆకాశంలో కనిపించదు. ఉత్తరానక్షత్ర దర్శనం, ఆభరాణలను తీసుకురావడం, మకరజ్యోతి దర్శనం సందర్భంగా శబరమలై కొండలు ‘స్వామి శరణం-అయ్యప్ప శరణం’, ‘స్వామియే శరణం అయ్యప్ప’ నినాదాలతో మార్మోగిపోతాయి. అత్యంత అరుదైన, అత్యద్భుతమైన మరకజ్యోతి దర్శనం పూర్వజన్మ పుణ్యఫలం.

- చివుకుల రామమోహన్